" శ్రీశార్వరి నామసంవత్సరంలో ఏదో ఒకరోజు, ఆఖరి రోజైనా సరే మీ నిరీక్షణకు ఫలితం దైవానుగ్రహంగా లభిస్తుంది, ఓపిక పట్టి ప్రయాణం గావిస్తూ ఉండండి...
మీ ఇన్నాళ్ళ ఎడారి ప్రయాణంలో అలసటకు ఊరటగా, దాహార్తికి ఉపశమనంలా ఒయాసిస్ ఒకటి తారసపడి మీకు శాంతిని కలిగిస్తుంది....
అని ఒక వ్యక్తికి కొందరు సహృదయులైన పెద్దలు సూచించగా.....
సరిగ్గా ఎంత దూరంలో ఉందో తెలియదు కాని కచ్చితంగా ఉందని తెలుసు, చేరుకోగలమనీ తెలుసు....
కాబట్టి దైవం మీద విశ్వాసంతో ప్రయాణం గావిస్తు ఉన్న వ్యక్తిని వీలైతే ప్రోత్సహించాలి లేదా చూసిచూడనట్టు వదిలేయాలి....
అంతే కాని ఎంతదూరం నడిచినా నీకు నీళ్ళు దొరకవు అని నిరుత్సాహపరిచే దౌర్భాగ్యులు హితులెలా ఔతారు..?
నీకెందుకు నీళ్ళకోసం ఈ వృధాప్రయాసా వేరే ఎదైనా దారి చూస్కొని వెళ్ళు అని పక్కదారి పట్టించే దౌర్భాగ్యులు హితులెలా ఔతారు..?
నువ్వెళ్ళే దార్లో నీళ్ళు దొరకవు అని మేమనుకుంటున్నాము...కాబట్టి నీ ప్రయాణానికి అడ్డుపడి వేధిస్తాము అనే దౌర్భాగ్యులు హితులెలా ఔతారు..?
నీకు నీళ్ళు దొరికిన తర్వాత అన్నీ మేమే లాక్కొని తాగేస్తాము....
కాబట్టి నువ్వు ప్రయాణించడమే దండగ అని నీరుకార్చే దౌర్భాగ్యులు హితులెలా ఔతారు..?
అసలు ఆ వ్యక్తి మార్గానికి / ప్రయాణానికి / అలసటకు / ప్రయాసకు ఎటువంటి సంబంధం లేని మీకు,
మిమ్మల్ని ఉసిగొల్పే ఒక ఇద్దరు దౌర్భాగ్యుల,
ఆ బరితెగించిన, బాగా చదువుకున్న బద్మాష్ల చెప్పుడు మాటలు వినే అవసరం, అగత్యం మీకెందుకు....?
"ఇన్నిరకాలుగా మీరు పక్కదారి పట్టించారు, నోరు పారేసుకున్నరు, ఏదో రకంగా ఒక చిచ్చుపెట్టి తన ప్రయాసకు విఘాతం కలిగించేలా నానా వేషాలు వేసి మీ కుయుక్తులతో ఆ వ్యక్తిని సాధించలేకపోయామనే
ఆవేశం వెళ్ళగక్కారు....", అని
ఇంకొన్నాళ్ళకు ఆ వ్యక్తి ప్రయాస ఫలించి నీటి కయ్య లభించినప్పుడు,
మిమ్మల్ని, ఇన్నాళ్ళ మీ శకుని ఎత్తులను ఎత్తిచూపిస్తు ఎక్కడికక్కడ ఏకిపారేసినప్పుడు మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు అనే సోయి మీకు లేదా..??
ఒకరి జీవితానికి ఏది ముఖ్యమో, ఎవరు హితులో, ఎవరు నక్కజిత్తులు వేసి
నానా రచ్చజేసి ఎదగనివ్వకుండా కిందికి లాగే కిరాతకులో, ఎవరు మేకవన్నెపులులో, ఎవరు గోముఖవ్యాఘ్రములో,
ఎవరు అజ్ఞ్యాతంలోనే ఉండి మంచి చేసే మితృలో.....
