Tuesday, April 4, 2023

శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ ! అభంగుర విభూతిర్నిస్తతరంగయదుమంగళం !!

అభంగుర విభూతిర్నిస్తతరంగయదుమంగళం !!

శ్రీవేంకటాద్రి నిలయుడు, శ్రీలక్షీ లోలుడు, ఎనలేని గొప్ప విభూతులకు నిలయుడైన శ్రీహరి, భక్తులకు సదా శుభముల పరంపరలను అనుగ్రహిస్తూ విరాజిల్లుగాక....

మన కూకట్పల్లి వివేకానందనగర్ పరిసరాల్లో 
శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ ఆండాళ్ అమ్మవారి సమేతంగా కొలువైన కలియుగ ప్రత్యక్షదైవం 
శ్రీవేంకటేశ్వరస్వామి వారు,
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామానుజ చిన్నజీయ్యర్ స్వామి వారి మంగళ ఆశాసనములతో వర్ధిల్లుతూ, 32వ వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత, శ్రీపాంచరాత్రాగమోక్త పాంచాహ్నిక దీక్షాప్రయుక్త చైత్ర శుద్ధ సప్తమీ కల్యాణమహోత్సవ కైంకర్యంలో భక్తులను అనుగ్రహిస్తూ విశేషమైన వైభవంతో అలరారే శ్రీభూసమేతశ్రీనివాసుడి వైభవం, మహిమ్నతను వర్నించడం విరించికైననూ దుర్లభమే కదా....☺️💐🍿
🍦🍨🍕🍧

నేనురాసే భగవద్ తత్త్వ విశ్లేషణాత్మక పోస్టులన్నీ కూడా శ్రీచాగంటి సద్గురువులచే అనుగ్రహింపబడిన కొన్ని వందలాది ప్రవచనాల్లో పేర్కోనబడిన వివిధ భక్త భాగవత భగవద్ కథాసుధాంశాలకు నాదైన రీతిలో వ్యాఖ్యాన విశ్లేషణ జోడించి రాసినవే కాబట్టి, ఈసారి అస్మద్ గురుదేవులకు బాగా ఇష్టమైన కొబ్బరిపచ్చడి / కొబ్బరిచట్ని ని ఎగ్సాంపుల్ గా తీసుకుని భగవదనుగ్రహ వైభవాన్ని వర్నించే ప్రయత్నం గావిస్తాను....🙂

కొబ్బరిచట్ని మన తెలుగువారందరికీ కూడా సుపరిచితమైన అమొఘమైన వంటకమే కద...
ఇడ్లీలైనా, దోశలైనా, గుంటపొంగనాలైనా, ఉప్మా అయినా, మరే ఇతర అల్పహారమైనా లేక అన్నమైనా సరే....
అందులోకి పోపు/తాళింపు కలిపిన కొబ్బరి చట్నీ కలుపుకుంటే అది ఎంత కమ్మని భోజనమో ఎల్లరికీ తెలిసినదే....

ఒకరు భుజించిన ఫలాల విత్తనముల నుండి జనించవు కాబట్టి కొబ్బరి మరియు అరటి ఎవ్విధంగానూ ఎంగిలి కాని పూర్ణమైన పరిశుద్ధమైన ప్రకృతి ప్రసాదిత పదార్ధములు కావడం...
మరియు బెల్లం అనే అమృతతుల్యమైన పదార్ధం, చెరుకు నుండి డైరెక్ట్ గా తయారుకావింపబడే నిలవదోషం లేని పదార్ధం కావడం వల్ల....
ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పింపబడే పదార్ధాల్లో అగ్రతాంబూలం కొబ్బరి మరియు అరటి పండు మరియు బెల్లానికే అని అందరికి తెలిసిందే....

వీటిలో, ఎంతో నమిలితే కాని జీర్ణం కాని పూర్ణఫలమైన కొబ్బరి జ్ఞ్యానానికి సూచిక అని శ్రీచాగంటి సద్గురువుల ఉవాచ కాబట్టి కొబ్బరిచట్ని ని ఇక్కడ ఉపమానంగా ఉటంకిస్తున్నానూ....

