Thursday, November 12, 2020

శ్రీకరమైన శరత్ పౌర్ణమి విశేషం.....😊 ( అనగా ఆశ్వయుజ / కార్తీక పౌర్ణమి )

( అనగా ఆశ్వయుజ / కార్తీక పౌర్ణమి ) 

శ్రీముత్తుస్వామి దీక్షితార్ వారి సశాస్త్రీయమైన కర్ణాటకసంగీత సుజ్ఞ్యాన ప్రౌఢిమ భరిత సంకీర్తనల్లో లోకప్రసిద్ధమైనది
" కంజదలాయతాక్షి కమాక్షి..." అనే అత్యద్భుతమైన సంకీర్తన....

శ్రీ చాగంటి సద్గురువులచే వారి ప్రవచనాల్లో ప్రత్యేకంగా ఉటంకించబడిన సంకీర్తన...కాబట్టి ఎంత మహత్తరమైన సంకీర్తనో అది ఉపాసించే సంగీతరసికులకు మాత్రమే విదితమైన సత్యం అది.....

ఈ కీర్తనలోని చరణంలో 
"రాకాశశివదనే సురదనే...." అని 
అమ్మవారి ముఖమండలాన్ని శరత్కాల పౌర్ణమి చంద్రుడితో పోల్చి కీర్తించినవైనం ఎల్లరికి విదితమే...

6 ఋతువుల్లో కేవలం శరత్కాలమే ఎందుకు ప్రత్యేకం...?

శ్రీచాగంటి సద్గురువులు చెప్పినట్టుగా 
" పరిణతచంద్రుడు " అని శరత్కాలపౌర్ణమి చంద్రుడినే ఎందుకు పిలవడం..?
( అంటే మిగతా 10 నెలల్లో వచ్చే పౌర్ణమి చంద్రుడికి పరిణతి లేదనా దానర్ధం...? ఇదెక్కడి విడ్డూరం...! )

" ఋతురాగాలు " వంటి సీరియల్ టైటిల్ సాంగ్స్ లో పాడినట్టుగా
" శరత్ చంద్రికల కళ..." ఎందుకు అంత విశేషమైనది...?

ఇత్యాది గా జిజ్ఞ్యాసాపరులకు ప్రశ్నలు రావడం సహజమే కద....

మీరు లౌకికంగా కూడా గమనించగలిగితే ఈ శరదృతువు లోని పౌర్ణమి చంద్ర బింబం మిగతా ఋతువుల్లోని చంద్రబింబం కంటే కూడా
చాలా పెద్దగా, ఎర్రగా, కాంతివంతంగా, హాయిగా, ఎన్నెన్నో సరికొత్త కళలసమాహారంలా మనకు దర్శనం ఇవ్వడం ఎల్లరికి విదితమే కద....

శ్రీ చాగంటి సద్గురువులు వివరవించినట్టుగా చైత్ర మాసం తో చాంద్రమాన కొత్త సంవత్సర కాలగణనం మొదలుపెట్టడంతో చిత్త నక్షత్రం మొదట ఉండవలసిన నక్షత్రం....
అలా కాక అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రమవ్వడం తో ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ప్రకాశించే ఆశ్వయుజ మాసం కదా నిజానికి మొట్టమొదటి మాసం అవ్వాలి...

మరి మొదలు కాదు...చివర కాదు....

ఈ శరత్కాల ఆశ్వయుజ పౌర్ణమి సరిగ్గా చాంద్రమాన కాలగణన వ్యవస్థలో అనగా మన పంచాంగ క్రోడీకరణలో సరాసరి మధ్య స్థానంలో వచ్చేలా మన పెద్దలు ఈ సనాతన ధర్మావలంబిత చాంద్రమాన సంవత్సర పట్టికను రూపొందించడం నిజంగా విచిత్రమే కదు....

చైత్రం వైశాఖం - వసంత ఋతువు

జ్యేష్ఠం ఆషాఢం - గ్రీష్మ ఋతువు

శ్రావణం భాద్రపదం - వర్ష ఋతువు

ఆశ్వయుజం కార్తీకం - శరద్ ఋతువు

మార్గశిరం పుష్యం -  హేమంత ఋతువు

మాఘం ఫాల్గుణం - శిశిర ఋతువు

ఆశ్వయుజ శరన్నవరాత్రోత్సవం అనగా విజయదశమి తర్వాత వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి....
మరియు పాంచాహ్నిక దీపావళి ఉత్సవానంతరం వచ్చే కార్తీక పౌర్ణమి....

