Friday, November 20, 2020

శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారి తిరునక్షత్రోత్సవసందర్భంగా శ్రీపొన్నాలవెంకటేష్ గారిచే అందివ్వబడిన ఆచార్యవందనగీతం....🙏😊


శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలను శ్రద్ధాళువులై ఆలకించిన వారికి గుర్తున్నట్టుగా
"ఒక విష్ణ్వాలయంతో మనకు ఎల్లప్పుడు
సన్నిహిత సంబంధబాంధవ్యం ఉండడం జీవితోద్ధరణ హేతువుగా ఆవశ్యకమైనది....
ఎందుకంటే సృష్టి, స్థితి, ప్రళయం అనే మూడింట్లో స్థితికారకస్వరూపంలో ఉండే పరమాత్మ శ్రీమహావిష్ణువు / శ్రీహరి నామం లేకుండా రోజు మొదలవ్వదు....జీవితం నడవదు....

"గోప్త్రీ గోవిందరూపిణి" గా ఆ ఆదిపరాశక్తి సాగించే విశ్వపరిపాలన అనే లీలలో మానవాళికి విశేష అనుగ్రహదాయకాలు విష్ణ్వాలయాలు....

అటువంటి ఒక మహత్తరమైన, శ్రీపాంచరాత్రాగమోక్త అర్చారాధనలతో విరాజిల్లే శ్రీమదలర్మేల్మంగాపద్మావతీఆండాళ్
సమేతశ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం నా జీవితానికి ఎన్నోవిధాలుగా వివిధ విశేష అనుగ్రహదాయకమై వర్ధిల్లుతోంది.....
ఆ ఆలయం శ్రీచిన్నజీయర్ స్వామివారి కరకమలములమీదుగా 1990 లో నెలకొల్పబడడం ఆ ఆలయాన్ని సందర్శించే భక్తభాగవతుల భాగ్యహేతువు....

ఆచార్యులవారిచే భాగ్యనగరంలో ఎన్నెన్నో ఆలయాలు జీవంపోసుకున్నాయి...
వాటిలో సశాస్త్రీయంగా నిర్దేశిత ఆగమోక్తంగా నిర్మింపబడి ప్రాణప్రతిష్ఠ గావించబడిన భగవన్మూర్తి అనునిత్యం షోడశకళలతో తొణికిసలాడుతూ ఆ మూర్తిలో కొలువైన పరమాత్మ యొక్క ఆజ్ఞ్యాచక్రజనిత శక్తి ప్రసరణ దిక్సూచికి సరాసరి 90 డిగ్రీల కోణంలో తూర్పుకు అమరి విశేషమైన దైవికశక్తిని పుంజుకుంటూ భక్తులెల్లరికి జీవశక్తి రూపంలో అది అనుగ్రహించబడుతూ ఉండేలా వ్యవస్థీకరించబడిన ఆలయాలు అరుదు.....

అందునా శాస్త్రోక్తమైన శౌచనియమాదులతో నిత్యం దైవనామ / స్తోత్ర పారాయణంతో, అత్యంత వైభవోపేతమైన వార్షికబ్రహ్మోత్సవ నిర్వహణతో అలరారే ఆలయాలు బహు అరుదు.....

కూకట్పల్లి వివేకానందనగర్లో కొలువైన అటువంటి శ్రీశ్రీనివాసుడి ఆలయం కొలిచిన భక్తుల కొంగుబంగారమై విరాజిల్లడం త్రికరణశుద్ధితో ప్రార్ధించే ఎందరో భక్తులకు ఎరుకలో ఉన్న సత్యం....

ఆ స్వామివారి వైభవం చూడాలంటే 
చైత్ర శుద్ధ సప్తమికి ఎంతో సశాస్త్రీయంగా, 
శ్రీవైష్ణవానికే వన్నె తెచ్చే ఆచార్యశిఖామణులతో
అంగరంగవైభవంగా జరిగే శ్రీభూశ్రీనివాస కల్యాణం చూసి తీరవలసిందే....!😊

ఆచార్యతిరునక్షత్రోత్సవ సందర్భంగా వారి అనుగ్రహం, మంగళ ఆశాసనాలు భక్తులెల్లరికి దండిగా లభించి ఎల్లరు దైవానుగ్రహానికి పాత్రులౌదురు గాక.....
శ్రీలక్ష్మీవేంకటరమణ గోవిందా గోవిందా....🙏😊

https://youtu.be/BAYy_w0_OB0




No comments:

Post a Comment