Saturday, April 20, 2019

2019-April-19- శ్రీ వికారి చైత్ర పౌర్ణమి నాటి హనుమజ్జయంతి వైభవం.. :)

శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ ||
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||
రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||
...
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం....
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమద్ స్మరాద్భవేత్....
అంటూ సంత్ గోస్వామి తులసీదాస్ కృత హనుమాన్ చాలీసా, శ్రీమద్రామాయణాంతర్గత ' జయత్యతి బలోరామో.....' జయమంత్రం, మరియు వివిధ శ్లోకాలతో హనుమంతుని ఆరాధించని ఇల్లు, వాడా, ఊరు, నగరం ఉండదు అనడం అతిశయోక్తి కానేరదు.....
అసలు హనుమంతుని చిన్న గుడి ఐనా లేని కాలని, నగర్, ఉండవంటే ఈ పాపపంకిలమైన కలియుగానికి హనుమద్ ఆరాధన ఎంతటి అవసరమో, ఆ పరమరామభక్తుని అనుగ్రహం ఎంతటి కీలకమో అనేది జగద్విదితమేకదా....,
మరే దేవుడికి లేనన్ని స్వయంభూ ఆలయాలు , దేవతా, ఋషి, మానవ స్థాపిత, ఆలయాలు హనుమంతునికి మాత్రమే ఉండడం, ఎంతటి తీవ్ర కష్టాన్ని సైతం నిర్మూలించే హనుమద్ ఆరాధనా వైభవం ఆ శ్రీరాములవారి త్రేతాయుగం నుండి ఈనాటి శ్రీవేంకటేశ్వరస్వామి వారి కలియుగం వరకు వాడవాడల ఆ వాయుపుత్రుని ఘనభక్తవాత్సల్యానికి తార్కాణంగా నిలిచి, అసలు హనుమంతుడి దయలేని నాడు నాటి శ్రీరామాయణం నుండి నేటి ఇంటింటి రామాయణం వరకు మన జీవితాలు నిలదొక్కుకొని మనగలిగే ప్రసక్తే లేదనేది నిర్వివాదాంశం...!!
ఇందాక పొద్దున్నే నా స్కూల్ డేస్ నుండి నేటివరకు కూడా గత 20 సంవత్సరాలుగా రెగ్యులర్ గా వెళ్ళే సాయిబాబా ఆలయంలో కొలువైన అభయాంజనేయ స్వామిని దర్శించుకొని, గత సంవత్సరమే కొత్తగా కొలువైన శ్రీలక్ష్మీగణపతి ఆలయ ప్రథమవార్షిక త్రయాహ్నికోత్సవాంతర్భాగంగా శివపార్వతుల కళ్యాణమహోత్సవంలో పాల్గొనడం జన్మాంతర సౌభాగ్యంగా భావించి, శ్రీ వికారి చైత్ర పౌర్ణమి నాటి హనుమజ్జయంతి పర్వదిన సందర్భంగా, అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాంతర్గతంగా సమీకరించిన కొన్ని వాక్యాలతో ఆ సమీరజుని శ్రీకరమైన వైభవాన్ని కొంత వివరింప చిరు ప్రయత్నం ... 😊
