Tuesday, January 28, 2025

మితృడికి, స్నేహితుడికి, హితుడికి, పరిచయస్తుడికి, పరాయివాడికి / అపరిచితుడికి భేదం ఏంటంటే....


1. మన అభ్యున్నుతి గురించి మనకంటే ఎక్కువగా అలోచించి మనకు సదా దిక్సూచిలా ఉండే వారు మితృలు.

2. మన అభ్యున్నుతి గురించి మనలా అలోచిస్తూ తోచిన సహాయాన్ని అందిస్తూ ఉండేవారు స్నేహితులు.

3. మన అభ్యున్నుతి గురించి వారికి తోచిన ఓ నాలుగు మంచి మాటలు చెప్పే వారు హితులు.

4.మన అభ్యున్నుతి గురించి తక్కువగా, వారి జోబులు నింపుకోవడం గురించే ఎక్కువగా, అలోచించే వారు పరిచయస్తులు.

5.కేవలం తమ జోబులు నింపుకోవడం గురించి మాత్రమే అలోచించే వారు పరాయివారు / అపరిచితులు...

.
.

1. చాలా తక్కువగా మాత్రమే ఉండే మితృలు ఏనాడు కూడా మనకు బాధ కలిగించరు, మన బాధకు పరోక్షంగా కూడా కారణం కారు.

2. తక్కువగా ఉండే స్నేహితులు ఏనాడు కూడా మన బాధకు కారణం కావాలని అనుకోరు.

3. ఓ మోస్తరుగా ఉండే హితులు మనం బాధపడితే మంచి మాటలతో ఊరడిస్తారు.

4.ఎక్కువగా ఉండే పరిచయస్తులు ఏవైనా చెప్తారు...ఎన్నైనా చెప్తారు...వాళ్ళ మాటలు ఎంతవరకు వినాలి అనేది మన బుద్ధికి తెలిసి ఉండాలి.

5. ఇక పరాయివారి గురించి / అపరిచితుల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

ఇక ఎవరు ఏ క్యాటగిరిలోకి వస్తారనేది... 
వారివారి మాటలతో, చేతలతో వారు, మన బుద్ధితో మనము నిర్ణయింపబడే / నిర్ణయించవలసిన అంశం.

ఎక్కడో ఎంతో దూరంలో ఉండే ఒక వ్యక్తి, ఒక బంధువు, ఒక పెద్దాయన, ఒక గురువు, ఇత్యాదిగా ఎవ్వరైనా కూడా మనకు మితృలు అవ్వొచ్చు....

నిత్యం మనతో ఉండే సో కాల్డ్ మనవారే మనకు పరాయివారవ్వొచ్చు....

కాబట్టి ఎవరు చెప్తున్నారు అనేది కాదు...
ఏం చెప్తున్నారు, ఎట్ల చెప్తున్నారు, ఎవరి అభ్యున్నతికై చెప్తున్నారు అనేదే ముఖ్యం...
తద్వారా ఎవరు ఏ కోవలోకి వస్తారు అనేది మనకు మనమే నిర్ణయించుకోవలసిన జీవితాభివృద్ధికారక అంశం.

ఫర్ ఎగ్సాంపుల్..

ఈశ్వరానుగ్రహంగా పంచభక్షపరమాన్నములు దండిగా ఉండగా....

ఎదైతే ఏముంది...అంతా అన్నమే కదా...అని 
మిగిలిపోయిన నిన్నటి చద్దనాన్ని వడ్డించే మూర్ఖులు మనవారైనా సరే పరాయివారే అవుతారు....

అప్యాయంగా పంచభక్షపరమాన్నములను వడ్డించే వారే మనవారౌతారు....అది ఎవ్వరైనా సరే...

ఇది క్లుప్తంగా లోకరీతిని తెలిపే ఒక చక్కనైన జీవిత నౌకకు గల చుక్కాని.


No comments:

Post a Comment