శ్రీ 112018 అన్న, " బోండాకు 40 రూపాయలు తీసుకొని మావాడికి 5 బోండాలు ఇచ్చి (5×10=(25+25=50)) రూపాయలు తీసుకొని మా వాడి జోలికి రాకుండా మీ పని మీరు చూస్కోండి...."
అని క్లియర్ గా ఆదేశాలిచ్చినంక కూడా ఇంకా ఏవో ఓవర్యాక్షన్లు చేయాలని చూసే వారికి చెప్పోచ్చేదేమంటే.....
1. పరిధి తెలుసుకొని ప్రవర్తించడం మీ మొదటి కర్తవ్యం...
2. ఇప్పుడు ఎవరు ఎన్ని కహానీలు చెప్పినా, ఎన్ని బీరాలు, వైనాలు, భాష్యాలు వల్లించినా సరే, నన్ను అవమానించిన వారిని, నన్ను చిన్న చూపు చూసి హేళన చేసిన వారిని, నా దూరదృష్టిని,
నా స్వీయకౌశల ప్రయుక్త ఔచిత్యపూరిత కార్యాచరణాత్మక ప్రణాళికను, నా కష్టాన్ని, నా శ్రమను, నా సమయన్ని, నా ధనాన్ని, నా ప్రయాసను...
ఇలా నా యావద్ వ్యక్తిత్త్వాన్ని అగౌరవపరిచేలా వ్యవహరించిన బద్మాష్ బాడ్ఖావ్లకు
నా సొమ్ము ఒక్క రూపాయి కూడా చెందడం నేను ససేమిరా సహించను....
3. అవసరమనుకుంటే మొత్తం తిరుపతి హుండీలో వేయడానికి కూడా నేను ఆలోచించను....కాని నన్ను ఓర్వని బాడ్ఖావ్లకు చెందడం మాత్రం నేను అస్సలు భరించలేను.....
4. 2017 సంవత్సరం వరకు ఒక్క బాడ్ఖవ్ కూడా కనీసం పలకరించింది లేదు...
ఇప్పుడు 2022 సంవత్సరం లో ఒక్కొక్క బాడ్ఖావ్ ఒక్కొక్కరంగు పూసుకొని ఎన్ని వేషాలు ఎన్నెని కపటనాటకాలు వేస్తున్రో నాకు తెలవదనుకుంటే అది మీ వెర్రి....
మధ్యలోని ఈ 5 సంవత్సరాల్లో....
నా మాటే శాసనం గా ఉన్న నా ఇంట్లోనే అందరూ నాకే ఎదురు తిరిగి...నన్నే ప్రశ్నించి నా మాటకు, నా బాటకు, నా ప్రయాణానికి, అడ్డుపడేలా...
నా జీవితంలోకి అనవసరంగా జోక్యం చేస్కున్న బాడ్ఖావ్లు ఎవరు...?
ఆ బాడ్ఖావ్లవి ఎంతటి సిగ్గుశరం లేని బత్కులు కాకపోతే, నా ఇంట్లో స్త్రీలను ఎడవమని చెప్పి నన్ను సాధించే కుట్రలను రచించి ఇప్పుడు
ఉమ్మేసిన విస్తరిలో మెక్కబడే వారి దినాలకూడులా, నా సొమ్ము దోచిపెట్టమని అడిగే ఆ బాడ్ఖావ్లెవరు....?
ఇత్యాదిగా నా మదిలోని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించవలసిన సమయం ఆల్మోస్ట్ రానే వచ్చింది....
కాబట్టి మీకు మీరే
నాకు, నా కుటుంబానికి, నా సొమ్ముకు, దూరంగా ఉండడం....
లేదా నా కుటుంబసభ్యులకు నా మీద లేనిపోనివన్నీ నూరి పోసి నాకు విరుద్ధంగా ఉసిగొల్పి నన్ను ఇన్నాళ్ళు సాధించినందుకు,
ఇప్పుడు నా సొమ్ము ఎట్లైనా మింగి సావడనికి మీరు సిద్ధపడితే,
మీ పై ఏ కేస్ పెట్టాలో అదే కేస్ పెట్టి నాకు కావలసిన సమాధానాలు రాబడతా....
ఎవరో పాపిష్టి బాడ్ఖావ్లు క్రియేట్ చేసిన అనవసరమైన తుఫాన్ మొత్తం తగ్గినంక....
కుటుంబసభ్యుల పట్ల ఉండవలసిన కర్తవ్యానుగుణంగా వారికి అవసరమైనవన్నీ నేను సమకూర్చి పెట్టినంక...
ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఎందుకు నోరు విప్పి జరిగింది జరిగినట్టు నిజం చెప్పరో అది కూడా చూస్తా....
