శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ ||
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ ||
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||
రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||
...
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||
...
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం....
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమద్ స్మరాద్భవేత్....
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమద్ స్మరాద్భవేత్....
అంటూ సంత్ గోస్వామి తులసీదాస్ కృత హనుమాన్ చాలీసా, శ్రీమద్రామాయణాంతర్గత ' జయత్యతి బలోరామో.....' జయమంత్రం, మరియు వివిధ శ్లోకాలతో హనుమంతుని ఆరాధించని ఇల్లు, వాడా, ఊరు, నగరం ఉండదు అనడం అతిశయోక్తి కానేరదు.....
అసలు హనుమంతుని చిన్న గుడి ఐనా లేని కాలని, నగర్, ఉండవంటే ఈ పాపపంకిలమైన కలియుగానికి హనుమద్ ఆరాధన ఎంతటి అవసరమో, ఆ పరమరామభక్తుని అనుగ్రహం ఎంతటి కీలకమో అనేది జగద్విదితమేకదా....,
అసలు హనుమంతుని చిన్న గుడి ఐనా లేని కాలని, నగర్, ఉండవంటే ఈ పాపపంకిలమైన కలియుగానికి హనుమద్ ఆరాధన ఎంతటి అవసరమో, ఆ పరమరామభక్తుని అనుగ్రహం ఎంతటి కీలకమో అనేది జగద్విదితమేకదా....,
మరే దేవుడికి లేనన్ని స్వయంభూ ఆలయాలు , దేవతా, ఋషి, మానవ స్థాపిత, ఆలయాలు హనుమంతునికి మాత్రమే ఉండడం, ఎంతటి తీవ్ర కష్టాన్ని సైతం నిర్మూలించే హనుమద్ ఆరాధనా వైభవం ఆ శ్రీరాములవారి త్రేతాయుగం నుండి ఈనాటి శ్రీవేంకటేశ్వరస్వామి వారి కలియుగం వరకు వాడవాడల ఆ వాయుపుత్రుని ఘనభక్తవాత్సల్యానికి తార్కాణంగా నిలిచి, అసలు హనుమంతుడి దయలేని నాడు నాటి శ్రీరామాయణం నుండి నేటి ఇంటింటి రామాయణం వరకు మన జీవితాలు నిలదొక్కుకొని మనగలిగే ప్రసక్తే లేదనేది నిర్వివాదాంశం...!!
ఇందాక పొద్దున్నే నా స్కూల్ డేస్ నుండి నేటివరకు కూడా గత 20 సంవత్సరాలుగా రెగ్యులర్ గా వెళ్ళే సాయిబాబా ఆలయంలో కొలువైన అభయాంజనేయ స్వామిని దర్శించుకొని, గత సంవత్సరమే కొత్తగా కొలువైన శ్రీలక్ష్మీగణపతి ఆలయ ప్రథమవార్షిక త్రయాహ్నికోత్సవాంతర్భాగంగా శివపార్వతుల కళ్యాణమహోత్సవంలో పాల్గొనడం జన్మాంతర సౌభాగ్యంగా భావించి, శ్రీ వికారి చైత్ర పౌర్ణమి నాటి హనుమజ్జయంతి పర్వదిన సందర్భంగా, అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాంతర్గతంగా సమీకరించిన కొన్ని వాక్యాలతో ఆ సమీరజుని శ్రీకరమైన వైభవాన్ని కొంత వివరింప చిరు ప్రయత్నం ... 😊
హనుమంతుని వైభవంగురించి విశేషంగా తెలియజేసే పరాశరసమ్హితానుసారంగా, యుద్ధంలో త్రిపురాసుర సమ్హారానికి శ్రీమహావిష్ణువు రుద్రునకు చేసిన సహాయానికి ప్రతిగా, తన రాబోయే శ్రీరామావతారంలో అపర రుద్రామ్షసంభూతుడిగా ప్రభవించి రావణాసుర సమ్హారంలో ఎనలేని సహాయం చేస్తానని వచించి, తదనుగుణంగా పుంజికస్థల అనే అప్సరస శాపవశాత్తు అంజనాదేవి అనే వానరకన్యగా భూమిపై ప్రభవించి, వానరరాజు కేసరికి వాయుదేవుని అనుగ్రహంగా ఇవ్వబడిన రుద్రతేజస్సును స్వీకరించడం వలన ఆవిర్భవించిన మహానుభావుడు ఆంజనేయుడు అని లోకోక్తి కదా.....
