Wednesday, March 10, 2021

Fools do fault finding....Intelligent folks do fact finding...

ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో చోట్ల ఎన్నెన్నో పండ్లతోటలు గల అపర కుబేరుడు.....

కొన్ని లక్షల మంది ఆయన క్రింద పనివాళ్ళు గా వివిధ స్థాయుల్లో ఉండి తమ క్రింది వారితో పనిచేయించడం...

అనగా ఒక స్థాయిలోని అధికారులు తమ క్రింది వారితో పనిచేయించడం...
ఆ క్రింది వారు వారి క్రింది వారితో పనిచేయించడం...
ఇలా  అత్యున్నతమైన స్థాయిలో ఉండే ఒక ఐదుగురు అధికారుల క్రింద శాఖోప శాఖలుగా విస్తరించి ఉండే ఒక పెద్ద తోట వ్యవస్థలో దక్షిణ భారత దేశంలోని 2 ప్రముఖ నగరాల్లో విస్తరించి ఉన్న 2 పండ్లతోటల్లో పనిచేసే ఒక 10 మంది అధికారులు
( క్రింది స్థాయి నుండి మొదలయ్యే 4 వివిధ అధికార పదవుల్లో ఉండే ఒక 10 మంది ధూర్తులు మరియు భూగోళానికి మరోవైపు ఉండే పండ్ల తోటల్లో పనిచేసే బాగా మదించి బొజ్జలు బలిసిన ఇద్దరు ధూర్తులు...

ఒకడు ఒళ్ళు బలుపు తో బాగా నోరు పారేసుకోవడంలో ఫస్ట్ ఉండే వాడు...
తోటలో పనిచేస్తు టన్నులకు టన్నుల కోట్ల కొలది పండ్లను బాగానే కూడబెట్టుకున్న తెలుగు వాడు ఈ బాగా నోటిదూల గల బద్మాష్ బాడ్కావ్.....

ఇంకొకడు చిన్నవయసులోనే సిమ్హాసనంపై కొలువై ప్రపంచానికి అటుసైడు ఉంటూ ఇటుసైడ్ పనివాళ్ళను పీల్చిపిప్పి చేస్తూ తోటలో పనిచేస్తు పర్వతాలలా పండ్లను కూడబెట్టుకున్న పొగరుబోతు...)

ఈ కొంతమంది బద్మాష్ బాడ్కావ్లందరు కలిసి వాళ్ళ క్రింద ఎంతో నిబద్ధతతో పనిచేసే ఒక సామాన్య కూలివాడిని నిండా ముంచేందుకు చేసిన కుట్రలో
భాగంగా చాలా రోజులుగా అది సర్వోన్నత న్యాయస్థానంలో ప్రశ్నించబడి వీళ్ళందరు కలిసి సలిపిన కౌరవ కార్పణ్య సదృశ ఘోరకలికి ప్రాయశ్చిత్తంగా, ఎన్నెన్నో రకాల పన్నాగాలను పన్నుతూ ఆ సామాన్య పేదవాడిని, వాడి కుటుంబాన్ని నానా కష్టాలకు గురిచేసినందుకుగాను

వారు వారు పనిచేసే తోట విభాగాలనుండి వారి అజమాయిషిలో ఉండే చెట్ల నుండి కొన్ని పండ్లను బాధితుడికి ఇప్పించవలసిందిగా ఆజ్ఞ్యాపించారు....

ఎంతటి వారైనా సరే సర్వోన్నత న్యాయస్థానం ముందు గౌరవం తో తలదించి సత్ప్రవర్తనతో వ్యవహరించాలి కాబట్టి...,
ఇంగితం, విచక్షణ, గౌరవం, మరియాద, పద్ధతి, అణకువ ఇటువంటి పదాలకు అర్ధం తెలిసిన వ్యక్తి కావడంతో ఆ లెక్కలేనన్ని పండ్లతో అలరారే మొత్తం పండ్ల తోటలకు అంతర్జాతీయ రైతుయజమాని గా ఉండే వ్యక్తి ఆ న్యాయస్థాన తీర్పుని గౌరవించి పండ్లు ఇవ్వమని చెప్పగా,
వారందరు ఇకచేసేదేమి లేక అయిష్టంగానే పండ్లను ప్రాయశ్చిత్తార్ధమై ఇచ్చి అందులోనుండి కొంత తిరిగి వాళ్ళందరి జోబుల్లోకి వచ్చేలా వ్యవస్థీకరించబడిన ఈ ధార్మిక న్యాయపోరాటంలో ఒక్కొక్కడిది ఒక్కొక్క వింత మౌఢ్యం...

ఒక్కొక్కడికి అసలు దిమాక్ ఉంటదో ఉండదో కూడా అర్ధం కాదు...

