Wednesday, April 10, 2019

అస్మద్ గురుదేవుల వాగ్వైభవంలో యుగాది / ఉగాది పండుగ మరియు యుగాది పచ్చడి ప్రాశస్త్యం.... ☺

అస్మద్ గురుదేవుల వాగ్వైభవంలో యుగాది / ఉగాది పండుగ మరియు యుగాది పచ్చడి ప్రాశస్త్యం.... 
తద్వర్షాదౌనింబసుమం
శర్కరామ్లఘృతైర్యుతం
భక్షితంపూర్వయామేస్య
తద్వర్షంసౌఖ్యదాయకం.....!
తద్వర్షాదౌనింబసుమం = నూతనసంవత్సర వసంత ఋతు ఆగమనం తో కొత్తగ పూసే వేపపువ్వు
శర్కరా = నిలవ దోషం ఉండని బెల్లం అని ఇక్కడ భావించాలి... ( చక్కెర కి బదులుగా)
ఆమ్ల = ఆమ్లము అనగా ఇక్కడ చింతపండు రసం గా భావించాలి...
( సైంటిఫిక్ గా చింతపండు రసంలో టార్టారిక్ యాసిడ్ అనే ఆమ్లము ఉంటుంది. అత్యంత శక్తివంతంగా మనిషి యొక్క మేధోమండలాన్ని ఉత్తేజపరిచే లక్షణం ఉన్నందుకే చింతపులుసు పుళిహోరనే ఎక్కువగా ఆలయాల్లో ప్రసాదంగా ఇచ్చే వ్యవస్థను మన పెద్దలు ఏర్పరిచారు. అందుకే దాన్ని ఆంగ్లంలో ' ట్యామరిండ్ ' అని సంబోధిస్తారు...)
ఘృతైర్యుతం = పసుప్పచ్చని పూసలుపూసలు గా ఉండే స్వచ్ఛమైన అమృతతుల్యమైన దేశవాళి ఆవునెయ్యిని కూడా అందులో కొంచెం కలుపుకోవాలి.....
వీటితో పాటుగా వసంత ఋతువులో అప్పుడప్పుడే కొత్తగా కాస్తు, వగరు, పులుపు, తీపి రుచులు కలగలిసినట్టుగా ఉండే మామిడికాయ ముక్కలు + పూర్ణఫలమైన కొబ్బరికాయ ముక్కలు, కూడా అందులో కలపడం పరిపాటి....
భక్షితంపూర్వయామేస్య = భగవంతునికి ఈ ఉగాది పచ్చడి ని నైవెద్యంగా సమర్పించి అది ప్రసాదంగా ఎంత తొందరగా వీలైతే అంతటి పొద్దు జాములోనే స్వీకరించడం...
తద్వర్షంసౌఖ్యదాయకం = ఆ నూతన సంవత్సరమంతా కూడా వారికి ఈశ్వరానుగ్రహంగా సౌఖ్యదాయకంగా ఉంటుంది....
అని క్లుప్తంగా శ్లోకభావం....
-19:03
45,446 Views

No comments:

Post a Comment