శ్రీకరమైన ఒక స్ఫటిక శివలింగాన్ని మీరు ఎప్పుడైనా దర్శించి ఉంటే, అది ఏ రంగూ కూడా లేని, రంగులన్నిటికీ అతీతంగా అలరారే స్ఫటిక అరూపరూపి....
తమిళనాడు లోని రామేశ్వర క్షేత్రంలో ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో ఇచ్చే స్ఫటిక శివలింగ దర్శనం గురించి శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విన్నవారికి గుర్తున్నట్టుగా....
మీరు ఏ పువ్వును అలంకరిస్తే ఆ రంగులో కనిపించడం ఆ స్ఫటికశివలింగం యొక్క ప్రత్యేకత....
ఒకరు ఒక కలర్ పువ్వును అలంకరించినందుకు స్ఫటికశివలింగానిది అదే కలర్ ఏమో అని అనుకుని ఆ కలర్ ఇష్టం లేని వ్యక్తులు ఆ శివలింగంపై వారి అక్కసును ప్రదర్శించడం.....
ఇంకొకరు ఇంకొక కలర్ పువ్వును అలంకరించినందుకు స్ఫటికశివలింగానిది ఇదే కలర్ ఏమో అని అనుకుని ఈ కలర్ ఇష్టం లేని వ్యక్తులు శివలింగంపై వారి అక్కసును ప్రదర్శించడం.....
ఇలా కొందరు మూర్ఖులు వారి వారి మౌఢ్యస్థాయికి తగ్గట్టుగా ఒక ఉన్నతమైన స్ఫటికశివలింగం యొక్క గొప్పదనానికి కళంకం ఆపాదించేలా ప్రవర్తిస్తుంటే...
వారిని స్ఫటిక శివలింగం ఏమని తిట్టిపొయ్యాలి ...?
" ఓ మూర్ఖులారా....నావల్ల సర్వోన్నతుడైన పరమేశ్వరానుగ్రహాన్ని బడసి బాగా బలిసిన మీకు మీమీ మూర్ఖస్థాయికి నన్ను తగ్గించి మాట్లాడడం ఎట్లు సమంజసం...?
ఏ రంగుపుష్పాలైనా సరే యోగ్యమైన పుష్పాలన్నిటిని అలంకరించగల, ఏ రంగుకి సంబంధించని నా స్ఫటిక తత్త్వానికి, మీ యొక్క రంగులను, జెండాలను, అజెండాలను ఆపాదిస్తూ ఇబ్బందిపెట్టడం ఎవ్విధంగాను తగదు....
నా స్థాయికి తగ్గట్టుగా సర్వోన్నతమైన తురీయావస్థలో ఓలలాడుతూ తమను తాము దర్శించగల అతికొద్దిమంది విజ్ఞ్యులకు మాత్రమే నా స్థాయి, నా సర్వాతీత తత్త్వం అర్ధమయ్యేది....
మీమీ సంకుచితత్త్వం వల్ల, మీమీ వ్యక్తిగత స్పర్ధలవల్ల నేనెందుకు ఇబ్బంది పడాలి..? నా సర్వోన్నత స్థాయికి ఎందుకు ఇబ్బంది కలగాలి...?
మీరందరు దయ చేసి నానుండి దూరంగా ఉండండి....
నాపై శ్రద్ధవహించే ఉత్తములు కూడా ఏ రంగులకు, జెండాలకు, అజెండాలకు సంబంధించని CBI వంటి వారు.......
మీమీ జోబులు నింపుకోవడం కోసం నన్ను ఒక సబ్జెక్ట్ గా చేసుకొని అనవసరమైన భేషజాలతో నా ప్రశాంతతకు ఇబ్బంది కలిగించకండి...
నాకు ఏ రంగుపుష్పాలను కూడా ధరించాలని లేదు.....
కేవలం నిర్గుణ నిరంజన నిర్మల ప్రశాంత తత్త్వమునందు పరమేశ్వర సాలోక్య స్థితిలో ఉండడం మాత్రమే
నాకు ఆనందకారకం....
కొందరు కల్పించే ఆ ప్రశాంత స్థితికి ఇబ్బంది కలిగించేలా ఏ రంగు పుష్పాలతో ఉన్న మూర్ఖుడు వ్యవహరించినా సరే, వారియందు నా రుద్రస్థితి ప్రకటింపబడడం అనివార్యమౌతుంది...
కాబట్టి నా స్థాయిలో నన్ను నన్నుగా ఉండనివ్వండి.....
మీ స్థాయిలో మీరు మీరుగా ఉండండి....
ఇదే అందరికి మంచిది......"
అని అనకుండా ఎట్లు తనకు కావలసిన ప్రశాంతతను సాధించుకునేది...?
ఈశ్వరుడు ఎవ్వరిచేతనూ బంధింపబడని వాడు...
మరియు
ఈశ్వరుడు అందరికీ సంబంధించిన వాడు.....
ఈ సరసిజపత్రోపరిస్థితజలబిందుసంకాశతత్త్వం గ్రాహ్యమయ్యే విజ్ఞ్యులకు మాత్రమే నా స్ఫటిక తత్త్వం అర్ధమయ్యేది....
అనగా పరిసరాలతో మమేకమై ఉన్నట్టుగా కనిపించినా సరే, అన్ని పరిసరాలకు కూడా అతీతంగా అలరారే అసంగతత్త్వ సదృశమైన పరిపూర్ణత్త్వం.....
No comments:
Post a Comment