శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయ భావే
ప్రాప్యేత్వయి స్వయముపేయ తయా స్ఫురంత్యా |
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్ || 16 ||
ప్రాప్యేత్వయి స్వయముపేయ తయా స్ఫురంత్యా |
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్ || 16 ||
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారిచే రచింపబడిన 32000 సంకీర్తనారత్నాల్లో ఇప్పుడు మనకు లభించినవి దాదాపు సగం కంటే తక్కువ అని పెద్దలు / అన్నమాచార్య సంకీర్తనా వాంజ్ఞయ పరిశోధకులు చెప్పడం వినేఉంటారు.......
పదకవితాపితామహులచే రచింపబడిన ఆ సంకీర్తనలను అధ్యాత్మ శృంగార వైరాగ్య సంకీర్తనలుగా విభాగించి వివిధ సంగీత సాహిత్య స్రష్టలు, పరతత్త్వ ద్రష్టలు వాటిని పరిశోధించి అందులో ఉపయోగించబడిన సాహితీ విజ్ఞ్యానం తో పాటుగా తద్ప్రతిపాదితమైన పరతత్త్వపరమార్ధాలను కూడా జనబాహుళ్యానికి అందించి ఆ కలియుగ ప్రత్యక్ష పరమాత్మ అనుగ్రహం భక్తులెల్లరికి చేరువయ్యేలా ప్రత్యక్షంగా పరోక్షంగా కృషిచేస్తున్న మహనీయులెందరికో ఈ లోకం సదా కృతజ్ఞ్యతతో నమస్కరిస్తూనే ఉంటుంది.........
ఆచార్యులచే అన్ని వందల వేల సంకీర్తనలు రచింపబడి కొన్ని వందల సంవత్సరాలు అవి గుప్తంగా
"అన్నమాచార్యసంకీర్తనాభాండాగారం " గా పిలువబడే ఆ చిన్న గదిలాంటి గూటిలో
( స్వామివారి ఆలయ హుండీలో కానుకలు సమర్పించి ప్రదక్షిణగా ఆ కొప్పెరకు నమస్కరించి తిరిగి వచ్చే లైన్లో అట్లే ముందుకు నడిచి శ్రీభాష్యకార్లసన్నిధికి వెళ్ళే ముందు వచ్చే ప్రదేశం ) సాక్షాత్ అన్నమాచార్యుల వంశీకులే, వాటివిలువ తెలియని దుండగుల కంటబడకుండా దాచిపెట్టడం, కొన్ని వందల సంవత్సరాల తరువాత అవి స్వామివారి సంకల్పంగా బయల్పడి ఇప్పుడున్న మన 20 / 21వ శతాబ్దానికి అవి అనుగ్రహింపబడడం, కలియుగ దైవమైన శ్రీనివాసుణ్ణి దర్శించడమంటే అన్నమాచార్య సంకీర్తనల్లోని పరతత్త్వాన్ని గ్రహించి ఆ గోవిందుడిని సాక్షాత్కరింపజేసుకోవడమే నిజమైన శ్రీవేంకటేశ్వర దర్శనంగా ఈ లోకంలో అన్నమాచార్య సంకీర్తనల ప్రాభవం దశదిశలా దినదినప్రవర్ధమానమై ఎల్లరికి ఆ శ్రీనివాసుడి సన్నిధిని వారున్న చోటే స్థిరీకరించబడి స్వామివారి అనుగ్రహం సిద్ధించబడడం...... ఇవన్నీ ఇప్పటి తరం వారు ప్రతిరోజు చూస్తున్న సత్యాలే కద......

ఇవన్నీ స్వామివారి లీలలే అనేది అధ్యాత్మ సత్యం......
కాని వీటన్నిటి వెనకాల ఇంకా ఎమైనా లౌకిక సత్యం దాగున్నదా...?
కాని వీటన్నిటి వెనకాల ఇంకా ఎమైనా లౌకిక సత్యం దాగున్నదా...?
తన సంకీర్తనావేద వ్యాప్తి ద్వారా శ్రీనివాసుడు ఈ లోకానికి ఇంకేమైనా చెప్తున్నాడా...?
ఇత్యాది గా కొందరికైనా ఆలోచనరాకమానదు....
