Wednesday, November 18, 2020

శ్రీ శార్వరి నామసంవత్సర కార్తీక శుద్ధ విదియోపరితదియ నాటి చంద్రరేఖ....!😊

🌙 🌙 🌙 🌙 🌙 🌙 🌙🌙

సాక్షాత్ కార్తీక దామోదరుడి బామ్మర్ది...

కార్తీక త్రయంబకుడి శిరోభూషణం...

దర్శించి తరించండి....

మరియు శ్రీచాగంటి సద్గురువులచే అనుగ్రహింపబడిన ఈ క్రింది కార్తీకమాస విశేషశ్లోకములను అనుసంధానిస్తు మీ మీ కార్తీక దీపారాధన / పూజాదివిధులను కావించి బాగా పుణ్యం సముపార్జించండి....
చిన్నశ్లోకములే అయినను బహుశక్తిదాయక శ్లోకమంత్రములు ఈ రెండూకూడాను...
(నేను ఏది రాసినా కూడా ఎంతో పరిశోధన గావించి నా జీవితానికి అన్వయించుకొని అవి సైంటిఫిక్ గా శాస్త్రంబోధించినట్టే
మనకు హితకరము అని రూఢపరచుకున్నంకనే ఇతరులకు తెలియజేస్తాను... )

******* ******* *******
కార్తీకదీపారాధన శ్లోకం

కీటాః పతంగాః మశకాశ్చవృక్షాః
జలేస్థలేయేనివసంతిజీవాః
దృష్ట్వాప్రదీపం నచజన్మభాగినః
భవంతిత్వం శ్వపచాహివిప్రాః

******* ******* *******
ఉసిరిచెట్టుకి మొక్కేటప్పుడు పఠించే శ్లోకం....

ధాత్రీదేవినమస్తుభ్యం
సర్వపాపక్షయంకరి

పుత్రాందేహిమహాప్రాజ్ఞ్యే
యశోదేహిబలంచమే

మేధాంప్రజ్ఞ్యాంచసౌభాగ్యం
విష్ణుభక్తించశాశ్వతీం

నిర్రోగంకురుమామ్నిత్యం
నిష్పాపంకురుసర్వదా.

******* ******* *******


No comments:

Post a Comment