Friday, August 28, 2026

శ్రీపరాభవ నామ సంవత్సర జ్యేష్ఠ పౌర్ణమి పర్వసమయ పురస్కృత, ఇంద్రకీలాద్రి స్థిత శ్రీదుర్గామల్లేశ్వర దేవాలయం, మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనారసిమ్హస్వామి దేవాలయం,(పంచారామ క్షేత్రం) శ్రీ బాలచాముండేశ్వరి సమేత అమరేశ్వరస్వామి దేవాలయం, మోపీదేవి శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాల సందర్శనంతో పునీతమైన శుభసమయ మంజరి...

శ్రీపరాభవ నామ సంవత్సర జ్యేష్ఠ పౌర్ణమి పర్వసమయ పురస్కృత, ఇంద్రకీలాద్రి స్థిత శ్రీదుర్గామల్లేశ్వర దేవాలయం, మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనారసిమ్హస్వామి దేవాలయం,
(పంచారామ క్షేత్రం) శ్రీ బాలచాముండేశ్వరి సమేత అమరేశ్వరస్వామి దేవాలయం, మోపీదేవి శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాల సందర్శనంతో పునీతమైన శుభసమయ మంజరి...

ఒక మంచి ఎలెక్ట్రిక్ బైక్ ఉండడం వేరు....
ఆ ఎలెక్ట్రిక్ బైక్ నిత్యం మంచి కండీషన్ లో ఉండి స్మూత్ గా నడవడం వేరు...
ఆ ఎలెక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరి నిత్యం నిండుగా చార్జ్ అయ్యి ఉండడం వేరు...
ఆ ఎలెక్ట్రిక్ బైక్ సంవత్సరానికి ఓ రెండు మూడు సార్లు మంచిగా సర్వీసింగ్ చెంది నిత్యం ఫిట్ గా మంచి కండీషన్ లో ఉండడం వేరు...

పైన ఉటంకించిన విధంగా బాగా మేంటేన్ చేసినప్పుడే ఆ ఎలెక్ట్రిక్ బైక్ కి మరియు అది నడిపే వారికి సార్ధకత ఒనగూరేది....

అదే విధంగా....

ఒక మంచి గౌరవభరితమైన జన్మ, అనగా మనిషి జన్మ లభించడం వేరు....
ఆ మనిషి జన్మకు నిత్యం భక్తి అనే సర్వోన్నతమైన విభూతి లభించి పద్ధతిగా జీవించడం వేరు...
ఆ మనిషి యొక్క మనసు నిత్యం నిండుగా చైతన్యభరితమై ఉండడం వేరు...
ఆ మనిషి జన్మ తరించడానికి సంవత్సరానికి ఓ రెండు మూడు సార్లు చక్కని భగవద్ దర్శనాలతో నిత్యం అనుగ్రహింపబడుతూ ఉండడం వేరు...

పైన ఉటంకించిన విధంగా మనిషి జన్మను బాగా మేంటేన్ చేసినప్పుడే ఆ మనిషి జన్మకు మరియు అందలి జీవుడికి సార్ధకత ఒనగూరేది....

ఇటుకలు, ఇసుక, సిమెంట్, యొక్క సమ్మిళిత స్వరూపమే గోడలు...
గోడలు మరియు పైకప్పు కలిస్తే ఒక గది...
కొన్ని గదుల సమూహమే ఒక ఇల్లు...
కొన్ని ఇళ్ళ సమూహమే ఒక వీధి...
కొన్ని వీధుల సమాహారమే ఒక కాలని....
కాలనీల సమాహారమే నగరాలు....
నగరాల సమాహారమే జిల్లాలు...
జిల్లాల సమాహారమే రాష్ట్రాలు...
రాష్ట్రాల సమాహారమే దేశాలు...
దేశాల సమాహారమే ప్రపంచం...
ప్రపంచాల సమాహారమే విశ్వం...
విశ్వాల సమాహారమే అమేయమైన, అగ్రాహ్యమైన రోదసి...

