శ్రీవైశాఖశుద్ధతదియ అక్షయ తదియ / అక్షయ తృతీయ గా అందరు పండగ జరుపుకోవడం ఎల్లరికి విదితమే.....
ఇవ్వాళ్టి సమాజంలో అక్షయతృతీయ అంటే
"అది బంగారం కొనుకున్నే ఒక పండగ"
గా ఈ సమాజంలో వ్యాపారస్తులు వ్యాప్తిగావించి ప్రజల ఆస్తికత్వాన్ని కూడా తమ వ్యాపార వస్తువుగా మార్చేసారనుకోండి......
"అది బంగారం కొనుకున్నే ఒక పండగ"
గా ఈ సమాజంలో వ్యాపారస్తులు వ్యాప్తిగావించి ప్రజల ఆస్తికత్వాన్ని కూడా తమ వ్యాపార వస్తువుగా మార్చేసారనుకోండి......
శ్రీచాగంటి సద్గురువుల మాటల్లో చెప్పాలంటే,
అక్షయ తదియ రోజు బంగారం కొంటే బంగారం అక్షయం అవుతుందనేది వ్యాపారస్తుల అజ్ఞ్యానవల.....
అలా చేస్తే బంగారంతో పాటుగా కలిపురుషుడికి పరీక్షిత్ మహారాజు వరంగా ఇచ్చిన వాసస్థానాల్లో బంగారం కూడా ఒకటి కాబట్టి కలిపురుష ఉద్ధతికూడ కూడా అక్షయమై వివిధ ఈతిబాధలకు అది దారితీస్తుంది...,
అనే విషయన్ని గ్రహించి మనల్ని మనం సరిద్దుకోవడం జ్ఞ్యానవల...
ఏ వలలో చిక్కి తదనుగుణమైన ఫలితాలు పొందుతామనేది వారి వారి గురుభక్తి, దైవభక్తి పై ఆధారపడేవిషయం.....

శ్రీ చాగంటి సద్గురువులు నుడివినట్టుగా ఆ రోజు చెయ్యవలసిన ముఖ్యమైన పని జీవుడికి ఇహపరాల్లోను ఉపయుక్తమయ్యే విధంగా బాగ పుణ్యం మూటకట్టుకోవడం......
మరీముఖ్యంగా " శీతలోదకభరితజలభాండదానం " అనగా చల్లటి త్రాగునీటితో నింపబడిన ఒక మట్టికుండ / కూజా ని ఒక సత్బ్రాహ్మణోత్తమునకు దానం గా
ఇవ్వడం.......
ఇవ్వడం.......
సంకల్ప సహిత సమంత్రక దానంగా ఇవ్వడం మరింత ప్రశస్తం.....
మన వైదిక ధర్మానికి ఆయువుపట్టే "సంకల్ప సహిత సమంత్రక క్రతువులు"
యావద్ ప్రపంచంలో మరెక్కడా కానరాని విశేషమైనది మన సనాతన ధర్మం కాబట్టే ఇక్కడి వేదోక్త క్రతువులకు వెలకట్టలేని విలువ గొప్పదనం ఇవ్వబడి యావద్ ప్రపంచం తలవంచి నమస్కరించే దేశంగా ఈ భారతదేశం యుగయుగాలుగా ఖ్యాతి గడించింది....

ఒక అమూల్యమైన రత్నం యొక్క విలువ అది తనంతట తాను స్వతహాగా
నిర్ణయించి ఎదుటివ్యక్తికి చెప్పదు.....
నిర్ణయించి ఎదుటివ్యక్తికి చెప్పదు.....
గొలీల ఆట ఆడుకునే ఒక పిల్గాడి చేతికి ఆ రత్నం చిక్కితే అది కూడ అతడిదెగ్గర ఉన్న మిగతా రాళ్ళలో ఒక రాయిగా విలువకట్టబడుతుంది.....