కాబట్టి, నేను చెప్పదలచుకుంది ఒక్కటే....
నన్ను మానసికంగా, నా కుటుంబ సభ్యులను శారీరకంగా ఇబ్బంది పెట్టిన బాడ్ఖావ్లు....
ముందు వైపు ఉండే వారా.....
వెనక వైపు కిరాయికి వచ్చినవారా....
( పిలవని తద్దినాలకు వచ్చి పిండాల కూడు దోచుకొని మింగడానికి గుంట నక్కల్లా
ఇతరుల జీవితాల్లోకి అనవసరంగా కలగజేసుకునేవారు )
సుట్టాలా....స్నేహితుల......
స్నేహితులుగా ఉండి సుట్టాలైన వారా.....
కొత్త వారా...పాత వారా.....
ఇంటి వారా...బయటి వారా.....
మన వారా...పరాయి వారా.....
తెలిసిన వారా....తెలియని వారా....
ఇలా ఎంత మంది ఉన్నా సరే.....
నేను వారిని ఓర్వను....వారికి నా సొమ్ము దోచిపెట్టబడడం సహించను......
నా నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో, ఎక్కడి నుండి నాకు కావలసిన సహాయసహకారాలు అందిస్తారో నాకు తెలుసు / తెలుసుకోగలను.....
నేను ఆల్రడి ఒక పాత పోస్ట్లో చెప్పిన.....
" అవతలి వ్యక్తి ఆ... అని నోరు తెరిచి మాట్లాడడం పూర్తి చేసే లోపు వారి పేగులను లెక్కించడమే కాదు వారి ప్రతి అణువణువులోని హావభావాలను చదివే ఘటికులు కూడా ఈ లోకంలోనే ఉంటారు.... "
అని.....
కాబట్టి...గత 5 సంవత్సరాల్లోని వివిధ సంఘటనల్లోనే కాదు.....
నేను 2nd క్లాస్ చదివేటప్పుడు రొఫినా టీచర్ వాళ్ళింట్లోని జామ చెట్టు క్రింద కూర్చొని మా క్లాస్మేట్ నవీన్ చెప్పినట్టు జామ చెట్టు ఆకుల్లో చింతపండు పెట్టి అది "స్వీట్ పాన్" అని జోక్స్ వేస్కున్న రోజులదెగ్గరి నుండి.....
" జామకాయ్ చట్ని " అనే కొత్త రకం చట్ని ఎప్పుడూ ఎక్కడా వినలేదే అనుకుంటూ గత సంవత్సరంలోని ఒక పెళ్ళిలో వడ్డించబడిన ఆ విచిత్రమైన వంటకం వరకు...
నేను ఆరగించేవి తిండ్లు చిరుతిండ్లే కాదు......
కాలాన్ని....మరియు చిరంతన కాలప్రవాహ యవనికపై సాగే " కాదిహ్రీమంతవిద్యాయాః ప్రాప్త్యైవ పరదేవతా...." గా ఉండే కాల కేళీ విలాసాన్ని కూడా.....
కాబట్టి నా క్షణిక అమాయకత్వ ధోరణితో నన్ను మోసగించడం తేలిక అని అనుకొని నన్ను ముంచాలని చూసే వారికి, నా సమ్మతికి విరుద్ధంగా నా సొమ్ము మెక్కాలని చూసే వారికి,
కాళింది మడుగులోని కాళీయుని పడగలపై నర్తించి వాడి పొగరును దమించిన పాదాల యొక్క దెబ్బ ఎట్లుంటదో అట్లాంటి ఎఫెక్ట్స్ రాబోవు కాలగతిలో ఎరుకపరిచే నా కార్యాచరణలో వారెల్లరికీ తెలిసివచ్చెదాకా నాకు మనః శాంతి ఉండదు......
నేను చెప్పాల్సింది చెప్పాను....
అర్ధం చేస్కొని వెనక్కి తగ్గడమే వారికి మంచిది.....
వేద మంత్రాల శక్తికి ఎవరు ఎదురు నిలివగలరో నేను కూడా చూస్తా....
స్వాహాకారానికి గల శక్తి ఎట్టిదో....
స్వధాకారానికి గల పితృదేవతా ప్రభావం ఎట్టిదో.....
ఒక్క నెయ్యి చుక్కతో...ధేనుముద్రతో వేసే చిటికెడంత యజ్ఞ్య చెరువు ఏం ఏం సాధించిపెట్టగలదో.....
అనేవి కొందరికి తెలిసిరావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందనుకుంటా....
ధర్మస్య జయోస్తు....
అధర్మస్య నాశోస్తు....
ప్రాణిశుసద్భావనాస్తు
విశ్వస్యకళ్యాణమస్తు
No comments:
Post a Comment