వేల సంకీర్తనల ద్వారా ప్రతిపాదించబడుతున్నది అదే పరతత్త్వం.....కాని ప్రతీ సంకీర్తన కూడా ప్రత్యేకమైన విధంగా రచింపబడి లోకానికి అందించబడింది......
అన్ని సంకీర్తనలు కూడా ఆ శ్రీనివాసుణ్ణి వివిధ రకాలుగా కీర్తిస్తున్నాయి అనేది కనిపించే సత్యం.....
ఆ కీర్తించే వైనంలో కడు ఘనమైన గహనమైన అనుగ్రహం భక్తులకు అనుగ్రహింపబడుతున్నది అనేది కనిపించని సత్యం......
అన్నమాచార్యుల సంకీర్తనల ఆవశ్యకత ఇప్పుడున్న మన సమాజానికి ఎందుకంతగా ముఖ్యమైనది.....?
ఇంటింటా అన్నమయ్య పాట..... అనే రీతిలో అన్నమాచార్య సంకీర్తనలు అందరి జీవితాల్లో ఒక భాగమై ఉండడం ద్వార ఆ శ్రీనివాసుడు ఏ విధంగా తన భక్తులను ఈ కలియుగంలో సమ్రక్షిస్తున్నాడు....?
ఇత్యాదిగా కొన్ని ముఖ్యమైన అంశాలను ఒకసారి పరికిద్దాం....
1. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించి ఇక్కడి శాంతియుతమైన సనాతన ధర్మ జీవన విధానాన్ని దెబ్బకొట్టి, ఇక్కడి సొత్తంతా కొల్లగొట్టి ఈ దేశానికి ఎంతగానో నష్టం కలిగించేటప్పటికే వివిధ సనాతన ధర్మ వ్యతిరేకమైన రాజులు రాజ్యాలు మతాలు ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడం ప్రారంభించాయి........
అటువంటి క్లిష్ట పరిస్థితులను, ఇక్కడి ప్రజల సహజమైన సత్త్వ గుణప్రధానమైన జీవనవిధానాన్ని
తమకు అనువుగా చేసుకొని ఆంగ్లేయులు
మరింతగా ఈ దేశంలో విధ్వంసం సృష్టించడం ప్రారంభించారు....
తమకు అనువుగా చేసుకొని ఆంగ్లేయులు
మరింతగా ఈ దేశంలో విధ్వంసం సృష్టించడం ప్రారంభించారు....
అది అన్నిరకాలుగా ఇక్కడి విద్యావిధానాన్ని, జీవనవిధానాన్ని కూడా ఎంతో ఘోరంగా కోలుకోలేనివిధంగా గాయపరిచింది
కాబట్టి శౌచము, వేదాధ్యయనము, దైవారాధన, సదాచారము, ధర్మము, స్వాధ్యాయము, ఉపాసన, హరికథల ద్వార భక్తి ప్రచారము, ఇత్యాది సనాతనధర్మాంతర్గతమైన ఉనికిపట్ట్లన్నీ కూడా క్రమంగా సమాజంలో క్షీణించడం ప్రారంభించాయి.......
దానికి తోడుగా దేశ జనాభ ( ప్రపంచ జనాభా కూడా )
గణనీయంగా పెరిగిపోవడం అందులో సిమ్హభాగం సత్త్వగుణరహితమై, కలిప్రభావంతో రజోగుణ తమోగుణ సంఘాతము ఉగ్రగుణరూపంగా విజృంభించడం, చాతుర్వర్ణవ్యవస్థ లుప్తమైపోవడం, ఇవ్విధంగా యావద్ సమాజం బాహ్యాంతర కాలుష్యంతో నిత్యం సతమతమవుతూ, పరిశుద్ధమైన నీరు, ఆహారం, తగ్గిపోవడం, ఉగ్రరోగాలు ప్రబలిపోవడం, ఇత్యాదిగా కేవలం జీవించడం కోసమే నిత్యం ఒక దైనందిన పోరాటంలా ప్రజల జీవితాలు మారిపోవడం తో అసలు మనః శాంతి
అనేది ఒకటుంటుందనే విషయంకూడా
తెలియనంతగా ఇవ్వాళ్టి ఆధునిక జీవితాలు జీవితంలో ఆధ్యాత్మికతకు అసలు చోటులేకుండా చేసి చేటు చేయడం మనం గమనించవచ్చు........

