యావద్ ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన అతిపెద్ద గ్రామీణ జాతర గా, లక్షలాది భక్తులను తమ వైపు ఆకర్షింపజేసి మొక్కులను చెల్లింపజేసి, అనుగ్రహాన్ని వర్షించే ఒక విశేషమైన జాతరగా ఓరుగల్లు కాకతీయసామ్రాజ్య కాలం నాటి నుండి ప్రాచుర్యం పొందిన వన దేవతల జాతరగా, ఒక కుంకుమభరిణలో గుప్తంగా కొలువై ఉండే ఆదిపరాశక్తి యొక్క అత్యంత విశేషమైన వ్యక్తీకరణాత్మక ఉత్సవంగా, తెలుంగు / తెలంగాణ వీరవనితల ధైర్యసాహసాలకు ప్రతిబింబంగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అశేష భక్తులతో గౌరవనీరాజనాలను అందుకునే జాతర గా సమ్మక్క సారక్క జాతర ప్రఖ్యాతినొందింది.....
ఇవ్వాళ్టి ఆధునిక పరిపాలనా వ్యవస్థలో అంతగా దర్శించలేకపోయినా, ఆనాటి రాచరిక వ్యవస్థలో సనాతన ధర్మం యొక్క మేళవింపు అడుగడుగునా కానవచ్చే రీతిలో ఉండే రోజుల్లో,
రాజవంశపారంపర్య వారసులకు / రాజ్యాలకు /
రాచఖడ్గాలకు / రాజప్రాసాదాలకు / ఇలా.... యావద్ రాచరిక వ్యవస్థకు దైవత్వం తో / తద్వారా వారి రాజ్య / పుర ప్రజలతో ఒకవిధమైన అవినాభావ సంబంధ బాంధవ్యాలు ఉండేరోజుల్లో పాటించబడిన నైసర్గికాచారసంప్రదాయల వైభవం మనం ఈనాటికి కూడా గుర్తించి గౌరవించడం అనేది ఎల్లరూ గమనించగలిగే విశేషం.....
ఎందుకంటే అది మానవ భూమికకు అందని రీతిలో ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండే వివిధ దైవిక భూమికలకు ఆలవాలంగా పరిఢవిల్లే ఈ భారతదేశం యొక్క వైభవం....
సమ్మక్క, సారలమ్మ/సారక్క, పిగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న,
అనే ఐదుగురు కోయ దోరల జీవిత కథాంశంగా, ఆనాటి కాకతీయ సామ్రాజ్య పాలకులతో గల విభేదాలతో జరిగిన యుద్ధంలో వారు వీరస్వర్గాన్ని అలంకరించగా అందులో ఆదిపరాశక్తి అంశలో జన్మించిన సమ్మక్క సమీపంలోని చిలుకల గుట్టకు చేరుకొని తనను తాను ఒక కుంకుమభరిణ గా రూపాంతరం గావించుకొని తన ప్రఛ్చన్న ఉనికి యొక్క వ్యక్తీకరణ ఉత్సవంగా ఆనాటి నుండి ఈ నాటి వరకు కూడా మేడారం జాతర గా రెండు సంవత్సరాలకు ఒక్కసారి అమ్మవార్లు గద్దెనెక్కడం మరియు తిరిగి వనప్రవేశం గావించడం అనే ముఖ్య ఘట్టాలుగా భక్తులెల్లరిచే పూజింపబడడం అనే చారిత్రక నేపథ్యంలోగల వివిధ విశేషాలు భక్తుల్లెలరికి తెలిసినవే...
కోయదొరలు / రాజులు / రాజ్యాలు / యుద్ధాలు / ఇలాంటివన్నీ కూడా సాధరణమైన చారిత్రకాంశాలుగా ఉన్నా......
వారికి దైవత్వం ఆపాదించబడి వారి వీరగాథలు దైవిక ఘట్టాలుగా, గ్రామీణ ఉత్సవాలుగా ప్రాంతీయాచారాలుగా విశేష ఖ్యాతిని గడించడమే ఇక్కడి ప్రత్యేకత....
మాఘ మాసం అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన, పుణ్యప్రదమైన, మాసంగా
మాఘ స్నానాలుగా తీర్థ స్నానాలకు ప్రసిద్ధినొందిన మాసంగా శ్రీ చాగంటి సద్గురువులు పలు ప్రవచనాల్లో బోధించి ఉన్నారు...
( మాఘపంచకంగా పిలువబడే
మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, మాసాల్లోని పంచాంగ ముహూర్తాలకు గల విశేష బలం కారణంగా ఉత్తరాయణపుణ్యకాలంలోని ఈ 5 నెలల్లో ఎన్ని పెళ్ళిల్లు, ఇతర ఫంక్షన్లు ఉంటాయో అందరికీ తెలిసిందే....)
నల్లమల అభయారణ్యాల్లో తిరుమల గిరుల్లో కొలువైన అత్యంత శక్తివంతమైన తుంబురు తీర్థానికి ముక్కోటి పర్వదినం కూడా మాఘ పౌర్ణమి రోజే....
మహా తపస్విని, భక్తకవయిత్రి, సాధ్వీమణి, భక్తప్రహ్లాద అంశలో ఈ కలియుగంలో జన్మించిన శ్రీ తరిగొండ వెంగమాంబ గారు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి అత్యంత సన్నిహితమైన భక్తుల్లో ఒకరిగా ఖ్యాతిగడించిన యోగిని యొక్క శక్తి నిక్షేపణ కూడా ఉత్సవం గా, మాఘ పౌర్ణమి తుంబురు తీర్థ ముక్కోటి స్నానం గా భక్తులచే ఆరాధింపబడే వన జాతర గురించి కూడా భక్తులు వినే ఉంటారు.....
