Wednesday, April 1, 2020

My B.Tech Final Year Tour & importance of ' Shraddham' .....

శ్రీసిమ్హాచల శ్రీవరాహనృసిమ్హస్వామి
( సిమ్హాద్రి అప్పన్న ) పుణ్యక్షేత్రం, కైలాసగిరి, అరకు లోయ / కాఫీ తోటలు, బొర్రా కేవ్స్, ఆర్కే బీచ్, రాజమండ్రి పేరంటాలపల్లి గోదావరి బోట్ ట్రిప్, మారేడుమిల్లి ఫారెస్ట్ విసిట్, ఇలా వీటన్నిటిని కవర్ చేస్తూ సాగిన మా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ టూర్ కి వెళ్ళడం జీవితంలో ఒక పెద్ద మధురస్మృతి....... నాలుగు సంవత్సరాలు కష్టనష్టాల్లో సుఖదుఖాల్లో ఒకరికొకరం చేయుత నిచ్చుకుంటూ సాగిన ఆ ఇంజనీరింగ్ చదువులనాటి రోజులు శాశ్వతంగా గుర్తుండిపోవడంకోసమే ఒక యాత్రలో అందరిని భాగస్వామ్యం చేసిందేమో కాలం అని అనిపించకమానదు వెళ్ళిన ఎవ్వరికైనా సరే........
భద్రాద్రికొత్తగూడెం, రామవరం ఊర్లోని అమ్మమ్మ ఇంటి దెగ్గర చెట్టు కింద స్కూల్లో నర్సరి అనే పేరుతో కొన్ని రోజులు పలకా బల్పం పట్టి, ఆ తదుపరి కొన్ని రోజులు జమై ఒస్మానియ దెగ్గరి రాం నగర్ లోని మదర్ థెరెసా స్కూల్లో ఎల్కేజి అనే పేర అదే పలకా బల్పం పట్టి అ ఆలు, ఏ బి సి డీ లు దిద్దిన రోజులనుండి,
మూసాపేట్ భరతనగర్ లోని వివేకానంద స్కూల్లో యూకేజి అని కొన్ని రోజులు 'ఏ ఫర్ యాపిల్....' అయ్యకా జగద్గిరిగుట్ట దెగ్గరి ప్రగతినగర్ స్లం బస్తిలోకి మా మకాం మారడంతో దెగ్గర్లోని రాజధాని స్కూల్లో 1 వ తరగతి నుండి చదువులు మొదలయ్యిన రోజుల దెగ్గరి నుండి, కూకట్పల్లి లోని శ్రీచైతన్య లో ఇంటర్ పూర్తయ్యి నర్సాపూర్లోని బి.వి.అర్.ఐ.టి లో ఈ ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు జీవితంలో ఏ టూర్లకి పెద్దగా వెళ్ళింది లేదు.....
( స్కూల్లో ఒకసారి నాగార్జున్సాగర్ ట్రిప్ కైతేవెళ్ళాం....)
జే.బి.యస్ లో బస్సెక్కి వేములవాడ కు వెళ్ళి 5 కత్తెరలు ఇచ్చి కొండగట్టులో పూర్ణంగా కొరిగించుకొని దర్శనాలయ్యాక ఇంటికి 2 లడ్డూలు, 4 కాశీదారాలు తో రావడమే 21 సంవత్సరాలపాటు నాకు తెలిసిన టూర్లు / తీర్థయాత్రలు /.... సమ్మర్ సెలవుల్లో ఒక్కడినే ఉప్పల్ బాబై వాళ్ళింటికి అట్నుండి కొత్తగూడెం అమ్మమ దెగ్గరికి ట్రైన్లో వెళ్ళడమే నాకు ప్రతి సంవత్సరము కొనసాగే అడ్వెంచర్...........
21 సంవత్సరాల పాటు అసలు తిరుపతి అంటే ఏంటో, శ్రీశైలం అంటే ఏంటో కూడా తెలియకుండా / వెళ్ళకుండా బ్రతికిన మధ్యతరగతి జీవితాలకు ఇక ఇతర తీర్థయాత్రలు / విహారయాత్రలు అనేవి అందని ద్రాక్షే కదా......
కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడం అంటే ఎంతో ఇష్టమైన నాకు, ఆ భాగ్యం మాత్రం ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసి స్వశక్తితో జీవితంలో ఎదిగి నాకాళ్ళమీద నేనునిలబడిన తరువాతే నాకు లభించింది.........
21వ ఏట జీవితంలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించి ఉద్యోగజీవితంలో కుదురుకున్న తర్వాత శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు విన్న పుణ్యఫలంగా
ఇంటిల్లిపాదిని శిరిడి, తిరుపతి, శ్రీశైలం తీస్కెళ్ళి దర్శించడం జరిగింది.....
కాబట్టి నా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోని ఈ యాత్ర నాకు ఒకరకంగా చెప్పాలంటే వేట సినిమాలో అండమాన్ చెరసాలలో చీకటి గదిలో ఖైది గా ఉన్న చిరంజీవి జగ్గయ్య సహాయంతో బయటపడి సముద్రాన్ని ఈది మలబ్బార్ దీవుల్లో దాగిఉన్న నిధిని కనిపెట్టినంతటి ఆనందాన్ని ప్రసాదించిన యాత్ర.......
ఎప్పుడు చూసినా నా జీవితం, నా కష్టాలు, నా లోకం అన్నట్టుగా ఉండే నన్ను, చింతల్ చైతు మరియు జి.వంశి ఇద్దరు కూడా
" ఈ రెగ్యులర్ కష్టాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటూనేఉంటైర......
కష్టపడి టి.సి.యెస్ లో ప్లేస్మెంట్ సాధించావ్ కద... మరింకెందుకు అట్లే బాధగానే ఉంటానంటావ్......
లైఫ్ లాంగ్ మెమొరబుల్ ట్రిప్ గా గుర్తుంటుంది ర.... మా మాట విని వచ్చైర రా ఆటో...... "
అని అలా ఏదో కన్విన్స్ చేయడంతో సరే అనుకొని మొత్తానికి ఇంట్లో కూడా చెప్పి ఒప్పించి ట్రిప్ కి 5వేలు కావాలని అడిగి నేను కూడా పాసెంజర్ లిస్ట్లో నా పేరు వ్రాయించాను..... అలా మొత్తానికి నేను కూడా అందరి ఫ్రెండ్స్ తో పాటుగా జీవితంలో మొట్టమొదటిసారి గోదావరి ఎక్క్ప్రెస్ ఎక్కడం జరిగింది......
భాగ్యనగర్ ఎక్స్ప్రెస్స్ ( సికింద్రాబాద్ టు ఉప్పల్ )
మరియు సింగరేని ఫాస్ట్ ప్యాస్సెంజర్
( ఉప్పల్ టు భద్రాచలం రోడ్' ), ఈ రెండు ట్రైన్లు మాత్రమే తెలిసిన జీవితానికి 21వ పడిలో తెలిసిన 3వ ట్రైన్ గోదావరి ఎక్స్ప్రెస్......!
ఆ తరువాత నా జీవితం కూడా నిజంగానే ఆ గోదావరి ఎక్స్ప్రెస్ అంత వేగంతో ముందుకు దూసుకెళ్ళడం ప్రారంభించింది......
( అనగా 21వ పడి నుండి మొదలైన నా ఉద్యోగ జీవితంతో లభించిన స్వతంత్రతతో, అప్పటినుండి ఆలంబనగా అందుకున్న శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల ద్వార సమకూర్చుకున్న మానసిక స్థైర్యంతో ఎదురొచ్చిన కష్టాలను ఎగదోసుకుంటూ గోదావరి ఎక్స్ప్రెస్ లా దూసుకుపోవడమే జీవితం నాకు నేర్పింది....... ఆ అలుపెరగని నా జీవనపోరాటం మొదలై పుష్కరకాలం గడచినాసరే ఇప్పటికీ ఆ గోదావరి ఎక్స్ప్రెస్ నాకు అందించిన ఇన్స్పిరేషన్ మరచిపోలేనిది.....!
