Tuesday, January 28, 2025

శ్రీ క్రోధి నామ 2025 సంవత్సర (జనవరి-10-2025) పుష్య శుద్ధ ఏకాదశి, శ్రీవైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి / పర్వసమయ శుభాభినందనలు...😊💐


మన సనాతన హైందవ ధర్మమునందు ఎన్నో విశేషమైన పండగలు, ఉత్సవాలు, కలవు...వేటి ప్రత్యేకత 
వాటిదే...వేటి వైభవం వాటిదే...వేటి మహిమ్నత వాటిదే...

అట్టి సర్వోత్కృష్టమైన ఉత్సవాల్లో శ్రీవైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి ఎంతో ప్రశస్తమైనది....

కార్తీక శుద్ధ ఏకాదశి / దేవోత్థాన ఏకాదశి నాడు తన యోగనిద్ర నుండి మేల్కొని సర్వాలంకారశోభితుడై పాలకడలిలోని శేషశయ్యపై జగత్తుకు ఆదిమూలమైన  శ్రీలక్ష్మీనారాయణ మూర్తిగా కొలువై దేవతలందరికీ కూడా ఉషోదయ సమయంలో శ్రీమహావిష్ణువు యొక్క సందర్శనం అనుగ్రహింపబడే మహోన్నతపర్వసమయమే, సౌరమానం ప్రకారంగా ధనుర్మాస శ్రీవ్రతం / మార్గళి తిరుప్పావై ఉత్సవ సమయంలో ఏతెంచే శ్రీవైకుంఠ ఏకాదశి, ఈ ముక్కోటి ఏకాదశి పండగ అనేది విజ్ఞ్యిలకు విదితమైన అంశమే......

ఈ కాన్సెప్ట్ ని కొంచెం సైంటిఫిక్ గా, కాస్మిక్ ఆస్ట్రాలజి తో జోడించి ముక్కోటిఏకాదశి యొక్క వైభవాన్ని స్మరించి పుణ్యాన్ని సముపార్జించుకుందాం...

అసలు ఈ దేవతల కాన్సెప్ట్ ఏంటనేది కొంచెం వివరంగా డిస్కస్ చేసి ఆ తరువాత దేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి పర్వసమయ వైభవం గురించి డిస్కస్ చేద్దాం...

ముప్పదిమూడు వర్గాలుగా కొలువైన దివిజ సమూహాలనే దేవతలుగా విజ్ఞ్యులు పరిగణింతురు....

12 ద్వాదశాదిత్యులు, 11 ఏకాదశరుద్రులు, 8 అష్టవసువులు, 2 అశ్విని దేవతలుగా, ఈ విశ్వంలో పరిభ్రమించే దేవతా సమూహం మహర్షులచే వర్గీకరింపబడింది....
(వికీపీడియాలో వారి పేర్లు లభించును)
వారివారి జన్మాంతర ఉపాధుల్లో సముపార్జించుకున్న విశేషపుణ్యబలంచేత సదరు ఉత్తమ జీవయాత్రలో నింగిలో సంచరించే తైజసిక దేహులకు ఈశ్వరశాసనానుగుణంగా లభించే పదవి దేవతా ఉపాధి. అది స్వీకరించడం, స్వీకరించకపోవడం అనేది ఆ ఉత్తమజీవుడికి సంబంధించిన స్వవిషయం....

ఫర్ ఎగ్సాంపుల్, రీసెంట్ గా ఒక మాన్యులకు వారి కీర్తికి, వారి ప్రహృష్టవచనాల ప్రభావ ప్రాభవానికి, సంతసించి సర్వశాసక వ్యవస్థకు అధినేతలైన మాన్యులు, వారికి క్యాబినెట్ స్థాయి గౌరవాన్ని అందించే సలహాదారు పదవితో గౌరవించడం న్యూస్ లో చదివే ఉంటారు కద...
ఆ పదవిని, అట్టి పదవితో లభించే పర్క్స్, ఇన్సెంటివ్స్, అండ్ ఇతరత్రా ఎగ్సిగ్యుటివ్ పవర్స్, ని స్వీకరించడం, స్వీకరించకపోవడం, అనేది ఆయా మాన్యుల స్వవిషయం...

అచ్చం ఇదే విధంగా, సదరు ఉన్నతగతుల్లో దివిలో సంచరించే ఉత్తమజీవులకు ఆపాదింపబడే దేవతా ఉపాధి కూడా...
మరియు అట్టి పదవితో లభించే లోకశ్రేయోదాయకమైన వివిధ డివైన్ కాస్మిక్ పవర్స్ ని స్వీకరించడం, స్వీకరించకపోవడం, అనేది ఆయా ఉన్నతజీవుల స్వవిషయం...

ఎందుకంటే ఒక్కసారి దేవతా ఉపాధిలోకి సదరు ఉన్నతస్థాయి జీవుడు ప్రవేశించాడంటే....
లోకశ్రేయస్సును కాంక్షిస్తూ, ప్రార్ధించిన వారికి వరాలను అనుగ్రహిస్తూ, వివిధ ద్యులోకాల్లో నిరంతరం సంచరించడం వల్ల వారి జన్మాంతరార్జిత పుణ్యసంచయం తగ్గిపోతూ ఉంటుంది...
అట్టి దేవతలకు వారి ప్రార్ధనలకు అనుగుణంగా విశేషపుణ్యసంచయాన్ని అనుగ్రహించే పర్వసమయమే ఈ ముక్కోటి ఏకాదశి పండగ సమయం....

