Sunday, August 24, 2025

శ్రీ విశ్వావసు 2025 శ్రావణపౌర్ణమి / రాఖీపౌర్ణమి / జంధ్యాలపౌర్ణమి / హయగ్రీవజయంతి / పర్వసమయ శుభాభినందనలు...💐


ఒకప్పుడు, అనగా రమారమి ఒక 50 సంవత్సరాలక్రితం, ఈ భాగ్యనగరం / హైదరాబాద్ ఎంతో విశేషమైన పచ్చదనం / వివిధపక్షులకలకూజితస్వరవైభవం / ప్రశాంతత / తో విలసిల్లిన ఒక విశాలకుగ్రామం.....
ఇవ్వాళ ఈ భాగ్యనగరం / హైద్రాబాద్ అనే మహానగరం ఎంతో ఇరుకైన గృహసముదాయాలతో, కనుమరుగౌతున్న పచ్చదనంతో, వినిపించని పక్షులకలకూజితస్వరవైభవంతో,
రోజురోజుకూ పెరిగిపోతున్న పట్టనావాసజానాభాతో ఆహ్లాదలేమితో సతమౌతున్న సగటు ఆధునికవిశ్వనగరం...
అనే సత్యం చాలామందికి విదితమే ...
అచ్చం అదే విధంగా....,
ఒకప్పుడు, అనగా రమారమి ఒక 500 సంవత్సరాలక్రితం, భారతదేశం యొక్క దక్షిణప్రాంతం మొత్తం ఎంతో వైభవోపేతమైన చంద్రవంశసంజాత చక్రవర్తులు పరిపాలించిన విశాల విజయనగరసామ్రాజ్యంగా చరిత్రలో 
ఎనలేని ప్రాముఖ్యతను సంతరించుకున్న ప్రదేశం....
అనే సత్యం చాలమంది చరిత్రకారులకు విదితమే.....

పూర్వం ఎందరో మహారాజులు / చక్రవర్తులు, సామ్రాజ్యాలు ఉండగా, విజయనగరసామ్రజ్యవైభవాన్నే ఎందుకు ప్రస్తుతిస్తున్నానంటే, వారిఏలుబడిలో 
భారతదేశదక్షిణప్రాంతమంతా కూడా విశేషమైన సనాతనధర్మవైభవంతో పరిఢవిల్లిన అంశం....

శృంగేరిజగద్గురుపరంపరాగౌరవందనబిరుదావళిలో భాగంగా...,
ఆనాటి ఋష్యశృంగమహర్షి వారి తపోభూమిగా వినుతికెక్కిన ఇవ్వాళ్టి శృంగగిరి / శృంగేరి జగద్గురుపీఠాలంకృతులైన
శ్రీవిద్యారణ్య స్వామివార్ల అపారమైన అనుగ్రహంతో వర్ధిల్లిన విజయనగరమహాసామ్రాజ్యవైభవానికి స్మృతిగా,
"కర్ణాటకసిమ్హాసనప్రతిష్టాపనాచార్య జయీభవ... విజయీభవ...."
అని వందిమాగధులచే ఇప్పటికీ స్తుతింపబడే 
విజయనగరసామ్రాజ్యవైభవం శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించిన విజ్ఞ్యులకు విదితమే....

శ్రీఆదిశంకరాచార్యస్థాపిత జగద్గురుపీఠాన్ని అధిరోహించి ఉన్న తపోధనులైన శ్రీవిద్యారణ్యులచే, ప్రత్యేకంగా పర్యవేక్షింపబడుతూ, నిర్మింపబడిన మహాసామ్రాజ్యంగా వినుతికెక్కిన వైభవం విజయనగరమహాసామ్రాజ్యానిది..

అనివార్యమైన కారణాలరీత్యా  ఇవ్వాళ్టి రోజుల్లో ఎంతగానో లుప్తమైపోయిన భారతీయ సనాతనధర్మప్రోక్త
వర్ణాశ్రమవ్యవస్థ మరియు ఎంతగానో సంకరమైపోయిన ఆధునికసమాజం యొక్క సమ్మిళితసమాహారస్వరూపం మరియు సమూల అంగ్లభాషాధారిత  విద్యావిధానప్రాబల్యం కారణంగా, అసలు ఏ పండగ ఎందుకు జరుపుకుంటున్నామో కూడా తెలియనంతగా మనసనాతనపర్వదినాలు / ఉత్సవాలు కొందరికి వింతగొలిపే విచిత్రాలుగా అనిపించవచ్చు......