భద్రాద్రి వెళ్ళినప్పుడల్లా గోదావరి లో ఎన్నో సార్లు కాకిస్నానాలు చేసినాసరే,
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాంతర్గతంగా లభించిన సంకల్ప పఠనబలంవల్ల,
సంకల్ప సహిత తీర్థస్నానం వల్ల సాధించబడిన పుణ్యవిశేషంతో సిద్ధించబడిన ఎన్నో కార్యక్రమాలలా.......
జీవితంలో గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాతే, నేను ఎన్నో ట్రైన్లు ఎక్కి ఎన్నెన్నో ప్రదేశాలు దర్శించాను......
( తిరుపతి, బెజవాడ, అలాహాబద్, కాశి, కాకినాడ, మురమళ్ళ , ఇలా పలుప్రదేశాలకు వెళ్ళినప్పుడల్లా నాకు మొదట గుర్తొచ్చింది మాత్రం ఆ మొట్టమొదటి గోదావరి ఎక్స్ప్రెస్ యొక్క లాంగ్ జర్నీయే.....)
ఇక మా బి.టెక్ బ్యాట్చ్ ఫ్రెండ్స్ అందరం ముందుగా అనుకున్న ఐటెనరి ప్రకారంగా ట్రిప్లో అన్నీ కవర్ చేసుకునేలా ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటి కవర్ చేసుకున్నాం.....
క్లాస్రూంలో ఒక్కొక్కడు ఒక్కో విభిన్న పర్సనాలిటి.......
అమీర్పేట్ సునయన్.....
వీడు మా క్లాస్ లీడర్ అన్నమాట.
ఏది ఏమైనా సరే ముందు మా ECE బి సెక్షన్ కి రావల్సినవి, కావాల్సినవి సమకూర్చడం, కాలేజ్ లోని మిగతా ఇతర డిపార్ట్మెంట్స్ తో సత్సంబంధాలు కలిగి మా క్లాస్ కి ఒక మంచి గుర్తింపు ఉండేలా చూడడం, పేపర్ ప్రసెంటేషన్స్, వగైరాల్లో మా క్లాస్ కి ప్రతినిధిగా ఉండడం, మొత్తానికి 2004-08 ECE బ్యాట్చ్ అంటే సునయన్ వాళ్ళ బ్యాట్చ్ అనేంతగా వీడు కాలేజ్లో అందరితో మమేకమై ఉండే కలుపుగోలు వ్యక్తి.....
మా క్లాస్ ఒక అస్సెంబ్లి అనుకుంటే సునయన్ అధికారపక్షసభాపతి, గౌ||సీ.ఎం శ్రీ కేసీఆర్ లాంటి వ్యక్తి అన్నమాట.......
మాట, మనిషి, బాగా గట్టిగా ఉన్నా మనసురీత్య బాగ మృదుస్వభావి....
"అందరికోసం కొందరు...." అనేలా ప్రతిఒక్కరికై స్పందించే వ్యక్తి......😊
తిరుమలగిరి జి.వంశీచంద్ర......
వీడు పేరుకుతగ్గట్టే చంద్రుడిలా అన్నిటిని అందరిని బాగ కూల్ గా హ్యాండిల్ చేసే వ్యక్తిత్వం.....
గౌ|| వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ లాంటి వ్యక్తి అన్నమాట.......
మాటతో పాటుగా మనిషి కూడా మృదువే.... మంచి నైపుణ్యంగల ఫాస్ట్ ఎక్సిక్యూటర్...... ఎంతటి పనినైనా ఎంతో ఓపికతో చక్కబెట్టడంలో వీడు దిట్ట.....
"నేనున్నానని......" అనట్టుగా వీడు కూడా ది మోస్ట్ డిపెండబిల్ బడ్డి ఫర్ ఆల్ ది ఫ్రెండ్స్........
ఎంత ఎదిగినా ఒదిగిఉండడంలోనే గొప్పదనం ఉంటుంది అనేందుకు వీడు మంచి ఉదాహరణ.....
గర్వం అనేది ఎంత వెతికినా కనిపించని కలుపుగోలు వ్యక్తిత్వం వీడిది..... 😊
ఇక కొందరేమో బాగ సైలెంట్ పర్సనాలిటీస్.......