ఒక స్వర్ణకారుడి చేతికి అది లభించి ఆభరణంలో మణిపూసగా అమరినప్పుడు ఆ ఆభరణం తో పాటుగా అది విలువకట్టబడుతుంది....
బాగా నిష్ణాతుడైన ఒక వజ్రాల వ్యాపారికి అది లభిస్తే తన దెగ్గర ఉన్న మిగతా రత్నాలతో పోల్చబడి దానికి తగురీతిలో విలువపొందుతుంది.....
ఇక్కడ రత్నం తన స్థానం వల్ల, అనగా అది లభించిన వ్యక్తి యొక్క జ్ఞ్యానానికి సమంగా విలువకట్టబడిందే తప్ప దాని యొక్క స్వతహ్సిద్దమైన విలువ ఇంత అని ఎవ్వరు ఆ రత్నానికి విలువకట్టలేదు.....
అట్లే ఈ భరతభూమి ని కొందరు మిగతా అన్నిదేశాలమాదిరిగా ఇంకో దేశం మాత్రమే అని భావిస్తారు....
( రత్నంతో గోలీలు ఆడుకునే ఆ పోరగాడిలా ) వారికి అది అక్కడివరకే విలువ.....
( రత్నంతో గోలీలు ఆడుకునే ఆ పోరగాడిలా ) వారికి అది అక్కడివరకే విలువ.....
ఇంకొందరు మరింతగా ఈ దేశం యొక్క విలువను కేవలం భోగభూమిగా కాకుండా కర్మభూమిగా, ధర్మభూమిగా, యోగభూమిగా గుర్తించి తదనుగుణంగా ఈ దేశాన్ని
గౌరవిస్తారు.....
( ఆభరణంలో మణిపూసగా తనకు లభించిన రత్నాన్ని పొదిగిన స్వర్ణకారుడి రీతిగ )
గౌరవిస్తారు.....
( ఆభరణంలో మణిపూసగా తనకు లభించిన రత్నాన్ని పొదిగిన స్వర్ణకారుడి రీతిగ )
మరి కొందరు ఈ దేశాన్ని తద్ అభిన్నమైన వైదికసంస్కృతిని, సనాతనశాస్త్రప్రాభవాన్ని, గౌరవిస్తూ ఈ భూమిని జ్ఞ్యానభూమిగా సేవించి వెలకట్టలేని కైవల్యభూమిగా మార్చుకొని తరిస్తుంటారు.....
( రాళ్ళను, రత్నాలను జ్ఞ్యానదృష్టితో చూసి వేరుచేసి రత్నానికి తగు విలువనిచ్చి గౌరవించిన ఆ ఆరితేరిన వజ్రాల వ్యాపారిలా..... )
కాబట్టి ఇక్కడ ఈ దేశం యొక్క గొప్పదనం కేవలం అందులో జన్మించిన వ్యక్తుల వల్ల కాకుండా ఈ దేశానికి మాత్రమే సొంతమైన వైదిక శాస్త్ర విజ్ఞ్యాన సంపత్తి ని గురువుల, ఆచార్యుల, యోగుల, సిద్ధపురుషుల, భక్తభాగవతుల, సాంగత్యం, అనుగ్రహం, వల్ల లభించిన జ్ఞ్యానదృష్టికి తగు రీతిలో ఆపాదించబడుతుంది అనేది నిర్వివాదాంశం........
కాని ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది.....
రెండు అరచేతులు కలిస్తేనే కరతాళధ్వని ప్రభవించి
( చప్పట్లు ) ఎదుటి వ్యక్తిని అభినందించగలం.....
( చప్పట్లు ) ఎదుటి వ్యక్తిని అభినందించగలం.....
రెండు భాస్పరపుతునకలను రాపాడిస్తేనే అందులోనుండి అగ్ని ప్రభవించి దీపాన్ని వెలిగించగలం....