సూర్యున్ని ఆరగించే మధురఫలంగా భావించి గగనగామి గా ఎగిరినప్పుడు ఇంద్రుని వజ్రాయుధ ప్రహారానికి దవడ (హనువు) వాసింది కాబట్టి హనుమంతుడయ్యాడు.....
ఆ సంఘటనాంతర్గతంగా వాయుదేవున్ని శాంతింపజేయుటకు సకలదేవతలు తమ తమ శక్తులను ఆ పవనసూతికి అనుగ్రహించడంతో, సకల దేవతాస్వరూపుడైనాడు... ఆఖరికి సాటిలేని బ్రహ్మదేవుని శక్తి బ్రహ్మాస్త్రంతోనైనా సరే నిలువరించ సాధ్యపడని అసాధ్యసాధ్యుడు హనుమంతుడు అని చతుర్ముఖ బ్రహ్మదేవుల అనుగ్రహం కదా....!!
నేను నాలోకం...అన్నట్టుగా కదలిక లేకుండా ఎప్పుడూ నిశ్ఛలచిత్తుడై తపస్సులోనే ఉండే శివునకు,
అన్ని కదలికలకు అధారమైన తన ' శక్తి ' కూడా తోడై, అపర రుద్రశక్తిగా భువికి తరలివచ్చిన హరతేజస్సు హనుమంతుడు....
వాలాగ్ర శక్తిగా, హనుమంతుని లోని రుద్రునకు, రుద్రాని గా శక్తిమొత్తం తన వాలంలో (తోకలో) కొలువైఉంటుంది.....అందుకే కదా ' ఇంద్రజిత్ ప్రయోగ బ్రహ్మాస్త్ర బంధితుడిగా ' బ్రహ్మగారిపై ఉన్న గౌరవంతో ఉన్నప్పుడు, రాక్షసులు ఎన్ని అఘాయిత్యాలు చేసినా బ్రహ్మాస్త్ర బంధనాన్ని గౌరవించి శాంతచిత్తుడై సహించాడు కాని, చివరకు తోకకు నిప్పు పెట్టగానే అగ్గిమీదగుగ్గిలమై మొత్తం కాంచనలంకనే కాల్చిపడేసాడు...!
అందుకే సీతమ్మ కూడా, " హనుమ తోకకు పెట్టబడిన నిప్పు మంచువలే చల్లగా ఉండి తనకు ఎట్టి హాని కలిగించక ఉండుగాక...! " అని దీవించింది హనుమంతున్ని....

శ్రీరామనామస్మరణలో లీనమై ఉండి, తను కూర్చున్న చోటినుండి ఇసమంతనైనను కదలకుండ, ఎంతటి శక్తిని సైతం తన తోకతో చుట్టి తుత్తునియలు చేయడం హనుమంతుడి వాలాగ్ర స్థిత పరాశక్తి వల్లె....!
ఏదేవుడికైనా సరే ఆ దేవుడికి స్తోత్రం ఉంటుందికాని, ఆ దేవతా శరీరభాగాలకు ప్రత్యేకించి స్తోత్రాలు ఉండవు...
కాని ఒక్క హనుమంతుడికి మాత్రమే " హనుమల్లాంగూలాస్త్ర స్తోత్రం " ఉండడం మనం గమనించవచ్చు...ఒక స్థితి నుండి మరో స్థితి కి మారేటప్పుడు హనుమంతుడు తన తోకను చరిచి లంఘిస్తాడు అని సద్గురువుల ఉవాచ...అంతటి ఘనమైన శక్తికేంద్రం హనుమవాలం....!!

భీముడికి, గరుత్మంతుడికి, తమ తమ శక్తిపై ఉన్న అతిశయాన్ని నివారించుటకు, హనుమంతుడు తన తోకను కదిలించమని సవాల్ విసిరింది కూడ అందుకే....పరాశక్తిని నిలువరించే శక్తి కలదే ఇహపరమున ఎవ్వరికైనన్..?