గౌ|| కూకట్పల్లి ఎం.ఎల్.ఏ శ్రీ మాధవరం కృష్ణారావ్ గారిలా అన్నమాట...
సతీష్ శిఖనం, కృష్ణకిషోర్, వెంకట్ వినోద్, కే.వినయ్, వినయ్ విశ్వనాథ్, ఇలా వీళ్ళందరు అసలు మాటలు వచ్చారావా అనేంతగా అనిపించే సైలెంట్ బడ్డీస్.......😊
ఇక కొందరేమో అన్నిట్లోను చలాకీ గా ఉండే బాగ ఎస్టాబ్లిష్డ్ పర్సనాలిటీస్........
గౌ|| శేరిలింగంపల్లి ఎం.ఎల్.ఏ శ్రీ ఆరెకపూడిగాంధి గారిలా అన్నమాట....
విజయ్ మణి వర్మ, సందీప్ వర్మ, సురేష్, ఇలా వీళ్ళందరు.....బాగ సౌండ్పార్టీలు కూడాను.....😁
ఇక కొందరేమో ఎప్పుడైనా ఎవ్వరితోనైనా కలివిడిగా ఉండే సింపుల్, ప్రాక్టికల్, హంబుల్, స్మైలి, పర్సనాలిటీస్.....
గౌ|| సిద్దిపేట్ ఎం.ఎల్.ఏ శ్రీ హరీష్ రావ్ గారిలా అన్నమాట.....
చింతల్ చైతన్య, సికింద్రబాద్ రాజేష్, మధుసాయి, వి.వంశి, ఇత్యాదిగా ఉండే కొందరు.....😊
ఇలా మా క్లాస్ మొత్తం ఒక అస్సెంబ్లిలా మా చదువులు, మా ఎక్సాంలు, మా ల్యాబ్లు, మా సెమినార్లు, మా అల్లరి
అన్నట్టుగా సాగిపోయిన ఆ నాలుగు సంవత్సరాలు,
4 దశాబ్దాలైనా సరే ఇట్టే కళ్ళముందు కదలాడే మధురమైన ఇంజనీరింగ్ రోజులు......
టూర్ కి వెళ్ళినవారందరికి ఆ జ్ఞాపకాలు మరింతగా పదిలమే.....
వైజాగ్ ప్రాంతానికి ఇక చేరువలో ఉండగా ట్రైన్ డోర్ దెగ్గర నిల్చొని ఆకుపచ్చని దుప్పటి కప్పుకున్న పంటచేలపైన ఆవరించి ఉన్న పొగమంచుపై బాలభానుడు తన లేలేత అరుణారుణకిరణాల విన్యాసంతో గావిస్తున్న ఆ వర్ణమంజరిని, ఆ ప్రకృతిసోయగాన్ని ఆశ్చర్యంగా తిలకిస్తుండగా........
విజయ్ మణివర్మ వచ్చి.....
" ఏరా వినైగా జీవితంలో ఎప్పుడూ ఇంతటి పచ్చదనం చూడనట్టుగా అట్లే చూస్తుండిపోయావేంట్రా.....
మొదటిసారి వస్తున్నావా ఏంటి ఇటువైపు......"
అని గట్టిగా అనడంతో ఆ భావవిపంచిక అక్కడితో ఆగి....
" అవున్రా బండోడా.....ఇలా లాంగ్ ట్రిప్లో పొగమంచుతో ఉన్న సూర్యోదయం చూడడం ఇదే మొదటిసారి....నిజంగా ఇంతటి పచ్చదనం, చల్లదనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదుర.......
ఐనా నువ్వేంట్రా ఇంటర్నల్ ఎగ్సాంస్ ఉంటే తప్ప నా దెగ్గరికొచ్చి డిస్టర్బ్ చెయ్యనివాడివి..... ఇలా వచ్చి డిస్టర్బ్ చేసావ్......."
అని ఏదో అలా కాసేపు ఆ ట్రైన్ డోర్ దెగ్గరే ముచ్చట్లు పెట్టి,
" మనం డెస్టినేషన్ కి ఆల్మోస్ట్ వచ్చేసామ్ర.....సొ ఫ్రెషప్ అవ్వమని చెప్దామని వచ్చా....."
