Sunday, March 14, 2021

శ్రీభువనేశ్వరి ద్వాదశజ్యోతిర్లింగేశ్వరాలయం లో మహాశివరాత్రి సందర్శనాంతరం లభించిన ఈశ్వరస్మృతివిలాసం....😊

శ్రీపరమేశ్వరసందర్శనాసౌభాగ్యం గురించి ఒక్కొక్కరు ఒక్కోలా వచించడం ఎల్లరికి తెలిసిందే...

ఫర్ ఎగ్సాంపుల్ నిన్నటి శ్రీమహాశివరాత్రి లింగోద్భవకాల మహన్యాసపూర్వక ఏకవారరుద్రాభిషేకాలు / జాగరణ / ఈశ్వరసందర్శనం తో భక్తులకు లభించిన ఈశ్వరానుగ్రహసంధాయక
సందర్శనావైభవం గురించి కొంత పరికిద్దాం....

ఒక చిన్న లౌకిక ఎగ్సాంపుల్ తీస్కొని
ఈశ్వర సందర్శనామహత్తు గురించి వివరించేప్రయత్నం గావిస్తాను...

గుడిలో దేవుడికి సమర్పించిన కొబ్బరికాయ్ ఇంటికి ప్రసాదంగా తెచ్చుకొని, చిన్న చిన్న ముక్కలుగా కోసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఇత్యాదివి జోడించి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలా రోస్ట్ చేసి,
తగుమోతాదులో నీటిలో నానబెట్టిన చింతపండుని కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి, ఆ పచ్చడికి
మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, తో పోపు పెట్టి పచ్చడిలోకి ఆ పోపు కలిపి కొద్ది సేపు స్టవ్ మీద సింలో పెట్టి, ఆ పచ్చడిని నార్మల్ వైట్ ఇడ్లీలతో తిన్నప్పుడు ఉండే ఆ అమొఘమైన రుచి / ఆనందం / తన్మయత్వం ఇత్యాది అవ్యక్తభావమంజరులకు ఏవైనా కొలమానాలుంటాయా...??

ఆ "కొబ్బరి పచ్చడి" తినడంలో లభించే ఆనందానికి అసలు కారణం / మూలం ఏంటి అనేది ఎవరైనా నిర్దిష్టంగా వివరించగలరా..??

అంటే ఆ "అమొఘమైన కొబ్బరి పచ్చడి" కి కారణం

కొబ్బరా..? చింతపండా..?
పచ్చిమిర్చా..? పోపా..?
లేదా వీటన్నిటిని సరైన మోతాదులో సరైన పద్ధతిలో సరైన వేడితో ఒక చక్కని కొబ్బరి పచ్చడి గా మార్చిన వ్యక్తా..??

అచ్చం అదేవిధంగా....

ఒక ఆగమోక్త ఆలయంలోని గర్భాలయంలో వైదిక నియమనిష్ఠలతో ప్రతిష్ఠాపన గావించబడి, వివిధ పుష్పమాలికలు / దళాలు / అలంకరణతో కొలువైన ఈశ్వరమూర్తి / సుస్వర వేదమంత్రాలతో శాస్త్రోక్త ఆచార ఆహార్య సంప్రదాయంతో ఈశ్వరార్చన గావించే అర్చకవ్యవస్థ, వీటన్నిటి సమ్మిళిత సమాహారంగా ఈశ్వరుడిని సందర్శించే భక్తుడి మనోఫలకంపై
ఈశ్వరానుగ్రహంగా కొలువైన దైవికభావసౌకుమార్యంతో గావించబడే ఈశ్వరసందర్శనాంతర్గత ఆనందం అనే ప్రక్రియలో.....

ఆ ఈశ్వరసందర్శనానందం అనే అవ్యక్త భగవద్భక్తిభావమంజరులకు అసలు మూలకారణం ఏంటి...??

గుడి లోని ఈశ్వర మూర్తా..?
ఈశ్వరుడి అలంకరణా..?
అర్చారాధనా విధానమా..?
దర్శించబడే తీరా..?
దర్శించగోరే భక్తుడి భావనా...?

ఏది..??

పైన ఉదహరించబడిన కొబ్బరి పచ్చడి ఎగ్సాంపుల్ లో
ఆ కొబ్బరిపచ్చడి మాధుర్యానికి ఏది అసలుకారణమో ఎట్లు నిశితంగా తెలియపరచలేమో....

దైవసందర్శనంలోని తాదాత్మ్యతకు మూలకారణం కూడా అట్లే నిశితంగా తెలియపరచలేము....
అసలు కొబ్బరి పచ్చడి అంటే ఏంటో తెలియని వారు....
కొబ్బరి పచ్చడి తినని వారు....
కొబ్బరి పచ్చడి యొక్క గొప్పదనం తెలియని వారు

ఆ కొబ్బరి పచ్చడి గురించి ఎమైనా కామెంట్స్ వేస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో......

అచ్చం అట్లే.....

అసలు దైవదర్శనం అంటే ఏంటో తెలియని వారు....
దైవదర్శనం గావించని వారు....
దైవదర్శనం యొక్క గొప్పదనం తెలియని వారు

ఆ దైవదర్శనం / దైవం గురించి మాట్లాడడం కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది...

తెలిస్తే కొబ్బరి పచ్చడి చేస్కొని తిని ఆనందించాలి....
లేకపోతే అది తెలిసిన వారు చక్కగా చేసిపెడితే తిని ఆనందించాలి.....
అంతే కాని అసలు అదేంటి, అది ఎట్లు, ఎందుకు, ఇత్యాది శుష్కప్రేలాపన శుద్ధదండగ అనేది ఎల్లరికి విదితమే..

ఇంకొంచెం పైస్థాయిలో చెప్పాలంటే.....

శ్రీచగంటి సద్గురువులు నుడివినట్టుగా
" Its not the darShan we get....Its the darShan he gives..."."

" మనం గావించేది దర్శనం కాదు....అది వీక్షణం మాత్రమే అనబడుతుంది...

ఈశ్వరుడు ప్రసాదించేది దర్శనం....
అది సందర్శనం అవుతుంది...." 😊💐

ఇదన్నమాట క్లుప్తంగా కూకట్పల్లి లోని మా శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ కి దెగ్గర్లో ఉండే ప్రాచీన శ్రీభువనేశ్వరి ద్వాదశజ్యోతిర్లింగేశ్వరాలయం లో

( చతుర్దశభువనాలను తన క్రీగంటి చూపులతో శాసించే శ్రీభువనేశ్వరి అమ్మవారు తన శక్తిగా కొలువైఉండగా భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలకు ప్రతీకగా ఒకే పానవట్టంపై 12 శివలింగాల ( మహామహిమాన్వితమైన బాణలింగాలు) సముదాయం తో ( అందులోని ఒక తెల్లని లింగాకృతి
సౌరాష్ట్ర సోమానాథుడికి ప్రతీక ) విరాజిల్లే
అత్యంత అరుదైన ఈశ్వరాలయంలో )

మహాశివరాత్రి సందర్శనాంతరం లభించిన ఈశ్వరస్మృతివిలాసం....😊..😊

No comments:

Post a Comment