కాబట్టి జ్ఞ్యానచక్షువుతో దర్శించినప్పుడు,
ఈ ప్రపంచమంతా కూడా వైవిధ్య భరిత ప్రకృతి తో మమేకమై వర్ధిల్లే వ్యక్తుల / వ్యక్తిత్వాల సమూహంతో వర్ధిల్లే ఒకానొక విశాల భూగోళం....

వివిధ వస్తువులు, పరికరాలు, వాహనాలు మరియు ఇతర సృజనాత్మక విశేషాలన్నీ కూడా అమేయ మానవ మేధోశక్తికి తార్కాణంగా కాలానుగుణంగా పరిణమించి, పరిఢవిల్లి, లయించే భౌతిక తత్త్వాలు....
అనగా ఫర్ ఎగ్సాంపుల్, అప్పుడెప్పుడో సంపన్నుల స్టేటస్ సింబల్ గా అలరారిన అంబాసిడర్ కార్ ఇప్పుడు ఏ సంపన్నులు కూడా పెద్దగా పరిగణించని కాలం చెల్లిన వస్తువు....
ఎందుకంటే ఇప్పుడు అంబాసిడర్ కార్ స్థానంలో బెంజ్, బి.ఎం.డబ్లు, ల్యాండ్ రోవర్, రోల్స్ రాయ్స్, ఔడి, రేంజ్ రోవర్, ష్కోడా కార్లు కొలువు తీరి ఉంటున్నాయ్....

అనగా సదరు అంబాసిడర్ కార్ అనే భౌతిక వస్తుసంపద కాలక్రమంలో కనుమరుగైపోయిన ఒక జ్ఞాపకం....
అదే విధంగా ఈ ప్రపంచంలోని ఏ ఇతర వస్తువైనా సరే.....
అది అప్పటి సీ.అర్.టి అయినా...
ఇప్పటి ప్లాస్మా టి.వి అయినా...
ఇత్యాదిగా...మరే వస్తువైనా.....
ఎందుకంటే, అశాశ్వతత్త్వం అనేది భౌతిక తత్త్వం యొక్క స్వాభావిక లక్షణం....

కాని పరతత్త్వం / పరమాత్మ తత్త్వం అనేది అప్పుడు, ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, సార్వజనీనమైన, సార్వకాలిక, సర్వోన్నతమైన తత్త్వం....
ఎందుకంటే అది భగవద్ తత్త్వం...

భ గ వ తి

భ కారం - దైవికద్యుతిశక్తికి
గ కారం - దేవతాగమనశక్తికి
వ కారం - అమృతశక్తికి
త కారం - తత్త్వస్థిరీకరణశక్తికి

ప్రతీకలు గా ఆనాడు ఈనాడు దినపత్రికల్లో ప్రచురింపబడిన అరవిందుల అంతరంగం లో నిర్వచింపబడెను...

అనగా,
సదరు దేవతాశక్తి వారివారి లోకాలనుండి మనలోకంలోకి ప్రసరింపబడాలంటే,

మొదట వారు ఆకాశంలో తరంగితమై దైవికద్యుతిశక్తిగా ప్రభవించాలి....
ఆ తదుపరి మన లోకంలోకి భూమికి తగలకుండా వీలైనంత కిందికి గమనం సాగించి విచ్చేయాలి...
ఆ తదుపరి వారి అమృతేక్షణశక్తితో ఈ లోకంలోని భక్తులను అనుగ్రహించాలి....
ఆ తదుపరి తత్ అమృతేక్షణశక్తితో వర్షింపబడే దేవతానుగ్రహం ఉద్దేశ్యింపబడిన భక్తులయందు దేవతానుగ్రహతత్త్వంగా స్థిరీకరింపబడి గ్రాహ్యమవ్వాలి...

అప్పుడు, సాధారణంగా మనకు కనిపించని, కనిపించనవలసిన అవసరంలేని పరతత్త్వం / పరమాత్మ తత్త్వం, భగవద్ తత్త్వం గా మనకు ఇంద్రియగ్రాహ్యమై, ఔరా... ఈ భగవద్ తత్త్వం ఎంతటి మహిమాన్వితమైన విశేషమైన తత్త్వం....అనే ఎరుకలోకి వచ్చి....మనం సంతసించి పరిఢవిల్లేది....

