మాఘ పంచకం అనే 5 నెలల అత్యంత శుభప్రదమైన ముహూర్తాల సీసన్ గా
( ఎక్కువగా పెళ్ళిళ్ళు మరియు ఇతర ఫంక్షన్లు జరిగే సీసన్ )
ఈ మాఘ / ఫాల్గుణ / చైత్ర / వైశాఖ / జ్యేష్ఠ నెలలకు ఎంతటి ప్రాధాన్యం కలదో ఎల్లరికీ తెలిసిందే....
ఉత్తరాదిన కుంభమేళ, దక్షిణాదిన ప్రత్యేకించి
తెలుంగు సీమలో అత్యంత మహిమాన్వితమైన "సమ్మక్క సారక్క/సారలమ్మ జాతర" మేడారం అభయారణ్యంలో జంపన్న వాగు దాటిన తదుపరి ప్రాంతంలో మరియు
"తుంబురు తీర్థ ముక్కోటి పర్వోత్సవం" తిరుమల శేషాచల అభయారణ్యాల్లో కొలువైన తుంబురు కోనలోని ద్రోణ తీర్థం దాటిన తదుపరి ప్రాంతంలో
ఎంతటి మహిమాన్వితమైన ఉత్సవాలుగా అశేష భక్త జనంచే ఆరాధింపబడుతాయో చాలా మందికి తెలిసే ఉంటుంది....
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం అర్చిస్తూ స్వామి వారి ఆలయానికి ఉత్తరదిశగా, శ్రీభూవరాహస్వామి వారి ఆలయానికి దెగ్గర్లో ఇప్పుడు ఒక స్కూల్ ఉన్న ప్రాంతంలో జీవసమాధి చెంది ఇప్పటికీ భక్తులను విశేషంగా అనుగ్రహించే ఒక అనన్యసామాన్యమైన యోగినీ, భక్తకవయిత్రి, సాధ్వీమణి యొక్క తపఃశక్తి మొత్తం గుప్తంగా తుంబురుకోనలో నిక్షిప్తంగావింపబడడం....
భక్తప్రహ్లాదుని అంశలో ఈ కలియుగంలో జన్మించిన శ్రీ తరిగొండ వెంగమాంబ అనే ఆ మహాభక్తురాలి సూక్ష్మరూప తపఃశక్తిపుంజం ఫాల్గుణ పౌర్ణమి యొక్క చంద్రుడి షోడశ కళాత్మక శక్తికి విశేషంగా యాక్టివేట్ అయ్యి, తుంబురు తీర్థ జలాల్లోకి ప్రసరింపబడి, అక్కడికి ఎంతో ప్రయాసతో కష్టించి గంటలపాటు పాపవినాశనం డ్యాం నుండి నడకమార్గంలో కొండలను కోనలను లోయలను దాటుకుంటూ చేరుకొని సేవించిన వారికి అది అనుగ్రహింపబడే అత్యంత మహిమాన్వితమైన రోజు......
1. పాపనాశన తీర్థం.....
2. సనకసనందన తీర్థం....
(దెగ్గర్లోనే గుప్తంగా మనుష్యులకు అగోచరంగా /
యక్ష / కిన్నెర / కింపురుష / సిద్ధ / సాధ్య / విద్యాధర / నాగ / గంధర్వ / ఇత్యాది మనుష్యేతర ఉన్నతమైన జాతులకు గోచరమయ్యే కాయరసాయన తీర్థం..)
3. ద్రోణ తీర్థం....
(అడవి మధ్యలో సన్ననిధారగా ఆకులమధ్య కనిపించీ కనిపించని రీతిలో ఎదురయ్యె తీర్థం)
4. తుంబురు తీర్థం.....
ఈ వరుసక్రమంలో ఎదురయ్యే తీర్థాలను సేవిస్తూ, ఆఖరి మజిలీ అయిన తుంబురు తీర్థ ఉద్గమ స్థానానికి భక్తులు చేరుకోవడం, అక్కడ నిరంతర చల్లని జలపాతంలా పర్వతప్రాంతం పైనుండి ఎన్నెన్నో విశేష ఔషధ మూలికలతో కలగలిసిన తీర్థజలాన్ని సేవించడం ఈనాటి విశేషం....
ఒక్కొక్క వ్యక్తి తన జీవితపర్యంతంలో దాచుకున్న సంపద మొత్తం తనకు సంబంధించిన వారికి వీలునామాగా రాసి గతించిన తరువాత అది లోకానికి తెలిసిరావడం గురించి వినే ఉంటారు....
ఆ వ్యక్తి జీవించి ఉన్నప్పుడు అది కేవలం తన అధీనంలో ఉన్న సంపద.....
కాని సదరు వ్యక్తి గతించిన తదుపరి ఒక సేవాసమితి / ట్రస్ట్ / పీఠానికి రాసివ్వబడిన ఆ సంపదలోని కొంత భాగం ఎంతో మందికి చెందుతూ, ఎందరినో తరింపజేసే ప్రజాసంపదగా రూపాంతరం చెందడం ఈ లోకంలో మనం గమనించవచ్చు.....
అచ్చం ఇదేవిధంగ, ఒక యోగి/యోగినీ, భక్తుడు/భక్తురాలు, సాధువు/సాధ్వీమణి
యొక్క తపఃశక్తి మొత్తం వివిధ రూపాల్లో వివిధ చోట్ల నిక్షిప్తం గావింపబడి, ఒక్కో ప్రత్యేక సమయాల్లో అవి విశేషంగ వాటి శక్తిని ప్రసరింపజేయడం, ఎందరో భక్తులకు అనుగ్రహంగా అది అందిరావడం గురించి వినే ఉంటారు...