అని వాడు చెప్పగా ఆ పృకృతిని తిలంకించడం ఆపి పళ్ళుతోముకొని ఫ్రెషప్ అవ్వగా వైజాగ్ రానే వచ్చింది......
లాడ్జ్లో బాత్, డ్రెస్సింగ్, టిఫ్ఫిన్స్, అన్నీ అయ్యాక
సిమ్హాచలం అప్పన్న స్వామి గుడికి వెళ్ళాక అక్కడున్న
" కప్పపు స్తంభం " యొక్క ప్రత్యేకత చదివినప్పుడు హమ్మయ్య టూర్లో ఈ సౌభాగ్యం కూడా లభించింది కదా అని ఆనందించి.....
సందీప్ వర్మ అందరికి ఆ టికెట్స్ కొని తెచ్చివ్వగా...... నా వంతు రాగానే కోరికల లిస్ట్ మొత్తం చదివి దండం పెట్టుకొని ఇవన్నీ త్వరలోనే అనుగ్రహించు స్వామి.......
ఇవన్నీ తీరగానే మళ్ళీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను అని మొక్కుకొని ప్రసాదాలు స్వీకరించి అలా కాసేపు ఆలయ ఆవరణలో కూర్చొని విశ్రమించాము.......
ఇక తర్వాత ఆర్కే బీచ్,కైలాశగిరి
అరకు లోయ మరియు మార్గమధ్యన ఉండే కాఫీ తోటలు, రాజమండ్రి నుండి గోదావరి బోట్ ట్రిప్ లో భాగంగా మధ్యలో ఉండే పోచమ్మ అమ్మవారి ఆలయం, రామకృష్ణ మునివాటికలోని శివాలయం అలా అన్నీ కవర్ చేసుకొని బ్యాక్ టు రాజమహేంద్రి లాడ్జింగ్.....
ఆఖరిన మారేడుమిల్లి రిసర్వ్ ఫారెస్ట్ కూడా కవర్ చేసాము......
పెద్ద పెద్ద చెట్లతో ఉండే దట్టమైన అటవీప్రాంతంలో వివిధ పక్షుల కలకూజితములు వినాలనుకునే వారికి మారేడుమిల్లి ని ' ఆర్నిథాలజిస్ట్స్ హెవెన్ ' గా చెప్పొచ్చు......
అప్పుడు టూర్ కి వెళ్ళిన మా బ్యాట్చ్ మేట్స్ అందరం అరకులోయలో దిగిన గ్రూప్ పిక్....😊
*****************
మనం నివసించే ప్రదేశము నుండి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోని ప్రదేశాలే మనకు అంత చలిగా, వింతగా, కొత్తగా అనిపిస్తాయి అని చెబితే నమ్మే మనిషికి, ఈ ఇహలోకాన్ని వీడి బహు దూరంలో కొన్ని వేల, లక్షల, కోట్ల కిలోమీటర్ల దూరంలో అనగా కొన్ని లైటియర్ల దూరంలో ఉండే పరలోకాలు ఇవ్విధంగా ఉంటాయి అని మన పెద్దలు, పూర్వులు, శాస్త్రాలు చెబితే వాటిని ట్రాష్ అని కొందరు కొట్టిపారేయడం నాకైతే బహువింతగా అనిపిస్తుంటుంది ఒక్కోసారి.....
గతించిన మన పెద్దలకు మాసికాలు, సంవత్సరికాలు తప్పకుండా శక్తికొలది శ్రద్ధతో ఆ ఇంటి పెద్ద కొడుకు మిగతా కొడుకులతో కలిసి నిర్వహించి తీరాలి అని మన సనాతన శాస్త్రం, విజ్ఞ్యులైన పెద్దలు చెబితే అది ఒక అక్కర్లేని ప్రయాసగా భావించే వారిని శాస్త్రం మాత్రం మూర్ఖులు, కృతఘ్నులు అని వచిస్తుంది......
