శ్రీభారతావని ఏనాడు ఎవ్వరిని ఇబ్బంది పెట్టని ధర్మభూమి......
అందరి మంచి కోరుకునే వేదభూమి.....
వీలైనంత సహాయం చేసే త్యాగభూమి.....
తనను ఇబ్బంది పెట్టినవారిని కూడా ఒక పద్ధతిగా
' సామ దాన భేద దండోపాయాలతో ' నిలదీసి వారికి వారే ఈ భూమిని గౌరవించి నమస్కరించి వారి నడవడిని వారే సరిదిద్దుకునేలా చేసింది.....
' సామ దాన భేద దండోపాయాలతో ' నిలదీసి వారికి వారే ఈ భూమిని గౌరవించి నమస్కరించి వారి నడవడిని వారే సరిదిద్దుకునేలా చేసింది.....
ఎన్నో దేశాలకు ఉన్నట్టుగానే ఈ భారత దేశానికి కూడా ఎంతో శక్తి ఉంది......
కాని ఆ శక్తిని సక్రమంగా లోకశ్రేయుస్సు కొరకు మాత్రమే ఉపయోగించుకునేలా తన యుక్తిని ఆ శక్తికి జతపరిచే ఎకైక దేశం ఈ భారతదేశం.....
కాని ఆ శక్తిని సక్రమంగా లోకశ్రేయుస్సు కొరకు మాత్రమే ఉపయోగించుకునేలా తన యుక్తిని ఆ శక్తికి జతపరిచే ఎకైక దేశం ఈ భారతదేశం.....
అన్ని దేశాలకు ఉన్నట్టుగానే ఈ భారత దేశానికి కూడా ఎంతో గొప్ప సంపద ఉంది......
కాని అది జీవితాలను సంకుచితపరిచి కృశింపజేసే కేవల భౌతికవాదాన్ని మాత్రమే పెంచి పోషించే సంపద కాదు.....
చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకమై ఆ భౌతిక సంపదకు సార్ధకత చేకూరేలా ఎన్నటికి తరగని దైవిక సంపదను కూడా ప్రోది చేసే అధ్యాత్మ జ్ఞ్యాన సంపద.....

యుగాలు మారిన సరే ఈ జగానికి సదా జగద్గురువై భాసించే ఎకైక భూమి ఈ భరతభూమి.....
ఇది శ్రీరాముడు కోసల దేశం నుండి వేలకు వేల క్రోసులు నడిచి లంకకు వారధి కట్టి మరీ రావణ వధ గావించబడిన భూమి......
ఇది శ్రీ కృష్ణుడు సముద్రమధ్యన ద్వారకా సామ్రాజ్యాన్ని నిర్మించి మరీ తన ప్రజలను కాపాడిన కర్మ భూమి......
అభయం సర్వభూతేభ్యోః దదామి ఏతత్ వ్రతం మమ....."
అనే అలనాటి త్రేతాయుగం నాటి పతినకు కొనాసాగింపుగా,
ఇక ఈ పాపపంకిలపు కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడిగా తిరుమలగిరిపై నిలిచి తన శ్రీపాదములను శరణాగతి గావించి జీవించేవారికి అన్నీ తానై కాపాడి తీరుతానని పద్మపీఠంపై వరదముద్రలో నిలిచిన దైవిక సిరులభూమి.......

ఇక్కడ ఏ రక్కసి ఎక్కువ కాలం నిలువజాలదు....
ఇక్కడ ఏ మహమ్మారి ఎక్కువ కాలం మనజాలదు....
ఇక్కడ ఏ గుంటనక్కల ఆటలు ఎక్కువకాలం సాగవు......
నవ్వుతూ నిలుచున్న ఆ పరమాత్ముడు నవ్వుతూనే అన్ని లెక్కలను అందరి తిక్కలను సరిచేసి ధర్మాన్ని సదా గెలిపించే లోకసారంగుడు......
అందుకే అన్నమాచార్యులవారు
" సాధించి వేంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష..... ఆది మూలమే మాకు అంగరక్ష.....శ్రీదేవుడే మాకు జీవరక్ష....." అని స్వామివారిని కీర్తించారు......
ధర్మస్య జయోస్తు..... అధర్మస్య నాశోస్తు..... ప్రాణిశుసద్భావనాస్తు విశ్వస్యకల్యాణమస్తు......
ఓం శాంతిః శాంతిః శాంతిః.....🙏
No comments:
Post a Comment