అట్లే ఒక ఉన్నతమైన జ్ఞ్యానస్థాయిలో ఉన్న వ్యక్తి కి అంతటి ధీటైన కోవిదుడు ఎదురుగా నిలిచిననాడే వారి పరస్పర సహకారంవల్ల ఆ దేదీప్యమైన జ్ఞ్యానరాశి లోకానికి అందివచ్చి తన్మూలంగా ఎందరెందరికో ఆ జ్ఞ్యానజ్యోతులు మార్గదర్శకత్వాన్ని వహించి జ్ఞ్యానమార్గాన్ని ఆశ్రయించిన వారందరికి యోగక్షేమాలను ఒసగుతు వారి జీవితాలను తరింపచేసేది......
( ఒక్క అగ్గిపుల్లను అగ్గిపెట్టేతొ రాపాడించి వెలిగించిన ఆ ఒక్క దీపం కొన్ని వందల వేల దీపాలను వెలిగించగలదు అన్నచందంగా.....)
శ్రీచాగంటి సద్గురువుల సంపూర్ణ రామాయణంలో సీతమ్మ రావణాసురుడితో సంభాషించే సమయంలో ఒక ప్రశ్న అడుగుతుంది.....
" రావణా.... నీకు లంకలో మంచి చెప్పేవారు లేరా.....
లేదా చెప్తే విని నిన్ను నువ్వే సరిదిద్దుకునే లక్షణం నీకు లేదా ....?
నన్ను బాధించి నీ పుణ్యాన్ని నువ్వే కరిగించుకొని నీ మృత్యువుని నువ్వే వండుకుంటున్నావు.......తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త......"

అవ్విధంగా చెప్పే వారు ఉండాలి.....
చెప్తే వినే వారూ ఉండాలి.......
అప్పుడే ఆ ప్రయాస సార్ధక్యం చెందుతుంది.....
చెప్తే వినే వారూ ఉండాలి.......
అప్పుడే ఆ ప్రయాస సార్ధక్యం చెందుతుంది.....
అట్లే జ్ఞ్యానమార్గంలో ప్రయాణంగావించి కైవల్య తీరానికి చేరగోరే వారికి కూడా సద్వాక్కుల దివిటీలతో ఉభయకర్మక్షయాన్ని గావించి ముక్తితీరానికి చేర్చే మహాత్ములు లభించి, వారి సద్వాక్కుల సహాయంతో ప్రయాణం కొనసాగించే వారు ఉన్నప్పుడే ఆ ప్రయాస సార్ధక్యం చెందుతుంది......
వీటన్నిటికి మూలకారణం భగవద్ అనుగ్రహం తన్మూలంగా జనించే తత్త్వజ్ఞ్యాన జిగ్న్యాసా భరిత అధ్యాత్మతత్త్వచింతన........
అసంఖ్యాకమైన జన్మపరంపరలో గడించబడిన విశేషమైన పుణ్యబలం చేతనే అది సంభవించేది.....
ఆ పుణ్యానికి హేతువు భగవద్భక్తి అనగా భక్తిమార్గ ప్రయాణం......
ఆ భగవద్భక్తి వల్ల సమకూరిన భగవదనుగ్రహంవల్ల సిద్ధించబడేది జ్ఞ్యానం......
ఆ అధ్యాత్మజ్ఞ్యాన ప్రయాణం వల్ల తుదకు భగవదనుగ్రహంగా సిద్ధించబడేది జన్మరాహిత్యమైన స్థితి అనగా మోక్షం......
ఆ భగవద్భక్తి వల్ల సమకూరిన భగవదనుగ్రహంవల్ల సిద్ధించబడేది జ్ఞ్యానం......
ఆ అధ్యాత్మజ్ఞ్యాన ప్రయాణం వల్ల తుదకు భగవదనుగ్రహంగా సిద్ధించబడేది జన్మరాహిత్యమైన స్థితి అనగా మోక్షం......
