వరాలన్నిటికీ కూడా అధిదేవత శ్రీవరలక్ష్మీదేవి...
వరాలు అనగా ఏంటి..?
జీవితపర్యంతమూ సదరు వ్యక్తి గౌరవించే దేవతానుగ్రహములన్మియునూ వరములే....
ఫర్ ఎగ్సాంపుల్....
ఉత్తమమైన గురువులు లభించడం వరం...
ఉత్తమమైన ఆరోగ్యం ఉండడం వరం...
ఉత్తమమైన విద్యావినయం ఉండడం వరం...
ఉత్తమమైన తల్లితండ్రులుండడం వరం...
ఉత్తమమైన భార్యాబిడ్డలుండడం వరం...
ఉత్తమమైన బంధుమితృలుండడం వరం...
ఉత్తమమైన సంపదలుండడం వరం...
ఉత్తమమైన పరిపాలకులుండడం వరం...
ఉత్తమమైన పరిసరాలుండడం వరం...
ఇలా జీవితంలో అనుగ్రహింపబడే ప్రతీ ఉత్తమమైన విభూతి కూడా వరమే..
కాంతి ఉంటే చీకటి ఉండదు...
కాంతి లేనిచో చీకటి ఉండును...
అనేది సాధారణ సైన్స్ చెప్పే అంశం...
అనగా కాంతి యొక్క లేమియే చీకటి...
అచ్చం అదేవిధంగా..
లక్ష్మి ఉంటే అలక్ష్మి ఉండదు...
లక్ష్మి లేనిచో అలక్ష్మి ఉండును...
అనేది అధ్యాత్మ సైన్స్ చెప్పే అంశం...
అనగా లక్ష్మి యొక్క లేమియే అలక్ష్మి...
ఇక్కడ లక్ష్మి అంటే కేవలం డబ్బు అని కాదు అర్ధం...
లక్ష్మ్యతే ఇతి లక్ష్మి అనే వ్యుత్పత్తి ప్రకారంగా....
ప్రస్ఫుటంగా భాసించే విభూతియే లక్ష్మి...
అనగా
సకలశాస్త్రాలను మదిలో మధించగా లభించే సారాన్ని అనుగ్రహించే గురువాక్కులను అవధరించిన వ్యక్తియొక్క జీవితంలో ప్రస్ఫుటంగా సమకూరిన బృహస్పతి యొక్క అనుగ్రహమే శ్రీగురులక్ష్మి...
నిత్యం సూర్యోపాసనతో రోగరహితమైన జీవితాన్ని కలిగిఉండి ప్రస్ఫుటంగా సమకూరిన ధన్వంతరి యొక్క అనుగ్రహమే శ్రీఅరోగ్యలక్ష్మి...
నిత్యం సరస్వతీదేవి ఉపాసనతో విద్యావినయభరిత జీవితాన్ని కలిగిఉండి ప్రస్ఫుటంగా సమకూరిన విద్వత్తు యొక్క అనుగ్రహమే శ్రీవిద్యాలక్ష్మి...
ఇత్యాదిగా ఇతరత్రా అన్నీ ఉత్తమవిభూతులు కూడా శ్రీలక్ష్మీ అనుగ్రహములే...
ఇవ్విధమైన విశేషమైన సకలవిధ శ్రీలక్ష్మీ అనుగ్రహాన్ని
వర్షించే పరతత్త్వస్వరూపమే శ్రీవరమహాలక్షీదేవి....
చారుమతిదేవి అనే పతివ్రతాశిరోమణి యొక్క స్వప్నవృత్తాంతం ద్వారా ఈ లోకానికి అందిన అధ్యాత్మ విశేషం ప్రకారంగా....,
కలియుగ ప్రత్యక్షదేవతలైన శ్రీమదలర్మేల్మంగాపద్మావతీదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంతగానో ప్రీతిపాత్రమైన
శ్రావణ మాసంలో పౌర్ణమి తిథికి సమీపంగా ఉండే శుక్రవారం నాడు శ్రీవరలక్ష్మీవ్రతాన్ని ఆచరించి తరించడం అనే విశేషం చాలాకాలం నుండి లోకంలో సుప్రసిద్ధినొందిన శ్రావణవైభవవిశేషాంశం...
