భక్తి సంగీత సాధకులకు, ప్రత్యేకించి శ్రీనివాసుడి అభిమానులకు / శ్రీవేంకటేశ్వరుడి ఆరాధకులకు, పెద్దగా పరిచయం అక్కర్లేని పుంభావసంగీతసరస్వతీ మూర్తిగా వారి వారి హృదయసీమల్లో స్థిరంగా శాశ్వతమైన పేరు....
తిరుమలేశుడే జీవితంగా సేవించి తరించిన అలనాటి అన్నమాచార్యుల గురించి మన పెద్దలద్వారా వినడమే కాని ఈనాటి వారెవ్వరు ప్రత్యక్షంగా దర్శించినవారు లేరు...
అటువంటి అన్నమాచార్యుల వారి ఆత్మను
తమలోకి కళాన్యాసం గావించుకొని అచ్చం అదేరీతిలో ఇప్పటికీ శ్రీవేంకటేశ్వరుణ్ణి తమ సంకీర్తనల ద్వారా లాలిస్తూ సేవించి తరిస్తున్నారా ఏమి అన్నట్టుగా, శ్రీ గరిమెళ్ళ గురువుగారు తమ యావద్ జీవితంలోని సిమ్హభాగం ఆ శ్రీవేంకటరమణుడిని తమ రమణీయ సంకీర్తనా సుమసౌరభాలతో అర్చించడంలోనే వారి 7 పదుల జీవితంలోని భక్తి సంగీత యజ్ఞ్యం సార్ధకమయ్యిందనేది జగద్విదితమైన సత్యం....
పురుషులలో పుణ్యపురుషులు వేరయ....
అని వేమన గారు సెలవిచ్చినట్టుగా....
కొందరు వారు ఎన్నుకున్న మార్గాల్లో వారి వారి యావద్ జీవిత ప్రస్థానాన్ని కొన్ని తరాలవారు శాశ్వతంగా గుర్తుపెట్టుకొని గౌరవించబడేలా చక్కని సద్గుణాలప్రోదిగా మలిచి సమాజంలో చిరకీర్తికాయులై ఉండడం మనం సాధారణంగా గమనిస్తుంటాం...
మేలైన చక్కని మాటనైపుణ్యం...
గంభీరమైన ఆచరణాత్మక దృక్కోణం...
వారు పలికే ప్రతిపదంలోను మృదుత్వం, చేసే ప్రతిపనిలోను వినమ్రతతో ఒదిగిఉండే సరళి, ఇత్యాది గా వారి జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ నలుగురిలో తమకంటూ ఒక ప్రత్యేక గౌరవం గల వారిగా ఉండడం మనం చూస్తుంటాం....
ఇప్పుడు మన సమసమాజంలో ఉదాహరణకు
ప్రవచనా ప్రస్థానంలో శ్రీ చాగంటి సద్గురువులు....
రాజకీయ ప్రస్థానంలో శ్రీ తన్నీరు హరీష్ గారు.....
సామాజిక కార్యక్రమ / సేవాదృక్పథంతో ప్రజలకు చేరువగా ఉండే ప్రస్థానంలో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు...
ఆధ్యాత్మికత / భగవంతుడు కొందరికి మాత్రమే కాదు..... భగవద్కృపకు ఎల్లరూ పాత్రులే అనేలా
భక్తి మార్గంలో సేవా దృక్పథంతో సాగే శ్రీ చిన్నజీయర్ స్వామీజి వంటి వారు...
ఇలా వారి వారి మార్గాల్లో వారు కనబర్చే చిత్తశుద్ధి భరిత కార్యాచరణాత్మక సరళిలో వారికంటూ ఒక ప్రత్యేక గౌరవమరియాదలను అందుకొనే వారు ఉండడం సమాజంలో మనం చూస్తుంటాం కద...
అటువంటి వారిలో,
భక్తి సంగీత / అన్నమాచార్య సంకీర్తనా వ్యాప్తి ప్రస్థానంలో చిరంతన కీర్తిని గడించిన మాన్యులు శ్రీ గరిమెళ్ళ గురువుగారు....
ఇటువంటి మహనీయులకు ఏ విధంగా ఆ మహత్తు ఆపాదించగలం అని అడిగితే...దానికి ఒకటే సమాధానం...
వారి సమక్షంలో / వారి మాటల్లో / వారి కార్యక్రమాల్లో
ఒక చక్కని ప్రశాంతత / ఒక చక్కని మనో ఆహ్లాదం / ఒక చక్కని సందేశం / ఒక చక్కని స్ఫూర్తి / ఒక
చక్కని మనోరంజకత్వం అనేవి వాటంతట అవే సమకూరడం అనే సత్యం....
శ్రీ గరిమెళ్ళ గురువుగారి ఏ సంకీర్తన విన్నా సరే..