పెద్దలు గతించిన ఒక సంవత్సరంలోపు 12 సార్లు నెలకు ఒక్కసారి, ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి ఒక్కసారి శ్రద్ధగా నిర్వహించవలసిన కార్యక్రమం శ్రాద్ధం....... చదువురాని అజ్ఞానులు అవి వదిలేస్తే మూర్ఖత్వం అనొచ్చు......మరి చదువుకున్న మూర్ఖులను ఏమంటాం......
" దేవపితృకార్యాన్నప్రమతితవ్యం..... "
" స్వాధ్యాయం నప్రమతితవ్యం...... "
అని ప్రతిగుడిలో శివరాత్రికి వెళ్ళినప్పుడైనా వింటూనే ఉంటారు.....
పైతృకకార్యాలంటే చిన్నచూపుచూసే వారిని మాత్రం పెద్దలు ఎన్నటికి క్షమించరు.......
సంవత్సరంలోని ఒక్క రోజున ఒక్క పూట వీలైన ఇరుగుపొరుగు బంధు వర్గాన్ని పిలిచి పెద్దలకు ఆ శ్రాద్ధవిధి నిర్వహించనివారు లౌకికంగా ఎంతటిఘనులైనా సరే వారు నిత్య అమంగళంతోఉండేఅధములే అని శాస్త్రవచనం......
ఇక వీటిపై కొందరు చేసే కుతర్కంలో భాగంగా చెప్పే సమాధనాలు బహు చిత్రంగా ఉంటాయి....
"పెద్దలకు చేయవలసిన సంవత్సరీకాలను మేము ఒకేసారి గోదావరిలో కలిపేసామండి.....కాబట్టి వాటి గురించి మేము పట్టించుకోము....."
గోదావరిలో కలిపేయడానికి అదెమైన 10 రూపాయల పసుపుకుంకుమపూలువత్తుల పొట్లమా...??
అది వారి ఫొటో దెగ్గర ఇంటి పెద్ద కోడలు భక్తితో నమస్కరించి దీపం వెలిగించి, వారు తినే 4 రకాల కూరగాయలు, సేరు బియ్యం, కొన్ని పండ్లు కొన్ని పూల తో ఒక గంటపాటు అందుబాటులో ఉన్న బ్రాహ్మణోత్తముడితో శ్రద్ధతో జరిపించవలసిన క్రతువు........
కనీసం 5 గురికి భోజనం పెట్టినాసరే ఒక రోజు ఆ ఇంట్లోని అందరూ తినేంతటి ఖర్చు కూడా కాదు ఆ పైతృకక్రతువుకి......
జన్మనిచ్చిన వారికి ఆమాత్రం మరియాద కూడా చెయ్యని వారి జీవితం వృధానే కాదు..... అది సకలదోషాలకు నిలయమై ఉండే జీవనంగా మారి పితృదేవతల ఆగ్రహంతో ఎట్టి శుభములను అనుగ్రహించకుండా కాలం సదా కోపంతో ఉంటుంది......
వారు బ్రతికున్నప్పుడు పెట్టినమాలేదా అనే విషయం పక్కనబెట్టి వారు గతించిన తరువాత అన్ని ఆబ్దీకాలు ఖచ్చితంగా చేసి తీరవలసిన విహిత ధర్మం....
ఇంటిపెద్ద కొడుకుకి అది తప్పకూడని బాధ్యత......
ఒక్కరోజు పెట్టే ఈ పైతృకతిథి తో వారికి ఊర్ధ్వలోకాల్లో ఆకలి తీరడం ఏంటి...... ఇలాంటి కొందరి వెర్రి ప్రశ్నలు ఇంకా చిత్రంగా ఉంటాయి.....
1. శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతం ప్రవచనాలు విన్నవారికి, ( జరత్కారోపాఖ్యానం, వాలఖిల్యులు, గృహస్తాశ్రమ ప్రాముఖ్యత )
ఇవన్నీ బాగ అర్థమవుతాయి......
ఒక ఇంట గతించిన వారి 3 తరాలవారు కూడా పితృలోకంలో ఉండి వారి పేరుమీద మనం చేసే శ్రాద్ధాలు / దానాలు అందుకొని ఆ వంశీకులను / గోత్రీకులను అనుగ్రహిస్తుంటారు అని.....
