1 అశ్విని Aswini
2 భరణి Bharani
3 కృత్తిక Krutthika
4 రోహిణి Rohini
5 మృగశిర Mrugasira
6 ఆర్ద్ర Arudra / Ardra
7 పునర్వసు Punarvasu
8 పుష్యమి Pushyami / Pushya
9 ఆశ్లేష Aslesha
10 మఖ Makha / Magha
11 పుబ్బ (పూర్వఫల్గుణి) Pubba / Poorva Phalguni
12 ఉత్తర (ఉత్తరఫల్గుణి) Uttara / Uttara Phalguni
13 హస్త Hasta
14 చిత్త Chitta / Chitra
15 స్వాతి Swati
16 విశాఖ Visakha
17 అనూరాధ Anuradha
18 జ్యేష్ట Jyeshta
19 మూల Moola
20 పూర్వాషాఢ Poorvashada
21 ఉత్తరాషాఢ Uttarashada
22 శ్రవణం Sravanam
23 ధనిష్ట Dhanishta
24 శతభిషం Satabhisham
25 పూర్వాభాద్ర Poorvabhadra
26 ఉత్తరాభాద్ర. Uttarabhadra
27 రేవతి Revati
అనబడే 27 నక్షత్రాల్లో, భూలోకవాసులకు వీక్షణీయమైన రీతిలో వెలుగొందే 12 నక్షత్రాలతో పూర్ణచంద్రుడి ఖగోళ కూడిక వల్ల ప్రభవించేవే ఈ క్రింది 12 చాంద్రమాన మాసాలు...
1. చైత్రం
2. వైశాఖం
3. జ్యేష్ఠం
4. ఆషాఢం
5. శ్రావణం
6. భాద్రపదం
7. ఆశ్వయుజం
8. కార్తీకం
9. మార్గశిరం
10. పుష్యం
11. మాఘం
12. ఫాల్గుణం
మీరు గమనించి ఉండి ఉంటే...,
చాంద్రమాన పట్టికలో ఆషాఢమాసం 4వ మాసం అయినా, నిజానికి నక్షత్రమానం ప్రకారంగా 10వ మాసం....
అనగా...
భూమి నుండి దర్శనీయమై ఉండే 20 / 21 వ నక్షత్రాలైన పూర్వ / ఉత్తరాషాఢ తో పూర్ణచంద్రుడు కూడి ఉండగా ప్రభవించే 10వ నక్షత్రమాన మాసం....
0 నుండి 9 వరకు ఉండే అంకెల తరువాత ప్రభవించే మొట్టమొదటి అంకెలజత తో మొదలయ్యే సంఖ్య పది / 10....
అని మనం నిర్వచించవచ్చు....
అనగా పది నుండి అంకెలు సంఖ్యలుగా రూపాంతరం చెంది,
0 నుండి 9 వరకు ఉండే అంకెల క్రమవరుస అనంతమైన సంఖ్యాసముద్రంగా కొనసాగే గణితశాస్త్రవైభవం...
0 యొక్క శక్తి గురించి లోకానికి సనాతన భారతదేశ కోవిదులు,
5వ శతాబ్దం లో ఆర్యభట్ట గారు,
7వ శతాబ్దం లో బ్రహ్మగుప్త గారు,
12వ శతాబ్దం లో పాశ్చాత్య ప్రపంచం,
ఎంతో గొప్పగా నిర్వచించగా ఆ విధానన్ని ఆంగ్లేయులు మరలా మనకే "జీరో" అనే పేరుతో ఆధునిక గణితంలో పరిచయం గావించారు.....
ఈ సున్నా ని కొందరు శూన్యం అంటారు / అనుకుంటారు...
అధ్యాత్మ కోవిదులు పూర్ణం అని సంబోధిస్తారు...
ఎందుకంటే...పూర్ణం నుండే అన్నీ ఉద్భవించును కాబట్టి.....