ఇవ్వబడే పండ్లు ఏదో తమ జోబ్లోనుండి ఇస్తున్నట్టుగా ఒకడి ఫీలింగ్.....

ఇవ్వబడే పండ్లు ఏదో తను ఇంట్లో కూడేసుకున్న టన్నులకొద్ది పండ్లనుండి ఇస్తున్నట్టుగా ఇంకొకడి ఫీలింగ్.....

తన అధీనంలో ఉండే చెట్ల నుండి కోసిచ్చిన పండ్లనుండి తిరిగి జోబ్లోకి రాబట్టుకోవడం అనేది నిజమైనా ...
ఇంకా ఏదో ఆ బాధితుడి నుండి పీక్కతిందామని చూడడం ఎంత విడ్డూరం.... 

అసలు ఈ ఫలదానాలు రాకుండా ఎన్నో సార్లు ఎన్నో విధాలా ప్రయత్నించి ఇప్పుడు ప్రాయశ్చిత్తంగా ఇచ్చినవి జోబ్లో వేస్కున్నంక కూడా ఇంకా మెక్కుదామని అనుకోవడం ఎంత ఇంగితరహితమైన ప్రణళిక...

నీ పై అధికారుల కృషితో సమకూరిన ఫలదానాలు నీకు అనవసరం...

నీ కాపులో ఉండే చెట్లనుండి కోసిచ్చిన పండ్లనుండి  కొంత జోబ్లోకి వస్తున్నందుకు సంతోషించు....

ఎక్స్ట్రాలు / ఓవర్యాక్షన్లు / అతితెలివితేటలు / పొగరుబోతు లెక్కలు మానండి..

ఇన్నాళ్లు నా వారినే నాపైకి కయ్యాలకు ఎగదోసి,
నా ఇంట్లో నాకే మనః శాంతి లేకుండా చేసి,

ఒక వైపు "అసలు నీకు ఏ పండ్లు రావు..." అంటూ ఇన్నిరోజులు పక్కదారి పట్టించి ఇప్పుడు నీ ప్రాయశ్చిత్త వాటాగా నీచే ఇప్పించబడిన పండ్లను మింగేద్దామని అనుకోవడం ఒళ్లు బలుపు కాకపోతే ఇంకేమంటారు....

ఈశ్వర ప్రసాదంగా నాకు లభించే ఇతర చెట్ల నుండి ఇప్పించబడిన పండ్లపైన నీకెందుకు అసూయా , ఏడుపు...??

వచ్చేవాటిని తీసుకొని గమ్మున ఉండు / ఉండండి...
మీ జీవితాలను మీరు ప్రశాంతంగ జీవించండి....
నా జీవితం నన్ను ప్రశాంతంగ జీవించనివ్వండి....

కాదని కయ్యాలకు కాలు దువ్వితే కాల 
గతిలో మీరు ఎట్లు కరిగిపోరో నేను కూడా చూస్తా..

నీకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పేవారికి చెప్పు...

నా ప్రతి పదంలోని ప్రతి అక్షరంలో
దాగున్న గుంభనంలోని అర్ధ పమార్ధాలాను బాగా విడమర్చి నీకు బోధించమని....

అందరు కూడబలుక్కొనే కదా నిండా ముంచుదామని నానా యాగి చేస్తూ ఛస్తూ బ్రతికారు ఇన్నాళ్ళు...

నీ దుష్టచతుష్టయం అందరు కలిసి కాన్ఫరెన్స్ కాల్లో బాగా మాట్లాడుకొని ఎక్కువ వాటా మింగడం ఏమాత్రం క్షేమకరం కాదని 
ఒక కొలిక్కి వస్తేనే మీ అందరికి మంచిది....

నన్ను, నావారిని ఇన్నాళ్లు పీక్కతిన్నందుకు...
నేను ఎట్లాగో మీకు జరగాల్సిన శాస్తి జరిగేంతవరకు నేను చేయాల్సింది చేయవలసిన టైంలో చేసి తీరుతా....అది నా వ్యక్తిగత విషయం...

అట్లాగని మీరు ప్రాయశ్చిత్తం కొలది ఇచ్చినదానికంటే ఎక్కువ మీ జోబ్లోకి పంపడానికి ససేమిరా సమ్మతించను...

ఇవ్వబడే పండ్లను పద్ధతిగా ఇచ్చినవి ఇచ్చినట్టే తీస్కుంటారో...
లేదా పొగరుతో నోరుపారేసుకొని పళ్ళు రాలగొట్టుకునేంతవరకు పరిస్థితులను ఉద్రిక్తపరుస్తారో విచక్షణతో ఆలోచించి వివేకంతో
మెలగడంలోనే మనికి కలదు సుమా..!
జాగ్రత్త...జాగ్రత్త...జాగ్రత్త....

No comments:

Post a Comment