శ్రీగోస్వామితులసీదాస్ గారు ఈ కలియుగంలో ప్రభవించిన అభినవవాల్మీకి / త్రేతాయుగ వాల్మీకి మహర్షి యొక్క అవతారంగా శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విజ్ఞ్యులు ఆలకించే ఉంటారు...
ఆనాడు దేవభాష సంస్కృతలో ఈ లోకులకు శ్రీమద్రామాయణ ఇతిహాస ఆదికావ్యాన్ని అందించేందుకు ఒక బోయ వాల్మీకి మహర్షిగా రూపాంతరం చెందడం భగవద్ అనుగ్రహవిశేషం...
ఈ కలియుగంలో దేవభూమి అవధ మహాసామ్రాజ్యంలో (దేవతావృక్షాలైన ఔదుంబర చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతానికి ఔద్ ప్రదేశ్ అనే పేరు ఉండగా...
కాలక్రమంలో అవధ్ ప్రావిన్స్ గా వినుతికెక్కిన ఉత్తరభారతంలోని దేవభూమి)
హిందీలిపితో సమ్మిళితమై ఉండే అవధ్ మాండలీకంలో ఈ లోకులకు శ్రీమద్రామాయణ ఇతిహాస ఆదికావ్యాన్ని పండితపామరస్మరణయోగ్య రీతిలో అందించేందుకు భగవదనుగ్రహంగా ప్రభవించిన సాధుసత్పురుషులే
శ్రీతులసీదాస్ గారు...
దేవభాష అయిన సంస్కృతం యొక్క వైభవాన్ని అర్ధంచేసుకోవడానికి అక్షరాస్యత ఎక్కువగా అవసరమై ఉన్న కారణంగా, గ్రామీణప్రాంత భక్తులకు, విజ్ఞ్యులకు, సంస్కృతసారస్వతం అనేది చాలావరకు అందనిద్రాక్షగా ఉన్న అంశం. అందుకే ఈ లోకంలో వారివారి నైసర్గికప్రాంతీయమాండలీకనుడికారంతో దేవభాషలో వర్ధిల్లే అమర సారస్వతాన్ని తర్జుమాగావించి అనుగ్రహించేందుకు
ఈశ్వరానుగ్రహంగా ఈ లోకంలో ఎప్పటికప్పుడు మహానుభావులు, మేధావులు, భక్తులు, యోగులు, అవధూతలు, ప్రభవిస్తూనే ఉంటారు.....
ఉత్తరాదిన సంత్ తులసీదాస్ గారు, మీరాబాయ్ గారు, సంత్ సూర్దాస్ గారు, సంత్ కబీర్దాస్ గారు....ఇత్యాదిగా
దక్షిణాదిన శ్రీతరిగొండవెంగమాంబ గారు, శ్రీబమ్మెరపోతనామాత్యులు, శ్రీత్యాగరాయులు, శ్రీగోపరాజు / కంచర్ల గోపన్న / భద్రాచల రామదాసు గారు,
శ్రీ పురంధరదాసులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, ఇత్యాదిగా ఎందరో మహానుభావులు...అందరికీ వందనములు...💐🙏
"జై సియారాం బావుజి...పైరోహాత్లగైఛ్ఛే...
సుఖ్ సుఖ్ జియో..."
అనే సమస్కారం ఉత్తరాదిన ఉండే విజ్ఞ్యులకు ఇంకా అలవడిఉండి ఈ దేశంలో పరస్పరగౌరాభిమానప్రయుక్త కుటుంబవ్యవస్థ పరిఢవిల్లడానికి కారణం శ్రీతులసీదాస్ లాంటి మహాభక్తులు అనుగ్రహించిన శ్రీరామచరితమానస్ వంటి మహాసారస్వత ప్రభావమే....
లోకోత్తరమైనమహిమతో అలరారే శ్రీహనుమాన్ చాలీసా సారస్వతం ఈ కలియుగవాసులకు శ్రీతులసీదాస్ గారు అనుగ్రహించిన విశేషం అని విజ్ఞ్యులకు ఎరుకే..
చిరంతనగంగాజలప్రవాహఝరులతో వర్ధిల్లే కాశీ / వారాణశి తీర స్థిత కాశి అస్సి ఘాట్స్ లో ఒకటిగా శ్రీతులసీదాస్ గారి పేరుమీద "తులసీ ఘాట్" నెలకొనిఉండడం మన చిరంతనసనాతనధర్మవైభవానికి సగౌరవ వందనం...
అట్టి చిరస్మరణీయులైన మహానుభావులు సంత్
శ్రీగోస్వామితులసీదాస్ గారి అనుగ్రహం ఈ కలియుగవాసులకు నిత్యం లభిస్తూ తరించేదరుగాక... 💐🙏
No comments:
Post a Comment