ఓం పూర్ణమదః పూర్ణమిదంపూర్ణాత్ పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయపూర్ణమేవావశిష్యతే ||
0 యొక్క శక్తి గురించి శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలో కూడా విజ్ఞ్యులు ఆలకించే ఉంటారు....
ఎంత పెద్ద సంఖ్య అయినా కూడా 0 చే గుణించగా అది 0 / శూన్యం అవ్వును.....
ఎంత పెద్ద సంఖ్య అయినా కూడా 0 చే భాగింపగా అది అనంతం / ఇన్ ఫైనైట్ అవ్వును.....
ఏ అంకెలకైనా / సంఖ్యలకైనా 0 ని జతపరిస్తే వాటి విలువ హెచ్చును....
తీసివేత అనేది 0 కి వర్తించదు....
ఎందుకంటే, మీ ఇంటి దెగ్గర ఉన్న మట్టిని కొంచెం మీరు ఒక గంపలోకి ఎత్తుకుంటే, ఈ భూగోళం నుండి కాసింత మట్టిని మీరు తీసివేత గావించగా, ఈ భూమిపై ఉన్న మట్టి కొంచెం తగ్గింది....ఎందుకంటే మీ గంపలో ఆ మట్టి ఉంది కాబట్టి....
ఇదే అంశాన్ని మీరు ఆకాశానికి వర్తించగలరా..??
అనగా ఎక్కడి ఆకాశం నుండైనా కొంచెం ఆకాశం ఒక పాత్రలోకి తీసుకుంటే, పైన అనంతమైన ఆకాశం నుండి కొంచెం ఆకాశం తగ్గిందని మీరు చెప్పగలరా....??
కాబట్టి ఆకాశాన్ని మీరు శూన్యం అన్నా, పూర్ణం అన్నా, అది ఎప్పటికీ అట్లే ఆ పూర్ణత్వం తోనే వర్ధిల్లుతూ ఉండును....
ఎందుకంటే ఆనాడు మన ముత్తాతల ముత్తాతలు దర్శించింది మరియు ఈనాడు మనం దర్శించునది మరియు మన మనవల మనవలు దర్శించేది అదే అకాశం....అదే సూర్యచంద్రులు....అదే తారామండలం...అదే నవగ్రహాలు....అదే రోదసీ....
కాబట్టి పూర్ణం ఎప్పటికీ పూర్ణమే...
లంబోదరుడి బొజ్జలా...
మరియు పూర్ణం, తనను ఆశ్రయించి ఉండే ఇతర ఎన్నో తత్త్వాలను పరిపూర్ణం గావించే పూర్ణతత్త్వం...
ఇక 1 గురించి చర్చిద్దాం..
గణిత శాస్త్రం యొక్క వైభవానికి మొదటి మెట్టు 1.
ఆ తర్వాతే ఎన్ని మెట్లైనా / అంకెలైనా / సంఖ్యలైనా...
శ్రీ ఆదిశంకరాచార్యుల వారి అద్వైతతత్త్వసిద్ధాంతప్రచారంలో భాగంగా శ్రీ చాగంటి సద్గురువుల ఈ క్రింది వచనాలు విజ్ఞ్యులకు విదితమే....
"శ్రీ ఆదిశంకరాచార్యులవారు....
పరమాత్మ తత్త్వాన్ని "ఏకం / ఒక్కటే" అని అనిఉండిఉంటే....
ఆ ఒకటి ఈ ఒకటి అని మళ్ళీ ఎన్నో ఒకట్లు బయల్దేరుతాయ్ అని....
"ఏకం" అని అనలేదు...."అద్వయం" / "అద్వైతం" అని నిర్వచించారు...
అనగా "దట్ విచ్ ఇస్ నాట్ టు" / "రెండు కానిది" అని అర్ధం...
" తిరుపతి కొండలు ఏడైనా ఆ కొండల, రాయుడు ఒక్కడే...
తెలుగున పదములు ఎన్నున్నా, ఆ తియ్యందనము ఒక్కటే...
ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నడైనా, ఏర్టెల్ ఒక్కటే ...."