బెజ్జవాడ / బెజవాడ - ఎన్నో కొండలకు గల బెజ్జాల నుండి ప్రభవించిన వాడ గా....
విజయవాడ - విజయుడు / అర్జునుడు తపస్సు చేసి ఇంద్రకీలాద్రి స్థిత ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహాన్ని అందుకొని తరించిన వాడ గా....
తన తమ్ముడైన విజయుడి / అర్జునుడి తపస్సు సఫలీకృతమై పరాశక్తి యొక్క అనుగ్రహంతో పంచపాండవులు విజయులై వర్ధిల్లాలి అని సంకల్పించి పాండవాగ్రజుడైన ధర్మరాజు గారు
స్వయంగా ప్రతిష్ఠించిన ప్రాచీన ప్రాభవభరిత పాదమల్లేశ్వర దేవాలయంతో (ఇప్పుడు పాతశివాలయం అని పిలుస్తున్నారు) వర్ధిల్లే వాడ గా.... విజయవాడ అనాదిగా ప్రసిద్ధినొందిన కృష్ణవేణి జీవనదీ పరీవాహక ప్రాంతం...

శ్రీ కనకదుర్గా సమేత మల్లేశ్వర స్వామి వారిని దర్శించి,
అమ్మవారి విశేషానుగ్రహంగా,
"భ గ వ తి " తత్త్వం యొక్క వైభవాన్ని ఎరుకలోకి తెచ్చికొని తరించండి....
ఆవిడ హరిభక్తిప్రదాయిని అని విజ్ఞ్యుల స్తుతి...
 
***** ***** ***** ***** ***** ***** ***** ***** *****
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.  
***** ***** ***** ***** ***** ***** ***** ***** *****
 
అనే శార్దూల పద్యంతో సాటిలేని మహిమాన్వితమైన శ్రీ ఆంధ్రమహాభాగవతాన్ని ప్రారంభించిన శ్రీపోతనామాత్యుల వారు ఏ మాహాశక్తిని "మహానందాంగనా" అని స్తుతించారో.....

ఆ మహాశక్తి, ఆ పరాశక్తి, త్రిశక్తి స్వరూపంగా, అమ్మలగన్నయమ్మగా, శ్రీ విజయకనకదుర్గగా ఇంద్రకీలాద్రిపై కొలువై, మహిషాసురమర్దినిగా మనుష్యులుల్లో అల్లుకునే మహిషత్వాన్ని సమ్హరిస్తూ దైవత్వాన్ని అనుగ్రహిస్తున్నదో...,
శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్భాగవత ప్రవచనాలను శ్రద్ధభక్తితో ఆలకించిన విజ్ఞ్యులకు విదితమే.....
 
***** ***** ***** ***** ***** ***** ***** ***** *****
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
***** ***** ***** ***** ***** ***** ***** ***** *****
 
అనే పోతనామాత్యుల సర్వోన్నతమైన శక్తివంతమైన ఉత్పలమాల పద్యాన్ని అమ్మవారు ఎవ్విధంగా తన ఆలయ ద్వారతోరణానికి మకుటాయమానమైన పద్యకిరీటాలంకరణమణిరాజంగా కొలువుతీర్చి, పోతనామాత్యులకు శ్రీకైవల్యాన్ని అనుగ్రహించి, అది చదివే భక్తులెల్లరికీ శ్రీకైవల్యపదప్రాప్తికి కావలసిన పాత్రతను అనుగ్రహిస్తున్నారో..... విజ్ఞ్యులకు ఎరుకే....
  
పైకి మరో గొప్ప ఉత్పలమాల పద్యంగా అనిపించినా, కనిపించినా, ఆంతరమున ఈ అత్యంత శక్తివంతమైన పద్యం ఎట్టి శాక్తేయవైభవకారక బీజాక్షర వైభవంతో అలరారే గొప్ప సారస్వత సంపత్తియో తెనుగుభాషావిద్వాంసులకు, అధ్యాత్మకోవిదులకు, శ్రీవిద్యోపాసకులకు విదితమైన అంశమే....
అని శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలను ఆలకించిన భక్తులకు ఎరుకలో ఉన్న అంశమే.....

