శ్రీశ్రీనివాసుడి శ్రీకరమైన అనుగ్రహంగా మూడేళ్ళ క్రితం ముడిపడిన మన బంధం....అనురాగమనే అంగరాగములను అలదుకొని ఆత్మీయ అనుబంధమై వికసించి...అంతులేని ఆకాశ అంచులకు చేరుకోవాలని విహరిస్తూ అనునిత్యం చంద్రుడి వెన్నెలకై ఎదురుచూసే చకోరవిహంగ చూపుల్లోని నిత్యనూతన వన్నెలలా అనుబంధవర్ణాలను అలుముకుంటూ...
నయనాల నయగార మాటలతో..
వదనాల విరిసొగసుల హావభావాలతో...
ఎద సవ్వడుల సరాగాలతో...
మదిలో మెదిలే మమతానురాగాలతో...
జతపడిన జీవితాల జంటస్వరాలతో...
గాఢమైన ప్రేమభావాల గమకాలతో...
మన జీవితప్రయాణం అనునిత్యం ఆనందాల డోలికల్లో కొనసాగి, ఆ ఆనందనిలయుడి శ్రీపాదాలను అలకరించే తిరువడిసరముల సౌరభమై సదా పరిఢవిల్లు గాక...😊🍕🍨🍟💐
Wishing both of us a very happy third marriage anniversary....
May God bless us with all the Health, Happiness, Peace and Prosperity to get going with many more anniversary celebrations ahead....💐🍟🍨🍕😊
No comments:
Post a Comment