శరద్ ఋతువులోని ఈ రెండు పున్నములు కూడా అత్యంత ప్రశస్తమైనవిగా మన పెద్దలు పేర్కొనడం చాలా మందికి ఎరుకలో ఉన్న విషయమే...
( the same is celebrated as " Autumn Moon " across the world ) 

తీవ్రమైన ఎండలు కాయకుండా....
భారి వర్షాలు లేకుండా....
గజ గజ వణికించే చలి లేకుండా...

ప్రకృతి ఒక ప్రశాంతమైన / ఆహ్లాదకరమైన వాతావరణ స్థితిలో ఉండడం ఈ శరద్ ఋతువులో మనం గమనించగలం.....

ప్రశాంతంగా బ్రతుకుతుంటే కొందరు ఓర్వలేని వారు అలజడులు కలిగించినట్టు, ఈ ప్రశాంతమైన శరద్ ఋతువు యమధర్మరాజు గారికి కూడా బాగా ప్రసన్నమైన ఋతువు గా ఉండి, 
శ్రీ చాగంటి సద్గురువులు బోధించినట్టుగా ప్రకృతిలో
యమదమ్ష్ట్ర బయల్దేరే కాలం కూడా ఈ శరద్ ఋతువు అవ్వడం ఒకింత శోచనీయం.....

అందుకే ఈ ఆశ్వయుజ మాసం ఆరంభమవ్వడంతోనే విశేషంగా అమ్మవారి ఆరాధన,
దుర్గా సప్తశతీ ప్రయుక్త శాక్తేయ అర్చారాధనలు గావించి జీవులు రక్షణను పొందేలా మన పెద్దలు పండగలను వ్యవస్థీకరించడం మనం గమనించవచ్చు.....

ప్రత్యేకించి 
శ్రీవిద్యోపాసకులకు, శాక్తేయ బీజాక్షరోపాసకులకు, వివిధ శాక్తేయ సిద్ధాంతానుగుణమైన శక్తి ఉపాసకులకు ఈ ఆశ్వయుజ మాసం ఎంతటి కీలకమైన మాసమో సంప్రదాయం తెలిసిన పెద్దలకు విదితమైన విషయమే..

ఇక కార్తీక మాసం యొక్క వైభవం, 
కార్తీక పౌర్ణమి తిథి ఎంత గొప్పదో ఎల్లరికి తెలిసిన విషయమే కద....

( ముక్కోటి తీర్థములు తమ తమ సూక్ష్మ శరీరంతో తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి వారి సన్నిధిలోని 
కపిలతీర్థం లోకి ప్రవేశించి అభిజిత్ లగ్నంలో మాధ్యందిన మార్తండుడు వినువీధిలో దేదీప్యమానంగా ప్రకాశిస్తుండగా
కార్తీక పౌర్ణమి మధ్యాహ్నం కపిలతీర్థ మొక్కోటి సంకల్పసహిత తీర్థస్నానం గావించడం ఎన్నో జన్మల పుణ్యబల విశేషం అని శ్రీ చాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో బోధించడం చాలా మందికి విదితమే....

2013 నాటి కపిలతీర్థ మొక్కోటి సంకల్పసహిత తీర్థస్నానం గావించడం, శ్రీచాగంటి సద్గురువుల
సమక్షంలో అనగా వకుళమాతగుహ దెగ్గర్లో గురువుగారు కుటుంబసహితంగా 
పుష్కరిణిలో తీర్థస్నానం గావించడం,

మరియు ఆ భారి భక్తజనసందోహం లో దూరి గబ గబా ముందుకు సాగి , అదే సమయంలో డైరెక్ట్ గా ఆ భారి కపిలతీర్థ జలపాత ధారల కింద, నాకు కుడివైపుగా ఉన్న గురువుగారిని ప్రత్యక్షంగా దర్శిస్తూ,
వారి అనుగ్రహమైన సంకల్ప పఠనంతో తీర్థస్నానం గావించడం నా జన్మాంతర సుకృతం... 😊)

ఇవ్విధంగా ఆశ్వయిజ కార్తీక మాసాల్లో పరివ్యాప్తమై ఉండే శరద్ ఋతువు యొక్క వైభవం నిజంగా బహు విశేషమైనదే...

ఇక అసలు విషయానికి వస్తే...

షడృతువుల ఒక సంవత్సర కాలచక్రాన్ని సంవత్సర కాలపురుషుడిగా భావిస్తే...

ఆ కాలపురుషుడి నడిమి వయసు శరద్ ఋతువు అవుతుంది...

అనగా ఒక 100 సంవత్సరాల ఆయుఃప్రమాణం కలిగిన దివ్యపురుషుడి మేధస్సు తన 50వ ఏట ఎంత పండిఉంటుందో....
ఎంతటి పెద్దరికాన్ని, 
ఎంతటి పరిపక్వమైన ఆలోచనాసరళిని, 
ఎంతటి గంభీరమైన జీవిత అనుభవాన్ని,
ఎంతో పదునుదేలిన వ్యూహాలను రచించే సమర్ధతతో,
పరిపూర్ణమై ఉంటుందో.....

