బలానికి ఆభరణం రక్షణ
విద్యకు ఆభరణం వినయం
జ్ఞ్యానానికి ఆభరణం వితరణ
సంపదకు ఆభరణం దానం
అధికారానికి ఆభరణం సేవ
విచక్షణకు ఆభరణం వివేకం
విజ్ఞ్యతకు ఆభరణం ప్రశాంతత
నిన్ను గౌరవించడానికి, విశ్వసించడానికి, నీ సూచనలు పరిగణించడానికి, నీ సలహాలను పాటించడానికి...
వీటిలో నీ దెగ్గర ఏ ఆభరణం ఉంది...?
[ అమాయకులను వంచించి, పీడించి, బెదిరించి, హింసించి, దౌర్జన్యం గావించి నువ్వు కూడబెట్టుకున్న బంగారు ఆభరణాలు, బిస్కెట్లు, ఇత్యాది వాటి గురించి లోకానికి అనవసరం ]
నువ్వు అగ్నిని ఇబ్బంది పెట్టినా, అగ్నిని తనలో అణువణువూ నింపుకున్న భగభగమండుతున్న బొగ్గురాయిని ఇబ్బంది పెట్టినా ఒక్కటే.....
అట్లే
నువ్వు భగవంతుణ్ణి ఇబ్బంది పెట్టినా...
భక్తుణ్ణి ఇబ్బంది పెట్టినా ఒక్కటే...
ఎందుకంటే భగవంతుడి ఉనికికి కారణం భక్తుల భక్తియే కనుక...
అనవసరంగా నీకు సంబంధంలేని, నీకు అవగాహన లేని, నీకు ఉపయుక్తం కాని, అంశాల / వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించకు.....
నీకు ఇతరులమీద ఏడుస్తూ, ఇతరులను ఏమారుస్తూ, వంచిస్తూ, పీడిస్తూ, బ్రతికేంతటి అగత్యం ఏమున్నది.....
ఇతరులమీద ఏడుస్తూ జీవించడానికి,
వారి వద్ద నువ్వు అనుభవించని ఐశ్వర్యమున్నదా...
నీకు లేని సంపద ఉన్నదా...
మరెందుకు నువ్వు ఎప్పుడూ,
ఎడారిలోని ఎండమావిలో నువ్వు చెప్పినంత నీళ్ళు ఉండాలి అనే వ్యర్ధవాదన / క్రూరవైఖరి తో ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటావ్...నీ పుణ్యం మరింత క్షయించడానికి కాకపోతే...
వీలైతే విజ్ఞ్యతతో నలుగురు మెచ్చేలా జీవించు...
లేకపోతే.....
అలెగ్జాండర్ డి గ్రేట్ లా వెళ్ళి నీకు తగిన విధంగా బంగారంతో పేటిక చేయించుకొని పెట్టుకో....
పరిధిదాటకుండా ఇంతకంటే పరోక్షంగా నీ లాంటి ఆధునిక రావణాసురులకు మంచిని బోధించడానికి ఏముంటుంది...?
ఇట్లు, ఉన్మాద వైఖరితో జీవించే ఒక ధూర్తుడుకి, మళ్ళీ గాయపరిచే కుట్రలు రచించే వాడి క్రూరత్వానికి, వాడి వల్ల గాయపడిన బాధితుల ఆవేదనాభరిత స్పందన...
No comments:
Post a Comment