ఆ కోవకు చెందిన శ్రీతరిగొండ వెంగమాంబ గారి అధ్యాత్మ విశేషం ఈ రోజు తిరుమల తుంబురు తీర్థ ముక్కోటి పర్వ దినంగా, యావద్ బ్రహ్మాండంలోని వివిధ తీర్థాలు వాటి వాటి సూక్ష్మ రూపంలో ఈ తుంబురు తీర్థ ముక్కోటి పర్వం నాడు తుంబురు తీర్థ జలాల్లోకి ప్రవేశించి విశేషమైన అనుగ్రహాన్ని వర్షిస్తాయి...అని మన పెద్దలు చెప్పినప్పుడు, వినడానికి ఏదో పాతకాలం నాటి సినిమా స్టోరీలా బానే ఉంది కాని అది ఎట్లు సాధ్యం.....అనే సందేహం ఈ ఆధునిక కాలంలో చాలా మందికి కలగవచ్చు.....
ఈనాటి మన ఆధునిక కాలంలోని ఒక చిన్న ఎగ్సాంపుల్ తో ఈ ప్రక్రియ గురించి వివరించే ప్రయత్నం గావిస్తాను...
కొట్లమంది జనాభాతో ఎన్నెన్నో పోలింగ్ సెంటర్స్ లో ఎలెక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహింపబడిన వోటింగ్ అనే ప్రక్రియలో మీరు గమనించి ఉండి ఉంటే, ఆ ఎలెక్ట్రానిక్ వోటింగ్ మషీన్లన్నీ కూడా క్రమక్రమంగా అన్ని పోలింగ్ సెంటర్స్ నుండి కలెక్ట్ చేయబడి ఒక సెంట్రల్ "స్ట్రాంగ్ రూం" అనే ప్రదేశంలో ఎందరో సాయుధ బలగాల కట్టుదిట్టమైన పహారా మధ్యన రక్షింపబడడం గురించి వినే ఉంటారు....
ఆ ఎలెక్ట్రానిక్ వోటింగ్ మషీన్లన్నీ కూడా "స్ట్రాంగ్ రూం" లో ఉన్నప్పుడు ఇనాక్టివ్ గానే ఉంటాయి....
ఏనాడైతే " వోట్స్ కౌంటింగ్ డే" అనే పేరుతో "ఎలెక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా" అనే భారత రాజ్యాంగబద్ధమైన సాధికారిక పర్యవేక్షణ సంస్థ యొక్క ఆధ్వర్యంలో గణనకు సిద్ధంగావింపబడుతాయో......
ఆనాడు ప్లగిన్ గావించి స్విచాన్ చేయగానే ఆక్టివేట్ అయ్యి కేవలం కొన్ని నిమిషాల్లో వాటిలో నిక్షిప్తమైన
వోట్లను బహిర్గతం గావించి, కేవలం ఒక్క రోజులో వందల మంది అభ్యర్ధుల జీవితాలను శాసించే ఫలితాలు వెలువరింపబడడం గురించి వినే ఉంటారు కద....
వేలకొలది చోట్లల్లో లక్షల కొలది వోటర్ల తో ఒక్కొక్క వోటును అందుకొని వాటిని తన మెమొరీలో సూక్ష్మరూపంలో ( ఫ్లిప్-ఫ్లాప్ సీక్వెన్స్ / బిట్స్ అండ్ బైట్స్ గా) దాచుకొని, ఎప్పుడైతే వాటిని లెక్కింపబడే "బటన్" తత్ అధికారం గల వ్యక్తి చే నొక్కబడుతుందో,
అప్పుడు వాటిలో గుప్తంగా నిక్షిప్తమై ఉండే వోట్లన్నిటినీ మనకు ఒకేసారి అందివ్వబడడం అనేది ఎంతటి ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ టెక్నలాజికల్ కాన్సెప్టో...
ఒక్కో గంటా, ఒక్కో రోజు, ఒక్కో వారం, ఒక్కో నెల, ఒక్కో సంవత్సరం, ఒక్కో పుణ్యక్షేత్రం, లో వివిధ సాధకులచే కొనసాగింపబడిన అధ్యాత్మ సాధన కూడా ఒక విధమైన దైవిక కట్టడితో "స్ట్రాంగ్ రూం" లాంటి ఒక ప్రదేశంలో భద్రపరచబడి ఒకానొక సమయంలోని చంద్ర శక్తిని వాటి బహిర్గత ప్రక్రియకు ట్రిగర్ గా ఉండేలా వ్యవస్థీకరించగలరు అని అనడం కూడా అంతటి ఎస్టాబ్లిష్డ్ స్పిరిట్యువల్ సైన్స్ కి సంబంధించిన కాన్సెప్ట్....
ఈ నాటి సైన్స్ అండ్ టెక్నాలజిని నమ్మే వారికి ఆనాటి ఆధ్యాత్మికతను కూడా అట్లే నమ్మడం వారి వారి జ్ఞ్యాన స్థాయికి సంబంధించిన అంశం.....
తిరుమల శ్రీవారి సేవానంతరం, అనాటి నా తుంబురు తీర్థయాత్ర కు సంబంధించిన విశేషాలను ఈ క్రింది పోస్ట్లో రాసాను....
https://m.facebook.com/story.php?story_fbid=10215645010451666&id=1033694038
No comments:
Post a Comment