క్యారెట్, మామిడిపండ్లు, ఇత్యాదివి స్వీకరిస్తే వైటమిన్ A సంవృద్ధిగా లభించి చక్కని కంటిచూపు లభించును..
పాలు, పెరుగు, వెన్న, నువ్వులు ఇత్యాదివి స్వీకరిస్తే శరీరానికి కాల్షియం, ఇత్యాదివి లభించును...
బీట్ రూట్, దానిమ్మ, ఎండుద్రాక్షలు, ఇత్యాదివి స్వీకరిస్తే రక్తంలో హెమోగ్లోబిన్ లెవెల్స్ రెగ్యులేట్ గావింపబడి వృద్ధిచెందును ...
బాదాం, అక్రోట్, నెయ్యి, ఇత్యాదివి స్వీకరిస్తే మేధోశక్తి వృద్ధిచెందును...
అలసందలు, చిక్కుడు, బీన్స్, (ఆలూ, చామ, మొదలైన) దుంపలు, వేరుశనగ/పల్లీలు, ఇత్యాదివి స్వీకరిస్తే శరీర పుష్టి, సౌష్టవం, వృద్ధిచెందును...
మినపగుండ్లు, మునగ, ఉల్లి, వెల్లుల్లి, ఇత్యాదివి స్వీకరిస్తే శరీరానికి చక్కని పటుత్వం లభించును....
సూర్యముఖిపుష్పం (సన్ ఫ్లవర్) గింజల యొక్క నూనే, నువ్వుల నూనే, పాలకూర, ఇత్యాదివి స్వీకరిస్తే శరీరానికి చక్కని ఇనుము ఖనిజం / బలం లభించును...
ఇత్యాదిగా విజ్ఞ్యులు చదివే ఉంటారు కద.....
చాలా మంది సాధారణ ప్రజలకు, ఈ విజ్ఞ్యాన విషయాలు ఎవరెవరు కనుక్కున్నారో తెలియదు....
ప్రకృతి ప్రసాదించే ఆయా పదార్ధాలను పద్ధతిగా స్వీకరిస్తే ఆయా ఆరోగ్య లాభాలు ఎట్ల లభిస్తయో తెలియదు....
అయినా సరే విశ్వసించి, ఆరగించి, ఆరోగ్యాన్ని పొంది అభివృద్ధిని సాధించి తరిస్తున్నారు.....
ఇది సైన్స్ అని అంటున్నారు...
నుట్రిషనల్ సైన్స్ అని అంటున్నారు...
మెడికల్ సైన్స్ అని అంటున్నారు...
మరి ఇదే విధంగా..
Sun సూర్య ఉపాసనతో శరీర ఆరోగ్యం / ఆత్మశక్తి...
Moon చంద్రుడి ఉపాసనతో మానసిక ఆరోగ్యం / మనోశక్తి..
Mars అంగారకుడి ఉపాసనతో విశేషరోగక్షయం...
Mercury బుధుడి ఉపాసనతో మేధోవైభవం / బుద్ధిశక్తి...
Jupiter బృహస్పతి ఉపాసనతో కార్యసాఫల్య శక్తి / గురుబలం...
Venus శుక్రుడి ఉపాసనతో మనోల్లాసం / ఐహిక జీవితంలో సుఖసంతోషాలు...
Saturn శనైశ్చరుడి ఉపాసనతో విశేష దుఃఖ / పీడాక్షయం...
("శనైః శనైః చరః ఇతి శనైశ్చరః" అని శ్రీచాగంటి సద్గురువుల ఉవాచ. అనగా నిదానంగా భ్రమణం గావించడం అని వ్యుత్పత్తి.
ఈశ్వరుడి / శ్రీవేంకటాచలం పై బాగుగా నెలకొన్న ప్రత్యక్ష పరమాత్మ గోవిందుడి కనుసన్నల్లో భ్రమణం గావించే ఖగోళ గ్రహాలకు శాస్త్రంచే ఈశ్వరత్వం ఆపదింపబడలేదు. కాబట్టి 'శనీశ్వరుడు' కాదు 'శనైశ్చరుడు' అని విజ్ఞ్యులు గమనింపవలె..)
అని మన ఆర్షవిజ్ఞ్యాన మహర్షులు చెప్పినప్పుడు విశ్వసించి ఆచరించి తరించడం కూడా అటువంటి సైన్సే కద.....
అది
ఆస్ట్రాలజి సైన్స్ అని అన్నా...
స్పిరిట్యువల్ సైన్స్ అని అన్నా...
కాస్మిక్ సైన్స్ అని అన్నా...
మరే ఇతర పేర్లతో వ్యవహరింపబడే సైన్స్ అయినా...
సైన్స్ సైన్సే అవుతుంది కద...
పైన పేర్కొనబడిన కూరగాయలు, పండ్లు, మరియు ఇతర పదార్థాలు కొనుక్కొని స్వీకరించి తరించాలంటే లౌకిక ధనం ఖర్చు అవుతుందేమో కాని...
ఆకాశాన్ని చూస్తు సూర్య చంద్ర గ్రహ తారా మండలాలను నమస్కరించి, ప్రార్ధించి, తరించడానికి ఖర్చేముంటుంది...?
అనే అలోచన ఈ ఆధునిక మానవులకు లేకపోవడం ఎంత విచారకరమో కద..!
చాల అరుదుగా మాత్రమే సంభవించే ఖగోళవిశేషమైన ప్రత్యక్ష గ్రహ దర్శనాలతో విజ్ఞ్యులు విశేషంగా తరించగలరు...
అని తెలియజేస్తూ...
సర్వే సుజనాః సుఖినోభవంతు...💐😊
[ As of now, (23rd-Jan--2025, 6:40 PM) Mars, Venus and Saturn have formed the 3 points of an almost perfect imaginary isosceles triangle in the clock wise direction on the south eastern horizon and Jupiter is overseeing them by decorating the western horizon 😊 ]
https://timesofindia.indiatimes.com/city/chennai/dont-miss-out-six-planets-align-for-a-rare-night-party-in-sky/amp_articleshow/117406628.cms
No comments:
Post a Comment