భగవద్భక్తి --> భగవదనుగ్రహం --> పుణ్యకర్మసంచయం / పాపకర్మక్షయం --> జ్ఞ్యానసముపార్జన --> భగవద్భక్తి
అనే ఈ పంచవిధమైన వలయప్రయాణంలో ఎన్నెన్నో జన్మల ప్రయాణంగావించిన జీవుడికి ఒకనాడు కేవల భగవదనుగ్రహం వల్ల ఆఖరిదైన
జ్ఞ్యానసముపార్జన --> భగవద్భక్తి
అనే వలయస్థానంలో ఉన్న ప్రాణి యొక్క చిత్తశుద్ధికి సంతసించి సదరు జీవుడిని ఈశ్వరుడు తనలోకి లయించివేసి ఆ జన్మపరంపరల వలయము నుండి ఇక పూర్తిగా స్వతంత్రత ప్రసాదించి అనుగ్రహిస్తాడు......
అనగా జీవుడిని కైవల్యతీరానికి జీవేశ్వరుడు చేర్చుట అన్నమాట....
అనగా జీవుడిని కైవల్యతీరానికి జీవేశ్వరుడు చేర్చుట అన్నమాట....
అనగా క్లుప్తంగా ఈ యావద్ కర్మచట్రాన్ని జాగ్రత్తగా పరికించిచూస్తే జీవుడికి అతి ముఖ్యమైనది పుణ్యం తన్మూలంగా జనించే భగవద్భక్తి భరిత చిత్తశుద్ధి......
కాబట్టి పుణ్యసంచయంకోసం ఈశ్వరుడు ప్రసాదించిన ఎన్నో పర్వదినాల్లో ప్రశస్తమైనది ఈ అక్షయతృతియ........
కాబట్టే సుదీర్ఘ జీవయాత్రల్లో ఉపయుక్తమయ్యే విధంగా జీవుడికి కావలసిన అక్షయమైన పుణ్యబలాన్ని సమకూర్చే విధంగా ఈ అక్షయతదియనాటి పర్వదినాన్ని మలచుకోవడంలోనే మనుష్యునకు తన మానవప్రయాసకి సార్ధకత లభించి లాభించేది.......
ఇక్కడ గమనిస్తే భక్తిమార్గము / జ్ఞ్యానమార్గము రెండూకూడా సమ్మిళితమై ఉన్నట్టుగా కనిపించడం కద్దు........
కొందరు అవి వేరు వేరు మార్గాలు అని భావిస్తారు.......
కాని నిజానికి అవిరెండు కూడా ఒకేవిధమైన మార్గంలో మనల్ని ప్రయాణింపచేస్తాయి అనేది నిఘూడమైన అధ్యాత్మ సత్యం.......
శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో చెప్పాలంటే
కాని నిజానికి అవిరెండు కూడా ఒకేవిధమైన మార్గంలో మనల్ని ప్రయాణింపచేస్తాయి అనేది నిఘూడమైన అధ్యాత్మ సత్యం.......
శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో చెప్పాలంటే
"భక్తి / జ్ఞ్యాన మార్గాలు రెండూ కూడా ఈశ్వరుని కడకు కొనిపోవు సమాంతర మార్గములు ....."
చిన్న లౌకిక ఉదాహరణతో ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్ గా చెప్పే ప్రయత్నం కావిస్తాను......
గౌ|| ముఖ్యమంత్రివర్యులు శ్రీ కే.సీ.ఆర్ గారు
గౌ|| ప్రధానమంత్రివర్యులు శ్రీ నరేంద్రమోది గారు నిర్వహించే ఒక అత్యవసర ప్రత్యక్ష వ్యక్తిగత సమావేశానికి ఢిల్లీ కి ప్రయాణం చేయాలి అనుకుంటే.....
గౌ|| ప్రధానమంత్రివర్యులు శ్రీ నరేంద్రమోది గారు నిర్వహించే ఒక అత్యవసర ప్రత్యక్ష వ్యక్తిగత సమావేశానికి ఢిల్లీ కి ప్రయాణం చేయాలి అనుకుంటే.....