అవ్విధంగా 6 ఋతువుల వయసు గల ఒక సంవత్సర కాలంలో ఈ శరదృతువులోని చంద్రుడిది కూడా అంతగా పండిన పూర్ణచంద్రబింబమై మనకు దర్శనమిస్తుంది....

" చంద్రమా మనసో జాతః .... "
అని కదా మన శృతివాక్యం.....

మనః కారకుడైన చంద్రుడు అంతటి పరిపూర్ణ బింబమై వినువీధిలో వెలుగొందుతున్నప్పుడు, ఆ చంద్రుడిని వివిధ శాస్త్రోక్త విధివిధానాలతో అర్చించినవారికి, ఆ చంద్రకళను ధరించిన పార్వతీపరమేశ్వరులను అర్చించినవారికి, ఆ చంద్రసహోదరి / చంద్రుడి బావ  శ్రీలక్ష్మీనారాయణులను అర్చించినవారికి ఈ శరదృతువులో ఎనలేని అనుగ్రహం లభించి వారి జీవితాలు మళ్ళీ వచ్చే శరద్ ఋతువు వరకు అలా పరిపూర్ణమై పరిఢవిల్లుతాయి....

ఆదిపరాశక్తి ఆరాధనకు ఆలవాలమైన దసరా:విజయదశమి / శ్రీలక్ష్మీనారాయణుల ఆరాధనలకు ఆలవాలమైన దీపావళి ఈ రెండు పెద్ద పండగలు కూడా శరద్ ఋతువులోనే వచ్చి మనకు ఆ పరిణత చంద్రుడి అనుగ్రహాన్ని ప్రసాదించి మన జీవితాలను పండిచేది....

శరద్ ఋతువులోని పరిణత చంద్రుడి ఆరాధనతో పరిణత కలిగిన మనోబలం మన సొంతమవుతుంది...

ఎన్ని బలాలున్నా మనోబలం లేకపోతే అవన్నీ దండగే.....

మనోబలం బాగా ఉంటే ఇతరములైన
ఎన్ని బలాలనైనను సాధించవచ్చును.....

కాబటి మనిషికి ఎంతో మనోబలం ప్రసాదించే ఈ శరద్ కాల పౌర్ణమి చంద్రుడి అనుగ్రహం నిజంగా చాల విశేషమైనది....

"వాడితో మసులుకునేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తరోయ్....
చూడ్డానికి కేవలం 34 సంవత్సరాల
సాధారణ వ్యక్తి లా కనపడతాడు కాని....ఎన్నెన్నో విషయాల్లో ఆరితేరిన దిట్ట.... 50 సంవత్సరాల తల పండిన వ్యక్తి లా ఉంటుంది వాడి ఉన్నతమైన ఆలోచనా భరిత కార్యాచరణసరళి..."

అని లోకంలో సాధారణంగా అనడం వింటూంటాం కద....

అది వారికి ఈ శరత్కాల చంద్రుడి అనుగ్రహం వల్ల అనుగ్రహించబడిన పరిణతి....అంతటి ఘనమైనది కనుకనే మన పెద్దలు ఆశ్వయిజ కార్తీకాలు రావడంతో ఎక్కువగా దైవసంబంధంగా ఉండేలా ఈ 60 రోజుల దైనందిన నియమావళి ఉండేలా ఏర్పరిచారు.....

9 రోజుల శరన్నవరాత్రులు ,
5 రోజుల దీపావళి తో మొదలయ్యే కార్తీక మాస సమ్రంభం....

ఇలా ఎక్కువగా పండగ వాతావరణం / ఆలయాలకి / దైవానికి మన జీవితాలు దెగ్గరగా ఉండేల మన పెద్దలు ఈ శరద్ ఋతు దైనందిన జీవితాన్ని సెలవిచ్చి ఆ దైవానుగ్రహంతో మన జీవితాలు పండేలా జీవనసాఫల్యతకు మార్గము ఏర్పరిచినారు....

కాబట్టి ఎల్లరు ఈ శరద్ ఋతువులోని చంద్రుడిని / విశేషించి ఈ శరద్ పౌర్ణమి ద్వయాన్ని బాగ ఆరాధించి
అనుగ్రహాన్ని బడసి జీవితానికి కావలసినంతగా మనోబలాన్ని పుంజుకొని సుఖసంతోషాలతో జీవించెదరు గాక....

