Saturday, February 28, 2026

శ్రీకృష్ణపరమాత్మ యొక్క సందర్భోచిత కార్యాచరణను ఒకసారి గమనించండి ...


అంధుడైన ధృతరాష్టృడి సంకుచిత మనసులో ఉండేవి
కుళ్ళు, కుట్రలు, కపటం, కార్పణ్యం, కక్ష, ఇత్యాదివి మాత్రమే అని తెలుసు కాబట్టే....,
కురుక్షేత్రసంగ్రామానంతరం...
"భీమసేన....రా నాయనా.... నువ్వు కూడా నాకు పుత్రసమానుడవే కద...ఒకసారి నన్ను ఆలింగనం గావించుకో పుత్ర....నా మనసు కాస్త తేలిక అవుతుంది....."
అని ధృతరాష్టృడు మొసలి వాక్కులను పలికే సందర్భంలో...,

"భీమా ఒక్క క్షణం ఆగు....!
ఈ ముదనష్టపు ముసలోడి మాయలో పడకు....నువ్వు పక్కకు తప్పుకో...నీ స్థానంలో ఈ ఇనుప భీమసేనుడి బొమ్మను అక్కడికి జరుపు....ఏం జరుగుతుందో చూడు..."
అని వారించిన శ్రీకృష్ణుణ్ణి వింతగా చూస్తున్న భీముడికి ఒక్క నిమిషంలో దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయ్యి విస్మయంతో హడలిపడ్డాడు...

ఎందుకంటే ఆ ఇనుప భీమసేనుడి బొమ్మ ధృతరాష్టృడి కౌగిలిలో తుత్తునియలై నామరూపాలు లేకుండా పోయింది...!

ఎందుకంటే ఆ నిమిషంలో ధృతరాష్టృడు తన తండ్రి గారైన వ్యాసమహర్షి వారిచే ఇవ్వబడిన "వెయ్యి ఏనుగుల బలం కలవాడిగా వర్ధిల్లు పుత్ర..." అనే వరాన్ని ప్రయోగించి
తన కౌగిలిలో ఉన్న భీముడిపై ఉన్న కోపాన్ని తీర్చుకుంటాడని 
శ్రీకృష్ణపరమాత్మకు తెలియును కాబట్టి...

ధర్మం రెండు పాదాల మీద నడయాడే ద్వారపయుగంలో జరిగిన ఈ వృత్తాంత బోధను శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విన్న విజ్ఞులు...,
సత్యం అనే ఒకేఒక పాదంపై నడయాడే ధర్మంతో ఉండే ఈ కలియుగంలో ఉండే కళ్ళున్న ధృతరాష్టృడి వంటి మొసళ్ళతో, 
లక్కగృహాలు కట్టే దుర్యోధన సంతతో, వారి వెయ్యి డేగకళ్ళ కుళ్ళు కుట్రలతో ఇబ్బందులకు గురైన ఈ కలియుగ పాండవులు ఎంత జాగరూకతతో ఉండాలి...??

ఈ కలియుగంలో కూడా కౌరవ సమూహంలో విదురుల వంటి మంచి వారు కూడా ఉండడం ఈశ్వరానుగ్రహం....

No comments:

Post a Comment