ఉజ్జైనీపురమహాకాళేశ్వరుడి శక్తిగా కొలువైన ఉజ్జైనీ మహంకాళి శక్తిపీఠం యొక్క అనుగ్రహం భాగ్యనగరానికి కారణాలరీత్యా తరలవచ్చి సికింద్రాబాద్ ఉజ్జైనీ మహంకాళి అమ్మవారిగా కొలువై, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా
ఎందరో భాగ్యనగర మేయర్లను, ప్రజాప్రతినిధులను, మంత్రులను, ముఖ్యమంత్రులను, బడాబడా పారిశ్రామికవేత్తలను, ఇత్యాది ఎందరో మాన్యులను ఎంతో ఘనంగా అనుగ్రహిస్తూ, వారి ద్వారా ఈ నగరప్రజలు చల్లగా ఉండేలా అనుగ్రహించడం మన భాగ్యనగర భాగ్యవిశేషం....
ముంబా మాతా అనుగ్రహంతో ముంబయ్ మహానగరంలో రోజూ కొన్ని లక్షల మందికి అన్నం లభిస్తూ ఎట్లు ఆ నగరం విశ్వనగరంగా పరిఢవిల్లుతున్నదో.....
అట్లే...
సికింద్రాబాద్ ఉజ్జైనీ మహంకాళి అమ్మవారి అనుగ్రహంతో హైదరాబాద్-సికింద్రాబాద్ / భాగ్యనగరం-స్కందనగరం అనే జంటనగరాల్లో యావద్ దేశం నుండి ఇక్కడికి వచ్చి నివసిస్తున్న ఎందరో ప్రజలకు అన్నపానీయములకు కొరత లేకుండా ఆరోగ్యమయజీవితాన్ని అనుగ్రహిస్తూ పరిఢవిల్లున్న ఆదిశక్తిఆలయాలకు, మందిరాలకు బోనాలజాతర రూపంలో భక్తులు సమర్పించే విశేష ఆషాఢనైవేద్యోత్సవమైన బోనాలపండగ యొక్క ఖ్యాతి విశ్వవిఖ్యాతమైనది...
ఉత్తరాంధ్రలో విజయనగర పైడితల్లి సిరిమానోత్సవం,
రాయలసీమలో గంగమ్మ జాతర, తెలంగాణలో మహంకాళి బోనాలు, అనే పేర్లతో వార్షిక ఉత్సవాంతర్గతంగా భక్తుల నమస్కారాలను, నైవేద్యాలను, ప్రార్ధనలను, స్వీకరిస్తూ తెలుగుజాతిని ఘనంగా అనుగ్రహిస్తున్న ఆ
"గోప్త్రీ గోవిందరూపిణి" అయిన ఆదిపరాశక్తి యొక్క క్రీగంటి చూపులతో భక్తులెల్లరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో విల్లసిల్లెదరని ఆకాంక్షిస్తూ....
ఎల్లరికీ 2025 బోనాల పండుగ శుభాకాంక్షలు...🙂💐🙏
No comments:
Post a Comment