అదే అన్నిటికంటే చక్కనైనదా అనేలా ఉండడం మనం గమనించగలం.....
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసంఫణిః....
అని కదా మన పెద్దలు అనేది....
చిన్నపిల్లలు మొదలుకొని పశుపక్ష్యాదులే కాక పాములను సైతం పరవశింపజేయగల శక్తి సంగీతానిది అని కదా దానర్ధం...
అటువంటి శక్తివంతమైన సంగీత మహాప్రస్థానంలో ఎందరో మహనీయులు తమదైన ముద్రతో జనరంజకంగా ఆలాపనలు గావించి కీర్తిగడించడం
విశేషమైతే....
ఆ దుర్లభమైన, ఎన్నో జన్మల పుణ్యబలసంప్రాప్తమైన
సంగీత సరస్వతీ కటాక్షాన్ని పూర్తిగా దైవానికే అంకితంగావించి జీవించి తరించడం అరుదు...
అటువంటి అరుదైన మహానుభావుల కోవలోని శ్రీ గరిమెళ్ళ గురువుగారి ప్రతి సంకీర్తన కూడా ఒక ప్రత్యేక దైవిక మహత్తు భరిత రసగుళిక.....
రాగాలకు నయం కాని రోగాలు ఉండవు...
అని మన పెద్దలు అనడం వినే ఉంటారు....
అంతటి సంగీత స్వరశుద్ధత, సాహితీ ఉచ్ఛారణా స్పష్టత, రాగగుంభనం, హృదయరంజక ఆలాపన, వెరసి ఆ యావత్ గానాలాపన ఒక అలౌకిక మహత్తును తనువుకు, తనువులోని జీవునకు ఆపాదించి తరింపజేయడం అనేది చాలా చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రక్రియ......
అటువంటి సంగీతాన్ని ఒక సదాచార నిష్ణాతుడైన సోమయాజి నిర్వహించే యజ్ఞ్య కృతువులా నిర్వహించగల ప్రజ్ఞ్య కోట్లలో కొందరికి మాత్రమే సంప్రాప్తించే దైవ కృప....
ఆ సోమయాజి పలికే ప్రతి సామవేద మంత్రం,
అర్పించే ప్రతి హవిస్సు,
ప్రకృతిలోని కొన్ని కోట్ల ప్రాణులకు చేసే మేలు ఏవిధంగా అగోచరమో.....
ఇటువంటి సంగీత ద్రష్టలు పలికే ప్రతి పదం, ఆలపించే ప్రతి స్వరం కొన్ని కోట్ల సంగీతారాధకులకు శాశ్వతంగా సమకూరే సరస్వతీ కటాక్షం.....
ఆ గీర్వాణి కటాక్షంతో సాధించలేనిదంటూ ఈ లోకంలో ఏది ఉండదు కద....
కాబట్టి మనో వికసన, మేధో వికసన, ఆత్మ వికసన కలిగించి శాశ్వత దైవానుగ్రహాన్ని సాధించిపెట్టే సంగీతాలాపనలు ఇటువంటి ఉన్నతశ్రేణి మహనీయుల కంఠసీమలనుండి సదా ప్రవహిస్తూ,
ఎందరెందరో సంగీతసాధకులకు అనుగ్రహాన్ని ప్రసరిస్తూ, భక్తుల హృదయడోలికల్లో సదా పరిఢవిల్లుతూ ఉండడమే ఈ లోకానికి
సమకూరే ఎంతో ముఖ్యమైన అనుగ్రహం.....
ఎందుకంటే చక్కని సాహితీ విలువలు గల సంగీతం మనిషిని మహర్షిని చేయగల సాధనం....
అందునా అవి దైవిక మహత్తు అలదబడిన సంగీత రసప్లావితములైతే మనిషికి ఎల్లప్పుడూ నిత్యనూతన జవసత్త్వాలు సమకూర్చే దైవానుగ్రహకారకాలు....
అటువంటి శ్రీ గరిమెళ్ళ గురువుగారి సంకీర్తనలు ఆ శ్రీవేంకటేశ్వరుడిని సదా తన భక్తులకు ప్రత్యక్ష పరోక్ష సత్యంగా చేరువ గావించి....
దేవుడి దెగ్గరికి జీవుడు వెల్లడం అప్పుడపుడు....
జీవుడిదెగ్గరికే దేవుడు రావడం ఎల్లప్పుడు.....
అనేలా అన్నమాచార్య సంకీర్తనా సుమాలతో శ్రీనివాసుడిని భక్తులు నిరంతరం సేవించి అర్చించి తరించడం అనే సౌభాగ్యం ఎందరెందరో భక్తులకు లభించి, భక్తులెల్లరి జీవితాలు ఆ శ్రీపతి అనుగ్రహంతో చల్లగా నిండుగా మెండుగా భక్తి పరిపుష్టి తో సంపూర్ణమై పరిఢవిల్లు గాక....
