శ్రీకరమైన ఒక సాధారణ రామచిలుకను కొందరు వారి కృషితో ఒక గొప్ప ప్రాజ్ఞ్యపక్షిగా తీర్చిదిద్ది దానికి ఎన్నెన్నో గౌరవాలు సమకూరడానికి కారణం అయ్యారు.....
కాబట్టి ఇప్పుడు వారి సూచనలమేరకే ఆ రామచిలుక తన కార్యాచరణ కావించడం అనేది ఎంతమాత్రమూ కూడా అతిశయం కానేరదు....
"నీ మొహానికి అదవసరమా....ఇదవసరమా....
నువ్వొక పెద్ద దైవభక్తుడివి....నీకొక మరియాదా..."
ఇత్యాదిగా ఎన్నో విధాలుగా ఆ సాధారణ రామచిలుకను ఎంతో హీనంగా అగౌరవపరిచిన అవమానించిన అడ్డగాడిదలకు.....
ఇప్పుడు ఆ పరిణతచెందిన శ్రీరామచిలుక పొందే గౌరవాలు, మరియాదలు, యశోఐశ్వర్యములు, ఇత్యాది భగవద్ ప్రసాదిత విభూతులపై పడిఏడవడం ఎవ్విధంగానూ శోభించని శుష్క ప్రయాస... .....
ఎంత చెట్టుకు అంతే గాలి....
ఎంత పుణ్యానికి అంతే సంపద....
ఎంత పరిశ్రమకు అంతే విలువ.....
ఎంత భావవైశాల్యానికి అంతే గౌరవం.....
ఎంత గౌరవానికి అంతే మరియాద.....
ఒక కూలి పనిచెసే వ్యక్తి యొక్క శ్రమకు, ఎన్ని సంవత్సరాలుగా రోజుకు ఎన్ని గంటల పాటు ఎన్ని గంపల మట్టి మోస్తూ ఎంత కష్టపడ్డాడు అనేది కొలమానం....
ఆ కష్టం కంటికి కనిపించగలదేమో....
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క శ్రమకు, ఎన్ని సంవత్సరాలుగా ఎంత మేధోక్లేశానికి గురవుతూ మానసికంగా ఎంత కష్టపడ్డాడు, అనేది కొలమానం....
ఆ కష్టం కంటికి కనిపించదు....
అక్యూట్ మెంటల్ స్ట్రెస్ తో తెల్లబడిన అతడి జుత్తును అడిగితే చెప్తుంది అతడి మానసిక కష్టం గురించి.....
అన్నేసి గంటల పాటు తదేకంగా మానిటర్ ని చూస్తూ రేడియేషన్ కి గురై సివియర్ హెడెక్ తో
టాం క్రూజ్ లా షైన్ అవ్వాల్సిన ఫేస్ విల్ స్మిత్ లా
నల్లబడి, తేజోహీనమైన అతడి కళ్ళక్రింద వలయాలను అడిగితే చెప్తుంది అతడి మానసిక కష్టం గురించి.....
ఒకవైపు వర్క్ స్ట్రెస్ తో, మరోవైపు ఓర్వలేని సీనియర్ల పాలిటిక్స్ తో, ఎన్నో రాత్రులు నిద్రపట్టక క్షీణించిన అతడి ఆరోగ్యాన్ని అడిగితే చెప్తుంది అతడి మానసిక కష్టం గురించి.....
ఊరిమీద పడితిరుగుతూ ఇతరుల ఉన్నతిపై పడిఏడిచే బొర్రలు పెంచిన బద్మాష్ బాడ్ఖావ్లకు ఇట్లాంటివి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా కూడా ఇతరుల మానసిక కష్టం గురించి అర్ధంకాదు....
ఒక జిత్తులమారి నక్క దెగ్గర ఒక బానిస గాడిద తన గోడును వెళ్ళబోసుకున్నట్టుగా అది ఒక వృధా ప్రయాసే అవుతుంది....
కాబట్టి ఇతరులకు సూక్తులను చెప్పడం తగ్గించి ఎవరికి వారు వారివారి జీవిత పయనాన్ని ఆత్మవిమర్ష గావించుకోడం ఉత్తమం.....
శ్రీవేంకటహరిభక్తి, గోవిందుడి శ్రీపాదయుగళ స్మరణమననసంకీర్తననిధిధ్యాసన, సశాస్త్రీయ పరమేశ్వరలింగాభిషేకం, అనే పుణ్యసంచయం జన్మజన్మలకు తరగని పుణ్యపర్వతరాశులు.....
అవి ఒకరు ఇస్తే వచ్చేవి కావు.....
ఒకరు తీసుకుంటే పొయ్యేవి కావు....
కేవలం భగవంతుడు, భక్తభాగవతులకు మాత్రమే అర్ధమయ్యే ఈశ్వరానుగ్రహవైచిత్రి....
No comments:
Post a Comment