హనుమంతుని వైభవంగురించి విశేషంగా తెలియజేసే పరాశరసమ్హితానుసారంగా, యుద్ధంలో త్రిపురాసుర సమ్హారానికి శ్రీమహావిష్ణువు రుద్రునకు చేసిన సహాయానికి ప్రతిగా, తన రాబోయే శ్రీరామావతారంలో అపర రుద్రామ్షసంభూతుడిగా ప్రభవించి రావణాసుర సమ్హారంలో ఎనలేని సహాయం చేస్తానని వచించి, తదనుగుణంగా పుంజికస్థల అనే అప్సరస శాపవశాత్తు అంజనాదేవి అనే వానరకన్యగా భూమిపై ప్రభవించి, వానరరాజు కేసరికి వాయుదేవుని అనుగ్రహంగా ఇవ్వబడిన రుద్రతేజస్సును స్వీకరించడం వలన ఆవిర్భవించిన మహానుభావుడు ఆంజనేయుడు అని లోకోక్తి కదా.....
సూర్యున్ని ఆరగించే మధురఫలంగా భావించి గగనగామి గా ఎగిరినప్పుడు ఇంద్రుని వజ్రాయుధ ప్రహారానికి దవడ (హనువు) వాసింది కాబట్టి హనుమంతుడయ్యాడు.....
ఆ సంఘటనాంతర్గతంగా వాయుదేవున్ని శాంతింపజేయుటకు సకలదేవతలు తమ తమ శక్తులను ఆ పవనసూతికి అనుగ్రహించడంతో, సకల దేవతాస్వరూపుడైనాడు... ఆఖరికి సాటిలేని బ్రహ్మదేవుని శక్తి బ్రహ్మాస్త్రంతోనైనా సరే నిలువరించ సాధ్యపడని అసాధ్యసాధ్యుడు హనుమంతుడు అని చతుర్ముఖ బ్రహ్మదేవుల అనుగ్రహం కదా....!!
నేను నాలోకం...అన్నట్టుగా కదలిక లేకుండా ఎప్పుడూ నిశ్ఛలచిత్తుడై తపస్సులోనే ఉండే శివునకు,
అన్ని కదలికలకు అధారమైన తన ' శక్తి ' కూడా తోడై, అపర రుద్రశక్తిగా భువికి తరలివచ్చిన హరతేజస్సు హనుమంతుడు....
వాలాగ్ర శక్తిగా, హనుమంతుని లోని రుద్రునకు, రుద్రాని గా శక్తిమొత్తం తన వాలంలో (తోకలో) కొలువైఉంటుంది.....అందుకే కదా ' ఇంద్రజిత్ ప్రయోగ బ్రహ్మాస్త్ర బంధితుడిగా ' బ్రహ్మగారిపై ఉన్న గౌరవంతో ఉన్నప్పుడు, రాక్షసులు ఎన్ని అఘాయిత్యాలు చేసినా బ్రహ్మాస్త్ర బంధనాన్ని గౌరవించి శాంతచిత్తుడై సహించాడు కాని, చివరకు తోకకు నిప్పు పెట్టగానే అగ్గిమీదగుగ్గిలమై మొత్తం కాంచనలంకనే కాల్చిపడేసాడు...!
అందుకే సీతమ్మ కూడా, " హనుమ తోకకు పెట్టబడిన నిప్పు మంచువలే చల్లగా ఉండి తనకు ఎట్టి హాని కలిగించక ఉండుగాక...! " అని దీవించింది హనుమంతున్ని....
శ్రీరామనామస్మరణలో లీనమై ఉండి, తను కూర్చున్న చోటినుండి ఇసమంతనైనను కదలకుండ, ఎంతటి శక్తిని సైతం తన తోకతో చుట్టి తుత్తునియలు చేయడం హనుమంతుడి వాలాగ్ర స్థిత పరాశక్తి వల్లె....!
ఏదేవుడికైనా సరే ఆ దేవుడికి స్తోత్రం ఉంటుందికాని, ఆ దేవతా శరీరభాగాలకు ప్రత్యేకించి స్తోత్రాలు ఉండవు...
కాని ఒక్క హనుమంతుడికి మాత్రమే " హనుమల్లాంగూలాస్త్ర స్తోత్రం " ఉండడం మనం గమనించవచ్చు...ఒక స్థితి నుండి మరో స్థితి కి మారేటప్పుడు హనుమంతుడు తన తోకను చరిచి లంఘిస్తాడు అని సద్గురువుల ఉవాచ...అంతటి ఘనమైన శక్తికేంద్రం హనుమవాలం....!!
భీముడికి, గరుత్మంతుడికి, తమ తమ శక్తిపై ఉన్న అతిశయాన్ని నివారించుటకు, హనుమంతుడు తన తోకను కదిలించమని సవాల్ విసిరింది కూడ అందుకే....పరాశక్తిని నిలువరించే శక్తి కలదే ఇహపరమున ఎవ్వరికైనన్..? 