1. తెల్లకొబ్బరి, ఎర్రకొబ్బరి, నల్లకొబ్బరి, హైబ్రీడ్ కొబ్బరి, సన్నకొబ్బరి, దొడ్డుకొబ్బరి, ఇలా వివిధ కొబ్బరి వంగడాలు మన దేశంలో లభ్యమౌతూ ఉండగా....
మనం షాపునుండి కొనుక్కొని వచ్చింది ఏ కొబ్బరి వంగడం..?
2. ఆ కొబ్బరిముక్కలను ఏమేరకు రోస్ట్ చేసి, ఏఏ ఇతర పదార్ధాలతో కలిపి, (అనగా నువ్వులు, మిర్చి, ఇత్యాది దినుసులు...) ఎంత లైట్ గ్రేయిండ్ సెమిసాలిడ్ పేస్ట్ గా చేసాము....?
3. కరివేపాకు, ఆవాలు, గుండుమినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, ఇత్యాది దినుసులతో మాడిపోకుండా చక్కని ఫ్రైడ్ పోపుకు సరిపడేంత వంటనూనేతో పోపును వేసి గ్రైండెడ్ కొబ్బరి పేస్ట్ లోకి పోపునుబాగా కలిపి,
సిద్ధమైన కొబ్బరిచట్ని ఎంత వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ ఇత్యాది టిఫిన్ తో ఆరగించాము.....?

అనే వివిధ విషయాలపై ఆ కొబ్బరిచట్ని యొక్క అమోఘత్వం అనేది ఆధారపడి ఉంటుంది.....

ఒక్క పూట ఇడ్లీ టిఫిన్ కోసం తయారుగావింపబడే కొబ్బరిచట్నిలోనే ఇన్ని వస్తువుల / పదార్ధాల పరిమాణం / కలబోత పై ఆధారపడి ఉండే అమొఘత్వం గురించి అలోచించే ఈ ఆధునిక మనిషికి......,

1. పరిపూర్ణుడైన భగవంతుడిని సామాన్యుడైన మనుష్యుడికి అందించి యావద్ జీవితాన్నే తరింపజేసే అసామాన్యమైన భగవద్ తత్త్వాన్ని ఒక ఉన్నతమైన జ్ఞ్యాన స్థాయికి చేరేలా ఆచరణాత్మకంగా అందుకోవాలంటే మరి ఆ భగవదారాధనా వ్యవస్థ ఎంత గొప్పదై ఉంటుంది....?
2. అందులో ఎన్ని ఉన్నతమైన సాత్విక పదార్ధాల కలబోత ఉంటుంది...?
3. ఎంత గొప్ప మహానుభావుల కృషి వల్ల లోకానికి అందివ్వబడిన ఋషిప్రోక్త ఆర్షవాంగ్మయ వినిమయం ఉంటుంది....?
4. లౌకిక ప్రపంచాన్ని, అలౌకిక భగవద్ తత్త్వాన్ని అనుసంధానించే మహోన్నతమైన దేవాలయ ఆగమాచారవ్యవహార వ్యవస్థ ఉంటుంది..?

అనే విషయాల పట్ల అవగాహన, గౌరవమరియాదలు, విశ్వాసం లేకపోవడం అనేది ఈ అధునిక కలియుగ మానవుడికి గల జాఢ్యం...మౌఢ్యం...
ఎందుకంటే ఈ కలియుగంలో ధర్మం, సత్యం అనే ఒకే ఒక పాదంపై నిలిచిఉండడం అనే లక్షణం వల్ల ప్రజల్లో దైవారాధనా అనే వ్యవస్థపై మక్కువ లేకపోవడం ఈ జాఢ్యానికి, మౌఢ్యానికి గల మూలకారణం.....

నిత్యమైన శాశ్వతమైన సార్వకాలికమైన సార్వజనీనమైన ఆ సత్యమే పరమాత్మ....
అందుకే ఈ కలియుగ ప్రత్యక్ష పరమాత్మగా కొలువైన వరదైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు తన తిరుమల ఆనందనిలయ సన్నిధికి ఏ విశ్వాసం వారైనా సరే దర్శనానికి వచ్చి అనుగ్రహింపబడి తరించవచ్చు అని సెలవిస్తూ
"Non-Hindus / foreigners can avail Tirumalesha Darshanam with due declaration of the faith vested in him....."
అని Q లైన్లో డిక్లరేషన్ వెసులుబాటు కూడా కల్పించిన గొప్ప హృదయవైశాల్యం గల ఘనదైవం ఆ గోవిందుడు....
అంత గొప్ప స్వామివారికి తిరుమలలో జరిగే నిత్యోత్సవాల్లో ఎంతో ప్రశస్తమైనది ఆర్జిత కల్యాణోత్సవం....