అనే అప్పటి ఏర్టెల్ హెలో ట్యూన్ కొందరికైనా గుర్తుండే ఉంటుంది...
[ క్రింద కామెంట్స్ లో ఆ ట్యూన్ లింక్ ఇచ్చాను...]
ఒక పెద్దలడ్డు .....
ఒక పది రూపాయల దానం....
ఒక వంద వెరైటీల భోజనాలు...
ఒక వెయ్యి రూపాయల పంచె/ధోవతి/ధర్మం...
ఒక పదివేల రూపాయల సరుకులు...
ఒక లక్ష రూపాయల బైక్...
ఒక పదిలక్షల రూపాయల కార్...
ఇలా 1 తర్వాత 0 / 0 లను జతపరిస్తే వచ్చే సంఖ్యామానానికి లౌకిక ప్రాభవమే కాక, వాటికి తెలుగు / సంస్కృతం లో నిర్దిష్టమైన పేర్లు కూడా ఉండడం విజ్ఞ్యులకు విదితమే....
మీరు ఎప్పుడైనా మన ఆర్.టి.సి బస్ల వెనకాల ఉండే నంబర్ప్లేట్ బోర్డ్ల పై ఉండే మనదైన మన తెలుగు సంఖ్యలను గమనించారా..??
సంఖ్య / తెలుగు / అరబిక్
సున్న ౦ 0
ఒకటి ౧ 1
రెండు ౨ 2
మూడు ౩ 3
నాలుగు ౪ 4
ఐదు ౫ 5
ఆరు ౬ 6
ఏడు ౭ 7
ఎనిమిది ౮ 8
తొమ్మిది ౯ 9
పది ౧౦ 10
నూరు ౧౦౦ 100
పది వర్గం / తెలుగు సంఖ్యామానం / అంతర్జాతీయ సంఖ్యామానం
1 ౧౦ (పది) 10 (పది)
2 ౧౦౦ (వంద) 100 (హండ్రెడ్)
3 ౧,౦౦౦ (వేయి) 1000 (థౌజండ్)
4 ౧౦,౦౦౦ (పది వేలు) 10,000 (టెన్ థౌజండ్)
5 ౧,౦౦,౦౦౦ (లక్ష) 100,000 (హండ్రెడ్ థౌజండ్)
6 ౧౦,౦౦,౦౦౦ (పది లక్షలు) 1,000,000 (మిలియన్)
7 ౧,౦౦,౦౦,౦౦౦ (కోటి) 10,000,000 (పది మిలియన్లు)
8 ౧౦,౦౦,౦౦,౦౦౦ (దశ కోటి లేదా పది కోట్లు) 100,000,000 (వంద మిలియన్లు)
9 ౧౦౦,౦౦,౦౦,౦౦౦ (శత కోటి లేదా వంద కోట్లు) 1000,000,000 (బిలియన్)
10 ౧౦౦౦,౦౦,౦౦,౦౦౦ (సహస్ర కోటి లేదా వేయి కోట్లు లేదా అర్బుదము) 10000,000,000 (పది బిలియన్లు)
11 ౧౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (పది వేల కోట్లు లేదా న్యర్బుదము) 100,000,000,000 (వంద బిలియన్లు)
12 ౧౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (లక్ష కోట్లు లేదా ఖర్వము) 1000,000,000,000 (ట్రిలియన్)
13 ౧౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (పది లక్షల కోట్లు లేదా మహా ఖర్వము)
14 ౧౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (కోటి కోట్లు లేదా పద్మము)
15 ౧౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (మహా పద్మము)
16 ౧౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (క్షోణి)
17 ౧౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (మహా క్షోణి)
18 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦(శంఖం)
19 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦(మహా శంఖం)
20 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦(క్షితి)
21 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦(మహా క్షితి)
22 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦(క్షోభము)
23 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (మహా క్షోభము)
24 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (నిధి)
25 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦ (మహా నిధి)
26 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦,౦౦,౦౦,౦౦౦(పరాటం)
27 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦(పరార్థం)
28 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦(అనంతము)
29 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦(సాగరము)
30 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ (అవ్యయం)
31 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦(అమృతం)
32 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦(అచింత్యం)
33 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ (అమేయము)
34 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ (భూరి)
35 ౧౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ (మహా భూరి)
సౌజన్యం :
https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%82%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%9A%E0%B0%95%E0%B0%AE%E0%B1%81
కాబట్టి 1 మరియు తదుపరి జతయ్యే 0 ల సంఖ్యామానం / తత్త్వం / గణితం / యొక్క ప్రాభవం లోకవిదితమే..