2. మనకు అది సంవత్సరంలో కేవలం ఒక్కరోజేమో......కాని వారి లోకంలోని కాలమానం ప్రకారం మన ఒక్క సంవత్సరం ద్యులోకవాసులకు ఒక్క రోజు.......
మన 100 సంవత్సరాలు వారికి 100 రోజులు......
300 సంవత్సరాల మన 3 తరాలు వారికి దాదాపుగా 365 రోజుల ఒక పైతృక సంవత్సరం......
అందుకే ఆ కార్యక్రమంలో 3 తరాల పేర్లు అనగా
తండ్రి, తాత, ముత్తాత అని అడుగుతారు తప్ప మీ 10 తరాల పేర్లు చెప్పండనో లేక కేవలం ఒకరి పేరు చెప్పండనో అని అడగరు.....
ఎందుకంటే అక్కడ ఒక పితృదేవతా సంవత్సరానికి పైన చెప్పినట్టుగా ఉండేది 3 తరాల మన పెద్దలు......
కాబట్టి వారు ఆకలితో అలమటిస్తుంటే మీరు ఎన్ని దేవతాపూజలు చేసినాసరే ఆ అనుగ్రహాన్ని పితృదేవతలు మీవరకు చేరనివ్వరు......అందుకే కచ్చితంగా వారికి జరగవలసిన ప్రతి ఆబ్దీకం జరిగితీరవలసిందే.......
మరీ ముఖ్యంగా నదులకు పుష్కరాలు వచ్చిన 12 రోజులు మీ మీ పెద్దలకు ఈ పైతృకకర్మలు చెయ్యండి చెయ్యండి అని మన పెద్దలు నెత్తినోరు మొత్తుకొని చెప్పేది ఎందుకంటే ఇంతకు ముందు వాటి నిర్వహణలో తెలిసి తెలియక చేసిన దోషాలు తొలగి విశేషంగా పితృదేవతలు తృప్తి చెందుతారు కాబట్టి, వారి అనుగ్రహానికి గురుబలం కూడా తోడై మనకు వారి అనుగ్రహం ఎన్నో రెట్లు అధికమై ప్రాప్తిస్తుంది కాబట్టి........
మీరు మాసికాలు సరిగ్గా చేయకుండ / చేయనివ్వకుండ, సంవత్సరీకాలు సరిగ్గా చేయకుండా, పుష్కరాల్లో కూడా చెయ్యకుండా వారిని అశ్రద్ధ చేస్తే వారు ఎంతగా ఆకలితో, అగ్రహం తో ఉంటారో ఒక్కసారి మీకు మేరే ఆత్మవిమర్శ చేసుకొని,
ఎవరో చెప్తే మనమెందుకు వినాలి అని కాకుండా మన క్షేమం కోసమే మన పెద్దలకు మనమే పితృదేవతారాధన నిర్వహించి వారిని శాంతపరిస్తే జరగవలసిన శుభాలు కలానుగుణంగా అవే జరుగుతాయి అని గ్రహించి విహితధర్మాన్ని నిర్వహించడంలోనే అందరి యోగక్షేమాలు ఉంటాయి అని తెలుసుకోవడమే ఉత్తమం.....
మంచి విషయాలు చెప్పేది మనకంటే చిన్నవారా పెద్దవారా అని చూడకుండ వాటిలో ఉన్న మంచిని గ్రహించి ఆచరించడంలోనే పెద్దరికం ఉంటుంది.......
ఒక డాక్టర్ గారి దెగ్గరికి వెళ్ళినప్పుడు వారి వయసు చూసి కాదుకద వెళ్ళేది.....వారిలో ఉన్న వైద్య విద్యని గౌరవించి వెళ్తాం.....
అట్లే నలుగురి మంచి కోరి చెప్పే శాస్త్రసంబంధిత విషయాలు కూడా......
సప్రామాణికంగా కావాలంటే 18 పురాణాల్లో ఒకటైన గరుడపురాణం ఒకసారి చదవండి..... చదివింది నమ్మండి.....నమ్మి ఆచరించండి.....
ఓం శాంతిః శాంతిః శాంతిః

No comments:

Post a Comment