ప్రశాంతత లేని జీవితంలో దైవము, దైవారాధన అనేవి అందని ద్రాక్ష.... అంటే యాంత్రికంగా ఏదో రెండు నిమిషాలు చెయ్యగలరేమో కాని ఆ ఆరాధనలో మనోలగ్నత సాధించడం కుదరని పని....
శ్రీచాగంటి సద్గురువులు చెప్పినట్టుగా ఈ కలియుగమానవులు కనీసం 18 క్షణాలపాటు కూడా మనసును నిలకడగా నిలపలేని అశక్తతతో జీవించే దుర్భరపరిస్థితుల్లో జీవనం సాగిస్తుంటారు......
కాబట్టి ఇక మిగతా గొప్ప విషయాలగురించి చింతించేందుకు ఈ కలియుగమానవులకు
అంతగా తీరికలేని కాలం.......
అంతగా తీరికలేని కాలం.......
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకొని క్రమేపి కలికాలం అనే సాలీడుగూటిలో చిక్కి శల్యమై కృషించిపోయే కీటకంలా మారిన మనుష్యిడిని ఉద్ధరించి కాపాడి కరుణించి అనుగ్రహించే మార్గం ఏది ....?
అనగా...,
ఎప్పటికీ కలుషితం కానిది....
ఎన్నటికీ శక్తిని కోల్పోనిది....
ఎవ్వరూ అపహరించలేనిది.....
ఎల్లరికీ అందుబాటులో ఉండేది.....
తక్కువ ప్రయాసతో త్వరితగతిన ఎక్కువగా అనుగ్రహించేది.....
ఎన్నటికీ శక్తిని కోల్పోనిది....
ఎవ్వరూ అపహరించలేనిది.....
ఎల్లరికీ అందుబాటులో ఉండేది.....
తక్కువ ప్రయాసతో త్వరితగతిన ఎక్కువగా అనుగ్రహించేది.....
అక్షరం.....!!
అక్షరాలు కలిపితే వచ్చే జానపదాలు.....
ఆ పదాల అల్లికలతో వచ్చే పాటలు.....
ఆ పాటలకు సాహితీవిలువలను జోడించి దైవిక మహత్తును జొప్పించి.....బీజాక్షర శక్తిని గుప్పించి...... మకుటాన్ని అలంకరించి రంగరించబడిన అమృతతుల్యమైన సంకీర్తనలు......

"కలౌ సంకీర్త్య కేశవం...." అనే సత్యాన్ని ఆధారంగా చేస్కొని...
కృతయుగంలో 4 పాదాల మీద...
త్రేతాయుగంలో 3 పాదాల మీద...
ద్వాపరంలో 2 పాదాల మీద
ఈ కలియుగంలో కేవలం ఒకే ఒక్కపాదం మీద నిలిచే ధర్మాన్ని రక్షించాలంటే,
త్రేతాయుగంలో 3 పాదాల మీద...
ద్వాపరంలో 2 పాదాల మీద
ఈ కలియుగంలో కేవలం ఒకే ఒక్కపాదం మీద నిలిచే ధర్మాన్ని రక్షించాలంటే,
ఉన్న ఆ ఎకైక మార్గమైన " సత్యం " అనే పాదాన్ని ఆలంబనగా అన్నమాచార్యులవారు ఆ పరతత్త్వ సత్యాలను సంకీర్తనల్లో పొందుపరచి ఈ లోకంలో వ్యాప్తిగావించబడేలా ఆ శ్రీనివాసుని దేవకార్యం నిర్వహించారు.......
సకల శాస్త్రపురాణవేదేతిహాస జ్ఞ్యానాన్ని మొత్తం అలతి అలతి పదాలలో నిక్షిప్తం గావించి అనంతమై ఉండి ఆద్యంతరహితమై వెలుగొందే ఆ పరమాత్మతత్వాన్ని సులభగ్రాహ్యంగా భక్తులెల్లరికి అందించి వారందరికి ఇహపరలాన్నీ కూడా ఈడేరి జీవితమే శ్రీనివాసుని శ్రీకైంకర్యంగా మారి అందరు చల్లగా జీవించేలా ఆచార్యులు ఎంతో దూరదృష్టితో కరుణతో ఆ సంకీర్తనలను జీవితాంతం రచించి తరించారు....