తిరుమల శ్రీవారి కల్యాణోత్సవమంతటి వైభవభరితమైన రీతిలో, అత్యంత ముఖ్యమైన ఆచారశుద్ధి, పదార్ధ/ద్రవ్యశుద్ధి, మంత్రశుద్ధి, స్థలశుద్ధి, కలగలిసిన మహోన్నతమైన ఉత్సవం, మన కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీలో కొలువైన శీమదలర్మేల్మంగా పద్మావతి ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక పాంచరాత్రాగమోక్త పాంచాహ్నిక బ్రహ్మోత్సవాంతర్గత వార్షికకల్యాణోత్సవం, ఎంతో విశేషమైన మహిమ్నతగలది....

"మంత్రాదీనంతుదైవతం
తన్మంత్రంబ్రాహ్మనాధీనం
తస్మాత్ బ్రాహ్మణోమమదేవతాః ..."

"మంత్రాధీనమై ఉండేది దైవం....
ఆ మంత్రం బ్రాహ్మనాధీమై ఉంటుంది...
(అనగా సదరు ఆలయంలో అర్చారాధనా కైంకర్యములను సలిపే పురోహితులు.....)
అందుకే వారిని భూసురోత్తములు
(భువిపై తిరుగాడే దేవతలు...) అని గౌరవించేది....."
అని ఆచార్యవాక్కు....

మామూలుగా కొందరు అనే....
"దేవుడు కరుణించినా పూజారి అడ్డుపడడం......" ఇట్లాంటి డైలాగ్స్ ఎవరో ఒక మూర్ఖుడి కల్పితాలు మాత్రమే......

మనం ఎగ్సాం మంచిగా రాస్తే ఎగ్సామినర్ మన మార్క్స్ కి అడ్డుపడడం అంటూ ఏమి ఉండదు....ఎందుకంటే ఒక ఎగ్సమినర్ అక్కడ ఉండేది మనకు కావలసిన బుక్లెట్స్ అందివ్వడానికే...
మరియు ఇతరులు మన బుక్లెట్ నుండి మనం రాసే జవాబులను కాపికొట్టకుండా పర్యవేక్షించడం కోసమే....

అదే విధంగా, అర్చక వ్యవస్థ ఉండేది ఆ భగవద్ తత్త్వాన్ని మెండుగా సరైన విధంగా భక్తుల్లెలరికీ కూడా అందివ్వడం కోసం మాత్రమే.....

ఒక విద్యాసంవత్సరమంతా కొనసాగిన మన పరిశ్రమ గొప్పదైనప్పుడు డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులమవ్వడానికి
ఒక ఎగ్సామినర్ ఎవ్విధంగానూ అడ్డుకాబోడు....కేవలం తన పర్యవేక్షణతో దోహదం అవుతాడు......

అదే విధంగా మన నిత్య భక్తి గొప్పదైనప్పుడు, మనచే ప్రార్ధింపబడే తత్ దైవం వరాలను అనుగ్రహించడానికి అర్చకులు ఎవ్విధంగానూ అడ్డుకారు....
కేవలం తమ పర్యవేక్షణతో దోహదం అవుతారు......

ఒక రాజ్యం యొక్క రాజు చాల గొప్పవాడిగా, ఉన్నతుడిగా కీర్తిని గడించాడంటే.......
తన సచివులు చాలా గొప్పవారు, శక్తివంతులైన విజ్ఞ్యులు అని అర్ధం.....
సుగ్రీవుడికి శ్రీమద్రామాయణంలో ఒక మంచి పేరు ఉండడానికి కారణం హనుమంతుడు 
" ఓం సుగ్రీవసచివాయ నమః..." అని వర్ధిల్లడం వల్లే.....

