Friday, December 27, 2024

శ్రీ క్రోధి నామ 2024 సంవత్సర మార్గశిర శుద్ధ సప్తమి ప్రయుక్త భానువాసర (8th-Dec-2024) శ్రీమేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనం, మరియు శ్రీరామప్ప (కాకతీయ రుద్రేశ్వర) దేవాలయ సందర్శనం...

శ్రీ క్రోధి నామ 2024 సంవత్సర మార్గశిర శుద్ధ సప్తమి ప్రయుక్త భానువాసర (8th-Dec-2024) శ్రీమేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనం, మరియు శ్రీరామప్ప (కాకతీయ రుద్రేశ్వర) దేవాలయ సందర్శనం..😊💐

పల్లెలే భారతదేశ వైభవానికి పట్టుకొమ్మలు అనే నానుడి ప్రకారంగా, భారతదేశంలోని సిమ్హభాగం పల్లెటూర్లలో నెలకొన్న ప్రజానీకావాస సముదాయం....
అట్టి వ్యవసాయ, పాడి ఆధారిత గ్రామీణ పల్లెప్రజానీక దైనందిన జీవనవిధానానికి సుదూరప్రదేశాల తీర్థయాత్రలు అనేవి  జీవితంలో ఎప్పుడో ఒక్కసారి అన్నట్టుగా ఉండే అందనిద్రాక్ష...
అందుకే అనాదిగా గ్రామదేవతల ప్రభావం, ప్రాభవం అనేది భారతదేశంలో ఎంతగానో ఖ్యాతిగడించిన అంశం.....

ఓరుగల్లు రాజధాని నగరదేవతగా కొలువైన శ్రీభద్రకాళి అమ్మవారి క్రీగంటి చూపులతో ఘనమైన వైభవభరిత పరిపాలనలో ఒక వెలుగువెలిగిన కాకతీయమహాసామ్రాజ్య చరిత్రలో ఒకానొక సమరసంఘటనలో భాగంగా అమరులైన వీరవనితలు, విశేషమైన మేడారం గ్రామదేవతలుగా వెలసి, వారి మహిమ్నత ఇప్పటికీ ప్రపంచం నలుదెసలనుండి భక్తులతో ఆరాధనలు అందుకోవడం అనేది జగద్విదితమైన అధ్యాత్మసత్యం.....
సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు కాకతీయ పాలకులతో జరిగిన సమరంలో అమరులై గద్దెనెక్కిన నాటి నుండి ఈనాటి వరకు కూడా, ప్రతిరెండు సంవత్సరాలకు నిర్వహింపబడే భారతీయ జాతీయ పండుగగా ఖ్యాతి గడించిన మేడారం వనదేవతల జాతర యొక్క ప్రశస్తి ఆచంద్రతారార్కమైనది...

ఈ క్రిందిపోషక విలువలతో అలరారే అపురూపమైన ఆయుర్వేద ఔషధం బెల్లం.

కాల్షియం: 40–100 ఎం.జి ప్రతి 100 గ్రాములకు
మెగ్నీషియం: 70–90 ఎం.జి ప్రతి 100 గ్రాములకు
పొటాషియం: 1056 ఎం.జి ప్రతి 100 గ్రాములకు
ఫాస్పరస్: 20–90 ఎం.జి ప్రతి 100 గ్రాములకు
సోడియం: 19–30 ఎం.జి ప్రతి 100 గ్రాములకు
ఐరన్: 10–13 ఎం.జి ప్రతి 100 గ్రాములకు
మ్యాంగనీస్: 0.2–0.5 ఎం.జి ప్రతి 100 గ్రాములకు
జింక్: 0.2–0.4 ఎం.జి ప్రతి 100 గ్రాములకు
కాపర్: 0.1–0.9 ఎం.జి ప్రతి 100 గ్రాములకు
క్లోరైడ్: 5.3 ఎం.జి ప్రతి 100 గ్రాములకు
&
వైటమిన్ A, B1, B2, B5, B6, C, D2, E, PP

అటువంటి నిలువదోషం లేని బెల్లాన్ని బంగారంగా సంబోధిస్తూ, 
వనదేవతల మ్రొక్కులుగా భక్తులు తులాభారం గావించి విశేషమైన ప్రసాదంగా పంచిపెట్టడం మేడారం వనదేవతల జాతలో ఒక విశేషమైన అంశం....
కనీసం త్రాగునీరు కూడా సరిగ్గా లభించని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకానికి ఇన్ని పోషకవిలువలతో కూడుకున్న పదార్ధాలు విస్తారంగా లభించడం అనేది అరుదు....
తద్వారా మారుమూలగ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎల్లరి అరోగ్యం దృఢంగా వర్ధిల్లాలని పాటించే ఇటువంటి నైవేద్య సమర్పణ / ప్రసాద వితరణ అనే ఆచారం ఎంత గొప్పదో కద...!