మనందరిని తరింపజేసారు......
మనందరిని తరింపజేసారు......
అందుకే ఆ కీర్తనలు సంకీర్తనలయ్యాయి......
సంకీర్తనలు సంకీర్తనామంత్రములయ్యాయి.....
సంకీర్తనామంత్రముల సంపుటి సంకీర్తనావేదం అయ్యింది.....
ఆ సంకీర్తనావేదమే కలిదోషభంజకమైన వైద్యమై వర్ధిల్లి ఎల్లరికి సుఖశాంతులను ప్రసాదించే
శ్రీనివాసుని శ్రీపాదశరణాగతి అనే అమృతమయమైన జీవనవిధానాన్ని ప్రసాదిస్తోంది......
శ్రీనివాసుని శ్రీపాదశరణాగతి అనే అమృతమయమైన జీవనవిధానాన్ని ప్రసాదిస్తోంది......
ప్రతి సంకీర్తన కూడా ఒక వెలకట్టలేని ఆణిముత్యమే....
ప్రత్యేకించి కొన్ని మరింతగా తణుకులీనే మేలిమిముత్యాల సరములో ఒదిగిన మణిపూసలా ఎంతో వైభవంతో ఆ శ్రీనివాసుణ్ణి కీర్తించే కడు రమ్యమైన తిరుమంత్ర ద్వయమంత్ర సారప్రతిపాదితములై అలరారే అభినవ జ్ఞ్యానమణిప్రకాశికలు.....

ఎవరు ఎంతగా గురుభక్తి హరిభక్తి అనే పరికరాలతో మెరుగులు దిద్ది ఆ సంకీర్తనామణిపూసల వెలుగులను ప్రకాశింపచేసుకొని వాటిలో ఆ శ్రీనివాసుడి వైభవాన్ని దర్శించి తరిస్తుంటారో వారికి ఆ సంకీర్తనలన్నీ కూడా చిరకాల చింతామణులై ఎల్లప్పుడు అనుగ్రహన్ని వర్శించడం కద్దు......!
మచ్చుకకు ముచ్చటైన ఈ సంకీర్తనను ఒకసారి చూడండి.....
ఎన్నెన్ని పురాణాల గాధలను తనలోఇముడ్చుకొని మనకి వాటన్నిటిని అధ్యయనం గావించిన ఫలితాన్ని అనుగ్రహిస్తున్నదో....
ఎన్నెన్ని పురాణాల గాధలను తనలోఇముడ్చుకొని మనకి వాటన్నిటిని అధ్యయనం గావించిన ఫలితాన్ని అనుగ్రహిస్తున్నదో....
************************
ప|| ఈ పాదమేకదా యిల యెల్లగొలిచినది |
ఈ పాదమే కదా యిందిరా హస్తములకిరవైనది ||
ఈ పాదమే కదా యిందిరా హస్తములకిరవైనది ||
చ|| ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది |
యీపాదమే కదా యీ గగన గంగ పుట్టినది |
యీపాదమే కదా యెలమి బెంపొందినది |
యీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది ||
యీపాదమే కదా యీ గగన గంగ పుట్టినది |
యీపాదమే కదా యెలమి బెంపొందినది |
యీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది ||
చ|| ఈ పదమే కదా యిభరాజు దలచినది |
యీపదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది |
యీపాదమే కదా యీబ్రహ్మ కడిగినది |
యీపాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది ||
యీపదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది |
యీపాదమే కదా యీబ్రహ్మ కడిగినది |
యీపాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది ||
చ|| ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది |
యీపాదమే కదా యిల నహల్యకు గోరికైనది |
యీపాదమే కదా యీక్షింప దుర్లభము |
యీపాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది ||
యీపాదమే కదా యిల నహల్యకు గోరికైనది |
యీపాదమే కదా యీక్షింప దుర్లభము |
యీపాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది ||
************************
శ్రీమహావిష్ణువుగా క్షీరసాగరంలో ఆదిశేషపర్యంకశయనుడై శ్రీమహాలక్ష్మిచే నిరంతరం పాదసంవాహనం గావించబడే ఆ లోకోత్తరమైన శ్రీపాదపద్మములే,
( అనగా ఇక్కడ లౌకికంగా స్వామివారు అలసటతో పరుండగా కాళ్ళు నొప్పిగా ఉన్నాయని లక్ష్మీ అమ్మవారు అలా కాళ్ళుపట్టడం అని కాదు.......
