"సద్యోజాతాది పంచవక్త్రజ
స-రి-గ-మ-ప-ధ-ని వరసప్తస్వర
విద్యాలోలం విదళితకాలం
విమలహృదయ త్యాగరాజపాలం....
నాదతనుమనిశం శంకరం...
నమామిమే మనసాశిరసా....."
"యాగ యోగ త్యాగ భోగ ఫలమొసంగే...
రాగసుధారసపానముజేసి రంజిల్లవే ఓ మనసా..."
అని సంప్రదాయ శాస్త్రీయ కర్ణాటక సంగీత శక్తిని దిగ్దిగంతముల పర్యంతం వ్యాప్తిగావించిన సద్గురు శ్రీత్యాగరాయ ఆరాధనోత్సవాలకు వేదికగా హైదరాబాద్లో ఈసారి రెండు సంస్థలు విజ్ఞ్యులైన శ్రోతలకు శాస్త్రీయసంగీతసుధారసపానాన్ని సవినయంగా సమర్పించేందుకు సంసిద్ధమైఉండగా....,
ఆలకించి అమరుల అనుగ్రహాన్ని అందుకొని తరించడమే భాగ్యనగరవాసుల భాగ్యపరిపాకమైన విశేషం...💐😊
ఔషధం అనేది భౌతిక / లౌకిక సంపద...
అది అనుగ్రహంగా రూపాంతరంచెందడం అనేది సేవించే వారి భక్తి, విశ్వాసంపై ఆధారపడి ఉండే అంశం...
"ఆ..ఎన్ని మందులు మిగితే మాత్రం ఏముందిలే...." అని ఔషధాన్ని మింగే వారికి అది పెద్దగా ప్రయోజనం కలిగించకపోవచ్చు....
"విష్ణు విష్ణు విష్ణు అని ముమ్మారు భగవద్ నామస్మరణతో సేవింపబడే ఈ ఔషధం సదరు రుగ్మతను కట్టడి గావించి ప్రశాంతతను, అరోగ్యాన్ని ప్రసాదించు గాక..."
అనే విశ్వాసంతో ఔషధాన్ని సేవించే వారికి అది అమృతమై వర్ధిల్లును.....
సంగీతం కూడా అచ్చం అట్లే...
భక్తి, విశ్వాసంతో ఆలకించే శాస్త్రీయ సంగీతం యొక్క
మహత్తు కూడా అట్టి ఘనమైన అనుగ్రహాన్ని ప్రసాదించును అని ఎందరో విజ్ఞుల స్వానుభవ నమ్మకం, సత్యం....
శ్రీసరస్వతీదేవి అనుగ్రహంగా లోకానికి లభించే ఘనమైన అగ్రశ్రేణి విద్వణ్మూర్తుల రాగాలాపనకు లొంగని రోగాలు లేవనికదా ఆర్యోక్తి...
శ్రీత్యాగరాయుల వారికి నారదమహర్షి వారి అనుగ్రహంగా లభించిన 'స్వరార్ణవం' అనే సంగీతవిద్య యొక్క మహత్తు అట్టిది మరి..!
ఈ ఆరాధనోత్సవాంతర్భాగమైన అత్యంత అమృతమయమైన ఘట్టం, పంచరత్నగోష్ఠిగానం, జనవరి 29న ఆనంద్ నగర లో 'విజ్ఞ్యాన సమితి' వారి ఆధ్వర్యంలో, మరియు ఫిబ్రవరి 2న శిల్పకళావేదిక లో 'సంస్కృతి ఫౌండేషన్' వారి ఆధ్వర్యంలో అని విజ్ఞ్యులు గమనించగలరు...
Hyderabad is all set to reverberate the grandeur of sathguru Shree Tyaagaraaya Sangeeta Sudhaa Naada Sakti in the following Shree Tyaagaraaya Aaraadhanotsawam festivals being jointly organized by a few philanthropic music academies and organizations.
A must to be savoured feast for all the traditional carNatik music admirers, the pinnacle of these
celebrations witnessed during the Pancharatna Goshti gaanam is set to be unveiled on the 18th of January in the Vignan Samiti's event @ AnandNagar and 2nd of February in the Sanskriti foundation's
HTAMF event @ Shilpakalaavedika...💐😊
https://www.facebook.com/share/p/158SHvht42/
No comments:
Post a Comment