అయినాసరే పాతబంగారానికే ఎల్లప్పుడు విలువ ఎక్కువ అన్నట్టుగా...
వన్నెతరగని మన ఆర్షసంప్రదాయవైభవం, అర్ధంచేసుకోగల విజ్ఞ్యతభరిత మాన్యులకు ఎల్లప్పుడూ నిత్యనూతన సనాతనమధుకావ్యమే అవ్వును....

శ్రావణపౌర్ణమి రాఖీపౌర్ణమిగా రూపాంతరం అవ్వకముందు, విశేషమైన ఉపాకర్మదినోత్సవం / యజ్ఞ్యోపవీతం గలవారికి నూతన యజ్ఞ్యోపవీతధారణ ఉత్సవంగా ఖ్యాతిగడించిన పర్వసమయం....
మనిషిలోని అన్నిరకాల శక్తికిమూలం బ్రహ్మాండపిండాండసమన్వయసిద్ధాంతం....
అందుకు మనిషిశరీరం యొక్క నవరంధ్రసమూహం తమతమ విహితకర్తవ్యాలను నిర్వహిస్తూ మనిషియొక్క శరీరం దేహంగా రూపాంతరం కాకముందే, ప్రపంచానికి పనికొచ్చే మంచిపనులకు, ఉపయుక్తమైన పరిష్కారాలకు / మేధోమథనజనితసృజనాత్మక ఆవిష్కరణలకు, దైవికతత్త్వజ్ఞ్యానసముపార్జనకు / వితరణకు ఉపయోగింపబడుతూ, తద్వారా మనిషిజీవితం చిరస్మరణీయమైన విధంగా ఆచంద్రతారార్కమైనకీర్తిని గడించి తరించేందుకు ఉపకరించే విద్వత్తు యొక్క పరిరక్షణకు కేటాయింపబడిన పర్వసమయంగా ఈ శ్రావణపౌర్ణమి చిరంతనంగా ఖ్యాతిగడించిన ఉత్సవసమయం...

పూర్ణచంద్రుణ్ణి అలంకరించి ఉండే శ్రీచక్రనవావరణమండలశక్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా భూలోకవాసులకు అనుగ్రహింపబడే శ్రావణపౌర్ణమి యొక్క విశేషం ఏమనగా, శ్రవణానక్షత్రంతో కూడి ఉండే చంద్రుడు తన చంద్రశక్తిని / ఓషధీశక్తిని / అమృతశక్తిని / మనోశక్తిని / గాయత్రిశక్తిని భూలోకగత వివిధవిజ్ఞ్యులకు వివిధరూపాల్లో సంపూర్ణంగా అందించే సమయం....
విజయనగరమహాసామ్రాజ్య చక్రవర్తుల పరంపరలో ఒకరైన,
శ్రీకృష్ణదేవరాయలకాలమ్నుండి బాగా ప్రాచుర్యం పొందిన 
తిరుమలేశుడి ఊంజల్ సేవ / డోలోత్సవంలో పాల్గొన్న విజ్ఞ్యులకు / విద్వాంసులకు / ఆర్షవిజ్ఞ్యానప్రాజ్ఞ్యులకు / శ్రీవిద్యోపాసకులకు / ఈ శ్రావణపౌర్ణమి యొక్క చంద్రశక్తి వైభవం ఎరుకలో ఉన్మ అంశమే...

ఇప్పటి మన ఆధునిక కాలంలో, ఈ శ్రావణపౌర్ణమి ఉత్సవాన్ని రాఖీపండగ / రక్షాబంధన ఉత్సవం గా పిలుస్తున్నాం కాబట్టి, ఎల్లరికీ రాఖీపండగ శుభాభినందనలు...💐

No comments:

Post a Comment