Sunday, April 16, 2023

శ్రీకరమైన భారతరాజ్యాంగపితామహుడిగా పేర్గాంచిన మహనీయుడు, శ్రీ బాబాసాహేబ్ అంబేడ్కర్ గారి 132 వ జయంత్యుత్సవ శుభాభినందనలు...💐🍧🍨🙂🍦🍿🍕🎂🇮🇳

శ్రీకరమైన భారతరాజ్యాంగపితామహుడిగా పేర్గాంచిన మహనీయుడు, శ్రీ బాబాసాహేబ్ అంబేడ్కర్ గారి 132 వ జయంత్యుత్సవ శుభాభినందనలు...

💐🍧🍨🙂🍦🍿🍕🎂🇮🇳

ఒక పెద్ద పెళ్ళి ఫంక్షనో, లేక డిన్నర్ ఫంక్షనో, లేక హ్యాపిబర్త్డే ఫంక్షనో, ఇత్యాది పార్టీస్ కి వెళ్ళినప్పుడు గమనించే ఉంటారు....

పేద్ద పేద్ద బగోనలు, గిన్నెలు, పాత్రల్లో, వండి సిద్ధంగావింపబడిన వివిధ స్వీట్లు, హాట్లు, బగార, తెల్లన్నం, బిర్యానీలు, ఓ 10 రకాల కూరలు, ఐస్క్రీంలు, గులాబ్ జాములు ఇత్యాదివన్నీ వండబడి సిద్ధమై ఉండగా...

వాటన్నిటిని డీసెంట్ సైజ్ గల విస్తరాకుల లాంటి వందలాది ప్లేట్స్ లో, అన్ని పదార్ధాలను ఆ ఫంక్షన్ యొక్క ఆహ్వానితులకు వడ్డింపబడడం అనే ప్రక్రియను ఒక పద్ధతిగా ఒక క్రమంలో అక్కడి క్యాటరింగ్ టీం నిర్వహించడం గమనించే ఉంటారు...

వాటన్నిటిని ఈవెంట్ ఆర్గనైసర్ అనే ఒక వ్యక్తి [ మన ఇంట్లోని చుట్టమే అవ్వొచ్చు లేకపోతే బయటి ఈవెంట్ మానేజ్మెంట్ వారికి పార్టీ పనులన్నీ మొత్తం గంపగుత్తకు అప్పగిస్తే ఆ టీం యొక్క హెడ్ ] ఒక పద్ధతిగా ప్రణాళికా బద్ధంగా ప్లాన్ చేసి, ఇంప్లిమెంట్ చేసి, ఎగ్సిక్యూట్ చేయడం గురించి గమనించే ఉంటారు....

" స్వాతంత్ర్యభారతం " అనే ఒక పేద్ద కల్యాణం లో భాగమైన వారందరూ కూడా ఒక పేద్ద కల్యాణానికి ఆహ్వానితులైన భారతదేశపౌరులు......

"భారతదేశ సార్వభౌమాధికారం" అనే పేరుతో వ్యహరింపబడే ఆ పేద్ద వంటకంలో భాగమైన ఎన్నో పదార్ధాలు అనగా వివిధ రాజ్యాంగబద్ధమైన హక్కులు, బాధ్యతలు, సూచనలు, మార్గదర్శకాలు, ఆదేశాలు, చట్టాలు, వీటన్నిటిని పౌరుల శ్రేయోజీవనానికై తగు విధంగా అందజేసే ఆ క్యాటరింగ్ టీం మెంబర్స్ వివిధ భారత రాజనీతిజ్ఞ్యులు...
( కామన్ గా మాట్లాడే భాషలో రాజకీయవేత్తలు / పొలిటీషియన్స్ )

మరియు అందులో
గౌ|| భారత ప్రధానమంత్రి,
గౌ|| భారత రాష్ట్రపతి,
గౌ|| భారత ఉపరాష్ట్రపతి,
గౌ|| భారత రాష్ట్ర ముఖ్యమంత్రి,
గౌ|| భారత రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,
గౌ|| భారత రాష్ట్ర గవర్నర్,

అనే మాన్యులు ఆ వివిధ క్యాటరింగ్ టీంస్ లో హెడ్స్ గా ఉండే ప్రధాన వ్యక్తులు...వారి క్రింద వివిధ క్యాబినెట్ మంత్రులు, సహాయమంత్రులు, ఎం.పీ లు, ఎం.ఎల్.ఏ లు, ఇత్యాదిగా ఒక పెద్ద ధృఢమైన క్యాటరింగ్ వ్యవస్థ అనేది ఆ భారతరాజ్యాంగ దత్తమైన ఫలాలను ప్రజలకు అందించే ఒక పబ్లిక్ సర్వీస్ టీం...

