Wednesday, April 1, 2020

శ్రీభద్రకాళీం శ్రియందేహినిత్యం.....🙏😊

శ్రీ భద్రకాళి అమ్మవారు, ఓరుగల్లు ఇలవేల్పుగా, కొన్ని వందల సంవత్సరాలు ఎనలేని వైభోగాలతో
ఎంతో ఘనమైన శాక్తేయ అర్చారాధనోత్సవాలతో తులతూగిన ఆలయం.....
యావద్ భారతదేశంలో కొన్ని ఆలయాలకు మాత్రమే అపర శివస్వరూపులైన శ్రీఆదిశంకరభగవద్పాదుల వారి అమృతహస్తాల మీదుగా శక్తిస్థిరీకరణ జరిగి ఆ దైవికమూర్తులు కొలువైన ఆలయాలు బహు శక్తిసంపన్నమైనవిగా పరిఢవిల్లుతున్నాయి......
వాటిలో వరంగల్ శ్రీభద్రకాళి అమ్మవారు కూడా ఒకరు.......😊🙏
ఈ అమ్మవారి పేరులోనే భద్ర అనే పదం ఇమిడిఉన్నది.......
అనగా సకలాపదలనుండి భద్రతను ప్రసాదించునది అని అర్ధం......
వసంతఋతువులో ఎక్కువగా విరబూసే మల్లియపుష్పాలతో కావించే అర్చన దేవతలకు బహుప్రీతికరం.....
ఈ కరోనా ఆపదను శీఘ్రమే అమ్మవారు దునుమాడి భక్తులందరికి ఆయురారోగ్యైశ్వర్యాలు కలిగిస్తూ చల్లగా చూడుగాక.....🙏
ఓం భద్రకాళీం ఓంకారరూపిణీం
ఐం భద్రకాళీం ఐంద్రీస్వరూపిణీం
హ్రీం భద్రకాళీం హృషీకేశసోదరీం
శ్రీం భద్రకాళీం శ్రితకల్పవల్లీం
శ్రీభద్రకాళీం శ్రియందేహినిత్యం.....🙏😊

No comments:

Post a Comment