ఇవన్నీ కూడా స్వానుభవపూర్వక,
సత్యపరిశోధనాత్మక, నిత్యానిత్యవస్తువివేచనతో,
మనకంటే కూడా ప్రత్యర్ధి ఒక మెట్టు పైస్థాయిలోనే వ్యూహరచన గావిస్తాడనే లౌక్యంతో, జాగరూకతతో మసలుకోవడంలో భాసించే సత్యాలు.....
అంతే కాని ప్రతీదానికి ప్రూఫ్స్ ఉండాలని కాని,
ప్రూఫ్స్ ఉంటేనే ఒకరిని నమ్మడం / నమ్మకపోవడం అనేవి సబబు అనడం కాని,
ప్రతీ విషయం కూడా సప్రామాణికంగా ఇతరులకు తెలియపరచిన పిదపే విశ్వసించలానే మౌఢ్యం కాని,
మరే ఇతరమైన జాఢ్యం కాని,
మనిషికి ఉన్నప్పుడు జీవితంలో రానించడం కష్టం....
శ్రీ చాగంటి సద్గురువులు వివరించినట్టుగా,
ధర్మం అనేది
దేశకాలానుగుణంగా,
వర్ణాశ్రమానుగుణంగా,
సంఘటానుగుణంగా,
నిత్యం మారుతూ ఉంటుంది...
అందుకే
" ధృయైర్వాజనైరితిధర్మం " అనే వ్యుత్పత్తి....
అనగా "జనులచే ధరింపబడునది ధర్మం"...
ఒక వ్యక్తి ధరించిన వస్త్రం ఏ విధంగా మారుతుందో...
అట్లే ఆచరించబడే ధర్మం కూడా...
తల్లితండ్రుల ముందు పుత్ర ధర్మం...
అన్నదమ్ముల / అక్కచెల్లెళ్ల ముందు భ్రాతృ ధర్మం...
బిడ్డల ముందు తండ్రి ధర్మం...
గుడిలో భక్తుడి ధర్మం...
ఇంట్లో యజమాని ధర్మం...
వీధిలో పౌరుడి ధర్మం...
ఇవ్విధంగా అనునిత్యం మారునదే ఒక వ్యక్తిచే ఆచరింపబడే ధర్మం...
ఇన్నాళ్ళు ఒక గోవు బాగా ఇచ్చే పాలను గ్రహించి, ఏదో స్వల్పకాలిక రుగ్మతతో తక్కువ పాలిస్తుందనే నెపంతో అదే వ్యక్తి ఆ గోవుని హింసించే దిశగా వస్తున్నప్పుడు,
ఇటువైపు అరుగు మీద మనం కూర్చునప్పుడు మన ముందు ఆ గోవు పరిగెత్తి పారిపోతే.....
హింసించేందుకు వస్తున్న ఆ కసాయివాడిని చూసి,
మన పదునైన మేధోశక్తితో వాడి
కర్కశత్వాన్ని తృటిలో గ్రహించి వెంటనే అటువైపు అరుగుపైకి వెళ్ళి కూర్చొని...
" ఇటువైపుగా ఒక గోవు పారిపోవడం మీరెమైనా చూసారా...? అని ఆ కసాయివాడు అడిగితే...
" ఏమో ఇక్కడ కూర్చున్నప్పటినుండి నెనైతే ఏ గోవును చూడలేదు...."
అని అనడంలో అసత్యమాడడం ఆపాదించబడకుండా ఒక గోవుని రక్షించిన పుణ్యమే ప్రాప్తిస్తుంది...
ఇది ధర్మసూక్షం....
కాబట్టి ధర్మం గొప్పదే.....
కాని ధర్మసూక్ష్మం మరింత గొప్పది....!
ఒక గోవు వంటి సాధుప్రాణి మాట్లాడలేదు కాబట్టి ఇతరుల ప్రమేయం అవసరమౌతుందేమో...
