Friday, August 1, 2025

శ్రీ విశ్వావసు 2025 శ్రావణ శుద్ధ పంచమి, నాగపంచమి పర్వసమయ శుభాభినందనలు...💐


ఒక 14 ఫ్లోర్స్ గల హైరైజ్ అపార్ట్మెంట్ ని ఒక ఎగ్సాంపుల్ గా తీసుకొండి....
ఈ క్రింది చతుర్దశభువనాలే ఆ అపార్ట్మెంట్ యొక్క ఫ్లోర్స్ గా భావించండి...

14.సత్యలోక
13.తపోలోక
12.జనోలోక
11.మహర్లోక
10.సువర్లోక(స్వర్గలోక)
9.భువర్లోక
8.భూలోక
7.అతల
6.వితల
5.సుతల
4.తలాతల
3.రసాతల
2.మహాతల
1.పాతాళ

ఈ పెద్ద హైరైజ్ అపార్త్మెంట్ లోకి వారివారి కర్మసిద్ధాంతఫలితానుగుణంగా ఈశ్వరానుగ్రహంగా ప్రతీ ప్రాణి తన జీవితపర్యంతంలో ఏదో ఒక ఫ్లోర్ కి ఒకసారి రావడం, ఒకసారి పోవడం అనేది ఇక్కడి ఆవాససిద్ధాంతం...
అనగా ఒకసారి ఒక ఫ్లోర్ కి వస్తే అక్కడినుండి కొద్దిసమయం పాటు వేరే ఫ్లోర్ కి వెళ్తూవస్తూఉండడం మెట్లు, లిఫ్ట్లు ఎక్కి దిగి తిరగడం అనే అంశం వర్తించని అపార్ట్మెంట్ లాంటి వ్యవస్థ ఈ విశ్వంలోని 14 లోకాలు / తలాలు...

(శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసిన,
మైరావణవృత్తాంతం లో హనుమంతులవారి అధోలోకప్రయాణం, 
దేవకార్యసాధకులు, త్రిలోకసంచారులైన శ్రీనారదమహర్షుల నిత్య లోకాంతర ప్రయాణం, 
తన బామ్మర్ది అర్జునుడికి ఎనలేని శక్తిభరిత పరమేశ్వరదత్తమైన పాశుపతాస్త్రం అనుగ్రహింపజేయడానికి శ్రీకృష్ణుడు గావింపజేసిన లోకాంతర ప్రయాణం, 
శ్రీకృష్ణుడి అన్నగారైన బలరాముడి భార్య రేవతిదేవి యొక్క తండ్రి కాకుద్మ / రైవత మహరాజు గారి బ్రహ్మలోకప్రయాణం, 
తిరుమల ఆలయ ఆవరణలో సంపంగిప్రాకారం నుండి ఆనందనియలకులశేఖరపడి వరకు 
నిశీధిసంధ్య ఏకాంతసేవానంతరకాలం నుండి
ఉషోదయసంధ్య జయవిజయద్వారబంధనతొలగింపు సమయం వరకు ఉండే వివిధ మానవేతర శ్రీవేంకటేశ్వరమహాభక్తుల నిత్యలోకాంతర ప్రయాణం,
అరుణాచల ఆలయ ఆవరణలో కొలువైన బ్రహ్మతీర్థ ప్రదేశంలో మహాయోగుల లోకాంతర ప్రయాణం,
ఇత్యాదిగా
సామాన్య మానవులకు వర్తించని లోకాంతర ప్రయాణం గావించే తపఃశక్తి సంపన్నుల, మహర్షుల ఉదంతాలు ఈ లోకంలోనూ, ఇతిహాసాల్లోనూ ఉన్నాయ్...అది వేరు విషయం అనుకోండి)

ఏ అపార్ట్మెంట్కైనా గ్రౌండ్ ఫ్లోర్ బాగా దృఢంగా ఉండడం అనేది ముఖ్యమైన అంశం...
ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ యొక్క శక్తివల్లే మొత్తం 14 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కి కూడా శక్తి అందుతూ ఉంటుంది...