త్రేతాయుగం నాటినుండి కాదు, అసలు హనుమ తను అవతారం స్వీకరించకముందే, జాబాలి / జపాలి అనే మహర్షి తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి, అదే రూపంతో కొలువైయ్యారు అని ఇప్పటికీ మనం తిరుమల కొండపై హనుమతిరుగాడే జపాలితీర్థం దెగ్గర చూస్తుంటాం కదా....
ఇక త్రేతాయుగంలో ప్రత్యక్షంగా రామ సుగ్రీవ మైత్రిని నెరపిన కిష్కింధకాండ నుండి, మరీ ముఖ్యంగా ఉపాసనా కాండగా లోకప్రసిద్ధినొందిన సుందరకాండ లో, హనుమను పట్టగల వీరుడు అసలు ఉన్నడా అని శివభక్తదురంధరుడైన రావణుడే హడలెత్తిపొయ్యేంతగా హనుమ విజృంభించడం మనం చూస్తుంటాం..... అశోకవననాశకుడిగా తన విశ్వరూపాన్ని జూపిన వైనాన్ని శ్రీవాల్మీకి మహర్షి తమ ఈ క్రింది సుందరకాండ 54 వ సర్గలోని 35వ శ్లోకంలో ఎంత ఆశ్చర్యజనకంగా అభివర్ణించారో చూస్తే, హనుమంతుని సకలదేవతాశక్త్యాత్మక వైభవం గోచరిస్తుంది..!!
***************************************************************
వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమోవా వరుణోనిలోవా!
రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో న వానరో అయమ్ స్వయమేవ కాలః!! 5-54-35
వజ్రము ధరించినటువంటి దేవపతియైన ఇంద్రుడా లేక యముడా లేక వరుణుడా లేక వాయువా లేక ఈశానుడా లేక అగ్నిదేవుడా లేక కుబేరుడా లేక సూర్యుడా లేక చంద్రుడా
ఇతడు వానరుడు కాడు. స్వయముగా కాలస్వరూపుడే...!!
vajrī mahendrastridaśeśvaro vā |
sākṣādyamo vā varuṇo.anilo vā |
rudrognirarko dhanadaśca somo |
na vānaro.ayam svayameva kālaḥ | 5-54-35
"He is not a monkey. He is either Indra the Lord of celestials wielding a thunderbolt, or Yama the lord of death of water, or the wind-god or the fire seated in the third eye of Lord Shiva or the sun-god or Kubera the lord of riches or the moon-god. He may be Kala (the Time-spirit) himself."
***************************************************************
హనుమంతుడు లేని నాడు...
సాగరలంఘనం లేదు...
సీతామాత జాడ కనిపెట్టడం, లేదు...
లంక యొక్క ఆనుపాను తెలిసె వీలు, లేదు...
అక్షకుమారాది రాక్షసవీరుల హననం, లేదు...
హిమాచల పర్వతసానువులనుండి ఓషధీ పర్వతాన్ని తెచ్చి
సంజీవిని (చనిపోయినవారిని బ్రతికించుటకు),