శ్రీబాలాత్రిపురసుందరీదేవి యొక్క విశేషానుగ్రహంతో మా బాలప్రణవి పంచవర్షబాలగా అమ్మవారి క్రీగంటి చూపులతో విశేషంగా అనుగ్రహింపబడి, శ్రీ విజయకనకదుర్గమ్మవారి దర్శనంతో మేము తరించడం మా జన్మాంతర సౌభాగ్యం...

స — షడ్జమము
రి — రిషభము
గ — గాంధారము
మ — మధ్యమము
ప — పంచమము
ద / ధ — దైవతము
ని — నిషాదము

స రి గ మ ప ధ ని స
అనే స్వరాల ఆరోహణ...
మరియు
స ని ధ ప మ గ రి స
అనే స్వరాల అవరోహణ...
యొక్క వైవిధ్య భరిత కర్ణాటక శాస్త్రీయ సంగీత నిర్దేశిత రాగయుక్త సమ్మిళిత సపరిష్కృత సారసభావతాళాన్విత ఆలాపనే కర్ణాటక సంగీత గాత్ర వైభవం...
అని విజ్ఞ్యులకు ఎరుకే.....

పైకి చెప్పడానికి 7 స్వరాల ఆరోహణ మరియు అవరోహణ యొక్క మేళవింపే హృదయాన్ని రంజింపజేసే శాస్త్రీయ సంగీతం అని ఎంతో సింపుల్ గా అనిపించినా.....
కర్ణాటక శాస్తీయ సంగీత సముద్రం యొక్క లోతుపాతులు ఎంతటి అనంతమైనవో, ఆ సంగీతరసార్ణవంలో ప్రభవించే స్వరమాధుర్యవిశేషాలు ఎంతటి మహిమాన్వితమైనవో, శాస్త్రీయ సంగీత విద్వాంసులకు విదితమైన వైభవమే...

ప్రపంచం / లోకం గురించి చెప్తూ, భగవద్ తత్త్వం గురించి చెప్తూ, ఇప్పుడు సడెన్ గా కర్ణాటక శాస్త్రీయ సంగీతం గురించి చెప్తున్నావేంటి నాయనా..
అని కొందరు అనుకోవచ్చు.....

కాని ఇక్కడ విజ్ఞ్యులు గమనించినట్లైతే, లోకానికి, భగవద్ తత్త్వానికి, కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి చాలా దెగ్గరి సంబంధం ఉంది...

ఎందుకంటే.,
ఈ ప్రపంచం మొత్తం కూడా స్క్రోడింగర్ / ష్రోడింగర్ వేవ్ థియరి యొక్క ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా పరిఢవిల్లే తరంగశాసితతత్త్వం...

ఇప్పుడు చెప్పబోయేది సైన్స్ అధారిత వైజ్ఞ్యానిక అధ్యాత్మ అంశాలు కాబట్టి, ఇంగ్లీష్ లో అయితే అర్ధం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది కాబట్టి....
కొంచెం సేపు ఆంగ్లంలో సంభాషించుకుందాం...

As we have learned during our school days, the below is the basic explanation of the Schrödinger’s Wave Theory.

***** ***** ***** ***** ***** ***** ***** ***** *****

Schrödinger’s Wave Theory is the foundational framework of quantum mechanics that describes how subatomic particles, like electrons, behave as waves rather than classical point particles. Proposed by Austrian physicist Erwin Schrödinger in 1926, this theory replaced Bohr’s planetary model of the atom with a probabilistic, wave-based mathematical model.

There are two primary forms of the Schrödinger Equations used to calculate the behavior of quantum systems:

1. Time-Dependent Equation :

Describes how a quantum state evolves over time. It tracks the temporal and spatial changes of a wave function.

2. Time-Independent Equation :

Used to calculate the stationary states of a system where probabilities do not change over time, such as an electron occupying a specific energy level in an atom.

***** ***** ***** ***** ***** ***** ***** ***** *****

Should I apply the same for explaining the quantization of the "paratattwam", the supreme or super particle matter that pervades all over the world and is available only for those who call it via the requisite gayatri hymn, I would have to say that 
the divine particle matter maintains its state in the above mentioned 2 different equations...