అదేవిధంగా ఒక ఆలయంలోని దైవం,
అనగా ఆ ఆలయంలో కొలువైన అర్చామూర్తుల్లోని దేవతాతత్త్వం, చాలా మహిమోపేతమైనదిగా కీర్తిని గడిస్తే......ఆ ఆలయ అర్చక వ్యవస్థ చాలా శక్తివంతమైన విజ్ఞ్యులుతో కూడి ఉండి అక్కడి వేదస్వరపఠనజనిత దైవిక శక్తి చాలా ఉన్నత శ్రేణికి చెందిన భగవద్విభూతి అని అర్ధం......

ఒక పేద్ద బిల్డింగ్ కట్టి, అన్ని రకాల మెడికల్ సామాగ్రిని కొనితెచ్చి, కేవలం నిపుణులైన డాక్టర్లు మాత్రమే లేరు...
నర్సులతో, వార్డ్ బాయ్స్ తో వైద్యం కానిచ్చేస్తున్నాం.....
అని గనక ఎవరైన అంటే అది ఒక  హాస్పిటల్ గా విజ్ఞ్యులు ఎందుకు పరిగణించరో.....

అదే విధంగా ఆలయం కూడా...
ఒక పెద్ద బిల్డింగ్ కట్టి, పెద్ద పెద్ద దేవతామూర్తులు కొలువైఉండేలా చేసి, కేవలం సుస్వరవేదపఠనం తో ఆరాధనలు కావించే భూసురోత్తములు (మరియు గోవులు) మాత్రమే లేరు.....
అని గనక ఎవరైన అంటే అది ఒక నిత్యదర్శనీయమైన ఆలయం గా విజ్ఞ్యులు పరిగణించరు....
ఎందుకంటే సశాస్త్రీయ అర్చరాధనా ప్రయుక్త వేదస్వరానికే దైవశక్తిని దేవతామూర్తిలోకి స్థీరికరింపజేసే శక్తి కలదు....
అప్పుడు మాత్రమే ఆ దేవతాశక్తి భక్తుల ప్రార్ధనలను ఆలకించి, వారి వారి భక్తికి అనుగుణంగా "ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయేత్..." అనే రుద్రపఠన వచనంలా భక్తుల ధార్మిక కోరికలను ఈడేర్చే కల్పతరువుగా ఆ ఆలయం భాసిల్లుతుంది....

అటువంటి ఆలయంలో నిత్యాగ్ని ఆరాధకులుగా వెలుగొందే సద్బ్రాహ్మణుల వేదపన్నల పఠనజనిత శక్తితరంగాలతో నిండి ఉండే వాతావరణంలో ఎంతో శక్తివంతమైన దైవిక తేజస్సుతో భాసిల్లే దేవతామూర్తుల దర్శనం గావించి తరించడమనేది ఎన్నో జన్మల పుణ్యబలంగా మాత్రమే సంప్రాప్తించే దైవానుగ్రహ విశేషం....అందునా ఈ కలియుగంలో భగవద్ నామస్మరణ మాత్రం చేతనే ఎంతో గొప్ప పుణ్యాలను గడించగలిగే కలియుగ వెసులుబాటు ఉండికూడా ఆ భగవద్ అనుగ్రహాన్ని అందుకోలేకపోవడం అనేది ఈ కలియుగవాసుల దుస్థితికి తార్కాణం....

ప్రతీ సబ్జెక్ట్లోను 100 కి 35 అత్తెసరు మార్కులతో ఉండే ప్రోగ్రెస్ కార్డ్ కు మరియు ఎన్నో సబ్జెక్టుల్లో 100 కు 80 పైనే మార్కులు ఉండే ప్రోగ్రెస్ కార్డ్ కు, ఒకే క్లాస్ లో ఉండే 100 మందికి గల ఒకే ఊపాధ్యాయులు ఏవిధంగానైతే ఆ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు సదరు విద్యార్ధుల పట్ల నవ్వడంలో అనివార్యమైన భేదం చూపిస్తారో......

అదే విధంగా, భగవంతుడు కూడా భక్తులను ఉద్ధరించే తన అనుగ్రహవైచిత్రిలో మనుష్యుల పట్ల వారి వారి భక్తి సాంద్రతకు తగినట్టుగా అనివార్యమైన భేదం చూపించడం అనేది సర్వసాధారణం....

