మనుష్యులకు అత్యంత ప్రధామైన సంపత్తి ఈశ్వరానుగ్రహమైన వాక్కు...
ఆ వాక్కును ఒక్కొక్కరూ ఒక్కోలా వారివారి దైనందిన జీవితప్రయాణానుగుణంగా వినియోగిస్తూంటారు....
"ఇవ్వాళ నాకు చాలా తలనొప్పిగా ఉంది...
బాగా అలసిపోయా....కొంతసేపు మీ అల్లరి ఆపి ప్రశాంతంగా ఉండనిస్తారా...."
అని అప్పుడప్పుడు అనడం ఎల్లరికీ తెలిసిందే...
అంటే దాని అర్ధం.....ఒకరి వాక్కు ఇంకొకరికి ఇబ్బందికరంగా పరిణమించే అంశం గురించి చెప్తున్నారు అని అర్ధం...కద.....
అటువంటి వాక్కును.....
సద్వాక్కుగా మలిచి, అసంఖ్యాకమైన విజ్ఞ్యులకు శ్రేయస్సును, శాంతిని, ప్రజ్ఞ్యానాన్ని, విజ్ఞ్యతను, ఇతర ఎన్నో ఉత్తమ విభూతులను అనుగ్రహించే ప్రవచనయజ్ఞ్యం లో వినియోగిస్తూ, తాము తరిస్తూ, ఇతరులను తరింపజేయడం అనే తపస్సును ఏ లాభాపేక్ష లేకుండా కేవలం ఆత్మోద్ధరణకై గావించే మాన్యులు ఈ రోజుల్లో అరుదు....
ఇతిహాస పౌరాణిక కావ్య స్తోత్రాది ఎన్నో అంశాల గురించిన ప్రహృష్ట వచనాలను అనుగ్రహించిన శ్రీ చాగంటి సద్గురువులుగా లోకోత్తరమైన గౌరవం తో అలరారే వారి కీర్తికిరీటం ఎంతో గొప్పది...
ఎల్లరికీ మంచిని బోధించే, మంచిని కలిగించే వారి మంచి మంచి ప్రవచనాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో లోకానికి అనుగ్రహింపబడి ఎల్లరూ తరించాలి....
ఎందుకంటే.....
గురువుగారి పేరు చెప్పుకుంటూ,
గురువుగారికి తెలియకుండా,
గురువుగారికి సంబంధంలేని,
రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కమీషన్ వ్యాపారాలు, ఇంకా ఎన్నెన్నో వ్యాపారాలు గావించే ఎందరో లోకులు ఉన్న ఈ రోజుల్లో,
గురువుగారిని ఆదర్శంగా గావించి,
మనకు తెలిసిన నాలుగు మంచి, ఉపయుక్తమైన, సుహృద్భావకారక విషయాలు లోకానికి అందించి తరిద్దాం అని అనుకునే వారు కూడా చాలా అరుదు....
లోకంపోకడకు దూరంగా ఉంటూ, లౌక్యభరితమైన, స్వార్ధరహితమైన, కేవల ఈశ్వరసంబంధమైన, మంచి పనులు, మంచి ప్రవచనాలు, విజ్ఞ్యతగల మంచి సమసమాజ స్థాపనకు ఉపకరించే వ్యాపకాలతో మీ ప్రవచనాప్రస్థానం సదా వర్ధిల్లాలని అభిలషిస్తూ,
శ్రీచాగంటి సద్గురువుల జన్మదినోత్సవం సందర్భంగా,
వారి శ్రీచరణాల చెంత చిరు కావ్యకైంకర్యనమస్సుమాంజలి...🙂💐
No comments:
Post a Comment