వారు వెంటనే చేసేది
1. ఒక హెలికాప్టర్ / పర్సనల్ చాపర్ సహాయంతో గగనతలం మీదుగా ఢిల్లీ చేరుకోవడం.......
1. ఒక హెలికాప్టర్ / పర్సనల్ చాపర్ సహాయంతో గగనతలం మీదుగా ఢిల్లీ చేరుకోవడం.......
2. ఢిల్లీ కి మరో గంటలో బయలుదేరే ఫ్లైట్స్ గురించి సమాచారం సేకరించి ఒక ఏరోప్లేన్ ఎక్కి ఢిల్లీ చేరుకోవడం.......
వారు ఏ పద్దతిలో ప్రయాణంగావించినాసరే,
అవలంబించే గగనమార్గం ఒక్కటే.....
చేరుకునే గమ్యం ఒక్కటే...
అవలంబించే గగనమార్గం ఒక్కటే.....
చేరుకునే గమ్యం ఒక్కటే...
ఇక్కడ మార్గము, మాధ్యమము ఒక్కటే అయినాసరే కొన్ని భేదాలు మాత్రం ఉండడం సహజం......
అవేంటో ఒకసారి చర్చించి, అచ్చం అదేవిధంగా భక్తి / జ్ఞ్యాన మార్గాల్లో ప్రయాణించే జీవుడు జీవేశ్వరుడిని ఏ విధంగా పొందుతాడో అనే సామ్యాన్ని పరికిద్దాం......
1. "Heavy upward thrust propeller coupled with sufficient forward thrust addition..."
అనే సూత్రానికి అనుగుణంగా వ్యవస్థీకరించబడిన
హెలికాప్టర్ లో ప్రయాణించడం
( జీవుడు భక్తి మార్గంలో ప్రయాణించడానికి సూచిక )
అనే సూత్రానికి అనుగుణంగా వ్యవస్థీకరించబడిన
హెలికాప్టర్ లో ప్రయాణించడం
( జీవుడు భక్తి మార్గంలో ప్రయాణించడానికి సూచిక )
ఇది ఒకరకంగా చెప్పాలంటే ప్రైవేట్ ప్రయాణం. హెలికాప్టర్ నడిపే పైలట్ తో కాకుండా ఇతరులతో పెద్దగా సంబంధంలేని ప్రయాణం......
ఆకాశంలో తక్కువ ఆల్టిట్యూడ్ లో కొనసాగగలిగే ప్రయాణం....
లోపల ఉన్నవారికి మరియు బయట క్రింద భూమి పై ఉన్న వారికి కూడా నిరంతరం హోరెత్తించే శబ్దం తో కూడిన ప్రయాణం.....
భూమి పై ఉండే మిగతా అందరు కూడా చూడగలిగే ప్రయాణం.......
అవసరమైతే మధ్యలో అనువైన చోట ( హెలిప్యాడ్ ) క్రిందకి దిగి ఇంకొకరిని ఎక్కించుకోవడం, ఎమైనా కొత్త సామాన్లు వగేరా తీసుకోవడం,
అవసరమైతే మనకు పైనుండి పులిహోర పాకెట్లు అట్లాంటివి అందివ్వగలిగే ప్రయాణం,
" వాయుపీడనబంధనం " /
' Air Pressure Insulation ' అనే కాన్సెప్ట్ ఇక్కడ వర్తించదు......

అనగా ఇది భూమికి దెగ్గరగా సాగగలిగే ప్రయాణం........
2. "Heavy forward thrust propeller coupled with sufficient upward thrust addition...".."
