శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు, " భారతరత్న " పురస్కారాన్ని అందుకున్మ తొలి సంగీతకళాకారిణి గా ఎంతోమందికి సుపరిచితమైన ఆ పేరు, ఇన్ని దశబ్దాలైనా మరెన్నో దశాబ్దాలైనా ఇప్పటికి మరెప్పట్టికి కొన్ని కోట్ల సంగీతాభిమానుల హృదయాల్లో మరియు ఆ 7 కొండలప్రభువు యొక్క సన్నిధిలో నిరంతరం మార్మ్రోగుతూనే ఉంటుంది......
సప్తస్వరాలను తమ రసనపై నిలిపి రసగులికలుగా మలిచి మనసురంజిల్లే విధంగా రాగాలను అలదుతూ సరాగాలను సమకూర్చి
కర్ణాటకసంగీతసామ్రాజ్యాన్ని ఏలేటి అతిరథమహారథులా,
కర్ణాటకసంగీతసామ్రాజ్యాన్ని ఏలేటి అతిరథమహారథులా,
లేక
దైనందిన పనిలో అలసి సొలసి అలా కాసేపు ఏదో సంగీతం వింటూ సేదతీరుదాం అని వినే సామాన్యులా......
శ్రోతలు ఎవరైనా సరే, అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో, ఆ అమరగాయని యొక్క గంధర్వగానం అందరికి ఒక అలౌకిక తన్మయత్వాన్ని అందించి ఆనందపరుస్తుంది. అది ఎన్నో కోట్ల జన్మాంతరపుణ్యవిశేషం చేత మాత్రమే లభించే అరుదైన అనుగ్రహం.....!
"నడయాడే దైవం", శ్రీ కంచి పరమాచార్య వారి ప్రత్యక్షానుగ్రహన్ని గైకొని ప్రపంచవేదికపై ఎన్నోదేశాల
కళాకారులముందు "మైత్రీంభజతాం....." అని ఆలపించి యావద్ సంగీత ప్రపంచం యొక్క ప్రశంసలను అందుకున్న అరుదైన భారతనారీశిరోమణి శ్రీమతి సుబ్బు లక్ష్మిగారు......
కళాకారులముందు "మైత్రీంభజతాం....." అని ఆలపించి యావద్ సంగీత ప్రపంచం యొక్క ప్రశంసలను అందుకున్న అరుదైన భారతనారీశిరోమణి శ్రీమతి సుబ్బు లక్ష్మిగారు......
జీవితంలో ఎంత యెత్తుకు ఎదిగినా, ఎన్ని సిరిసంపదలను, పేరు ప్రఖ్యాతలను గడించినా, అవన్నీ ఈశ్వరప్రసాదములు అని సదా భావిస్తూ ఒదిగిఉండడంలోనే జీవనఔన్నత్యం ఉంటుందనే సార్వకాలిక సత్యశ్రేష్టానికి నిలువెత్తు సాక్ష్యం వారి జీవితం.........
శ్రీవేంకటాచలాధీశుడిపై అవ్యాజమైన భక్తితో జీవితాన్ని సార్ధకం చేసుకున్న భాగవతోత్తములలో ఒకరైన ఎం.ఎస్ గారిని స్వామి కూడా అంతే ఆప్యాయతతో, తిరుపతి పురవీధుల్లోకి అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి తనకంటే ముందే తన భక్తురాలైన ఎం.ఎస్ గారి మూర్తి దర్శనమయ్యేలా ఏర్పాటు చేసాడు ఆ భక్తవత్సలుడు సంకీర్తనాలోలుడు.....! అంతటి అనుగ్రహానికి నోచుకున్న వారి జీవితస్మరణకూడా అంతే అనుగ్రహదాయకం కదా మరి.... 😊
ఫలాన సంకీర్తన తో ఫలాన దైవస్వరూపాన్ని కీర్తించి
తరించవచ్చు అని ఎవరైనా అనుకోవడం లోకసహజం....
తరించవచ్చు అని ఎవరైనా అనుకోవడం లోకసహజం....
కాని ఎం.ఎస్ గారి గళంలో ఫలాన దైవస్వరూపం యొక్క కీర్తన వింటె ఆ దైవమే ఆనందించేలా ఉంటాయి ఆ ఆలాపనలు.......
అది శ్రీనివాసుడు మురిసిపోయే "భావయామి గోపాలబాలం" అన్నమాచార్యకృతి మొదలుకొని శంకరుడే దరహాసం పొందే సద్గురు త్యాగరాయ వారి "నాదతనుమనిశం" వరకు......
వారు ఆలపించిన సంకీర్తన ఎదైనా కావచ్చు.....
అది సాధించిపెట్టే అనుగ్రహం అనన్యసామాన్యమే......
అది సాధించిపెట్టే అనుగ్రహం అనన్యసామాన్యమే......
అందుకే వారి మధురగానామృతసగులికలు
కేవల లౌకిక సంగీతసారస్వత దీపికలు మాత్రమే కాక, ఆ సర్వేశ్వరుడిని మనకు వశపరిచే సామవేద మంత్రములై ఈ జగత్తునందు ఆచంద్రతారార్కమై అజరామరములై శాంతిదాయకములై
శోభిల్లడం......
కేవల లౌకిక సంగీతసారస్వత దీపికలు మాత్రమే కాక, ఆ సర్వేశ్వరుడిని మనకు వశపరిచే సామవేద మంత్రములై ఈ జగత్తునందు ఆచంద్రతారార్కమై అజరామరములై శాంతిదాయకములై
శోభిల్లడం......
వారి సంగీతరససిద్ధి ఎందరెందరో భక్తులకు ఆనందరససిద్ధిని కలిగించి సదా తరింపజేయుగాక......! 🙏
No comments:
Post a Comment