సంధానకరణి (శరీర అవయవాలు విరిగిపోయిన వారికి తిరిగి వాటిని అనుసంధానించుటకు),
సావర్ణకరణి ( బాగా పోరాడి శరీరంలో జీవకళ లోపించి ఆఖరిదశలో ఉన్నవారికి తిరిగి స్వస్థత చేకూర్చుటకు)
విశల్యకరణి (శరీరమునుండి విషపువస్తువులను తీసివేయుటకు )
అనే 4 దివ్యౌషధులతో, మేఘనాథుని మాయాయుద్ధంలో సమసిపోయిన మొత్తం వానరసేనను పునర్జీవింపజేయడం, లేదు....
లక్ష్మణస్వామికి సహాయంచేసి శ్రీరామనామ ధర్మాస్త్రంతో, అసలు లొంగదీసుకోలేనంతగా మాయాయుద్ధంలో ఆరితేరిన ఇంద్రజిత్ ని వధించడం, లేదు...
వాయుదేవున్ని ప్రార్ధించి శ్రీరామసంధిత శరం యొక్క వాయుగమనాన్ని రావణనాభి వైపునకు గురిని సవరించి, రావణసమ్హారం జరిగేలా చూడడం, లేదు...
ఇలా చెప్పుకుంటూ పోతే హనుమంతుడు లేని నాడు అసలు శ్రీరామాయణమే లేదు..!!! 
అందుకే కదా రాముడు చివరికి అందరికి తగు రీతిలో తనకు చేసిన సహయానికి ప్రతిగా బహుమతులను ప్రసాదించాడు కాని, హనుమ వద్దకు వచ్చేసరికి
"నువ్వు చేసిన సహాయం నాలోనే జీర్ణమైపోని హనుమా... చిరంజీవివై, భవిష్యద్ బ్రహ్మవై సదా వర్ధిల్లు...! " అంటూ శ్రీరామాలింగనాసౌఖ్యాన్ని పొందిన ఎకైక యోధుడిగా చిరకీర్తిని గడించాడు....!! 
ఇక ద్వాపర యుగం వచ్చేసరికి, కురుక్షేత్రసంగ్రామంలో అర్జునుడి దివ్యరథానికి "జెండాపై కపిరాజు..." గా నిలిచి, విజయుడి అసలు విజయానికి కారణమై నిలిచాడు....
యుద్ధం మొత్తం అయ్యాక, " అర్జునా, నీ రథం నుండి అన్ని సామాన్లు తీసుకొని దిగి దూరంగా వెళ్ళి నిల్చో..." అని చెప్పి....శ్రీకృష్ణుడు, పైన పతాకంపై కొలువైన హనుమను, ఇక సెలవు తరలి వెళ్ళు హనుమా...అని పలికి తను ఒక్కసారిగా దూకేసరికి భగ్గున రథం మొత్తం కాలిబూడిదవ్వగా...,
ఆశ్చర్యంతో చూసిన అర్జునుడు, 'అదేంటి బావ అలా రథం ఒక్కసారిగా కాలిపోయింది...' అని, విచారించగా...,
'రథంలో నేను, రథంపై హనుమ ఉండి అన్ని తామై నిన్ను రక్షించాము కాబట్టి ఇప్పటివరకు మంత్రపూతమైన తపశ్శక్తితో ఉన్న నీ రథం, అందులో నువ్వు క్షేమంగా ఉండగలిగారు....భీష్మ ద్రోనాది ఉద్దండుల బాణప్రహారానికి నీ రధం ఎప్పుడో కాలిపోయింది అర్జునా....' అని సమాధానం ఇచ్చిన
శ్రీకృష్ణుడివల్ల మనం చూడొచ్చు అసలు హనుమ లేనినాడు కురుక్షేత్రం, పాండవ విజయం కూడా లేనేలేదని..!!
ఇలా హనుమంతుని రక్షణచే లోకం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా క్షేమంగా ఉండి, నమ్మి కొలిచిన భక్తులెల్లరిని కంటికి రెప్పలా కాపాడి అనుగ్రహిస్తూన్నే ఉన్నాడు / ఉంటాడు ఆ అంజనీసుతుడు...!!