ఒక వ్యక్తి ఓ 60/70/80/90 సంవత్సరాల జీవిత పర్యంతంలో పైసా పైసా కూడబెట్టి సముపార్జించిన భౌతిక సంపదను ఏ విధంగా అయితే తనవారికి, తన సహాయకులకు, తన అభిమానులకు, తన మితృలకు, చెందేలా ఒక వీలునామాగా రాసి రెజిస్టర్ చేసి ఒక అధికారిక శాశ్వతత్త్వాన్ని సమకూర్చి వారు భౌతికంగా ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయినా సరే, వారు ఆర్జించిన భౌతిక సంపద వారి తరతరాలకు చెందేలా చేసే ఒక ప్రక్రియను మనం ఈ లోకంలో సాధారణంగా చూస్తూనే ఉంటాం....
అదే విధంగా, సాంప్రదాయిక సనాతన ధర్మ జీవితాన్ని ఆలంబనగా గావించి సదరు యోగి / యోగిని / ఆధ్యాత్మికవేత్తలు / సాధువులు / తపోధనులు ఇత్యాది మాన్యులు కూడా వారిచే ఆర్జింపబడిన ఆధ్యాత్మిక దైవిక సంపదను, శక్తిని వివిధ రూపాల్లో భావితరాలకు అందివ్వబడేలా కొన్ని యోగపద్ధతుల్లో వాటిని అందివ్వగలరు అని చెప్పబడినప్పుడు...
ఆ పరంపరాగతమైన విశ్వాసాన్ని గౌరవించి, ఆ దైవిక తత్త్వాన్ని అందుకొని వారి వారి జీవితాలకు ఆపాదించుకొని లబ్ధిని పొంది తరించడం అనేది మాన్యులకు విహిత ధర్మం.....
అదేంటి, ఎందుకట్ల, ఎందుకిట్ల, సైన్స్ సిద్ధాంతాలకు సరితూగుతుందా లేదా, ఆధునిక కాలంలో ఈ మూస ధోరణులేంటి, ఇత్యాదిగా వాటిని తూలనాడడంలో పెద్దగా ఏ గొప్పదనం, విజ్ఞ్యత కూడా ఉండవనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు....
చలికాలంలో శరీరానికి కావలసిన వేడిమిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందివ్వగలిగే నిలవదోషం లేని పదార్థమైన బెల్లాన్ని విరివిగా తులాభారాల్లో ఉపయోగించి 'మేడారం బంగారం ప్రసాదం' పేరిట భక్తులు ఇచ్చిపుచ్చుకునే సత్సంప్రదాయం మనం ఈ ఉత్సవంలో గమనించవచ్చు....
శరీరాంతర్గతంగా జనించే వివిధ విషసంఘాతాలను తొలగించడంలో కూడా బెల్లాన్ని మించిన దివ్యౌషధం లేదనేది ఆయుర్వేద శాస్త్రనిపుణులకు తెలిసిన సత్యం....
శరీర పుష్టికి కావలసిన వివిధ ఖనిజాలకు లవణాలకు గని వంటిది బెల్లం అనేది ఈనాటి డాక్టర్లు కూడా సెలవిచ్చే సత్యం....
( హానికారక చక్కెర కు బదులుగా బెల్లం వాడండి అని ఇప్పుడు మనకు వైద్యులు పదే పదే బోధించేది కూడా ఇందుకే...)
ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా
శుద్ధి గావించబడిన స్వచ్ఛమైన పసిడి ఏ విధంగా శరీర పుష్టికి దోహదం గావిస్తుందో....
( శుద్ధి గావించబడిన స్వర్ణాన్ని కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడుతారు అనేది కొందరికైనా తెలిసే ఉంటుంది....)
అదే విధంగా శరీర పుష్టికి కారణమవుతుంది కాబట్టి ఈ జాతరలో వినియోగింపబడే బెల్లాన్ని '
"మేడారం బంగారం ప్రసాదం" అనే పేరుతో భక్తులు ఇచ్చి పుచ్చుకునే సత్సంప్రదాయం ఈ మేడారం జాతరలో అంతర్భగమైన ఘట్టం....
జాతీయ ఉత్సవంగా జరుపుకునే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి ఏ విధంగా అయితే శ్రీభద్రాచల సీతారామచంద్రస్వామి వారికి పట్టుపీతాంబరాలు / ముత్యాల తలంబ్రాలను రాష్ట్రానికి రాజు గా ఉండే వ్యక్తి అనగా ఈ కాలంలో
గౌ || ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి సమర్పించి నమస్కరిస్తారో.....
అదే విధంగా జాతీయ ఉత్సవంగా జరుపుకునే సమ్మక్క సారక్క జాతరకు రాష్ట్రానికి రాజు గా ఉండే వ్యక్తి అనగా ఈ కాలంలో
గౌ || ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి బెల్లాన్ని సమర్పించి నమస్కరించడం ఆనవాయితి....
సిరులను అనుగ్రహించే సమ్మక్కకు....
సిద్ధిని అనుగ్రహించే సారక్కకు...
నమస్కరిస్తూ.....
ఎల్లరికీ మేడారం వన దేవతల జాతర శుభాభినందనలు....
🎂🍦🍕🍨💐😊🙏
No comments:
Post a Comment