Monday, April 6, 2020

శ్రీసీతారామచంద్రస్వామివారి పట్టాభిషేక మహోత్సవ దృశ్యమంజరి.....😊

శ్రీసీతారామచంద్రస్వామివారి పట్టాభిషేక మహోత్సవ దృశ్యమంజరి.....😊

స్వర్ణకిరీటధారణం, మేలిమిముత్యాలహారాలంకారం,
మంత్రశుద్ధితో శుభ్రపరచబడిన నదీ సముద్ర జలాలతో,
ఆమ్రపల్లవములతో గావించబడే సుగంధోదక సంప్రోక్షణం, ఆచార్యులచే గావించబడే శృతిసుభగమైన వేదేతిహాస పఠనం, ఆహా.......
అలనాడు రావణవధ తర్వాత కుబేరుడి పుష్పకవిమానాన్ని 

( శ్రీ చాగంటి సద్గురువులు సంపూర్ణరామాయణంలో చెప్పినట్టుగా అది రావణుడు తన దెగ్గరి బంధువైన  అన్న కుబేరుడిని హింసించి కాంచన లంకను మరియు ఇతర విలువైన వస్తువులన్నిటిని లాక్కొని కుబేరుడిని లంకనుండి తరిమివేస్తే అప్పుడు ఉత్తరాన అలకాపురి నిర్మించుకొని కుబేరుడు అక్కడ ఉండడం ప్రారంభించాడు) 


అధిరోహించి శ్రీరామవానరసేన మొత్తం అయోధ్యకు తరలివచ్చిన తదుపరి జరిగిన అత్యంత మనోహరమైన కోసలేంద్రుడి పట్టాభిషేకంలా ఉంది కదు....
😊


"
రాజారామచంద్రభగవాన్ కి జై....
సీతామాయి కి జై.....
లక్ష్మణస్వామికి జై..... "

అని లోకంలో అందరు అనడం సాధారణంగా వింటూనే ఉంటాం కద.....

ఇనకులోత్తముడైన శ్రీరాముణ్ణి
రాజరాం కి జై....
రాజరాంసూర్యకిజై....
రాజరాంగురుకిజై....

అని పిలవకుండా,
తన సూర్యవంశానికి భువిపై శాశ్వతకీర్తిని సముపార్జించిపెట్టిన
ఆ శ్రీరాముడికి చంద్ర పదాన్ని అన్వయించి శ్రీరాజరామచంద్రుడిగా
పిలవడం ఏంటి అని అసలు ఎప్పుడైనా ఆలోచించారా ??

షోడశకళాప్రపూర్ణుడిగా పౌర్ణమి చంద్రుడు సూర్యుడి సకల దైవత్వాన్ని 16 కళల రూపంలో తనలోకి స్వీకరించి వినువీధిలో అచ్చం సూర్యుడిలా వెలుగుతుంటాడు.......

కాని సూర్యుడిలా వేడిగా కాకుండా చల్లగా హాయిగా అమృతాన్ని వర్శిస్తూ
వెలుగుతుంటాడు........

అటువంటి చల్లనైన చక్కనైన పరిపూర్ణమైన చంద్రుడు ఆధ్యాత్మికపరంగా మనః కారకుడు.....

( చంద్రమా మనసో జాతః.... అని కదా శృతివాక్యం.....)

ఎవరైనా ఎదైన ఉపకారం చేస్తే 
" ఎంత మంచి మనసున్న మారాజో.... నిండు నూరేల్లు సల్లగా ఉండు నాయన....." అని దీవిస్తారు పెద్దలు......

మీరు ఏ శుభకార్యానికి వెళ్ళినా సరే పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, పువ్వులు, వంటి మంగళవస్తువులతో పాటుగా అక్షతలు ( క్రిమిసమ్హారకమైన యాంటిసెప్టిక్ పసుపు కలపబడిన బియ్యం ) అక్కడ పెడతారు..... అవి వారిపై చల్లి దీవించండని........

