Friday, August 1, 2025

శ్రీ విశ్వావసు 2025 ఆషాఢపౌర్ణమి / గురుపౌర్ణమి / వ్యాసపౌర్ణమి పర్వసమయ శుభాభినందనలు...💐🙏🙂

శ్రీ విశ్వావసు 2025 ఆషాఢపౌర్ణమి / గురుపౌర్ణమి / వ్యాసపౌర్ణమి పర్వసమయ శుభాభినందనలు...💐🙏🙂

ఎవ్విధముగ ఒక భ్రమరం తన జీవితపర్యంతం కూడా ఎన్నెన్నో పుష్పాలమీద వాలి భ్రమరకీటకన్యాయంతో ఎన్నెన్నో కీటకాలను భ్రమరాలుగా రూపాంతరంగావించి లోకానికి నిత్యపుష్పఫలసిద్ధిని అనుగ్రహించునో...
అవ్విధముగా...
నిత్యం ఈ లోకంలో జ్ఞ్యాననాదశక్తిని సృజిస్తూ తాము తరించి శిష్యులను తరింపజేసే భ్రమరంవంటి ఎందరో గురుమూర్తులకు ఆదిగురువు మన శ్రీవేంకటేశ్వరస్వామి వారు...

గురువు గారు అనే పరమోత్కృష్టమైన పదంలో...

గ కారం నాదశక్తికి
ర కారం అగ్నిశక్తికి
వ కారం అమృతశక్తికి

ప్రతీక...

అనగా

నాదశక్తితో ఎట్టి జ్ఞ్యానాన్నైనా సృజించి...
అగ్నిశక్తితో ఎక్కడికైనా ఆ సృజింపబడే జ్ఞ్యానాన్ని వ్యాప్తిగావించి....
ఇహపరాల్లోనూ ఆ జ్ఞ్యానసిద్ధిని అమృతసిద్ధిగా స్థిరీకరించే మహనీయులే గురువులు...
 

శ్రీచాగంటి సద్గురువుల ఎన్నెన్నో మహాద్భుతమైన ప్రవచనాల్లో ఒకటైన "కపిలగీత" శ్రద్ధాభక్తితో ఆలకించిన వారికి ఎంతటి జ్ఞ్యానసిద్ధి లభించునో....
శ్రీదత్తాత్రేయుడి లీలలను వినేవారికి ఎంతటి జ్ఞ్యానానుగ్రహం
లభించునో....
శ్రీవేంకటేశ్వరస్వామివారిని సేవించే వారికి ఎంతటి సర్వేప్సితఫలప్రదసిద్ధి సంప్రాప్తించునో....
విజ్ఞ్యులకు విదితమైన ప్రజ్ఞ్యానాంశమే...

కపిలుడై, దత్తాత్రేయుడై, శ్రీవేంకటరాయడై, స్వామివారు ఎనలేని కారుణ్యగురుమూర్తులై పరిఢవిల్లే వైనాన్ని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఎంతో హృద్యంగా వర్ణించారు ఈ క్రింది సంకీర్తనలో...

శ్రీగురుస్వరూపంగా, ప్రత్యక్షత్రిమూర్తులుగా, 
ఆదిపరాశక్తి అయిన గురుమండలరూపిణి గా, 
అమేయకారుణ్యమూర్తులై ఈ లోకంలో నడయాడే...
శ్రీవేదవ్యాసమహర్షి, శ్రీఆదిశంకరాచార్యుల, అనుగ్రహంతో అలరారే గురుపరంపరకు, జగద్గురువులకు, ఆచార్యులకు,
గురువులందరికీ కూడా శ్రీగురుపౌర్ణమి ఉత్సవ పురస్కృత సవినయ సాష్టాంగ సాక్షరయుక్తనమస్సుమాంజలి...💐🙂🙏

వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్రం అకల్మషం ।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం ॥                                       వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసరూపాయ విష్ణవే  ।
నమో వై బ్రహ్మనిథయే, వాసిష్ఠాయ నమో నమః ॥

ప|| తానె తానే యిందరి గురుడు | 
సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||

చ|| అపరిమితములైన యజ్ఞాల వడిజేయ | 
బ్రపన్నులకు బుద్ధి వచరించి|
తపముగా ఫలత్యాగము సేయించు | 
కపురుల గరిమల కర్మయోగి ||

చ|| అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ | 
మన్నించు బుద్ధులను మరుగజెప్పి ||
ఉన్నతపదమున కొనరగ గరుణించు | 
పన్నగశయనుడే బ్రహ్మయోగి ||

చ|| తనరగ గపిలుడై దత్తాత్రేయుడై | 
ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై |
ఒనరగ సంసార యోగము గృపసేయు | 
అనిమిషగతుల నభ్యాసయోగి ||

pa|| tAne tAnE yiMdari guruDu | 
sAnabaTTina BOgi j~jAna yOgi ||

ca|| aparimitamulaina yaj~jAla vaDijEya | brapannulaku buddhi vacariMci|
tapamugA PalatyAgamu sEyiMcu | 
kapurula garimala karmayOgi ||

ca|| annicEtalanu brahmArpaNavidhi jEya | manniMcu buddhulanu marugajeppi ||
unnatapadamuna konaraga garuNiMcu | pannagaSayanuDE brahmayOgi ||

ca|| tanaraga gapiluDai dattAtrEyuDai | 
Ganamaina mahima SrI vEMkaTarAyaDai |
onaraga saMsAra yOgamu gRupasEyu | animiShagatula naByAsayOgi ||

https://annamacharya-lyrics.blogspot.com/2007/09/306tane-tane-yimdari-gurudu.html?m=1

No comments:

Post a Comment