Tuesday, September 17, 2019

అమాత్యులందరికి అభినందనలు.....👏😊

శ్రీశ్రీనివాసుని అనుగ్రహంతో ఏర్పడిన నూతన రాష్ట్రాన్ని, తనకు బంగారు నగల మొక్కు ముట్టగానే సంతసించి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధితో సస్యశ్యామలంగా సుభిక్షంగా వర్ధిల్లేలా దీవించడంతో కొనసాగుతున్న రాష్ట్ర రాజకీయ ప్రస్థానంలో, రెండవసారి ఏర్పడిన అమాత్యుల క్యాబినెట్లో ఇద్దరు మహిళామణులకు స్థానం కల్పించడం
అభినందనీయం.....👏😊
తొలి విడత పేషిలో భారినీటిపారుదల శాఖామాత్యులుగా ( ఇరిగేషన్ మినిస్టర్ గా ) రాష్ట్రానికి ఎంతో ఘనమైనసేవలను అందించి ఈ సారి భారతదేశంలోనే అత్యంత భారీస్థాయిలో మెజారిటి పొందిన రెండవ శాసనసభాసభ్యులుగా రికార్డ్ సొంతం చేసుకున్న శ్రీహరీష్ గారికి అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖను అప్పగించడం కడు ముదావహం.....
ప్రజానాడి తెలిసిన నేతగా, రాజకీయం కంటే రాజనీతితో గావించే ప్రజాసేవా ప్రస్థానం చిరకాల యశోవిరాజితమై వర్ధిల్లుతుందని నమ్మి పనిచేసేవారిలో ఒకరైన హరీష్ గారి హయాంలో తెలంగాణ ఒక ఆర్ధిక మిగులురాష్ట్రంగా అభివృద్ధిచెంది మిగతా రాష్ట్రాలకు ఆదర్శమైన ఆర్ధిక విధివిధానాలతో మరింతగా పుంజుకొని అగ్రగామిగా నిలిచి శోభించాలని ఆశిస్తూ నూతన అమాత్యులందరికి అభినందనలు.....👏😊
PSCP.TV
Live: Swearing-in ceremony of Telangana Cabinet Ministers at Raj Bhavan, Hyderabad.

No comments:

Post a Comment