పద్యశతకం అంటే 100 పద్యాలసమాహారం...
మూకపంచశతి అంటే 500 మహిమోపేతమైన శ్లోకాల సమాహారం...
[ "శ్రీ మూకశంకరులకు ఒకానొక సమయంలో అమ్మవారు తాంబూలచరవణం గావించి అందలి ఒక పిడచ వారికి అందివ్వగా, లోకానికి అనుగ్రహంగా అందిన అత్యంత అరుదైన 5 శతకాల అమరవంద్యకావ్యం "మూకపంచశతి" ని ఆలకించాలంటే కొన్ని కోట్ల కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే కుదిరేది...." అనే శ్రీచాగంటి సద్గురువుల సద్వాక్కులు పుణ్యాత్ములకు కర్ణపేయమైన జ్ఞ్యాపకమే.... ]
ఇక్కడ శతం అనే 100...
అదుకు ఎన్ని రెట్లు గుణిస్తే అన్ని శతకాలు...
అట్లే సహస్రం అంటే వెయ్యి...
అదుకు ఎన్ని రెట్లు గుణిస్తే అన్ని సహస్రాలు...
అట్లే మిగతా మేయాలు కూడా....
ఫ్రీ గా ఇంటర్నెట్ లో లభించిన శ్రీచాగంటి సద్గురువుల "మూకపంచశతి" ప్రవచనాలను ఆలకించడానికే ఆరోజుల్లో ఒక నోకియా బ్లూటూత్ హెడ్సెట్ కొనుక్కున్నానంటే, వాటి వైభవం ఎంతటి మహిమాన్వితమో ఆలోచించండి...
ఇవ్విధంగా, 1 మరియు 0 యొక్క కాంబినేషన్ లో గణితశాస్త్రం యొక్క వైభవం బహువిశేషమైనది...
అమేయమైనది....
సర్వే సర్వత్రా పరివ్యాప్తమై ఉండేదే నిర్గుణ నిరాకార పరతత్త్వం....
శివ రూపంలో ఆ పరతత్త్వం ఒక నిర్దిష్టమైన నామరూపాత్మకగౌణంతో పరిఢవిల్లును....
శక్తి రూపంలో ఆ పరతత్త్వం నిర్దిష్టమైన శివా గా ప్రస్తుతింపబడును....
శ్రీచాగంటి సద్గురువుల సద్వాక్కుల్లో ఉదహరింపబడిన విధంగా,
ఒక కార్ బాడిని మీరు శివం గా భావిస్తే...
ఆ కార్ యొక్క చలనశీలత్వానికి కారణమయ్యే ఇంజన్ ని శక్తి గా భావిస్తే....
నిర్దిష్టమైన ఒక శివశక్త్యాత్మక కార్ అనే ఎన్టిటి కి ఒక బ్రాండ్ పేరు, ఒక నంబర్ ప్లేట్, ఒక డ్రైవర్, ఒక ఆర్.సి, ఇత్యాదిగా ఇతరత్రా విభూతులన్నీ వచ్చి చేరును...
అనగా శివశక్త్యాత్మక వ్యక్తావ్యక్త స్వరూపమే ఈ యావద్ విశ్వం, విశ్వం లోని అణువణువూ కూడా....
అందుకే శివశక్త్యాభేదస్వరూపమైన అమ్మవారిని వాగ్దేవతలు,
"శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ"
అని స్తుతించెదరు....