శ్రీచాగంటి సద్గురువులు నుడివినట్టుగా ఆవిడ ఆయనకు నిత్యాన్నపాయిని.....
( శ్రీలక్ష్మీఅష్టోత్తరం లో పఠించినట్టుగా.....)
లౌకికంగా అర్ధం నిరంతరం స్వామివారికి కావలసిన అన్నపానీయాలు సమకూర్చే పనిలో నిమగ్నమైఉండడం......
కాని మనలా స్వామివారు అన్నము ముద్దపప్పు పెరుగు స్వీట్లు ఒడియాలు మంచినీళ్ళు మజ్జిగ ఇత్యాదివి తినడం ఉండదు కాబట్టి మరి ఎవరికి అలా అన్నపానీయాలు ఆవిడ అలా సమకూర్చుతుంది...?
అక్కడ అవన్నీ చూసుకోవడానికి వివిధ సపర్యలు చేయడానికి విష్ణుపార్శ్వదులు, నిత్యసూరులు లేరా...?

అనే సందేహం రావడం సహజమే......
"నిత్యాన్నపాయినీం నిరవద్యాం...."
అనడంలో అసలైన అర్ధం ఏమనగా
స్థితికారుడైన శ్రీమన్నారాయణుడికి శ్రీమహాలక్ష్మి అమ్మవారు నిరంతరం వెంటేఉండి అన్నీ స్థితికార్యాలకి కావలసిన శక్తిని అందించే తత్త్వసూచిక.......
నారాయణుడు అనగా నారముల యందు వసించువాడు.....
నారములు అనగా నీరు, ప్రాణిసమూహము / నరసమూహము అని వివిధ అర్ధాలు కలవు.....
అనగా ప్రాణికోట్ల పాంచభౌతిక దేహంలోని హృదయపద్మంలో అంతర్యామిగా కొలువైఉండే పరమాత్మ యొక్క యోగక్షేమాలకు అవసరమైనవన్నీ సమకూర్చడం అని అర్ధం...అనగా మన యొక్క దేహపోషణకు మరియు ఆత్మోద్ధరణకు అవసరమైనవి సమకూర్చే అనుగ్రహస్వరూపిణి అని అసలైన అర్ధం...! )
వామనావతారం దాల్చి బలి దర్పాన్ని అణచి 3 అడుగుల భూదానం యాచించి యావద్ విశ్వాన్ని కొలిచిన పాదములు.....
అప్పుడు బ్రహ్మగారు తమ కమండలంలోని నీటితో ఆ శ్రీపాదాలకు పాద్యం ఇవ్వగా ప్రభవించినదే సురగంగానదీ....
ఎనెన్నో వృత్తాంతాల్లో అసురులు దేవతలపై దండెత్తినప్పుడు ఇంద్రుడితో సహా అందరు శరణాగతి గావించి వెతికిన పాదపద్మములు....
గజేంద్రుడు తనపాదాలను ఒడిసిపట్టిన మొసలిని చంపడానికి ఇక తన బలం సరిపోదని గుర్తించి ఎలుగెత్తి మొరలు పెడితే పరుగుపరుగున వచ్చి సుదర్శనచక్రం తో మొసలి కుత్తుకకత్తిరించిన ఆ పరమాత్మ యొక్క పాద్మపద్మములు ...
ఇంద్రుడి కుటిలత్త్వానికి బలై, తన పతి గౌతమమహర్షి చే జడంగా పడుండమని శపించబడిన అహల్యకు శాపవిమోచనం అనుగ్రహించిన శ్రీరామనారాయణుడి పాదపద్మాలు .....