త్రేతాయుగం నాటినుండి కాదు, అసలు హనుమ తను అవతారం స్వీకరించకముందే, జాబాలి / జపాలి అనే మహర్షి తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి, అదే రూపంతో కొలువైయ్యారు అని ఇప్పటికీ మనం తిరుమల కొండపై హనుమతిరుగాడే జపాలితీర్థం దెగ్గర చూస్తుంటాం కదా....
ఇక త్రేతాయుగంలో ప్రత్యక్షంగా రామ సుగ్రీవ మైత్రిని నెరపిన కిష్కింధకాండ నుండి, మరీ ముఖ్యంగా ఉపాసనా కాండగా లోకప్రసిద్ధినొందిన సుందరకాండ లో, హనుమను పట్టగల వీరుడు అసలు ఉన్నడా అని శివభక్తదురంధరుడైన రావణుడే హడలెత్తిపొయ్యేంతగా హనుమ విజృంభించడం మనం చూస్తుంటాం..... అశోకవననాశకుడిగా తన విశ్వరూపాన్ని జూపిన వైనాన్ని శ్రీవాల్మీకి మహర్షి తమ ఈ క్రింది సుందరకాండ 54 వ సర్గలోని 35వ శ్లోకంలో ఎంత ఆశ్చర్యజనకంగా అభివర్ణించారో చూస్తే, హనుమంతుని సకలదేవతాశక్త్యాత్మక వైభవం గోచరిస్తుంది..!!
***************************************************************
వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమోవా వరుణోనిలోవా!
రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో న వానరో అయమ్ స్వయమేవ కాలః!! 5-54-35

వజ్రము ధరించినటువంటి దేవపతియైన ఇంద్రుడా లేక యముడా లేక వరుణుడా లేక వాయువా లేక ఈశానుడా లేక అగ్నిదేవుడా లేక కుబేరుడా లేక సూర్యుడా లేక చంద్రుడా
ఇతడు వానరుడు కాడు. స్వయముగా కాలస్వరూపుడే...!!
ఇతడు వానరుడు కాడు. స్వయముగా కాలస్వరూపుడే...!!
vajrī mahendrastridaśeśvaro vā |
sākṣādyamo vā varuṇo.anilo vā |
rudrognirarko dhanadaśca somo |
na vānaro.ayam svayameva kālaḥ | 5-54-35
sākṣādyamo vā varuṇo.anilo vā |
rudrognirarko dhanadaśca somo |
na vānaro.ayam svayameva kālaḥ | 5-54-35
"He is not a monkey. He is either Indra the Lord of celestials wielding a thunderbolt, or Yama the lord of death of water, or the wind-god or the fire seated in the third eye of Lord Shiva or the sun-god or Kubera the lord of riches or the moon-god. He may be Kala (the Time-spirit) himself."
***************************************************************
హనుమంతుడు లేని నాడు...
***************************************************************
హనుమంతుడు లేని నాడు...
సాగరలంఘనం లేదు...
సీతామాత జాడ కనిపెట్టడం, లేదు...
లంక యొక్క ఆనుపాను తెలిసె వీలు, లేదు...
అక్షకుమారాది రాక్షసవీరుల హననం, లేదు...
హిమాచల పర్వతసానువులనుండి ఓషధీ పర్వతాన్ని తెచ్చి
సంజీవిని (చనిపోయినవారిని బ్రతికించుటకు),
సంధానకరణి (శరీర అవయవాలు విరిగిపోయిన వారికి తిరిగి వాటిని అనుసంధానించుటకు),
సావర్ణకరణి ( బాగా పోరాడి శరీరంలో జీవకళ లోపించి ఆఖరిదశలో ఉన్నవారికి తిరిగి స్వస్థత చేకూర్చుటకు)
విశల్యకరణి (శరీరమునుండి విషపువస్తువులను తీసివేయుటకు )

అనే 4 దివ్యౌషధులతో, మేఘనాథుని మాయాయుద్ధంలో సమసిపోయిన మొత్తం వానరసేనను పునర్జీవింపజేయడం, లేదు....