అందుకే సర్పాల లోకం పాతాళలోకమైనాసరే....
శ్రీమహావిష్ణువు యొక్క నాభికమలంలో / సత్యలోకంలో వర్ధిల్లే బ్రహ్మగారి వ్యవస్థకు ఆదిశేషుడి శక్తి శయనపీఠమై అలరారుచున్నది....
హాలాహలం అనే గరళాన్నే ఆభరణంగా మలిచి నీలకంఠుడైన పరమేశ్వరుడి కంఠసీమకు అలంకరణగా వాసుకి యొక్క శక్తి అలరారుచున్నది....
అగ్నిస్వరూపంగా ఆరాధింపబడే కార్తికేయశక్తి,
సకలప్రాణులకు కుండలినీశక్తి రూపంలో కొలువై జీవశక్తిని అందించే యోగికవ్యవస్థగా సుబ్రహ్మణ్యసర్పస్వరూపంగా అలరారుచున్నది....
ఊర్ధ్వగమన జంటనాగుల స్వరూపంగా ఆ సుబ్రహ్మణ్యసర్పస్వరూపాన్ని ఆరాధించడం మానవులకు అభివృద్ధికారక అంశంగా అధ్యాత్మశాస్త్ర ఉవాచ)

కరెంట్ అనే మహాశక్తిని మంచిగా ఆరాధించి అందుకుంటే ఎన్నో అనుగ్రహాలు లభించి తరించెందరు....
అగౌరవపరిచి ఆటలాడితే ఇబ్బందులు ఎదురౌతాయ్...
అచ్చం అదేవిధంగా సర్పశక్తిని మంచిగా ఆరాధించి అందుకుంటే ఎన్నో అనుగ్రహాలు లభించి తరించెదరు....
అగౌరవపరిచి ఆటలాడితే ఇబ్బందులు ఎదురౌతాయ్...

అందుకే భూలోకవాసులు కూడా సర్పారాధనను ఒక గొప్ప విశేషంగా భావించి, అత్యంతశక్తివంతమైన తిథి మరియు చాంద్రమానమాసం యొక్క కాంబినేషన్ అయిన శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమి పండుగ గా ఆరాధించి తరించడం అనే సత్సనంప్రదాయం అనాదిగా ఈలోకంలో ఖ్యాతి గడించిన విశేషం...

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసిన అనేకానేక ముఖ్యమైన అధ్యాత్మశ్లోకాల్లో ఒకటైన ఈ క్రింది నలదమయంతివృత్తాంతం / నలోపాఖ్యానం లోని శ్లోకంలో కర్కోటకుడు అనే నాగు యొక్క నామస్మరణ ఈ కలియుగవాసులకు ఎవ్విధంగా కలిప్రభావం నుండి కవచంలా ఉపకరించునో తెలిసినదే....

కర్కోటకస్యనాగస్యదమయంత్యాఃనలస్యచ
ఋతుపర్ణస్యరాజర్ష్యేహేకీర్తనంకలినాశనం

ఈ కలియుగమానవులకు కలిప్రభావంవల్ల దేవతలను దర్శించగల పుణ్యము, శౌచము, శ్రద్ధ, తపస్సు 
నిత్యంసమకూరిఉండడం అనేది దుర్లభమైన అంశం....

పైన పేర్కొనబడిన నలోపాఖ్యానం లోని శ్లోకాన్ని నిత్యం పఠించే / స్మరించే విజ్ఞ్యులకు, పిలిస్తే దేవతలు కూడా పలికేంతటి తపఃశక్తి నిత్యం సమకూరి ఉండడం అనేది అధ్యాత్మవిజ్ఞ్యులకు ఎరుకలోఉండే అంశమే ..

ఇరుభుజాలకు నాగాభరణాలను అలంకరించుకొని నాగాచలంపై బాగుగా నెలకొన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవ్యూహలక్ష్మీసహితశ్రీవేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో ఎల్లరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా వర్ధిల్లాలని అకాంక్షిస్తూ నాగపంచమి పర్వసమయ శుభాభినందనలు...💐

A brief explanation to understand the bigger picture of "chaturdasha bhuvanaalu" / the 14 worlds in simpler words is explained by some goodsamaritans in their blog below....
Do have a look....

https://www.dkscore.com/jyotishmedium/exploring-the-14-lokas-in-hinduism-a-journey-through-the-spiritual-realms-994?fbclid=IwQ0xDSwL1MyNjbGNrAvUzH2V4dG4DYWVtAjExAAEew-oM7tPQcv2BvsllY3eTJ1VMzx65bmaV-tF6oOAnAMtV5M_1LuLCQNPN14c_aem_aNN7fX7Oso0mTWvS95RAYg

No comments:

Post a Comment