జ్యోతిషశాస్త్రప్రకారంగా...,
శ్రవణం, రోహిణి, హస్త అనే ఏకవర్గనక్షత్ర కూటమికి సంబంధించిన నక్షత్రాల్లో, భూలోకం నుండి వీక్షించగల రీతిలో చంద్రుడు సదరు నక్షత్రంతో కూడి ప్రకాశించడం కేవలం శ్రావణపౌర్ణమి కి మాత్రమే వర్తించే అంశం....
జ్యోతిషశాస్త్రప్రకారంగా....,
రోహిణికి గల విశేషమైన చంద్రప్రీతి కారణంగా,
క్షీరసాగరతనయ శ్రీలక్ష్మీదేవికి సహోదరుడిగా భావింపబడే చంద్రుడికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం....
అందుకే, ఈ శ్రావణమాస పౌర్ణమికి అంతటి ప్రత్యేకత మరియు వైభవం...
గోమయం, బిల్వదళం, గజవదనం, కమలం, సువాసినీపాపిటస్థానం,
అనే 5 చోట్లు తన ఆవాసస్థానాలుగా గల శ్రీలక్ష్మీదేవికి
ఓం చంచలాయై నమః, ఓం చపలాయై నమః, అనే పేర్లు / గౌణములు కలవు....
అట్టి శ్రీలక్ష్మిదేవి యొక్క స్థిరమైన శాశ్వతనివాసస్థానం ధర్మం అని శ్రీలక్ష్మీఅష్టోత్తరం ఈ క్రిందివిధంగా స్తుతిస్తున్నది...
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్ ।
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్ ॥ 5 ॥
ఇట్టి పర్వసమయంలో....,
దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా-
మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే ।
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీనయనాంబువాహః ॥ 9 ॥
గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి ।
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ॥ 10 ॥
అనే వాక్యాల తత్త్వార్ధాన్ని ఎంతో గొప్పగా వివరించిన శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాంతర్గత శ్రీలక్ష్మీతత్త్వసారాన్ని ఆకళింపుజేసుకొని, శ్రీఆదిశంకరాచార్య విరచిత కనకధారాస్తవాన్ని పఠించడం మరింత శుభావహం....
నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
ఏలేవు లోకములు మమ్మేలవమ్మ
అని
కలియుగప్రత్యక్షదైవమైన శ్రీతిరుమలేశుడి విశాలవక్షసీమపై శ్రీవ్యూహలక్ష్మిగా కొలువైన అమ్మవారిని ఎంతో నిండైన పదసుమాలతో ఈ క్రింది సంకీర్తనలో ఆరాధించిన శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారికి ఒకానొకసందర్భంలో శ్రీశుకనూర్ పురప్రజలందరికీ వినబడేలా పలికిన పరదేవత, శ్రీస్వతంత్రవీరలక్ష్మిగా శ్రీపాంచరాత్రాగమంచే కీర్తింపబడే శ్రీపద్మావతీదేవి అమ్మవారి మెండైన అనుగ్రహంతో...,
ఎల్లరూ వారివారి శక్తియుక్తికొలది వారివారి గృహాల్లో శ్రీవరలక్ష్మీవ్రతాన్ని వారి ఇంటి మహిళామణులతో ఆచరింపజేసి తరించేదరు గాక అని ఆకాంక్షిస్తూ....
శ్రావణవరమహాలక్ష్మీవ్రతపర్వసమయ శుభాభినందనలు...💐
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి( బెరసితి వమ్మ
పాలజలనిధిలోని పసనైన మీగడ
మేలిమి తామెరలోని మించు వాసన
నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
ఏలేవు లోకములు మమ్మేలవమ్మ
చందురుతోడబుట్టిన సంపదల మెరగువో
కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడు నీడై
వుందానవు మా యింటనే వుండవమ్మా
పదియారు వన్నెలతో బంగారు పతిమ
చెదరని వేదముల చిగురు బోడి
ఎదుట శ్రీవేంకటేశు నిల్లాలవై నీవు
నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ
https://annamacharya-lyrics.blogspot.com/2007/11/352jayalakshmi-varalakshmi.html?m=1
No comments:
Post a Comment