ఇవ్వాళ నేను కాచి, కొంచెం పెరుగును కలిపి తోడుపెట్టిన పాలు కదపకుండా అట్లే మూతపెట్టగా, మరునాటికి తోడుకొని పాలగిన్న మొత్తం పెరుగుగిన్నెగా రూపాంతరం చెందును అనేది అనాదిగా విజ్ఞ్యులు పాటిస్తూ వస్తున్న విశ్వాసం, ఆచారం...

పెరుగు నుండి వెన్న, వెన్న నుండి నెయ్యి, నెయ్యి వల్ల విశేషమైన దేవతానుగ్రహం లభించి జన్మజన్మలకు సరిపడే పుణ్యాన్ని ఆర్జించి తరించడం అనేది కూడా అనాదిగా విజ్ఞ్యులు పాటిస్తూ వస్తున్న విశ్వాసం, ఆచారం...

అవ్విధముగనే....

ఈ జన్మలో విశ్వాసంతో, చిత్తశుద్ధితో, భక్తితో, గావింపబడే అధ్యాత్మకర్మాచరణ అనేది, ఈ జన్మలోను, మరియు ఉత్తర జన్మల్లోను ఎంతో ఘనంగా తరింపజేసే పుణ్యదాయక సాధనంగా వర్ధిల్లును అనేది కూడా అనాదిగా విజ్ఞ్యులు పాటిస్తూ వస్తున్న విశ్వాసం, ఆచారం...
దేశకాలానుగుణంగా, భక్తి, ఆచారం, అనేవి ఆయానైసర్గిక అంశాలకు అనుగుణంగా వివిధ నామరూపసంప్రదాయాలను సంతరించుకునే అంశం...

అటువంటి అపురూపమైన శ్రీమేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల సందర్శనం, బంగారం/బెల్లం నైవేద్య సమర్పణ / ప్రసాద వితరణ / స్వీకరణానంతరం, తిరుగుప్రయాణమార్గంలో లక్నవరం లేక్ కేబుల్ బ్రిడ్జ్ తరువాత తారసపడిన పురాతనమైన శ్రీ రామప్ప ఆలయాన్ని 
(800 సంవత్సరాల క్రితం వర్ధిల్లిన కాకతీయులనాటి శిల్పశాస్త్ర వైభవానికి దర్పణంగా అమరిన ఈ రామప్ప ఆలయం 
"UNESCO World Heritage Site" గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన పురాతత్త్వ విశేషం) 
దర్శించి, శ్రీకాకతీయరుద్రేశ్వరస్వామి వారిని ప్రదోషవేళలో నమస్కరించి తరించడం ఒక గొప్ప మధురస్మృతి...
చాలా సంవత్సరాల క్రితం శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో, ఈ రామప్ప ఆలయంలోని అత్యత్భుతమైన అలనాటి శిల్పకళావైభవం గురించి వినడం బాగా గుర్తు. ఒక శిల్పం యొక్క రాతిని మీటగా సంగీత శాస్త్రపరంగా సప్తస్వరాల శృతిని ప్రతిధ్వనించే శిల్పం గురించి ఎప్పుడో వినగా, ఇప్పుడు ప్రత్యక్షంగా తిలకించి, ఆలకించడం మరో గొప్ప మధురస్మృతి...

ఎంతైనా పాతకాలం నాటి మన పురాతన భారతీయ ప్రాచీనకళలయొక్క వైభవం అనన్యసామాన్యమైన సాటిలేని మేటి అద్భుతం....
పూర్వికులైన మన స్థపతులే ఇంత అత్యత్భుతమైన రీతిలో శిల్పశాస్త్రవైభవాన్ని ఆవిష్కరించి మనల్ని అబ్బురపరుస్తుంటే...
కొన్ని పురాతన దేవాలయాల్లో దేవశిల్పి విశ్వకర్మ సృజించిన శిల్పశాస్త్రవైభవానికి మనం ఇంకెంత అచ్చెరువొందవలెనో కదా..!

అందుకే యావద్ ప్రపంచంలో భారతదేశానిది అప్పుడూ, ఇప్పుడూ మరియు ఎల్లప్పుడూ కూడా ఎన్నో ఆశ్చర్యకరమైన, అతిశయభరిత విశేషాల్లో అమరులు కూడా ప్రశంసించే అగ్రస్థానమే..!! 🙂


No comments:

Post a Comment