అందుకు అనుబంధంగా ఉండే రక్షక/పోలీస్,
న్యాయ/జుడీషియరి శాఖలు
(IAS,IPS,IFS,IRS, SC/HC, HRC, మొదలైన పౌరహక్కుల పరిరక్షక వ్యవస్థలు)
అనేవి వాటి అమలును పర్యవేక్షిస్తూ ఒక వైపు ప్రజలకు ఆ నిర్దేశిత పదార్థాలన్నీ కూడా సక్రమంగా
అందేలా దోహదపడుతూ, మరో వైపు సందులో సడేమియా అన్నట్టుగా క్యాటరింగ్ చేసే వారే మొత్తం ఆమ్యామ్యాం కావించకుండా, వారిని కూడా పర్యవేక్షిస్తూ ఉండే దృఢమైన ఎగ్సిక్యుటివ్ వ్యవస్థ....

ఏడుపదుల స్వతంత్ర భారతావని ఎవ్విధమైన మార్గదర్శకాలతో ఇప్పటివరకు ఆర్జించిన ప్రగతి తో అంతర్జాతీయ యవనికపై అన్ని రంగాల్లోనూ తిరుగులేని శక్తిగా భారతదేశం గా వెలుగొందుతుందో,

లింగ, కుల, మత, వర్ణ, వర్గాలకు అతీతంగా ఎంతో ఉన్నతమైన రీతిలో ప్రతీ భారత పౌరుడికి కల్పింపబడిన హక్కులు గౌరవింపబడేలా, ప్రతి ఒక్కరి నిర్దేశిత బాధ్యతపట్ల పౌరులెల్లరూ గౌరవభావం తో మెలిగేలా, ఎన్నో దేశాల రాజ్యాంగాలను విస్తృత అధ్యయనం గావించి, ఎంతో కట్టుదిట్టమైన , మహత్వపూర్ణమైన భారతరాజ్యాంగ వ్యవస్థను..,  భారతీయులకు అందించిన ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, శ్రీ అంబేడ్కర్ గారి జన్మదినోత్సవం భారతీయులందరికీ కూడా ఒక గొప్ప పండగ.....

కాలానికి తగ్గట్టుగా సమాజంలో చోటుచేసుకుంటున్న వివిధ ఆధునిక మార్పుల దృష్ట్యా, సమాజంలోని ఆర్ధిక అసమానతలను రూపుమాపే దిశగా, ఒక పౌరుడి హక్కు మరో పౌరుడికి కంటకప్రాయంగా ఉండకుండా ఉండే విధంగా, అఖండభారతదేశం యొక్క వైభవానికి అనాదిగా మూలధర్మమైన సనాతనధర్మావలంబకులకు,
సనాతనధర్మసంపదకు, ముఖ్యంగా గోవులకు, కొన్ని అనివార్య కారణాలతో దిగుమతి కావింపబడిన వివిధ విదేశి సంస్కృతులనుండి కలిగే ఇబ్బందులనుండి, పరిరక్షింపబడవలసిన విధంగా తగురీతిలో కట్టుదిట్టమైన  చట్టాలకు పెద్దపీట వేసేలా.....,
ఆధునిక భారతసార్వభౌమాధికారానికి మరింత వన్నే తెచ్చేలా మరో అంబేడ్కర్ లాంటి ద్రష్టలైన మేధావి ఈ దేశంలో ప్రభవించాలని ఆకాంక్షిస్తూ..
వందేమాతరం....🙏

జై భారత్....
జై హింద్....
జై తెలంగాణ...
జై జవాన్....
జై కిసాన్....
🇮🇳🎂🍕🍿🍦🍨🍧💐🙂

[ భావిబారతపౌరులకు మార్గదర్శిగా అంబేడ్కర్ అనే ఒక మహోన్నతమైన రాజనీతిశాస్త్రవేత్త స్మృతిచిహ్నంగా, తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ప్రాంగణంలో అంబేడ్కర్ గారి పెద్ద విగ్రహ ఏర్పాటు హర్షణీయం...💐🍧🍨🍦🍿🍕🙂  ]


No comments:

Post a Comment