అనే సూత్రానికి అనుగుణంగా వ్యవస్థీకరించబడిన
ఏరోప్లేన్ లో ప్రయాణించడం
( జీవుడు జ్ఞ్యాన మార్గంలో ప్రయాణించడానికి సూచిక )
అనే సూత్రానికి అనుగుణంగా వ్యవస్థీకరించబడిన
ఏరోప్లేన్ లో ప్రయాణించడం
( జీవుడు జ్ఞ్యాన మార్గంలో ప్రయాణించడానికి సూచిక )
ఇది ఒకరకంగా చెప్పాలంటే పబ్లిక్ ప్రయాణం. ఏరోప్లేన్ నడిపే పైలట్ తో కాకుండా ప్లేన్ లో ఉండే ఇతరులందరితో కూడా సహకరిస్తూ సాగవలసిన ప్రయాణం......
ఆకాశంలో ఎక్కువ ఆల్టిట్యూడ్ లో కొనసాగే ప్రయాణం....
లోపల ఉన్నవారికి మరియు బయట క్రింద భూమి పై ఉన్న వారికి కూడా
ప్లేన్ ఒక ఎత్తు అందుకున్న తర్వాత అంతగా శబ్దం వినిపించని ప్రయాణం.....
అవసరమైతే మధ్యలో దిగి ఇంకొకరిని ఎక్కించుకోవడం, ఎమైనా కొత్త సామాన్లు వగేరా తీసుకోవడం లాంటివి కుదరవు.....,
మనకు పైనుండి పులిహోర పాకెట్లు అట్లాంటివి ప్లేన్ కిటికీలు తెరిచి అందివ్వడం లాంటివి ఉండవు....,
" వాయుపీడనబంధనం " /
' Air Pressure Insulation ' అనే కాన్సెప్ట్ కచ్చితంగా అవసరమయ్యే ప్రయాణం........

అనగా భూమి పై ఉండే మిగతా వాళ్ళతో సంబంధం లేని విధంగా చాల ఎత్తులో సాగే ప్రయాణం.......
అచ్చం ఇదే విధంగా
1. జీవుడు భక్తి మార్గంలో ప్రయాణించేటప్పుడు,
ఇతరులతో పెద్దగా సంబంధంలేని విధంగా అది ఒకరకమైన వ్యక్తిగత ప్రయాణం.....
నిరంతరం భగవన్నామస్మరణం / భగవద్ చింతన అనే ధ్వని హోరెత్తించే ప్రయాణం......
ఎందుకంటే ఇక్కడ అదే upward propelling force కాబట్టి....
లౌకికంగా భూమిపై ఉండే ఇతర భక్తులందరికి కూడా దెగ్గరగా సాగే ప్రయాణం.......
ఈ భక్తి మార్గ ప్రయాణం ఇతరులు కూడా సులభంగా అందుకోగలిగిన ప్రయాణం........
భగవద్ ప్రసాదంగా మధ్యమధ్యలో పులిహోర, చక్కెరపొంగలి ఇత్యాది ప్రసాదాలను హాయిగా ఆరగిస్తూ సాగే ప్రయాణం...😊

పంచేంద్రియచిత్తవృత్తుల బంధనం ఇక్కడ అంతగా వర్తించని ప్రయాణం.......
ఆ ఇంద్రియకలాపాలన్ని కూడా యధావిధిగానే ఉంటాయి కాని అవన్నీ కూడా భగవద్పరంగా కొనసాగుతాయి......
అనగా ఇది లౌకిక / ప్రాపంచిక పోకడలకు చాలా దెగ్గరగా సాగే సులభతరమైన ప్రయాణం.......!
2. జీవుడు జ్ఞ్యాన మార్గంలో ప్రయాణించేటప్పుడు,
ఇతర తోటి జ్ఞ్యానులందరితోను కలిసిమెలిసి సాగించే ఒక విధమైన పబ్లిక్ ప్రయాణం.....
అనగా సదరు జ్ఞ్యాని యొక్క తత్త్వ ప్రతిపాదన యావద్ లోకానికి సమ్మతమై ఉండగలగాలి......