లక్ష్మణస్వామికి సహాయంచేసి శ్రీరామనామ ధర్మాస్త్రంతో, అసలు లొంగదీసుకోలేనంతగా మాయాయుద్ధంలో ఆరితేరిన ఇంద్రజిత్ ని వధించడం, లేదు...
వాయుదేవున్ని ప్రార్ధించి శ్రీరామసంధిత శరం యొక్క వాయుగమనాన్ని రావణనాభి వైపునకు గురిని సవరించి, రావణసమ్హారం జరిగేలా చూడడం, లేదు...
ఇలా చెప్పుకుంటూ పోతే హనుమంతుడు లేని నాడు అసలు శ్రీరామాయణమే లేదు..!!!
అందుకే కదా రాముడు చివరికి అందరికి తగు రీతిలో తనకు చేసిన సహయానికి ప్రతిగా బహుమతులను ప్రసాదించాడు కాని, హనుమ వద్దకు వచ్చేసరికి
"నువ్వు చేసిన సహాయం నాలోనే జీర్ణమైపోని హనుమా... చిరంజీవివై, భవిష్యద్ బ్రహ్మవై సదా వర్ధిల్లు...! " అంటూ శ్రీరామాలింగనాసౌఖ్యాన్ని పొందిన ఎకైక యోధుడిగా చిరకీర్తిని గడించాడు....!!
"నువ్వు చేసిన సహాయం నాలోనే జీర్ణమైపోని హనుమా... చిరంజీవివై, భవిష్యద్ బ్రహ్మవై సదా వర్ధిల్లు...! " అంటూ శ్రీరామాలింగనాసౌఖ్యాన్ని పొందిన ఎకైక యోధుడిగా చిరకీర్తిని గడించాడు....!!
ఇక ద్వాపర యుగం వచ్చేసరికి, కురుక్షేత్రసంగ్రామంలో అర్జునుడి దివ్యరథానికి "జెండాపై కపిరాజు..." గా నిలిచి, విజయుడి అసలు విజయానికి కారణమై నిలిచాడు....
యుద్ధం మొత్తం అయ్యాక, " అర్జునా, నీ రథం నుండి అన్ని సామాన్లు తీసుకొని దిగి దూరంగా వెళ్ళి నిల్చో..." అని చెప్పి....శ్రీకృష్ణుడు, పైన పతాకంపై కొలువైన హనుమను, ఇక సెలవు తరలి వెళ్ళు హనుమా...అని పలికి తను ఒక్కసారిగా దూకేసరికి భగ్గున రథం మొత్తం కాలిబూడిదవ్వగా...,
ఆశ్చర్యంతో చూసిన అర్జునుడు, 'అదేంటి బావ అలా రథం ఒక్కసారిగా కాలిపోయింది...' అని, విచారించగా...,
'రథంలో నేను, రథంపై హనుమ ఉండి అన్ని తామై నిన్ను రక్షించాము కాబట్టి ఇప్పటివరకు మంత్రపూతమైన తపశ్శక్తితో ఉన్న నీ రథం, అందులో నువ్వు క్షేమంగా ఉండగలిగారు....భీష్మ ద్రోనాది ఉద్దండుల బాణప్రహారానికి నీ రధం ఎప్పుడో కాలిపోయింది అర్జునా....' అని సమాధానం ఇచ్చిన
శ్రీకృష్ణుడివల్ల మనం చూడొచ్చు అసలు హనుమ లేనినాడు కురుక్షేత్రం, పాండవ విజయం కూడా లేనేలేదని..!!

ఇలా హనుమంతుని రక్షణచే లోకం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా క్షేమంగా ఉండి, నమ్మి కొలిచిన భక్తులెల్లరిని కంటికి రెప్పలా కాపాడి అనుగ్రహిస్తూన్నే ఉన్నాడు / ఉంటాడు ఆ అంజనీసుతుడు...!!