Because, as long as it hasn't been invoked by a devotee, the divine particle matter is usually confined to the upper space realm thus being a subject governed by Schrödinger’s Time-Independent Wave equation.

And when it gets invoked, the divine particle matter is bound to propagate in accordance with the Schrödinger’s Time dependent Wave equation because of it's traversal in the Earth's gravitational field that naturally makes it a time governed entity to pervade all over the troposphere in the requisite signature pattern to the extent it radiates it's divine power.

Should one need a better practical understanding of the same, one may visit the peaceful "MopiDevitemple" located in the coastal area of Andhrapradesh to understand how lord Subrahmanya swamy continues to bless all the sincere devotees in accordance with the Schrödinger’s Time dependent Wave equation ever since his tapobhoomi was rediscovered by sage Agastya.

There are some interesting places on the planet earth where science and spirituality go hand in glove for the wellbeing of the planet and the devotees and Mangalagiri Shree Paanakaala LakshmiNaarasimha swamy temple is one such awe inspiring place where even today God drinks half of the jaggery juice offering and blesses the devotees with the other half.

While there are many legends associated with this pristine temples that date back to as old as kruta yugam, the lesser known one such aspect found by the devotees in their penance is....,
Lord Naarasimha all of a sudden appeared as stambodbhava naarasimha moorthy when bhakta Prahlaada answered, "Yes my ShreeHari is present in this pillar too... Because he pervades all over the universe...." to his crooked demon father Hiranyakashipa. After the annihilation of this demon, lord Ugra Naarasimha had to shun his unbearably ferocious form as per the prayers of bhakta prahlaada and all other gods who extolled him saying "aho balam..aho balam..." and the same has become the Ahobala Naarasimha ksheatram.

That shunned ferociousness of ugra narasimha swamy took the form of a phosphoric volcanic mountain and the same has been satiated with Elixir, cow ghee, cow milk and jaggery juice all thru the Kruta, Treta, Dwaapara and the present Kali Yugam respectively for the well-being / Mangalam of the world.

Several wise spiritual veterans consider having the darshan of all 5 panchaaraama temples mentioned below, as a cherished meritorious blessing for a lifetime and beyond because of the pristine legends associated with the enshrinement of these 5 temples' "parameshwara prasaadita aatmalingajanitajeevalingams" by various gods as per the respective historical legends.

I have had the blessings of the other 4 temples during my earlier visits. However, for some unknown reasons, the Amaravati temple visit remained pending since a long time and the same got completed successfully during the recent pilgrimage by the sheer grace of Lord Amareshwara 
swamy...

***** ***** ***** ***** ***** ***** ***** ***** *****
1. Amaraaraamam (Amaravathi)

Location: Palnadu District, near the Krishna River (about 40 km from Vijayawada).
Deity: Sri Amareswara Swamy with Devi Bala Chamundika.
Unique Feature: The Shivalinga is made of white marble and is notably tall. 
Legend states it was enshrined by Lord Indra.

2. Dakshaaraamam (Daakshaaraamam)

Location: East Godavari District (near Ramachandrapuram).
Deity: Sri Bheemeswara Swamy with Goddess Maanikyaamba (one of the 18 Shakti Peethas).

3. Somaaraamam (Bhimavaram)

Location: West Godavari District.
Deity: Sri Someswara Swamy with Goddess Rajarajeswari devi.

4. Ksheeraaraamam (Paalakollu)

Location: West Godavari District.
Deity: Sri Ksheera Ramalingeswara Swamy with Goddess Parvathi.

5. Kumaaraaramam (Saamalkota)

Location: East Godavari District (near Kakinada).
Deity: Sri Kumaara Bheemeshwara Swamy with Goddess Bala Tripura Sundari.

***** ***** ***** ***** ***** ***** ***** ***** *****

Sarvam Sree DurgaaMalleshwaraSwaami Sreecharanaaravindaarpanamastu...🙏💐

Sarvay sujanaah sukhinobhavantu... 💐🙂



No comments:

Post a Comment