అది అందరి ప్రశ్నలకు సశాస్త్రీయ సమాధానాలు ఇవ్వగలిగి చెక్కుచెదరని తత్త్వధీరత్వాన్ని ప్రతిపాదించే రీతిలో కొనసాగే లోకశ్రేయస్కరమైన అధ్యాత్మ జ్ఞ్యాన ప్రయాణం అయ్యి ఉండగలగాలి....
అది అందరి ప్రశ్నలకు సశాస్త్రీయ సమాధానాలు ఇవ్వగలిగి చెక్కుచెదరని తత్త్వధీరత్వాన్ని ప్రతిపాదించే రీతిలో కొనసాగే లోకశ్రేయస్కరమైన అధ్యాత్మ జ్ఞ్యాన ప్రయాణం అయ్యి ఉండగలగాలి....
ఆ జ్ఞ్యానభరితతత్త్వప్రతిపాదనలు సార్వజనీనమై సార్వకాలిక సత్యశ్రేష్టములై చిరంతన జ్ఞ్యానదీపికలై శాశ్వతమై నిలిచి గెలిచే రీతిలో కొనసాగే ప్రయాణమై ఉండగలగాలి....
లౌకికంగా భూమిపై ఉండే ఇతర భక్తులందరికి కూడా అంత దెగ్గరగా ఉండని ప్రయాణం.......
ఈ జ్ఞ్యాన మార్గ ప్రయాణం ఇతరులు అంత సులభంగా అందుకోలేని ప్రయాణం........
ఈ జ్ఞ్యాన మార్గ ప్రయాణం ఇతరులు అంత సులభంగా అందుకోలేని ప్రయాణం........
పంచేంద్రియచిత్తవృత్తుల బంధనం అనేది ఇక్కడ కచ్చితంగా వర్తించే ప్రయాణం.......
ఇంద్రియకలాపాలన్ని కూడా యధావిధిగా కాకుండా అవి వివిధ జ్ఞ్యాన స్థ్యాయిలో ఉండి భగవద్పరంగా కొనసాగుతాయి......
అనగా ఇది లౌకిక / ప్రాపంచిక పోకడలకు దెగ్గరగా సాగని ప్రయాణం.......!
ప్లేన్ ఒక ఎత్తు అందుకొని వినువీధిలో స్థిరంగా కొనసాగేటప్పుడు క్రింద భూమిపై ఉండి చూసే వారికి అది ఆకాశంలో నిశ్శబ్దంగా సాగిపోయే ఒక చిన్న విహంగం లాగ కనిపిస్తుంది......
కాని అదే స్థాయిలో ప్రయాణించే ఇంకో ప్లేన్ కి మాత్రమే ఆ స్థాయిలో
ఎంతో గంభీరంగా వేగంగా స్థిరంగా దూసుకుపోతున్న ఆ ప్లేన్ యొక్క విశ్వరూపం గోచరించేది....
ఎంతో గంభీరంగా వేగంగా స్థిరంగా దూసుకుపోతున్న ఆ ప్లేన్ యొక్క విశ్వరూపం గోచరించేది....
అట్లే జ్ఞ్యానమార్గంలో ప్రయాణించే వారు కూడా.....
ప్రపంచంలోని ఇతరులకు ఒక్కోసారి వారొక నిశ్శబ్దమైన సోదిమాలోకం లాగ కనిపిస్తారు.......
ప్రపంచంలోని ఇతరులకు ఒక్కోసారి వారొక నిశ్శబ్దమైన సోదిమాలోకం లాగ కనిపిస్తారు.......
ఆ జ్ఞ్యానస్థాయిలో ఉండే ఇతరులకు మాత్రమే వారి యొక్క నిశ్శబ్దంలోని
గాంభీర్యం, వేగం, స్థిరత్వం కానవస్తాయి....!
గాంభీర్యం, వేగం, స్థిరత్వం కానవస్తాయి....!
తుదకు ఇరు మార్గాలు కూడా చేరేవి ఆ సర్వేశ్వరుడినే కాబట్టి దేని విలువ దానిదే......
