Tuesday, January 28, 2025

శ్రీ క్రోధి నామ 2025 సంవత్సర మార్గశిర శుద్ధ తదియ బృహస్పతివాసర తిరుమల శ్రీవారి నేత్రదర్శనం / పూలంగిసేవానంతర, నేటి భృగువాసర పూరాభిషేకసేవ ఉత్సవ శుభాభినందనలు...💐😊

శ్రీ క్రోధి నామ 2025 సంవత్సర మార్గశిర శుద్ధ తదియ బృహస్పతివాసర తిరుమల శ్రీవారి నేత్రదర్శనం / పూలంగిసేవానంతర, నేటి భృగువాసర పూరాభిషేకసేవ ఉత్సవ శుభాభినందనలు...💐😊

స్వతహాగా స్వామివారు నిరాయుధపాణిగా, వరదకటి హస్తాలతో తన క్రీడాద్రి అయిన శ్రీవేంకటాచలం పై కలియుగప్రత్యక్ష పరమాత్మగా వెలసిన అప్రాకృత శ్రీవైష్ణవసాలిగ్రామమూర్తి...

వరదహస్తంతో ప్రతిపాదింపబడే శ్రీశ్రీనివాస శరణాగతికి...
కటిహస్తంతో ప్రతిపాదింపబడే సంసారసాగరతరణానికి...
అదనంగా....తదనంతర కాలంలో శ్రీభగవద్రామానుజాచార్యుల శ్రీవైష్ణవస్థిరీకరణలో భాగంగా అలంకరింపజేసిన స్వర్ణశంఖచక్రాలు, వక్షస్థల స్వర్ణదేవేరులు, నాగాభరణాలు, సూర్యకఠారి, అనన్యసామాన్యమైన శ్రీవైష్ణవ జ్ఞ్యానద్యుతికి, దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు, ఊర్ధ్వగమన కుండలినీ / యోగ శక్తికి, కుశాగ్రబుద్ధివైభవానికి, ప్రతీకలు...

అనగ, శ్రీశ్రీనివాసుడి శ్రీపాదపద్మములను ఆరాధించే వారికి ఇట్టి దివ్యానుగ్రహములు లభించి, జీవితంలో పరిపూర్ణంగా తరించెదరని ఆర్యోక్తి...

తిరుమలలో కేవలం శుక్రవారం నాడు మాత్రమే అనుగ్రహింపబడే శ్రీవారి నిజపాదదర్శనం సేవలో తరించేవారికి తెలిసినట్టుగా, 
స్వామివారి శ్రీపాదయుగళాన్ని సేవించిన వారికి యావద్ భూమ్యాకాశాల్లో కొలువైన పుణ్యక్షేత్రతీర్థాలను సేవించిన అనుగ్రహం సంప్రాప్తించును...

శ్రీవైకుంఠగత విరజా నదీ స్వామివారి శ్రీపాదపద్మములు కొలువైన చోట, క్రింద భూభాగంలో ప్రవహించడం అనే విశేషానికి తత్త్వార్ధం ఏమనగా...
ఈ భూలోక తిరుమల ఆనందనిలయస్థిత తిరుమేని నుండి శ్రీవైకుంఠలోకస్థిత మూలమూర్తివరకు, ఈ విశ్వంలో కొలువైన సకల శ్రీవైష్ణవశక్త్యానుగ్రహాన్ని ఆనందనిలయంలో కొలువైన శ్రీశ్రీనివాస శ్రీపాదపద్మాలవద్దకు యోగమార్గంలో రప్పించి భక్తులకు ప్రసాదించడం...
అందుకే స్వామివారి నిజపాదదర్శనసేవ యొక్క మహిమ్నత, ప్రాభవం, ప్రభవాం ఎనలేనిది...
ఒక్కసారి నిజపాదదర్శనంలో స్వామివారి శ్రీపాదములపై కొలువైన స్వతహ్సిద్ధ మంజీరములను దర్శించిన వారికి
నిత్యం శ్రీశ్రీనివాసుడి పాదాలయందు కొలువైఉండే అనఘాలక్ష్మి యొక్క అనుగ్రహం సిద్ధింపబడి ఎనలేని పుణ్యం సంప్రాప్తింపబడును...

అందుకే శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు, ఆ షోడశకళాప్రపూర్ణపరమాత్మశ్రీపాదపద్మములను, ప్రశస్తమైన దశావతరావైభవ వర్ణన సంకీర్తనలో "బ్రహ్మకడిగిన పాదము..." అని కీర్తిస్తూ...

" పరమ యోగులకు పరి పరి విధముల - పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన - పరమ పదము నీ పాదము"

అని ఆ పరమపదనాథుడి అనుగ్రహాన్ని ఈ తిరుమల శ్రీశ్రీనివాసుడి శ్రీపాదయుగళానుగ్రహంగా సెలవిచ్చారు...😊💐

https://annamacharya-lyrics.blogspot.com/2006/10/22brahma-kadigina-padamu.html?m=1
 
సర్వం శ్రీవేంకటకృష్ణార్పణమస్తు....🙏😊💐⭐✨

No comments:

Post a Comment