"ఆప్ మద్రాసి హై క్యా...?" అనే భావన నుండి
"ఆప్ తెలుగు హై క్యా ...?" అనే సగౌరవ గుర్తింపు భారతదేశవ్యాప్తంగా తెలుగు వారికి లభింపజేసింది ఎన్.టి.ఆర్ గారే అని ఎందరో మాన్యులకు తెలిసిన అంశం.
వారు నిర్వర్తించే ప్రతి కర్తవ్యాన్ని ఒక పవిత్రయజ్ఞ్యంలా నిర్వహించే ప్రజ్ఞ్యతో అలరారిన మాన్యుల్లో ఎన్.టి.అర్ గారు ఒకరు.
అది నిజజీవితమైనా...
సినిమా జీవితమైనా...
రాజనీతి అయినా...
ప్రజాసేవ అయినా...
దేశసేవ అయినా....
మన మట్టికి, మన భారతదేశానికి ఉపయుక్తమైన / గౌరవకారకమైన రీతిలో జీవించే వందమందికి జరిగే మంచిలో మనమంచి కూడా ఇమిడివుండును అని ఎన్.టి.ఆర్ గారు విశ్వసించి, సంకల్పించి, స్థాపించి, వ్యాప్తిగావించి, అభివృద్ధిపరిచిన "తెలుగుదేశంపార్టి" అనే ఒక పెద్ద మామిడిచెట్టు, ఎందరో నేటి వర్ధమాన రాజనీతిజ్ఞ్యులకు, విజ్ఞ్యతగల హుందాకరమైన రాజకీయవేత్తలకు, రాజకీయారంగేట్రాన్ని కల్పించిన ఒక గొప్ప ఆలంబనగా అలరారిన అంశం విజ్ఞ్యులకు ఎరుకే...
తెలుగుదేశంపార్టి అనే ఆ మామిడిచెట్టు యొక్క అభివృద్ధిఫలాలను అందుకొని వారివారి జీవితాలను తీర్చిదిద్దుకున్న వారందరూ కూడా పార్టీలకు అతీతంగా శ్రీ ఎన్.టి.అర్ గారికి నమస్కరించడం విజ్ఞ్యత అనబడుతుంది...
ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏఏరంగాల్లో ఎంతగా తెలుగువారి వైభవం ఒక వెలుగువెలుగుతోందో, వారందరి వైభవానికి ఆనాడు ఎన్.టి.అర్ గారు స్థాపించిన తెలుగుదేశంపార్టి యొక్క పరిశ్రమకు గల సంబంధబాంధవ్యం విజ్ఞ్యులకు విదితమే...
మన తెలంగాణరాష్ట్రసాధకపితామహులుగా, తెలంగాణరాష్ట్ర మొట్టమొదటిముఖ్యమంత్రివర్యులుగా ఖ్యాతి గడించిన శ్రీ కె.సి.ఆర్ గారు కూడా, పుష్కరకాలం పాటు తెలుగుదేశంపార్టిలో క్రియాశీలక మాన్యులుగా వర్ధిల్లిన అంశం విజ్ఞ్యులకు ఎరుకే...
మన తెలంగాణరాష్ట్రరెండవముఖ్యమంత్రివర్యులుగా వర్ధిల్లుతున్న శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా 8 సంవత్సరాల పాటు తెలుగుదేశంపార్టిలో క్రియాశీలక మాన్యులుగా వర్ధిల్లిన అంశం విజ్ఞ్యులకు ఎరుకే...
శ్రీ ఎన్.టి.ఆర్ గారికి ప్రతిరూపంగా అలరారే అంతటి వైభవభరితమైన తెలుగుదేశంపార్టి, అనివార్యమైన ఆంతరంగిక అల్లర్లకారణంగా అన్యాక్రాంతమై, అందకూడని విజ్ఞ్యతలేని బయటి వ్యక్తులకు పార్టిపగ్గాలు అంది ఎల్లరూ ఇబ్బందిపడకూడదు అనే దూరాలోచనతో, అందెవేసిన చాణక్యంతో, రాజనీతిచతురతతో, తెలుగుదేశంపార్టి యొక్క పగ్గాలను, ఎన్.టి.ఆర్ గారి తదనంతర ముఖ్యదిశానిర్దేశకులుగా అందుకున్న శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆధ్వర్యంలో
ఎవ్విధంగా తెలుగుదేశంపార్టి ఒక గొప్ప ప్రజాసేవక పరిశ్రమగా అలరారుతున్నదో విజ్ఞ్యులకు ఎరుకే...
గతంలో తెలుగుదేశంపార్టి గావించిన ప్రజాసేవాపూర్వకపరిపాలనాదక్షతను, అభివృద్ధికారకకార్యాచరణపటిమను
దర్శించిన తెలుగుప్రజలు సమకూర్చిన ప్రజాస్వామ్య
అధికారంతో మరలా ఇవ్వాళ పునర్వ్యవస్థీకృత నవ్యాంధ్రప్రదేశ్ లో ఎవ్విధంగా శ్రీ నారా చంద్రబాబు గారి సమర్ధ నాయకయ్వంలో తెలుగుదేశంపార్టి సుస్థిరమైన శాంతిభద్రతలతో, ఎన్.టి.ఆర్ గారు అందించిన సంస్కారభరిత విజ్ఞ్యతా పూర్వక సర్వతోముఖాభివృద్ధిబాటలో ప్రజాసేవాయజ్ఞ్యదీక్షతో పయనిస్తున్నదో విజ్ఞ్యులకు ఎరుకే...
శ్రీ ఎన్.టి.ఆర్ గారు కాక్షించిన
దేశశ్రేయస్సును, ప్రజాసంక్షేమాన్ని, అభివృద్ధిఫలాలను గమ్యంగా గావించి వర్ధిల్లే వారందరి హృదయాల్లో కూడా శ్రీ ఎన్.టి.ఆర్ గారిది అప్పుడూ, ఇప్పుడూ, మరియు ఎల్లప్పుడూ, సగౌరవ వందనీయ స్థానమే....
ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లే తెలుగు వారందరి హృదయాల్లో చిరస్మరణీయులైన
ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక అర్జునుడిగా, ఒక భీముడిగా, ఒక వీరబ్రహ్మేంద్రస్వామివారిగా, ఒక రాజనీతిజ్ఞ్యులుగా, ఒక ముఖ్యమంత్రివర్యులుగా, ఒక సాధకుడిగా, ఒక చిరంతన స్ఫూర్తిప్రదాతగా వెలుగొందే శ్రీ ఎన్.టీ.ఆర్ గారి కీర్తి అజారామరమైన వైభవం....
ఆచంద్రతాతార్కమై వర్ధిల్లే వారి యశస్సు మరెందరో విజ్ఞ్యులకు వారివారి జీవనబాటలో ఆదర్శంగా ఉండి భారతదేశానికి కీర్తిని వరింపజేసే విధంగా వర్ధిల్లాలని అభిలషిస్తూ.....
సర్వేసుజనాః సుఖినోభవంతు....🙂💐
No comments:
Post a Comment