ఇప్పటికీ వారి అమృత గాత్రమునుండి వెలువడిన భగవద్గీత 7 కొండలపై నిత్యం ప్రతిధ్వనిస్తు కీర్తికాయులుగా  మిగిలిపోయిన గానగంధర్వులు కీ.శే. శ్రీ ఘంటసాల గారు కూడా, వారు గాత్రప్రపంచంలో రారాజుగా కాకముందు సామాన్యులుగా ఉన్నప్పుడు ఒక హనుమంతుని ఆలయసమీపంలో నిత్యం వసించేవారని, ఆ హనుమంతుని అనుగ్రహంతోనే
అంతటి గాత్రవైభవం అమరిందని అస్మద్ గురుదేవుల ప్రవచనంలో వినేఉంటారు..   )
కాలం కర్కోటకుడి విషంలా బాధించిననాడు, మా జీవితాలను కూడా ఆ హనుమంతుడు అంతగా కాపాడి అనుగ్రహించాడు.....
సాడేసాత్ కాలపు శనిపీడాసమయంలోని గండకాలపు ఘడియల్లో కాలం చేయాల్సిన మా నాన్న ప్రాణాలను నిలిపి ఆ ఘొరకలినుండి గట్టెకించి సమ్రక్షించాడు....!
మా బస్తిలోని హనుమంతుని ఆలయ స్థాపన సమయంలో, అమ్మా నాన్నలచే కైంకర్యపరులుగా స్వామివారి గర్భాలయ నూతన మూర్తి యొక్క ధాన్యాధివాసం, జలాధివాసం, ఇత్యాది సశాస్త్రీయ క్రతువులను నిర్వహించి దీవించిన, దెగ్గరి శ్రీవేంకటేశ్వర ఆలయ అర్చకులు,
పాంచరాత్రాగమ విద్వాంసులు శ్రీమాన్ కోసురి రామకృష్ణాచార్యులవారు / రాఘవాచార్యులవారు ఆనాడు హనుమంతుని అనుగ్రహం మాపై స్తిరంగా ధృవమై నిలిచేలా చేసి అనుగ్రహిస్తే...,
మా దెగ్గరి చుట్టాలైన హరి అన్న, కవిత వదినలు, నాన్నతో ఆంజనేయ మాలను ధరింపజేసి ఆ కలిసిరాని సమయంలో శ్రీరామరక్షగా ఆదుకొని,
బంధుత్వమంటే ఒక రూపాయి పెట్టకున్నా పర్లేదు కాని..మంచి మనసుతో వీలైన మాటసహాయమో, చేతసహాయమో చేయడం అని చూపడంతో...,
ఇవ్వాళ్టికి కూడా హనుమంతుని సేవిస్తూ బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించాడు ఆ శ్రీవేంకటరామచంద్రుడు..!
అందుకే కదా అన్నమాచార్యులవారు హనుమంతున్ని సకలదేవతాత్మకంగా కొనియాడుతూ, శ్రీవేంకటేశ్వరస్వామి బంటుగా ఇప్పటికీ తన అప్రతిహత వీరత్వాన్ని శూరత్వాన్ని భక్తరక్షణ దీక్షాదక్షతను చాటిచెప్తూనేఉన్నడని ఈ క్రింది సంకీర్తనలో కీర్తించారు....! ☺️
************************************
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము
ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము
చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము
జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము
************************************
సర్వం, శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి సహిత స్వయంభూ శ్రీ కొండగట్టు వీరాంజనేయస్వామి శ్రీచరణారవిందార్పనమస్తు.....!🙏🙏🙏🙏🙏 🙂

