శ్రీహవ్యవాహనుడు, అగ్ని దేవుడి గురించి ఎల్లరికీ తెలిసిందే....
పద్ధతిగా మరియాదగా గౌరవంతో మీరు అగ్నిని హాండిల్ చేస్తే అగ్ని సకల శ్రేయోకారకం.....
ఏమాత్రం పొరపాటు గా లాపర్వాహి తో లేదా
ఒళ్ళు కొవ్వెక్కి బలిసి, మితిమీరిన అహంకారంతో అగ్నితో పరాచకమాడితే అది ఎవ్వరైనాసరే ఎంతటివారైనా సరే అగ్నికి ఆహుతవ్వక తప్పదు...
మీరు చిన్న అగర్బత్తితో చెలగాటమాడితే కొంచెం కాల్తది..
మీరు దీపంతో చెలగాటమాడితే కొంచెం ఎక్కువ కాల్తది..
మీరు స్టవ్ తో చెలగాటమాడితే ఇంకొంచెం ఎక్కువ కాల్తది..
మీరు రగులుతున్న జ్వాలతో చెలగాటమాడితే మరింత ఎక్కువ కాల్తది..
మీరు ఏ స్థాయిలో అగ్నితో పరాచకాలాడితే అదే స్థాయిలో అది మిమ్మల్ని తిరిగి బాధిస్తుంది....
మీరు ఎవ్వరు ఏంటి ఎంత గొప్పవారు
ఎంత పెద్ద పదవి పలుకుబడి ఐశ్వర్యంతో తులతూగే వారు...
లేదా ఎంత ఒళ్ళు బలుపుతో ఉన్నవారో...
అణకువకు అర్థం తేలియని వారో...
ఇత్యాది వేటిని కూడా అగ్ని పట్టించుకోదు...
తన జోలికి వచ్చి ఏదో చేయాలని చూస్తే తగు రీతిలో విరుచుకుపడటమే అగ్నికి తెలిసిన సమాధాన శైలి...
అచ్చం అదేవిధంగా అగ్ని సమమైన వ్యక్తిత్త్వం తో జీవించేవారు, నిత్య అగ్ని ఆరాధకులు కూడా....
వారిని మీరు ఏ స్థాయిలో బాధిస్తే వారు మీపైకి తిరిగి అదే స్థాయిలో విరుచుకుపడతారు....
వారు అనవసరంగ ఎవరిజోలికి వెళ్ళరు...
అనవసరంగ వారి జోలికి వచ్చిన వారిని వదలరు....
అది రగులుతున్న నిప్పైనా సరే....
నివురుగప్పిన నిప్పైనా సరే..
కాల్చడం బరాబరే...
నిప్పు తో డీల్ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అనే సోయి ముందు ఉండాలి...
" నివురు గప్పిన నిప్పని తెలియక నలిపేద్దామని చెయ్యేసాం....మా చేతులు కాలుతున్నాయి...కుయ్యో మొర్రో....." అని ఇప్పుడెంత మొత్తుకున్నా సరే
నిప్పుని బలుపుతో నలుపుదాం అని పావులు కదిపినమీకు ఆ నెగడు యొక్క సెగ తగిలి తీరడం తథ్యం....
ఒక చేత్తో నలుపుదం అనుకున్నాం కుదరట్లేదు కద అని రెండు చేతులు....
మరియు మీలాంటి బద్మాష్ బాడ్కావ్లు ఎంతమంది వచ్చి నిప్పుని నలుపుదామని చూస్తే అంతమంది కూడా కాలిపోకతప్పదు.....
కాల్చడం నిప్పు యొక్క లక్షణం....
ఒళ్ళుబలుపు నోటిదురుసు అధికార ఐశ్వర్యమదం ఇత్యాది ఏవైనా సరే
నిప్పుని నిప్పుగా ఉండకుండా చేయలేవు......
నిప్పుతో పరాచకం ఆడమని ఒసిగొల్పే
బయటి బద్మాష్ బాడ్కావ్లు ఎన్ని చెప్పినా సరే వినీ విననట్టుగా ఉండాలి...
కాదని బుద్ధిలేని మూర్ఖుల మాటలను వింటూ నిప్పుని ఏదో విధంగా అణిచివేద్దామని చూస్తే అది తన విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెడితే ఎదుటి వారు ఎవరు అనే దానితో నిమిత్తం లేకుండా అన్నిటిని కాల్చి బూడిద చేసేంతవరకు ఉపశమించదు....