ఎందరెందరో యోగులు సిద్ధులు తపమాచరించగా ఏ శ్రీపాదాల వేలికుండే దుర్నిరీక్ష్యమైన గోటికాంతిని సైతం దర్శించలేరో అటువంటి మహత్తరమైన శ్రీపాదపద్మములే నేడు కలియుగవాసుల భాగ్యపరిపాకమై శ్రీవేంకటాద్రి పై ఆనందనిలయంలోని అష్టదలపద్మపీఠంపై అమరి ఉండి భక్తులెల్లరికి దర్శనంప్రసాదించి ఎనలేని అనుగ్రహన్ని వర్షిస్తున్నది...!
అని ఆ శ్రీనివాసుడి శ్రీపాదవైభవన్ని ఎంత ఘనంగా ఆచార్యులు ఈ సంకీర్తనలో కృతిపరిచినారు కద......
శ్రీవైష్ణవసిద్ధాంతంలో శ్రీమహావిష్ణువు యొక్క అర్చారాధనలో శ్రీపాదార్చన చాల ముఖ్యమైనది, ప్రశస్తమైనది....
ఆపాదతలమస్తకం గా స్వామివారిని అర్చించేది / దర్శించేది అందుకే కద ......
అలాంటి శ్రీపాదాలు అధోలోకాల్లో ఉన్నవారు అర్చిస్తూ ఉన్నకారణంగా సగం మూర్తిభూమిలోపల ఉండగా శ్రీపాదార్చన కావించడం తప్పనిసరి కాబట్టే ద్వారక మహర్షి యొక్క తపఃఫలితంగా ఏర్పడిన ద్వారకాతిరుమలలోని ( చిన్న తిరుపతి ) గర్భాలయంలో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఇద్దరు మూర్తులు ఉండడం మనం గమనించవచ్చు......
అంతటి ఘనమైనవి ఆ శ్రీనివాసుడి శ్రీపాదపద్మములు...!!
అంతటి ఘనమైనవి ఆ శ్రీనివాసుడి శ్రీపాదపద్మములు...!!
అందుకే అనుకుంటా వామనావతారంలో విశ్వరూపం దాల్చిన ఆ శ్రీమన్నారాయణుడి పాదాలను సేవించిన గంగమ్మ అంతటి భాగ్యం నాకు ఎప్పుడూ ఉండవలే అని తలచి ఇప్పటికీ ర్యాలి శ్రీజహన్మోహినీకేశవస్వామి వారి ఆలయంలో స్వామి వారి పాదాలదెగ్గర నిరంతరం ఒక ఊటబావిలోని నీరులా పెల్లుబికి స్వామివారి శ్రీపాదాలను సేవిస్తూనే ఉంది...!
ప్రపంచంలో ఎన్నో ఆలయాలు మీరు దర్శించి ఉంటారు కాని ర్యాలి ఆలయంలో అతిలోకసౌందర్యం తో విరాజిల్లే ఆ జగన్మోహినీ స్వరూపం అసలు ఎక్కడా చూసిఉండిఉండరు......
అంతటి సమ్మోహనమైన స్వరూపం ఆ కేశవుడిది....!!!
ప్రపంచంలో ఎన్నో ఆలయాలు మీరు దర్శించి ఉంటారు కాని ర్యాలి ఆలయంలో అతిలోకసౌందర్యం తో విరాజిల్లే ఆ జగన్మోహినీ స్వరూపం అసలు ఎక్కడా చూసిఉండిఉండరు......
అంతటి సమ్మోహనమైన స్వరూపం ఆ కేశవుడిది....!!!
అసలు అది మానవనిర్మితమైన మూర్తి కాదు అనేది ఆ సజీవసాలిగ్రామ మూర్తిని దర్శించిన వారెల్లరికి ప్రస్ఫుటంగా గోచరించే సత్యం....!!🙏😊
"విష్ణోః పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ
యౌ "మధ్వ ఉత్స" ఇతి భోగ్య తయాఽప్యుపాత్తౌ |
భూయస్తథేతి తవ పాణితల ప్రదిష్టౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 10 ||
యౌ "మధ్వ ఉత్స" ఇతి భోగ్య తయాఽప్యుపాత్తౌ |
భూయస్తథేతి తవ పాణితల ప్రదిష్టౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || 10 ||
No comments:
Post a Comment