కాబట్టి తత్త్వశాస్త్రపరంగా,
10 అనే సంఖ్య శివశివా గా పరిఢవిల్లే
శివశక్త్యాభేదస్వరూపమైన పరిపూర్ణ తత్త్వాన్ని సూచించును.....
హెచ్చింపబడే శక్తి యొక్క స్థాయిని బట్టి 10 అనే తత్త్వ సంఖ్య...
10, 100, 1000, 10000, 100000, ......
ఇత్యాదిగా రూపాంతరం చెందుతూ ఉండే అమేయ తత్త్వం....
పైన వివరింపబడిన విధంగా...
ఈ యావద్ విశ్వం కూడా పరమేశ్వరుడి సంపత్తి....
అందుకే ఈశ్వరుణ్ణి శర్వుడు అని స్తుతించేది....
ఈశ్వర ప్రసాదంగా ఈ విశ్వంలోని ఎన్నో విభూతులను మనం అనుగ్రహంగా కలిగిఉన్నాం...
అందుకే అమ్మవారు,
"సదాశివానుగ్రహదా..." అని స్తుతింపబడును....
అందుకే తత్త్వపరంగా నక్షత్రమానప్రకారంగా 10వ మాసమైన ఆషాఢ మాసం లో ఎంతో విశేషమైన అమ్మవారి ఆషాఢ జాతరలు, ఉత్సవాలు, బోనాలు, ఇత్యాదిగా ఊరూరా, వాడవాడలా, పల్లేపట్నం, మొత్తం శివశక్త్యాత్మక తరంగాలతో శివమెత్తే / శిగమూగే పర్వసమయం.....
Resonance is one of the mightiest phenomena of this universe that can turn an ebb into a powerful tide or a powerful bridge into collapsed ruins.
So is the power of AadiParaashakti...
Shreemaatray Namaha...🙏💐
ఈ ఆషాఢ పర్వసమయం హైద్రాబాద్ / సికింద్రాబాద్ : భాగ్యనగరం / స్కందగిరి / స్కందపురి, అనే జంటనగరాల్లో,
బోనాల జాతర పేరిట ఎంతో వైభవంగా వర్ధిల్లడం విజ్ఞ్యులకు ఎరుకే....
అనాదిగా ఆషాఢ, ఆశ్వయుజ మాసాలు అమ్మవారి
విశేషమైన అనుగ్రహపాత్రతా లభ్యతకు పెట్టింది పేరు.....
దేవవైద్యులైన అశ్వినీ దేవతలకు ప్రతీకగా అలరారే అశ్విని నక్షత్రం తో పూర్ణచంద్రుడు కూడి ఉండే ఆశ్వయుజ మాసంలో అమ్మవారి ఆరాధన యొక్క వైభవాన్ని శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీనవదుర్గావైభవం అనే పోస్ట్లో భగవతి అనుగ్రహంగా వివరిస్తాను....
ఈ 2026 ఆషాఢ బోనాల పర్వసమయంలో అమ్మవారి క్రీగంటి దృక్కుల అమేయ శక్తితరంగాలు సుజనులెల్లరినీ శక్తివంతంగా అనుగ్రహించి, భక్తులందరికీ విశేషమైన
ఆయురారోగ్యైశ్వర్యాలను, అభీష్టసిద్దిని, అనుగ్రహించి తరింపజేయుగాక.....
అని అభిలషిస్తూ, ఎల్లరికీ 2026 బోనాల జాతర / ఆషాఢ ఉత్సవ శుభాభినందనలు...🙂💐
సర్వం కూకట్పల్లి గ్రామదేవత శ్రీ చిత్తారమ్మతల్లి,
బల్కంపేట ఇలవేల్పు శ్రీ రేణుకాహేమలాంబ / ఎల్లమ్మతల్లి శ్రీచరణారవిందార్పణమస్తు....💐🙏
సర్వే సుజనాః సుఖినోభవంతు...💐
No comments:
Post a Comment