ఇది ప్రత్యక్షమైన రీతిలో కూడా భగవంతుడు ప్రదర్శిస్తాడు...అని శ్రీ చాగంటి సద్గురువులు వారి శ్రీవేంకటేశ్వరవైభవం ప్రవచనాల్లో వివరించడం చాలామందికి గుర్తుండే ఉంటుంది....

(ఒక్కో పుణ్యాత్ముడైన భక్తుడు తిరుమల కొండపైకి వస్తున్నప్పుడు స్వామివారి వదనకమలం చిరునవ్వులమయమై వెలుగుతూ ఉండడం.....
ఒక్కో బిజినెస్మైండెడ్ భక్తుడు తిరుమల కొండపైకి వస్తున్నప్పుడు స్వామివారి వదనకమలం మందస్మితరహితమై ఉండడం గురించి....)

తిరుమలేశుడంతటి షోడశకళాత్మక శ్రీలక్ష్మీవైభవంతో విరాజిల్లే శ్రీనివాసుణ్ణి హైదరాబాద్ లో దర్శించాలంటే అది కూకట్పల్లి వివేకానందనగర్ కాలనిలో సాలగ్రామస్థలస్థిత ఆలయప్రాంతంలో కొలువైన శ్రీవేంకటేశ్వరాలయంలోనే....
ఎందుకంటే ఇక్కడ స్వామి వారికి వామభాగంలో నెలకొన్న
ఎంతో మహిమోపేతమైన బిల్వ / మారేడు వృక్షమును నిత్యం ఆవహించి ఉండే శ్రీలక్ష్మీ అమ్మవారి కారుణ్య కటాక్ష ఛాయలలో ఆ శ్రీనివాసుడు /  " భాస్కరీం బిల్వనిలయాం " గా స్తుతింపబడే శ్రీలక్ష్మి ఆపాదతలమస్తకం వసించి ఉండేలా,
అనగా...తిరుమల వేదపఠనంలో వివరింపబడినట్టుగా....

వదనాంబుజ స్థిత భాగ్యలక్ష్మిగా,
కరాంబుజ స్థిత దానలక్ష్మిగా,
భుజమండలాంబుజ స్థిత వీరలక్ష్మిగా,
హృదంబుజ స్థిత భూతకారుణ్యలక్ష్మిగా,
ఖడ్గాలంకృత శౌర్యలక్ష్మిగా,
సకలసద్గుణశోభిత కీర్తిలక్ష్మిగా,
దైవికదేహాంబుజస్థిత సౌమ్యలక్ష్మిగా,
భక్తులను అనుగ్రహించే సర్వసామ్రాజ్యలక్ష్మిగా....

అనునిత్యం స్వామివారిని ఆవహించి ఉండే వివిధ వైభవలక్ష్మి స్వరూపంగా స్వామివారు నిత్యం శ్రీ కి నివాసంగా శ్రీశ్రీనివాసుడిగా విరాజిల్లడం బహువిశేషమైనది.....

ప్రకృతి ప్రసాదించిన కర్రతో తయారుచేయనడిన ఒక గొప్ప కుమ్మరి చక్రం ఇవ్వగా....లెక్కలేనంత మట్టి ఇవ్వగా.......
ఒక కుమ్మరి వ్యక్తి ఎన్ని కుండలు తయారుచేసుకొని ఎంత చల్లని నీటిని సమకూర్చుకొని స్వీకరించి
తరిస్తాడనేది అతని పరిశ్రమపై ఆధారపడి ఉండే అంశం.....

అదేవిధంగా అమేయమైన భగవద్ అనుగ్రహం తిరుమలేశుడి రూపంలో ప్రకృతి మనకు అందించగా.....
32 వేల సంకీర్తనలు శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు అనుగ్రహించగా, అందులో వందలాదిగా మాన్యులు ఆలపించిన సంకీర్తనలు సిద్ధమైన కర్ణపేయమైన శ్రవణామృతంగా లభ్యమవ్వగా....
నిరంతర అలోచనల భ్రమణవీచిక అనే మదిచక్రం పై ఆ కీర్తనలను కొలువైఉండేలా జేసి వాటిని ఆకళింఫు గావించుకొని భక్తులు ఎంతగా తరిస్తారనేది సదరు భక్తుడి భక్తి సాంద్రతపై ఆధారపడి ఉండే అంశం.....