శ్రీ చాగంటి సద్గురువులు వివరించిన అక్షిత్రయం / అంబాత్రయం చాలమందికి గుర్తు ఉండేఉంటుంది...

* కంచి కామాక్షి *
* మదురై మీనాక్షి *
* కాశి విశాలాక్షి *

* శ్రీకాళహస్తి జ్ఞ్యానప్రసూనాంబ *
* దక్షారామ మాణిక్యాంబ *
* శ్రీశైల భ్రమరాంబ * 

( శ్రీ జోగులాంబ క్షేత్రం వేరు.... అది అంబాత్రయం లిస్ట్లోకి రాదు.... శక్తిపీఠాల లిస్ట్లోకి మాత్రమే వస్తుంది...)

విశేష శాక్తేయ ఆరాధనావళి లో
ఈ అక్షిత్రయం / అంబాత్రయం యొక్క ధ్యానం / అర్చన / ఆరాధన ఎంత ప్రశస్తమైనదో సంప్రదాయం తెలిసిన పెద్దలకు బాగ విదితమే....

యావద్ భూమండలానికి నాభి స్థానంలో ఉండేది శ్రీ కంచి కామాక్షి ఆలయం....

ఒక మనుష్య ప్రాణికి నాభి మండలం నుండి యావద్ శరీరానికి అనుసంధానించి ఉండబడే నాడి వ్యవస్థ ఎట్టిదో....

యావద్ భూమండలం పై గల అనేక శాక్తేయ ఆలయ దేవతా శక్తుల వ్యవస్థ అవ్విధంగా శ్రీ కంచి కామాక్షి 
పరదేవత / ఆలయం తో 
అనుసంధానించబడి ఉంటుంది....

కాబట్టి శ్రీకంచికామాక్షి కి సమర్పించే అర్చన / ఆరాధన / ప్రార్ధన / నమస్కారం ఇత్యాది పూజావిధులన్నీ కూడా అన్ని శాక్తేయాలయాల దైవానికి సమర్పించబడే ఆరాధనలుగా ఆ దయామయి శ్రీకంచికామాక్షి మార్చి భక్తులను అనుగ్రహిస్తుంది.....

"ఒక్క ఆలయంలోని పరాశక్తికి సమర్పించే ఆరాధన భూమండల మొత్తం ఆవరించి ఉండే వివిధ శాక్తేయ సన్నిధులకు సమర్పించడం తో సమమా...ఇదెక్కడి విడ్డూరం..."

అని ఎవరికైనా సందేహం కలిగితే....

ఆ దైవిక సమాధానాలు కేవలం ధ్యానగ్రాహ్యములు / అమ్మవారి వివిధ యోగకటాక్షములు అని నిర్వచించవలసి ఉంటుంది....

శ్రీకంచి పరమాచార్య వారి అనుగ్రహంతో ఈ క్రింది విశేషాలపై ధ్యానసిద్ధిని గడించి చూడండి....
అమ్మవారి కరుణమేర అవి గ్రాహ్యమై అనుగ్రహిస్తాయి....

*****

పంచభూత లింగాల్లో పృథ్వీలింగం ఉన్నది కంచిలోనే...

అక్కడి ఏకామ్రేశ్వర పృథ్వీలింగానికి నీటితో అభిషేకం ఉండదు.....కేవలం మల్లెనూనె తో మాత్రమే.....

కంచిలో ఎన్ని శివాలాయాలున్నా సరే 
అన్నిటికి ఆ శ్రీకంచికామాక్షియే అధిదేవత... 

శ్రీ కంచికామాక్షి గర్భాలయంలో అమ్మవారి సన్నిధిలో ఉన్న వ్యవస్థ పేరు " బిలాకాశం / బిలాహాసం "
( అనగా అక్కడి నుండి ఆకాశానికి అనగా ఈ విశాల విశ్వంలో ఎక్కడికైనను ప్రయాణించగల యోగమార్గము స్థిరీకరించబడి ఉన్నది.... )

కంచి క్షేత్రంలో ఉన్న తీర్థం " పంచగంగ " తీర్థం...

*****

విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్త్రహస్తపుటి
కామక్షిపక్ష్మలాక్షి కలితవిపంచి విభాసివైరించి.....

కమాక్షీం కుటిలాలకాం ఘనకృపాం
కాంచీపురీదేవతాం

ఏకామ్రేశ్వరవామభాగనిలయాం
మృష్టాన్నదాం పార్వతీం

భక్తానామభయప్రదాంబుజకరాం
పూర్ణేందుబింబాననాం

కంఠేకాంచనమాలికాం
శివసతీమంబామజస్రం భజే..!
🙏🙏🙏🙏🙏 😊🍨🍕🍟

No comments:

Post a Comment