అనగా, ఫర్ ఎగ్సాంపుల్, సదరు దేవతా ఉపాధిలో కొలువైన ఉన్నతజీవుడి పుణ్యసంచయసూచి ప్రకారంగా, ఆ తేజోమూర్తి పుష్కరకాలం పాటు, అనగా ఖగోళంలో బృహస్పతి తను ఉన్నచోటనుండి సంచరిస్తూ మళ్ళీ అదే చోటికి వచ్చేంతవరకు...
అట్లే దేవతా ఉపాధిలో కొలువైఉండేందుకు అర్హతను పొందిఉన్నాడు...అని మీరు భావించగలిగితే....,
ఆ తేజోమూర్తి తన దేవతా ఉపాధిని కేవలం, విశ్వమంతా పరిభ్రమిస్తూ, రమిస్తూ, రంజిల్లడానికే వినియోగిస్తున్నాడా....
లేక లోకశ్రేయస్కరమైన క్రతువులకు తన దైవిక శక్తిని వెచ్చిస్తున్నాడా అనే అంశాన్ని, చాతుర్మాస్య యోగనిద్రలో క్షుణ్ణంగా పరికించే పరమాత్మ, తదనుగుణంగా వారివారి పుణ్యసంచయాన్ని విశేషంగా వృద్ధిగావించే మహోన్నతమైన పర్వసమయమే ఈ ముక్కోటి ఏకాదశి...

శ్రీవైకుంఠంలో దేవతాసార్వభౌముడైన శ్రీలక్షీనారాయణ మూలమూర్తి యొక్క క్రీగంటి చూపులతో దేవతలే వారివారి పుణ్యబలాన్ని అంతగా వృద్ధిగావించుకొని తరిస్తుంటే....,
మరి ఈ భూలోకవాసులమైన మనం, మన పరిసరప్రాంతాల్లోని ఆలయాల్లో ఆచార్యుల వేదామ్నాయశక్తికి అనుగుణంగా ఆయా దేవిదేవతా మూర్తుల్లోకి ఆవాహింపబడే ద్యులోకవాసులైన దివిజుల శక్తి, ఆయా దేవతామూర్తుల నేత్రమండల శక్తిగా ప్రసరింపబడే విశేషారాధనా సమయాల్లో సందర్శించి తరించడం మన జీవయాత్రాభ్యున్నతికై మనం గావించే తపస్సే అవుతుందికదా...

సృష్ట్యారంభ సమయంలో బ్రహ్మాగారు నిర్దేశించిన మార్గంలో,
ఎంతో గహనమైన ప్రవాహఝరులతో ఉత్తుంగతరంగాలతో గంభీరంగా సాగరసంగమం దిశగా సాగే గోదావరి జలాలను, ఏ విధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంప్ హౌస్ లోకి మోటర్ల ద్వారా సంగ్రహించి, శుద్ధిచేసి, రాష్ట్రమంతటా విస్తరించి ఉండే ఒక విశాలమైన అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై వ్యవస్థ ద్వారా, రెండురోజులకు ఒకసారి గంటసేపు మన ఇంటివరకు అందించగా, మన ఇంట్లో ఆ త్రాగునీటిని స్టోర్ చేసుకొని ఉపయోగించి తరిస్తున్నామో...

అచ్చం అదేవిధంగా,

ఎక్కడో కనిపించనంత దూరాకాశంలోని ద్యులోకాల్లో సంచరించే దేవతా శక్తిని, వేదామ్నాయశక్తితో సదరు షోడశకళాత్మక ఆలయ ప్రతిష్థితదేవతామూర్తిలోకి ఆవహింపజేసి, భక్తులకు దేవతానుగ్రహంగా ఆచార్యులు అందించగా....
భక్తుల రూపంలో ఆలయానికి వెళ్ళే మనం ఆ దేవతానుగ్రహంతో తరించి పుణ్యసంచయంతో వర్ధిల్లడం కూడా అట్లే....

అక్కడెక్కడో కనిపించనంత దూరంలో
అమెరికాలో ఒరిజినేట్ అయిన ఒక మొబైల్ కాల్, కాంతి వేగంతో సముద్రంలో కొలువైఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా దేశవిదేశాలు దాటి, ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ సిగ్నల్ రూపంలో ఎన్నో మోబైల్ టవర్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్ లో ఉన్న రిసీవర్ కి అందగా, కాల్ ఆన్ చేసి....

"హాయ్, హలో, ఎట్లున్నవ్...ఏం సంగతి...
అప్పుడు చపాతి లా స్లిం గా ఉండే వాడివి...
ఇప్పుడు దిబ్బరొట్టె లాగ ఐనవ్...
ఇంకా ఏంటి విశేషాలు...."

అని ముచ్చట్లు పెట్టుకునే మనుష్యులకు...

మరి ఇదే విధమైన, ఒకానొక హైలి అడ్వాన్స్డ్ సౌండ్ బేస్డ్ కాస్మిక్ ట్రాన్సీవర్ వ్యవస్థ ద్వారా, మన ఆలయాలే మనకు దేవతలతో అనుసంధానమై అనుగ్రహాన్ని అందుకొని తరించేందుకు విశేషసాధనాలు అని అంటే, విశ్వసించడానికి ఎందుకో అంత తర్కం...

ఈ ముక్కోటి ఏకాదశి పర్వసమయం భక్తులకు విశేషమైన పుణ్యసముపార్జనను అనుగ్రహించే ఉత్సవమై వర్ధిల్లాలని అకాంక్షిస్తూ....,
విజ్ఞ్యులందరికీ 2025 శ్రీవైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి పండగా శుభాభినందనలు...😊💐

సర్వం శ్రీవేంకటకృష్ణార్పణమస్తు...🙏😊💐


No comments:

Post a Comment