( ఇప్పటికీ వారి అమృత గాత్రమునుండి వెలువడిన భగవద్గీత 7 కొండలపై నిత్యం ప్రతిధ్వనిస్తు కీర్తికాయులుగా మిగిలిపోయిన గానగంధర్వులు కీ.శే. శ్రీ ఘంటసాల గారు కూడా, వారు గాత్రప్రపంచంలో రారాజుగా కాకముందు సామాన్యులుగా ఉన్నప్పుడు ఒక హనుమంతుని ఆలయసమీపంలో నిత్యం వసించేవారని, ఆ హనుమంతుని అనుగ్రహంతోనే
అంతటి గాత్రవైభవం అమరిందని అస్మద్ గురుదేవుల ప్రవచనంలో వినేఉంటారు.. )
కాలం కర్కోటకుడి విషంలా బాధించిననాడు, మా జీవితాలను కూడా ఆ హనుమంతుడు అంతగా కాపాడి అనుగ్రహించాడు.....
సాడేసాత్ కాలపు శనిపీడాసమయంలోని గండకాలపు ఘడియల్లో కాలం చేయాల్సిన మా నాన్న ప్రాణాలను నిలిపి ఆ ఘొరకలినుండి గట్టెకించి సమ్రక్షించాడు....!
సాడేసాత్ కాలపు శనిపీడాసమయంలోని గండకాలపు ఘడియల్లో కాలం చేయాల్సిన మా నాన్న ప్రాణాలను నిలిపి ఆ ఘొరకలినుండి గట్టెకించి సమ్రక్షించాడు....!
మా బస్తిలోని హనుమంతుని ఆలయ స్థాపన సమయంలో, అమ్మా నాన్నలచే కైంకర్యపరులుగా స్వామివారి గర్భాలయ నూతన మూర్తి యొక్క ధాన్యాధివాసం, జలాధివాసం, ఇత్యాది సశాస్త్రీయ క్రతువులను నిర్వహించి దీవించిన, దెగ్గరి శ్రీవేంకటేశ్వర ఆలయ అర్చకులు,
పాంచరాత్రాగమ విద్వాంసులు శ్రీమాన్ కోసురి రామకృష్ణాచార్యులవారు / రాఘవాచార్యులవారు ఆనాడు హనుమంతుని అనుగ్రహం మాపై స్తిరంగా ధృవమై నిలిచేలా చేసి అనుగ్రహిస్తే...,
పాంచరాత్రాగమ విద్వాంసులు శ్రీమాన్ కోసురి రామకృష్ణాచార్యులవారు / రాఘవాచార్యులవారు ఆనాడు హనుమంతుని అనుగ్రహం మాపై స్తిరంగా ధృవమై నిలిచేలా చేసి అనుగ్రహిస్తే...,
మా దెగ్గరి చుట్టాలైన హరి అన్న, కవిత వదినలు, నాన్నతో ఆంజనేయ మాలను ధరింపజేసి ఆ కలిసిరాని సమయంలో శ్రీరామరక్షగా ఆదుకొని,
బంధుత్వమంటే ఒక రూపాయి పెట్టకున్నా పర్లేదు కాని..మంచి మనసుతో వీలైన మాటసహాయమో, చేతసహాయమో చేయడం అని చూపడంతో...,
బంధుత్వమంటే ఒక రూపాయి పెట్టకున్నా పర్లేదు కాని..మంచి మనసుతో వీలైన మాటసహాయమో, చేతసహాయమో చేయడం అని చూపడంతో...,
ఇవ్వాళ్టికి కూడా హనుమంతుని సేవిస్తూ బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించాడు ఆ శ్రీవేంకటరామచంద్రుడు..!
అందుకే కదా అన్నమాచార్యులవారు హనుమంతున్ని సకలదేవతాత్మకంగా కొనియాడుతూ, శ్రీవేంకటేశ్వరస్వామి బంటుగా ఇప్పటికీ తన అప్రతిహత వీరత్వాన్ని శూరత్వాన్ని భక్తరక్షణ దీక్షాదక్షతను చాటిచెప్తూనేఉన్నడని ఈ క్రింది సంకీర్తనలో కీర్తించారు....! ☺️
************************************
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము
ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము
చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము
జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము
************************************
సర్వం, శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి సహిత స్వయంభూ శ్రీ కొండగట్టు వీరాంజనేయస్వామి శ్రీచరణారవిందార్పనమస్తు.....!🙏🙏🙏🙏🙏 🙂
No comments:
Post a Comment