మూడుపూటలా మంచి భోజనానికి నోచుకోని పేదవారైనా సరే,
మందిని ముంచి కోట్లకు కోట్లకు ఫారిన్ బ్యాంకుల్లో దాచిన లౌకిక ధనవంతులైనా సరే.....

అక్కడ దీచించమని ఇచ్చేది ఆ అక్షతలనే....

పేదవాళ్ళింట్లో మొక్కజొన్న, గోధుమ ఇత్యాది ఇతర గింజలు లేవా....?
ధనికుల ఇంట్లో జీడిపప్పు బాదాం పిస్తా గింజలతో పాటుగా మణులు మాణిక్యాలు లేవా ???

మరి శిరస్సుపై చల్లి దీవించడానికి కేవలం అక్షతలు 
( కలవారైతే కొందరు ముత్యాలు కూడా అందులో కలుపుకొని ఉపయోగిస్తారనుకోండి ) ఉపయోగించడమే ఎందుకంటే అవి చంద్రసంబంధమైన ధాన్యము / సిరి కాబట్టి.......

అంటే మనసును చల్లగా అభివృద్ధిపరిచేందుకు దోహదం చేస్తాయి కాబట్టే బియ్యం మాత్రమే ఉపయోగిస్తారు దీవించడానికి అనేది ఇక్కడి ఆధ్యాత్మిక తత్వసత్యం.....

అలా రాజుకి చంద్ర శబ్దాన్ని అన్వయించి 
రాజరామచంద్రభగవాన్ కి జై
అని పిలవడం అంటే దాని అర్ధం.....

" ఒక రాజుగా, చక్రవర్తిగా దైవానుగ్రహంతో నీకు సకల అధికార ఐశ్వర్యాలు అమరినాయి.....
వాటిని ఎల్లప్పుడు ఇతరుల ఉన్నతికై, సంక్షేమానికై, సమ్రక్షణకై ఉపయోగించాలంటే
నీకు ధర్మం, విద్య, తెలివి, నీతి, చతురత, ధైర్యం, సాహసం, సహనం, కరుణ ఇత్యాది సకల సద్గుణాలకు జతగా మంచి మనసు ఉండడం అనేది ఎల్లప్పుడు ముఖ్యం..... " 

( వాయుపీడనానికి బ్యారోమీటర్, దూరానికి ఒడోమీటర్, వేగానికి స్పీడోమీటర్, బి.పి కి నోరుతిరగని ఆ స్పైగ్మోమ్యానోమీటర్ లాగ, మనుష్యుల మనస్సుల మంచిదనాన్ని కొలిచేందుకు కూడా ' మనోమీటర్ ' లాంటిది ఎమైనా ఉంటుందా అంటే ఉండేలవాళ్ళ దెగ్గర ఉండొచ్చు.....
అందరికీ లోకంలోని అన్ని మీటర్ల గురించి తెలిసి ఉండాలని ఏం లేదుకద......
లోకాలోకమైన ' మీటర్లు ' ఉండేవారి ఉంటాయి అని నమ్మి మంచి మనసును పెంపొందించుకోవడం మంచిదే ఎల్లరికి కద.......


అనే ఆధ్యాత్మిక సూక్ష్మాన్ని మనకు సులభగ్రాహ్యం అయ్యేలా పెద్దలు అలా చంద్రసంబంధమైన వాటితో మన జీవితాలను జతపరిచి అనుగ్రహిస్తుంటారన్నమాట.....😊

శ్రీ శార్వరి చైత్ర శుద్ధ నవమి నాటి కల్యానోత్సవానంతరం 
సిమ్హాసనం అధిష్టించిన ఆ శ్రీరాజరామచంద్రభగవానుడు అందరిని చల్లగా సమ్రక్శించుగాక.....

శ్రీరామచంద్రంశ్రితపారిజాతం
సీతాముఖాంభోరుహచంచరీకం
సమస్తకల్యాణగుణాభిరామం నిరంతరంశుభమాతనోతు....😊🙏

https://m.facebook.com/story.php?story_fbid=10219629606984089&id=1033694038

No comments:

Post a Comment