ఒవర్యాక్షన్లకు పోయి ఎవరు నిప్పుతో చలగాటం మొదలుపెట్టారో వారికి తగిన శాస్తి జరిగితీరుతుంది.....
కొందరి కోసం మూర్ఖంగా దిమాక్ లేని దద్దమ్మల్లా ఎంతోమంది ఒక్కటై నిప్పుతో ఆటలాడినాసరే అది అందరిని కట్టకట్టి కాల్చివేస్తుంది.....
కాబట్టి నిప్పుకి దూరంగా ఉండడంలోనే శ్రేయస్సు కలదు అని తెలుసుకొని మనగలగడంలోనే విజ్ఞ్యత కలదు....
మీరు నిప్పుని చాలా తక్కువ అంచనా వేసి పొగరుతో నోరు పారేసుకుని ఉంటే అది అక్కడితో వదిలేయండి....
ఇప్పటికైనా పద్ధతిగా గౌరవించి మసులుకోండి....
శ్రీచాగంటి సద్గురువులు నుడివినట్టుగా...
" ఉద్ధరేణాత్మనాత్మానం.."
కాబట్టి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని బాగుపడితే అదే ఇతరులకు మీరు గావించే మహోపకారం....
మీరు ఇతరులను ఉద్ధరించేంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నామనుకునే భ్రమలో నుండి తేరుకొని మీ జీవితాలు మీరు గౌరవప్రదంగా జీవిస్తే చాలు....
ఇరు వర్గాలు ఎంతో లోతైన చాణక్యంతో చదరంగం ఆడుతుంటే వీలైతే కేవలం ప్రేక్షకులుగా ఉండి చూడండి...
లేదంటే మాకెందుకు అనవసరమైన గోల అని మీ దార్లో మీరుండండి...
అంతే కాని ఆట అడేవారిలో ఒకవైపు వ్యక్తికి మనః శాంతి లేకుండా చేసి వాడి యుక్తులకు అడ్డుపడుతూ ఆటచెడగొట్టేలా వ్యవహరిస్తే మాత్రం మూతిపగిలెలా ఉంటాయ్ సమాధానాలు...అవసరమైతే మొహం కూడా పగులుద్ది....
కాబట్టి మీకు అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండాఉండడమే మీకు మంచిది....
అవతలి వ్యక్తి ఎవరు...వాడు ఎందుకు ఇంత కిరాతకంగా ఒక సామాన్యుడిని బాధించేలా చదరంగం ఆడుతున్నాడు....
వాడి అతితెలివికి తగ్గట్టుగా ప్రత్యర్ధి ఏవిధంగా తగు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాడు...
ఇత్యాది వేటి గురించి కూడా అవగాహన లేని వారు వద్దన్నా సరే పదే పదే విసిగించేలా వ్యవహరించడం ఎందుకు....
మీరు మీ అనవసరప్రమేయాన్ని తగ్గించుకోకపోతే....
మరియాదతో పాటుగా మున్ముందు చాల కోల్పోతారు...
కాబట్టి వయసుకు తగ్గట్టుగా మెలగండి...
ఇతరులను తక్కువ అంచనా వేయడం మానండి....
అన్నింటినీ మించి ఎవరికి ఎవరు నిజంగా శ్రేయోభిలాషులో....
ఎవరు కేవలం సొమ్ము నొక్కడం కోసమే గుంటనక్క వేషాలు వేస్తున్నరనేది కాలాంతరంలో స్పష్టంగా తెలియవస్తుంది....
కాబట్టి అప్పటివరకు ఎవరెవరు ఎవ్విధంగా ఉండడంలో వారికి మరియాద ఉంటుందో వారువారు అవ్విధంగా ఉండడమే అందరికి మంచిది...
ఇతర విషయాల గురించి పెద్దగా మాట్లాడకపోవడమే ఎల్లరికి మంచిది...
Always remember, never insult a pawn saying that you are just a mere sepoy...
When that mere sepoy struggles and successfully takes the 7 steps forward to land in the last row, it will become as much powerful as the power held by that 8th square....
Hence learn to remain humble...
Else be prepared to face the mighty metamorphosis on it's way quite soon when Time turns it's wheel against you for your each and every current hostile move...!
No comments:
Post a Comment