Tuesday, January 28, 2025

భగవంతుడి ప్రసాదం భక్తులందరికోసం కద...

ఎవరో కొందరు పందికొక్కులు మాత్రమే తింటూ దున్నపోతుల్లా బలవడానికి కాదుకద..

ఎవరో ఒక్కరి పర్యవేక్షణలోనే ఆలయం మరియు భగవంతుడి బాధ్యతలు ఎందుకుంటాయ్...?
విజ్ఞ్యులైన, నమ్మకస్తులైన, ఓ నలుగురు సభ్యులు / నాలుగు కుటుంబాలు సమానంగా పర్యవేక్షకులుగా ఎందుకు ఉండకూడదు..?

తిరుమల అంతటి మహోన్నతమైన ఆలయంలో కూడా,
పరమాత్మ వైభవానికి ఏలోటుకలగకుండా, సమాంతర పర్యవేక్షక వ్యవస్థలుగా,
ఆలయానికి తూర్పున పెద్దజియ్యంగార్ల వ్యవస్థ ఉన్నది,
ఆలయానికి ఉత్తరాన వంశపారంపర్య అర్చకవ్యవస్థ ఉన్నది,
ఆలయానికి దక్షిణాన మహంతుల అర్చకవ్యవస్థ ఉన్నది,
ఆలయానికి పశ్చిమాన అనంతాళ్వారుళ అర్చకవ్యవస్థ ఉన్నది,
కద....

మరి తిరుమలేశుడి భక్తుల అంశంలో కూడా అవ్విధమైన "Multiple observers to avoid SPOF" వ్యవస్థ ఉండాలి అని అంటే కాదనేది ఎవరు, ఎందుకు..? 

ఇత్యాదిగా ప్రశ్నలు లోకం అడగదా...?

మేము కూడా పర్యవేక్షకులుగా ఉంటాము అని కొందరు విజ్ఞ్యులు అనడంలో అర్ధం ఉంటుందేమో కాని...
మేము మాత్రమే పర్యవేక్షకులుగా ఉంటాము అని కొందరు మూర్ఖులు అనడంలో అర్ధంలేదు సరికద అది అనుమానాస్పదమైన గుత్తాధిపత్యానికి సూచికగా భావింపబడును అనేది జగత్తుకు విదితమైన అంశమే...

కాబట్టి, ప్రపంచాన్ని బాగా చదివిన వారితో మాట్లాడడానికి చక్కని లౌక్యం మరియు విజ్ఞ్యత ఉండాలి అనేది నిర్వివాదాంశం.

No comments:

Post a Comment