Sunday, July 14, 2024

ఎవరు తండ్రి...??

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారి మహిమాన్వితమైన సంకీర్తనల్లో ఒకటైన "ఇతనికంటె ఘనులికలేరు" అనే సంకీర్తనలో "తల్లియునితడె తండ్రియునితడే..." 
అని కొనియాడుతున్నారు ఆచార్యుల వారు స్వామివారి మాహాత్మ్యాన్ని... 

ఎవరు తండ్రి...??

"బాగా చదువుకొని వాళ్ళలా అభివృద్ధిచెందాలి...
వీళ్ళలా అభివృద్ధిచెందాలి..." అని బిడ్డలకు హితవచనాలు చెప్పేవారు తండ్రి...

ఆరోగ్యం క్షీణిస్తే అందుబాటులో ఉన్న ఇరుగుపొరుగు వారితో బండిమీదైనా సరే పరుగుపరుగున హాస్పిటల్ కి తీసుకెళ్ళి జీవితాన్ని నిలిపేవాడు తండ్రి...

వాళ్ళింట్లో అవి ఉన్నాయ్...వీళ్ళింట్లో ఇవి ఉన్నాయ్..
మన ఇంట్లో కూడా అవన్నీ ఉండాలి అని కొనితెచ్చేవాడు తండ్రి..

గళాభరణంగా ఒక చక్కని బంగారు హారం కూడా లేదంటే తనకు లేకున్నా సరే కొనిచ్చేవాడు తండ్రి...

ఫంక్షన్లకు వెళ్ళడానికి కట్టుకోవడానికి మంచి బట్టలు లేవంటే తనకు లేకున్నా సరే కొనిచ్చేవాడు తండ్రి...

సొడెక్సో కూపన్స్ తో కార్పోరేట్ కెఫిటేరియాల్లో మంచి తిండిని కొనుక్కొని తినకుండా అవన్నీ జమచేసి విజేత సూపర్ మార్కెట్లో ఇంటికిపనులకు ఉపయుక్తమైన కిచెన్ సామాగ్రిని కొనితెచ్చేవాడు తండ్రి...

తనలా తన బిడ్డలు కూడా పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని, విజ్ఞ్యులు హర్షించే విధంగా పిల్లలు పెరిగిపెద్దై ఉన్నత ఉద్యోగస్థులవ్వగానే, మంచి సంబంధం చూసి పెళ్ళి చేసేవాడు తండ్రి....

నేను పోయినా పర్వాలేదు...నా బిడ్డలు, మనవలు మనవరాళ్ళు నన్నుమించిన గొప్ప ప్రయోజకులు అవ్వాలి అని నమ్మేవాడు తండ్రి...

తండ్రి అంటే కర్తవ్యాన్ని మించిన బాధ్యత...
తండ్రి అంటే ఆప్యాయతను మించిన అనురాగం...
తండ్రి అంటే స్నేహితుణ్ణి మించిన మితృడు....
అందుకే తండ్రి అంటే శ్రీతిరుమలేశుడే అని అన్నారు శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు...

ఎందుకంటే...
ధనమే సర్వస్వంగా జనులు భావించే కలియుగం ఇది...
ధనం కోసం మందిని ముంచి బ్రతికేవారే ఎక్కువగా ఉండే కలియుగం ఇది...
ధనం కోసం సొంతవారినే సాధించే మూర్ఖులు ఎక్కువగా ఉండే కలియుగం ఇది...
అందుకే అట్టి ధనానికి భక్తుల పాపపంకిలాన్ని ఆపాదించి తన హుండీలోకి మ్రొక్కుబడుల రూపంలో ధనం చేరిన వెంటనే భక్తుల పాపాన్ని లయింపజేసి, తన దర్శనప్రసాదంతో పుణ్యాన్ని సంతరింపజేసి సకలవిధమైన ధర్మబద్దమైన ఈప్సితములను ఈడేర్చే భక్తులెల్లరి తల్లితండ్రిగా అలరారే ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుణ్ణి కీర్తిస్తూ,
'నిజమైన తల్లి, తండ్రి శ్రీతిరుమలేశుడే అని తెలుసుకున్న నాడే ఆ మనిషికి, ఆ మనిషి చదుకువుకున్న చదువుకు, ఆ మనిషి యొక్క జీవితానికి, ఒక అర్ధం పరమార్ధం సిద్ధించును...'
అనే ఈ క్రింది సందేశాత్మకమైన సంకీర్తనను అనుగ్రహించారు శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు ...

***** ***** ***** ***** ***** 
ఇతనికంటె ఘనులికలేరు
యితరదేవతల నిందరిలోన

భూపతి యితడే పొదిగి కొలువరో
శ్రీపతి యితడే చేకొనరో
యేపున బలువుడు నీతడే చేరరో
పైపై వేంకటపతి యైనాడు

మరుగురుడితడే మతినమ్మగదరో
పరమాత్ముడితడె భావించరో
కరివరదుడితడె గతియని తలచరో
పరగ శ్రీవేంకటాపతి యైనాడూ

తల్లియునితడె తండ్రియు నితడే
వెల్లవిరై యిక విడువకురో
చల్లగా నితని శరణని బ్రతుకరో
అల్ల శ్రీవేంకటహరి యయినాడు

https://annamacharya-lyrics.blogspot.com/2008/09/531-itanikamte-ghanulikaleru.html?m=1

***** ***** ***** ***** ***** 

తండ్రి అనే పదానికి / పాత్రకు తగిన విధంగా విజ్ఞ్యులచే గౌరవం లభించేలా జీవించే తండ్రులందరికీ కూడా "2024 ఫాదర్స్ డే శుభాభినందనలు..."💐

రీసెంట్ గా కూకట్పల్లి మెట్రో మాల్ దెగ్గర ఏర్పాటైన ఆక్వావల్డ్ / ఎక్సిబిషన్ కి వెళ్ళినప్పుడు దిగిన పిక్స్ లో,
మా పాప బాలప్రణవితో, నా భార్య హరితతో, నేను...😊
మరియు నా ఆల్ టైం ఫేవరెట్ పిక్చర్ ఆఫ్ మై గాడ్ఫాదర్ లార్డ్ శ్రీవేంకటేశ్వర ఇన్ హిస్ గురువార నేత్రదర్శనం..🙂


No comments:

Post a Comment