ఒక గురువుదేవులు ఏవిధంగానైతే శిష్యునకు సకల దైవిక తత్త్వాలను గురుబోధాంతర్గత సిద్ధామృతంగా అందించి తరింపజేస్తారో......
వివిధ అనివార్య లౌకిక వస్తువిషయ బంధనములతో నిత్యం బంధీకృతమై ఉండే మన చిత్తానికి ఒక గొప్ప గురువులా ఆ గోవిందుడు సదా లభ్యమయ్యే 
( మొత్తపు బంధ విమోచనంబునకు, చిత్తజ గురుడే ) సిద్ధౌషధము అని అన్నమాచార్యులవారు ఎంతో గొప్పగా
ఈ క్రింది సంకీర్తనలో వర్నించడం చాలామంది భక్తులు వినేఉంటారు.....

ప|| అన్నిటికి నిదె పరమౌషధము | వెన్నుని నామము విమలౌషధము ||
చ|| చిత్త శాంతికిని శ్రీపతి నామమె | హత్తిన నిజ దివ్యౌషధము |
మొత్తపు బంధ విమోచనంబునకు | చిత్తజ గురుడే సిద్ధౌషధము ||
చ|| పరిపరి విధముల భవరోగములకు | హరి పాద జలమె యౌషధము |
దురిత కర్మముల దొలగించుటకును | మురహరు పూజే ముఖ్యౌషధము ||
చ|| ఇల నిహ పరముల నిందిరా విభుని | నలరి భజింపుటె యౌషధము |
కలిగిన శ్రీ వేంకటపతి శరణమె | నిలిచిన మాకిది నిత్యౌషధము ||

ఇంతటి ఘనమైన కలియుగ ప్రత్యక్ష దైవాన్ని అందుకే అన్నమాచార్యులవారు....
త్రిదశవంద్యుడైన తిరువేంకటపతిని (అనగా బాల్య, కౌమార, యవ్వన, మనబడే 3 దశలు మాత్రమే ఉండే అమరులైన సకలదేవతలచే వందనములు స్వీకరించే శ్రీవేంకటపతిని...)
వెతకి వెతకి సేవించి తరించమని ఇహపర ఉన్నతికి సెలవిస్తూ ఈ ఘనమైన సంకీర్తనను అనుగ్రహించారు.....

ప|| వేదం బెవ్వని వెదకెడివి | ఆదేవుని గొనియాడుడీ ||
చ|| అలరిన చైతన్యాత్మకు డెవ్వడు | కలడెవ్వ డెచట గలడనిన |
తలతు రెవ్వనిని దనువియోగదశ | యిల నాతని భజియించుడీ ||
చ|| కడగి సకలరక్షకు డిందెవ్వడు | వడి నింతయు నెవ్వనిమయము
పిడికిట తౄప్తులు పితరు లెవ్వనిని | దడవిన ఘనుడాతని గనుడు ||
చ|| కదసి సకలలోకంబుల వారలు | యిదివో కొలిచెద రెవ్వనిని |
త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి | వెదకి వెదకి సేవించుడీ ||

http://annamacharya-lyrics.blogspot.com/2007/11/347vedam-bevvani-vedakedivi.html?m=1

నేటి కల్యాణోత్సవంలో, అనగా,
శ్రీశోభకృత్ నామ సంవత్సర భౌమ్య వాసర చైత్ర శుద్ధ సప్తమి, మార్చి-28-2023 ఉదయం
11.52 నిమిషాలకు మృగశిరా నక్షత్ర, మిథునలగ్న పుష్కరాంశ సుముహూర్తమున, శ్రీవారి 32వ వార్షిక కల్యాణమహోత్సవ వైభవ దృశ్యం....మరియు సాయంత్రం నిర్వహింపబడిన గరుడవాహాన సేవలో కొలువైన స్వామివారి ఊరెరిగింపు దృశ్యం....

శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే ।
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్ ॥

శ్రీమత్-సుందరజా మాతృముని మానసవాసినే ।
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥

మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః ।
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ ॥

శ్రీ పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙂🍧🍕🎂🍨🍦🍿

No comments:

Post a Comment