ఒక సత్పురుషుడు మాట్లాడగలడు కాబట్టి తను అడిగినప్పుడు మాత్రమే ఇతరుల జోక్యం అవసరమౌతుంది....
అనవసరంగా, అపరిపక్వమైన పెద్దరికంతో, అనాలోచిత ధోరణిలో, అనాహ్వానిత అర్ధరహితమైన వితండవాదంతో,
ఇతరుల జీవితాల్లోకి తలదూర్చితే
వాళ్ళ జీవితాలకు మీరు కలిగించే ఇబ్బందే అధికం....
మాకు హితులైన వారి అండదండలతో మా జీవితాలను చక్కదిద్దుకోవడం మాకు బాగా తెలుసును...
కాబట్టి మీ అనవసరమైన జోక్యాన్ని
తగ్గించుకుంటే మంచిది అని పద్ధతిగా విన్నవించిన తర్వాత కూడా
"మాకు నోటి దూల....ఒళ్ళు దురద...ఎక్కువ కాబట్టి అట్లా అనవసరంగా ఇతరుల జీవితాల్లోకి తలదూర్చి వాళ్ళను ఇరకాటంలోకి తోస్తుంటాము....."
అనేలా కన్నూమిన్ను కానని పొగరుతో మిడిసిపడితే,
ఆ భద్రకాళి ఉగ్రతకు మీ పొగరే కారణం అవుతుంది సుమ....!
ఒక మేకపోతు ఢీకొనేది మట్టిదిబ్బ తోనా....
లేక
సకలసద్గుణాలప్రోదిగా ఉండే గ్రనైట్ కొండ తోనా...
అని తెలుసుకొని ఢీకొనాలి....
అట్లే....
ఎదుటి వ్యక్తి, ఎటుపడితే అటు ప్రయాణించే ఒక తెగిన గాలిపటంలా, ఎదో జీవించాలి కాబట్టి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేలా జీవించే సగటు మనిషా....
లేక,
ఎంతో రాటుదేలిన జీవితానుభవంతో
బ్రతికే ఘటనాఘటనసమర్ధుడా అనే వివేచనతో తలపడడం సముచితంగ ఉంటుంది....
ఒకటి మాత్రం నిజం....
మీరెన్ని కుతంత్రాలతో ఒక వ్యక్తిని తన జీవితంలో ఎదగకుండా క్రిందికి లాగాలని ప్రయత్నిస్తే...మీరే అంత క్రిందికి పడిపోవడం జరుతుంది....
అది ఎవ్వరికైనా, ఎంతవారికైనా సరే వర్తించే సత్యం.....
కాబట్టి మీ జోలికి రాని ఇతరుల జోలికి వెళ్ళకండి....
వీలైతే ఎదైనా మంచి చేయండి....
లేకపోతే గమ్మున మీజీవితాలు మీరు జీవించండి....
అంతేకాని ఎంత చెప్పినా సరే మీ మూర్ఖత్వాన్ని కొనసాగిస్తు ఎందరెందరో జీవితాల్లో అశాంతి కుంపట్లు కలిగిస్తూనే ఉంటామనేలా
మీ దుందుడుకువైఖరి ఉంటే, తగిన సమయంలో తగు మూల్యం చెల్లించవలసివస్తుంది....జాగ్రత్త.....! "
***** ***** ***** ***** ***** ***** ***** ***** ***** ***** ***** *****
అని నాతో కయ్యానికి కాలుదువ్వే వారితో నేను ఒక గంభీరమైన స్వరంతో తగ్గపోరు లా వాదించడం అనే కలలో ఉండగా ఆల్మోస్ట్ తెల్లారి అయ్యేసరికి...
"హుమ్మ్ మళ్ళీ కలలో కయ్యాలా...గోవింద...గోవింద..."
అనుకుంటూ యధావిధంగా రోజువారి కార్యక్రమాల్లో నిమగ్నమవ్వడంతో ఆ కల కథ కంచికి చేరింది.....
నేను లంచ్ కి చేరుకున్నాను....
No comments:
Post a Comment