గురువుగారి అనేక అన్నమాచార్య సంకీర్తనల్లో ఒక
చక్కని కర్ణపేయమైన ఆణిముత్యం
అమృతవర్షిణి రాగంలో గురువుగారు ఆలపించిన
" త్రికరణ శుద్ధిగ జేసిన పనులకు దేవుడు మెచ్చును...లోకము మెచ్చును....
ఒకటి కోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాస పడనేలా...."
అనే సంకీర్తన....
" మనిషి మనసే పరిపూర్ణమైన గోదావరి, గంగా, కావేరి....."
అని అన్నమాచార్యులు ఎంతటి లలితమైన పదగుంభనంతో సెలవిచ్చారో....
అంతటి స్వరగుంభనంతో గురువుగారు ఆ చరణాన్ని ఆలపించి
" ఔరా ఎంత గొప్పదో కదా ఈ మనిషి యొక్క మనసు.... దైవానుగ్రహ సంపాకమైన మనో సంకల్పంతో మనుష్యుడికి అసాధ్యం అంటూ ఏముంటింది......
"అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం తవకింవద....." అని హనుమంతులవారి గురించి శ్రీమద్రామాయణం వచించినట్టుగా....
సంగీత శక్తికి సాటిరాగలది యావద్ విశ్వంలో మరేది లేదు...."
అనేలా తెలియజెప్పి శ్రీహరిసంకీర్తనము
సకలార్ధసాధకము....
సకలేప్సితప్రదము....
సకలసిద్ధిదాయకము....
అనే సార్వకాలిక సత్యాన్ని రూఢపరచే గంభీర శైలిలో సాగే శ్రీ గరిమెళ్ళ వారి స్వర ప్రస్థానం మరెందరో భక్తుల హృదయపీఠంపై ఆ శ్రీభూసమేతశ్రీనివాసుడికి నిరంతరం గావించబడే సంకీర్తనార్చగా సాగాలని ఆకాంక్షిస్తు....
వారి పాదపద్మములకు వారి జన్మదినశుభాభినందనాపూర్వక చిరుకవనాంజలి ప్రయుక్త నమస్సుమాంజలులు....🙏🍕🍟🍨😊
( నల్లకుంట శ్రీశంకరమఠం లో వారికి జరిగిన స్వర్ణగండపెండేర ప్రదానోత్సవంలో మరియు 2017 తిరుమల బ్రహ్మోత్సవసమయంలో తిరుమల సహస్రదీపాలంకరణ మండప ప్రాంగణంలో వారికి నమస్కరించి ఆశీస్సులను, అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా అందుకోవడం మరియు
వారి చిన్నబ్బాయ్ శ్రీ గరిమెళ్ళ అనీలకుమార్ గారు నాకు వృత్తిరీత్యా ఒకే కార్యాలయంలో ఉండగా వ్యక్తిగతంగా ప్రత్యక్ష స్నేహితులవ్వడం నా జన్మాంతర సుకృతం....😊 )
http://annamacharya-lyrics.blogspot.com/2007/11/336-trikaranasuddhiga-jesinapanulaku.html?m=1
trikaraNaSuddhiga jEsinapanulaku- త్రికరణశుద్ధిగ జేసినపనులకు
Archive Audio link : G Balakrishnaprasad
Ragam : Chakravakam, Composer : Balakrishnaprasad
ప|| త్రికరణశుద్ధిగ జేసినపనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును |
వొకటి కోటిగుణితంబగుమార్గములుండగ బ్రయాసపడనేలా ||
చ|| తనమనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి |
కనకబిందుయమునాగయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ |
దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు సేసినఫలములు |
తనుదానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగగ మరి యేలా ||
చ|| హరి యనురెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు |
గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమున జదివినపుణ్యములు |
పరమతపోయోగంబులు మొదలగుబహుసాధనములసారంబు |
పరిపక్వంబై ఫలియించగా బట్టబయలు వెదకనేలా |
చ|| మొదల శ్రీవేంకటపతికిని జేయెత్తి మొక్కినమాత్రములోపలనే |
పదిలపుషోడశదానయాగములుపంచమహాయజ్ఞంబులును |
వదలక సాంగంబులుగా జేసినవాడే కాడా పలుమారు |
మదిమదినుండే కాయక్లేశము మాటికి మాటికి దనకేలా ||
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg8-nXtKEXga9-_5-vod6sQB4cXuWcPW91ngW9jvlPivwbR3Mt5umzkc09mywN6usnzopFj8TPbmlsHtE9kOk7b-arxoD-JEv3s6ltn9XjkZi_t7qwGA5V1hc9GIbm8RkAIiD-ruLld2tWe/s1600/1604944628023303-0.png)
No comments:
Post a Comment