శ్రీకరమైనముగింపును అపేక్షిస్తు ప్రతి వైదిక పూజాకార్యక్రమాల్లో మంత్రపుష్పాన్ని పఠించడం అనాదిగా ఆచరింపబడుతున్న సత్సంప్రదాయం......
పేరులో సౌమ్యంగా " మంత్రపుష్పం " అని ఉండడం, తీరులో ఎంతో గంభీరమైన తారాస్థాయిలోని స్వర స్థానాలను అందులో నిక్షిప్తం చేసుకున్న ఈ వేదసూక్తపఠనం నిజంగా ఎంతో శాంతికారకం జ్ఞానదాయకం.......
మీ మీ ఇంటిదెగ్గర ఉండే ఆలయాల్లో గొప్ప స్వరప్రౌఢిమ కలిగిన వైదిక సంప్రదాయ విధానావలంబిత
సద్బ్రాహ్మనోత్తములు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా ఆ భాగ్యం కలిగిఉండొచ్చు మీక్కూడా.....
సద్బ్రాహ్మనోత్తములు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా ఆ భాగ్యం కలిగిఉండొచ్చు మీక్కూడా.....
ఇందాకే ఒక గంటక్రితం నేను రెగ్యులర్గా వెళ్ళే బాబమాందిరంలో గత సంవత్సరంలో కొత్తగా కొలువైన
శ్రీలక్ష్మీగణపతి ఆలయంలోని శ్రీవికారి భాద్రపద మాస సంకటహరచతుర్థి ప్రత్యేక ప్రదోషారాధనలో పాల్గొన్నప్పుడు అక్కడి అర్చకుల పూజానంతర మంత్రపుష్పపఠనం మరియు ప్రసాదవితరణ తర్వాత కురిసిన వర్షపు జల్లులకు, మా బిల్డింగ్పై ఈ మధ్యే కొనితెచ్చిన రోజా పూలమొక్క కొత్తగా చిగురించి మొగ్గతొడిగి పుష్పించిన 2 రోజాపూలను ఈశ్వరుడికి సమర్పించిన ఒక సంఘటనను జోడించగా ఒలికిన కొన్ని భావపరంపరలు......

చక్కని కుంకుమవర్ణంలో విరబూసిన రోజాపూలను ఆభరణాలుగా ధరించి హొయలొలికే మా రోజాపూలమొక్కకు మొదటగా శుభాకాంక్షలు తెలుపుతూ......👏👏😊
ఈ చరాచర సృష్టికారకములైన ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అనే పంచభూతాలను వాటి సమ్మిళిత సంఘాతంగా ఏర్పడే సూర్యుడు, చంద్రుడు, జీవుడు/ప్రకృతి అనే అష్టవిధ జగత్తుకు అధినేత ఆ సర్వేశ్వరుడు......
అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు విన్నవారికి గుర్తున్నట్టుగా,
" పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చ్హతి.... "
అని గీతాచార్యుడు చెప్పిన దాంట్లో
పుష్పానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నది.....
పుష్పానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నది.....
ప్రతి జీవుడిని ఆడించే పంచ తన్మాత్రలకు ప్రతీకైన పంచతత్వములు పుష్పముమందు మాత్రమే ప్రతిఫలిస్తాయి......
రంగు - నయనేంద్రియ సంబంధం
రుచి - జిహ్వేంద్రియ సంబంధం
వాసన - ఘ్రానేంద్రియ సంబంధం
స్పర్ష - చర్మేంద్రియ సంబంధం
శబ్దం - కర్ణేంద్రియ సంబంధం
రుచి - జిహ్వేంద్రియ సంబంధం
వాసన - ఘ్రానేంద్రియ సంబంధం
స్పర్ష - చర్మేంద్రియ సంబంధం
శబ్దం - కర్ణేంద్రియ సంబంధం
( పుష్పానికి శబ్దం ఎక్కడిది అనే సందేహం వుంటే గురువుగారి ప్రవచనం వినండి తెలుస్తుంది...😁 )
ఈ 5 ఉడిగిననాడు, అంటే ఈ 5 ఇంద్రియాల శక్తి లుప్తమై మనసు లయమైననాడు ఇక ఆ జీవుడి లౌకికాట ముగిసినట్టే.....
అది అప్రయత్నంగా అయిననాడు శివం లో ఇ కారం తొలగి శరీరం శిధిలమైందని అర్ధం...
అది ప్రయత్నపూర్వక యోగసాధలో
అయిననాడు జీవాత్మ లోని లౌకిక చేతనశక్తి ఆ పరమాత్మలోని అలౌకిక దివ్యచైతన్యంలోకి అనుసంధానమై మరింతగా వైశ్వికశక్తియుక్తులను పుంజుకొని జీవుడు యోగమార్గంలోని తన వివిధ బాటలను బాగ సందర్శించి ఈశ్వర సాన్నిధ్యానికి రహదారిని ఏర్పర్చుకుంటున్నాడు అని దాని అర్ధం....😊

అందుకే ఈ మర్త్యలోకంలో ఎన్నెన్నో వస్తువులు ఉన్నాసరే అమ్మవారు మాత్రం తనకు "చైతన్యకుసుమప్రియ" అనే పేరుమాత్రమే ఇష్టం అని లలితలో వాగ్దేవతలద్వార పుష్పవైభవాన్ని వ్యక్తపరిచింది కద..... 😊 👏👍🍨🍧🍦
No comments:
Post a Comment