Monday, April 15, 2019

శ్రీ శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వర స్వామి వార్ల 28వ వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత, శ్రీ వికారి చైత్ర శుద్ధ సప్తమి నాటి, కళ్యాణమహోత్సవవైభవం... :)

శ్రీ శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వర స్వామి వార్ల 28వ వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత, శ్రీ వికారి చైత్ర శుద్ధ సప్తమి నాటి, కళ్యాణమహోత్సవానంతరం, శ్రీమాన్ చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు అనే శ్రీవైష్ణవాచార్యాశిఖామణులు, శ్రీపాంచరాత్రాగమ స్రష్టలు, సముద్రందాటకుండా పదిలపరుచుకున్న తమ సదాచార సంపన్నమైన ఔపానసిక బలంతో, జ్యోతిష, వాస్తు, ఇత్యాది శాస్త్రాల్లో ఉద్దండులైన భాగవతవరేణ్యులు,
( అమరావతి రాకముందే ఎక్కడికి దెగ్గరగా నూతనాంధ్ర రాజధాని రాగలదో తెలిపి అక్కడ తమ వ్యాపార నివాస సముదాయములకనువైన స్థలసేకరణకు వాగ్సహాయం చేసి ఇవ్వాళ కొందరు కోటీశ్వరులుగా ఉండడానికి కారణమైన ఆచార్యులు వీరు....ప్రతి వార్షికబ్రహ్మోత్సవ ప్రత్యేక వ్యాఖ్యాన బ్రహ్మగా అసీనులయ్యె వీరి సద్వాక్కులను ఆలకించి జ్ఞ్యానార్జన చేసిన ఎందరో భక్తుల్లో నేనుకూడా ఒకడిని...వారి వాస్తు విశ్లేషణావైభవాన్ని చూసి ఎన్నోసార్లు ఆశ్చర్యంచెందాను. ఫలాన దోషం ఉన్నప్పుడు ఫలాన బాధలతో అక్కడి వారు ఇబ్బంది పడతారు...అని వారు వివరించిన విషయాలన్నీ కూడా నా జీవితం మరియు ఎందరో బంధుమితృల జీవితంలోతరచి చూసి..., ఔరా ఆచార్యుల అమృతవాక్కులు ఎంతటి ఘనమైనవి కదా అని వారిని చాల సార్లు తలచుకుంటు ఉంటాను.. అలా అందరికి మాట సహాయం చేసే సద్గుణం కేవలం సద్గురువులకు, ఆచార్యశిఖామణులకే కదా ఉండేది మరి....! )
స్వామి వారికి తలవ్రాలు (తలంబ్రాలు) గా సమర్పించిన మేలిమి ముత్యాల్లోనుండి ఆశీస్సులుగా నాకు అనుగ్రహించబడిన 2 ముత్యాలు మరియు అచ్చం మురళీకృష్ణమాచార్యుల వారిలా, మైకందుకుంటే కంచుకంఠం తో శ్రోతల మనోజాఢ్యం మాయమయ్యేలా, కర్ణభేరి తుప్పొదిలిపోయేలా శృతిగానం సాగించే శ్రీ కౌండిన్యాచార్యుల వారిచే 1 ముత్యం లభించగా, గైకొని సంతసించి భోజనప్రసాదస్వీకారానికి వెళ్ళినప్పుడు, ఆశ్చర్యంగా పైకిచూస్తే నేను, నా భార్య, నిల్చున్నది కదంబ వృక్షంకింద...!! 
వచ్చామా, స్వామిని దర్శించి ప్రసాదం ఆరగించి వెళ్ళామా
అని తప్ప, 10 సంవత్సరాలుగా గుడికి వెళ్తున్ననాకు ఈనాటివరకు అక్కడ ఉన్నది కదంబవృక్షం అనేసంగతే తెలియదని నాకు నేనే నవ్వుకొని స్వామికి నమస్కారం చేస్కొని, లైన్లో ఉండి ఈసారి ఏమేమి ఐటెంస్ పెడ్తున్నారా అని ఆలోచిస్తుండగా, స్వామి తో సాగిన చిరు మౌనసంభాషణలో,
" ఒరెయ్ నీకెంత సేపు తిండిగోలేనా, ఆచార్యముఖేన నాచే అనుగ్రహించబడినవి కేవలం మంచిముత్యాలా, లేక భక్తభాగవతానుగ్రహమైన జ్ఞానమౌక్తికములా అని ఒక్కసారైన సరిచూడవా....? మీ గురువర్యులు శ్రీమద్భాగవతంలో నా ఉళగళందపెరుమాల్ తత్వం గురించి ఏమని బోధించారో మరచితివా..? అచార్యులచే దత్తమైనవి 3 ముత్యాలు కాదు... వాటిని 1,2 ముత్యాలు అని సంబోధించవలే...
అదితి యొక్క ప్రార్ధనమేరకు, ఇంద్రునకు భ్రాతగా ఉపేంద్రుడనై 8 వత్సరముల వటువుగా ప్రభవించి, స్వర్గపీఠాధిరోహణకై తన అభీష్టాన్ని నెరవేర్చుటకు, బలిచక్రవర్తిని నేను ఈ క్రింది పోతనామాత్యుల వారి పద్యాలతో కదా ప్రార్ధించాను....
---------------------------------------------------------------
" స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ధ్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ
న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్."
" ఒంటివాఁడ నాకు నొకటి రెండడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల;
గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర! "
---------------------------------------------------------------
అప్పుడు మీ గురువుగారు వివరించిన అందలి వైశేషిక భావమంజరి తెలియును కదా....
" ఓ బలిదైత్య...నీకు స్వస్తి అగుగాక..." అని పైకి నేను అంటూనే...,
ఆంతరమున...." దేవకార్యఘాతకుడిగా మారిన ఇక నీ పని స్వస్తి....3 వ అడుగుతో నిన్ను పాతాళానికి సాగనంపెద..."
అనే భావం తో కదా నేను వచించితిని....
సమంత్రక జలాధారా పూర్వకంగా నేనడిగిన భూదానం చేయడానికి సిద్ధమైన బలిని, వద్దని వారిస్తు తీర్థపాత్రలో కీటకమై అడ్డు పడాలని జేరిన శుక్రచార్యుల వారి నేత్రాన్ని దర్భపుల్లతో చిదిమివేసి, బలిదైత్యుని తో
--------------------------------------------------------------------------------
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపైఁ, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
--------------------------------------------------------------------------------
అని స్తుత్యుడనై, 3 అడుగుల భూదానం పట్టి,
--------------------------------------------------------------------------------
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
--------------------------------------------------------------------------------
అనే పోతనామాత్యుల వారి వర్ణనలా, అలనాడు సకల విశ్వాన్ని కొలిచిన నా త్రివిక్రమాకృతిని మరచితివా...? "
అనే భావలహరిలో మునకలు వేసిన నాకు ఒక్కసారిగా స్వామి వారి వామనావతార వైభవం స్ఫురించి, శరణువేడిన వారిని కాచిరక్షించే శ్రీహరి భక్తవత్సలత ఎంతటి చిత్రమైనదో కదా అనుకొని,
జనకమహారాజుకు నాగేటిచాలులో అనుగ్రహించబడిన సీతమ్మవలే, అలనాడు పెరియాళ్వారులకు శ్రీవిళ్ళిపుత్తూర్ తులసీవనంలో అనుగ్రహించబడిన ఆండాళ్ తల్లి (గోదమ్మ) , స్వామి వామనావతార వైభావాన్ని ప్రస్తుతిస్తు తన తిరుప్పావై లోని ఈ క్రింది 3వ పాశురంలో స్వామిని ప్రార్ధించిన విధానాన్ని,
--------------------------------------------------------------------------------
ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మూరి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.
--------------------------------------------------------------------------------
మరియు నేను కంచికి వెళ్ళినప్పుడు దర్శించిన ఉళగళందపెరుమాళ్ ఆలయంలోని (దివ్యదేశం) స్వామి వారి త్రివిక్రమాకృతి యొక్క విశ్వరూపాన్ని జ్ఞ్యప్తికి తెచ్చుకొని, స్వామికి మనసారా ముమ్మారు నమస్కరించి, భోజనప్రసాదం ఆరగిస్తూ అప్పుడెప్పుడో ఒకసారి స్వామివారి నిజపాదదర్శనాంతర్గత శ్రీపాదవైభవం గురించి నేను రాసుకున్న ఈ క్రింది కవిత గుర్తుకువచ్చి సంతసించాను.. 
గంగమ్మకు తెలియును ఆ పాదాల చల్లదనం....
అహల్యకు తెలియును ఆ పాదాల వెచ్చదనం....
బలిదైత్యునకు తెలియును ఆ పాదాల గట్టిదనం...
కాళీయునకు తెలియును ఆ పాదాల కాఠిన్యం....
కమలమ్మకు తెలియును ఆ పాదాల కోమలత్వం...
నా ఎదసవ్వడులకు తెలియును ఆ పాదాల తియ్యందనం...!! 
**************************************************
“విష్ణోః పదే పరమ” ఇత్యుదిత ప్రశంసౌ
యౌ “మధ్వ ఉత్స” ఇతి భోగ్య తయా‌உప్యుపాత్తౌ |
భూయస్తథేతి తవ పాణితల ప్రదిష్టౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 10 || 🙏🙂

నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం

Vaame bhoomisutaa purashcha hanumaanpashchatsumitraa sutaha
Shatrughno bharatashcha paarsva dalayoraachveeyyadi koneshucha,
Sugreevashcha, vibheeshanashcha yuvaraat taarasuto jambavaan
Madhye neela saroja komala ruchim raamam bhaje syamalam
वामे भूमिसुता पुरश्च हनुमान्पश्चात्सुमित्रा सुतः
शत्रुघ्नो भरतश्च पार्श्व दळयो राछ्वीय्यादि कोनेषुच,
सुग्रीवाश्चा, विभीषनश्चा युवराट तारासुतो जांबवान
मध्ये नील सरोज कोमल रुचिं रामं भजे श्यामलं
వామే భూమిసుతా పురశ్చ హనుమాన్పశ్చాత్సుమిత్రా సుతః
శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోరాఛ్వీయ్యాది కొణేషుచ,
సుగ్రీవశ్చ, విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం
😊

అందరికి 2019 - శ్రీవికారి చైత్ర శుద్ధ నవమి / శ్రీరామనవమి శుభాభినందనలు....!

శ్రీరామచంద్రాశ్రితపారిజాత సమస్తకల్యాణగుణాభిరామ
సీతాముఖాంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు ....
శ్రీరాముడు లోకాభిరాముడిగా అందరిని సమ్రక్షిస్తు చల్లగా అనుగ్రహించు గాక...😊
అందరికి శ్రీవికారి చైత్ర శుద్ధ నవమి / శ్రీరామనవమి శుభాభినందనలు....!

సద్గురువుల వాగ్వైభవం లో శ్రీ వాల్మీకీ విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణం... :)

శ్రీ వాల్మీకీ విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణం,
(విశేషించి హనుమంతుని సకలదేవతా స్వరూపవైభవాన్ని ఆవిష్కరించే సుందరకాండ 😊)
యుగయుగాలుగా జగజగాలను పునీతం గావిస్తు, కులమతవర్ణవర్గాది భేదభావాలకు అతీతమై, శ్రవణం మాత్రం చేతనే ఎల్లరికి సకల క్లేశహరణమై శాంతిసౌభాగ్య దాయకమై జీవితాలకు ధన్యతను చేకూర్చడం అనే సత్యాన్ని ఎందరో భక్తులు తమ తమ జీవితాల్లో
స్వానుభవపూర్వకంగా దర్శించి తరించారనే జగద్విదితమైన సత్యానికి తార్కాణములు కోకొల్లలు...!
విశేషించి అది సద్గురువుల వాగ్వైభవం లో దర్శించినవారికి ఒనగూరే అనుగ్రహం అమేయం...!!
అటువంటి అనేకానేక ఆధ్యాత్మిక జీవుల జీవితాల్లో నాది కూడ ఒకటి... సరిగ్గా గమనిస్తే చరిత్రకారులెందరెందరో వారి వారి స్వానుభవగతమైన సత్యాలను అలంబనగా గావించి రచించుకున్న రామాయణాలు అనేకం....
ఉత్తరాన శ్రీ గోస్వామి తులసీదాస్ విరచిత శ్రీరామచరితమానస్ నుండి
దక్షిణాన మొల్ల రామాయణం మొదలుకొని, నిన్నమొన్నటి
చండవోలు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి పితామహులవరకు,
శ్రీమద్రామాయణానికి తమదైన రీతిలో సాధికారిక శాస్త్రసమ్మతమైన భాష్యాలు రచించి తరించిరి...
"The Magnanimity of sadguru Sree ChaaganTi pravachita, aadikavi Shree Vaalmeeki virachita, SreemadRaamaayaNam and its glorious
effects....."
అనే అంతర్జాల ఆంగ్ల శీర్షిక గా
నా నిజజీవితపు సంఘటనల ఆధారంగా
శ్రీమద్ రామాయణ వైభవాన్ని ఆ శ్రీవేంకటరామచంద్రుడు నాతో ఆవిష్కరింప జేసి నన్ను అనుగ్రహించుగాక.....
అనే నా సంకల్పానికి రేపటి
శ్రీరామనవమి కళ్యాణమహోత్సవం, స్వామి హనుమ అనుగ్రహంతో శ్రీకారమవుగాక ...! 😊
YOUTUBE.COM
Srirama Pattabhishekamu By Sri Chaganti Koteswara Rao Garu. Sri Rama Pattabhishekam (Coronation of…

Wednesday, April 10, 2019

2019 - VOTE right to LIVE bright....!

Here's a video that has links to websites with great useful info on the contestants, their existing parliament presence, and so on.....
Do check out and VOTE right to LIVE bright....!
panauti hai paabandi ka, 
( list ko) paDho sahi....
chunauti hai zimmedaariki ka,
( person ko ) chuno sahi...
kasauti hai zindagi ka,
( apna vote ko ) nibhaaye sahi....
Chalay VOTE daalne....
Apne bhalaayi kay vaaste...
aur desh ka bhalaayi kay vaaste bhi...😊

Rajadhani School's 1998 - Teachers Day Celebrations' Pic ... :)

Vinay Kumar Aitha
Got this 1998 - Teachers Day Celebrations Pic, from one of my Rajadhani School's senior buddy......
LoL...look at my innocent sane look.... How funny that I went to teach 6th class folks in my 7th class itself...😂