ఏది ఎక్కువ కాదు......ఏది తక్కువ కాదు.....
ఏది ఎక్కువ కాదు......ఏది తక్కువ కాదు.....
ఎవరికి ఏ మార్గం వారి వారి గురువుల ద్వార భగవదనుగ్రహంగా అందివ్వబడుతుందో వారికి ఆ మార్గం ఈశ్వరుడిని చేరే మార్గం అన్నమాట....
కాని అన్నిటికి మూలం మాత్రం భక్తియే...!!
భక్తి --> జ్ఞ్యానం --> పుణ్యం --> చిత్తశుద్ధి --> జన్మరాహిత్యం.....
అటువంటి అక్షయమైన భక్తి, పుణ్యం, జ్ఞ్యానం, చిత్తశుద్ధి, ఇత్యాది ఇహ పర లోక సంపదలన్నీ కూడా వర్షించేందుకు హరి భక్తి అనేది ఒక అమూల్యమైన సాధనం.......
అనన్యసామాన్యమైన శ్రీహరిసంకీర్తనం సకల శాస్త్రవేదేతిహాసా పారాయణ ఫలితాన్ని ప్రసాదించి ఒక మనుష్యునకు ఇహ పరాల్లో సుఖించేందుకు అవసరమైన అక్షయమైన సంపదలన్నీ అనుగ్రహిస్తుంది అని మనకు సెలవిస్తు అన్నమాచార్యుల వారు ఎంత ఘనమైనరీతిలో ఈ క్రింది సంకీర్తనను రచించారో ఒకసారి చూడండి......
********************************
145.chAladA brahmamidi-చాలదా బ్రహ్మమిది
145.chAladA brahmamidi-చాలదా బ్రహ్మమిది
Audio link :G.BalaKrishnaPrasad
Audio link :MohanaKrishna
Archive link :
Audio link :MohanaKrishna
Archive link :
ప|| చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనం ||
చ|| సంతోష కరమైన సంకీర్తనం | సంతాప మణగించు సంకీర్తనం |
జంతువుల రక్షించు సంకీర్తనం | సంతతము దలచుడీ సంకీర్తనం ||
జంతువుల రక్షించు సంకీర్తనం | సంతతము దలచుడీ సంకీర్తనం ||
చ|| సామజము గాంచినది సంకీర్తనం | సామమున కెక్కుడీ సంకీర్తనం |
సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం ||
సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం ||
చ|| జముబారి విడిపించు సంకీర్తనం | సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం | శమదమాదుల జేయు సంకీర్తనం ||
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం | శమదమాదుల జేయు సంకీర్తనం ||
చ|| జలజాసనుని నోరి సంకీర్తనం | చలిగొండ సుతదలచు సంకీర్తనం |
చలువ గడు నాలుకకు సంకీర్తనం | చలపట్టి తలచుడీ సంకీర్తనం ||
చలువ గడు నాలుకకు సంకీర్తనం | చలపట్టి తలచుడీ సంకీర్తనం ||
చ|| సరవి సంపదలిచ్చు సంకీర్తనం | సరిలేని దిదియపో సంకీర్తనం |
సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం ||
సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం ||
********************************
కలియుగ ప్రత్యక్ష పరమాత్మగా కొలువైన ఆ
శ్రీ వేంకటాచలాధీశుడు అందరికి అక్షయమైన భక్తి ప్రపత్తులను, పుణ్యాన్ని కటాక్షించి ఎల్లరిని చల్లగా కరుణించి కాపాడుగాక.....😊🙏
శ్రీ వేంకటాచలాధీశుడు అందరికి అక్షయమైన భక్తి ప్రపత్తులను, పుణ్యాన్ని కటాక్షించి ఎల్లరిని చల్లగా కరుణించి కాపాడుగాక.....😊🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః.....!
No comments:
Post a Comment