Saturday, February 28, 2026

శ్రీకరమైన 2026 విశ్వావసు పుష్యమాస బహుళ అష్టమి భానువాసర ప్రయుక్త ధనుర్మాసాంతర్గత శ్రీవ్రతం / తిరుప్పావై 27వ పాశుర పఠనోత్సవం / కూడారై ఉత్సవ శుభాభినందనానమస్సులు...💐🙏


***************************

27.వ పాశురము

కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్

అర్ధం: 

బాహ్యాంతరవైరిసమూహాన్ని జయించే కళ్యాణ గుణ సంపన్న గోవిందా, నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పర అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానం లోకులందరూ పొగడెడి తీరుతో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బహువులకు దండకడియములు, చెవి భాగమున అలంకరింపబడెడి దుద్దులు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందియలు, గజ్జెలు మొదలగు అనేక ఆభరణాలు మేము ధరించవలెను. తర్వాత మంచి వస్త్రాలు ధరించవలెను. పాలు, అన్నం మునిగేలా నెయ్యి పోసి.. ఆ మధుర పాల పదార్ధం మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కుర్చుని చల్లగా హాయిగా భుజించ వలెను అని గోదాదేవి.. రంగనాధుడిని తన చెలులు గోపికలతో కలిసి కోరింది.

***************************

ఈ 27వ పాశురాన్ని పఠించి శ్రీవైష్ణవాలయాల్లో ఎంతో గొప్ప వైభవభరితమైన వేడుకగా స్వచ్ఛమైన ఆవుపాలు, ఆవునెయ్యి తో పాయసం తయారుచేసి శ్రీగోదాకృష్ణులకు నివేదింపబడిన తదుపరి, భక్తులందరికీ దండిగా ప్రసాదంగా ఇవ్వడం చాలామంది విజ్ఞ్యులకు తెలిసే ఉంటుంది...

వివేకానందనగర్ శ్రీవేంకటేశ్వరాలయంలో అయితే ప్రత్యేకంగా కూడారై గంగాలాలకు పూజ నిర్వహించి అందలి తులసీ ఆఛ్ఛాదిత కూడారై ప్రసాదాన్ని ఆర్జితసేవాభక్తుల్లెలరికీ అందివ్వడం అనే ఎంతో శ్రీకరమైన ఉత్సవం నిర్వహించడం పరిపాటి...

పైకి చదవడానికి ఈ పాశురం / పాశుర తాత్పర్యం చాలా సింపుల్ గా అనిపించే ఒక మధురభక్తిభావజనిత భగవద్స్తుతికైంకర్యంగా అనిపించినా....,
ఆంతరమున పరమపదసోపానాధిరోహణతత్త్వప్రతిపాదిత పరతత్త్వ ప్రామాణ్యం గా ఈ పాశురాన్ని శ్రీవైష్ణవాచార్యశిఖామణులు భక్తులకు, ప్రపత్తిమార్గంలో వర్ధిల్లే శరణాగతులకు, భాగవతశ్రేష్టులకు, అనుగ్రహింతురు...

శ్రీచాగంటి సద్గురువుల "సంపూర్ణ శ్రీమద్భాగవతం" ప్రవచనాలు శ్రద్ధగా ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా....
అందులో శ్రీధృవోపాఖ్యానం ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా,
ఎవరి కోసం శ్రీనారద మహర్షివారు చిన్ని ధృవునకు 
"ఓం నమో భగవతే వాసుదేవాయ...." అనే ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి తపస్సు గావించమని చెప్పి, 
తపస్సుకు కావలసిన విహిత కర్తవ్యాచరణను అనుగ్రహించి వనాలకు పంపించగా, బాలు ధృవుడు అంతటి గొప్ప తపస్సు ఆచరించాడో, ఆ తపోఫలితంగా ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుణ్ణి చూసి, ఏమని స్తుతించాలో కూడా తెలియని బాల ధృవుణ్ణి సమీపించి, అప్పటివరకు అధ్యాత్మ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి సంఘటనగా,
సాక్షత్తు శ్రీమన్నారాయణుడే తన హస్తకమలంలో కొలువైఉండే శ్రీపాంచజన్యం అనే శంఖంతో ఆ బాలధృవుడి శిరస్సును స్పృశించగా, యావద్ విశ్వంలో పరిఢవిల్లే సుసాహితీసంపద అంతయూ కూడా ఆ బాల ధృవుడికి స్వప్రకాశ సారస్వతసిద్ధిగా మనోనేత్రానికి గోచరమై, శ్రీహరిని పరిపరివిధాల స్తుతించగా, ఆ సద్యోవిద్వాంసధృవస్తుతికి సంతసించిన శ్రీమన్నారాయణుడు,
అప్పటి వరకు అధ్యాత్మ చరిత్రలో ఎన్నడూ ఎవ్వరికీ కూడా అనుగ్రహింపబడనటువంటి పరమోన్నతమైన వరంగా "ధృవమండలాధిపతి" గా చిరంతనకీర్తితో వర్ధిల్లే మహత్భాగ్యాన్ని బాల ధృవునకు అనుగ్రహించిన వైనం అధ్యాత్మ విజ్ఞ్యులెల్లరికీ విదితమైన విశేషమే....

శ్రీచాగంటి సద్గురువుల అత్యంత ఆశ్చర్యకరమైన అతిశయస్ఫోరకమైన గంభీరమైన వచనాల్లో ఆ "ధృవమండలం" అంటే ఏంటో, అట్టి ధృవమండలానికి అధిపతిగా వర్ధిల్లడం అంటే ఏంటో, ప్రవచనాల్లో ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా....

గ్రహమండలం, చంద్రమండలం, సూర్యమండలం, తారామండలం,  అధో ఊర్ధ్వ నభసిస్థిత చతుర్దశభువనమండలాలు, జ్యోతిషమండలం, లోకాలోక దైవిక ఆశ్చర్యజనక విశ్వాంతరాళ సమస్తలోకాలు కూడా ఏ సర్వోన్నతమైన శాసకమండలాన్ని ఆధారంగా గావించి విశాల తైజసిక విశ్వంగా పరిభ్రమిస్తూ ఉండునో, అట్టి ధృవమండలానికి అధిపతిగా వర్ధిల్లడం...

అనే అత్యంత ఆశ్చర్యకరమైన శ్రీమన్నారాయణుడి అనుగ్రహవైచిత్రి గురించి మీకు స్వప్రకాశ జ్యోతక తత్త్వంగా భాసించాలంటే, మీరు ఈసారి ఎప్పుడైనా తిరుమల తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు, జాబాలి ఆంజనేయ ఆలయానికి సమీపంలో కొలువైన ధృవతీర్థాన్ని దర్శించి, ఆ తీర్థాన్ని భక్తిప్రపత్తులతో సేవించి, తిరుమలేశుడిగా ఏడుకొండల్లో నెలకొన్న తీర్థాల్లో నిత్యం తిరుగాడే శ్రీశ్రీనివాసుడి అనుగ్రహం గురించి అక్కడ కొంత సేపు ధ్యానం గావించండి...

ఎక్కువగా ఎవ్వరూ సందర్శించని ఆ ధృవతీర్థం విశేషమైన జ్ఞ్యానదాయక తీర్థంగా తిరుమల తీర్థాల వైభవం తెలిసిన విజ్ఞ్యులు చెప్తూఉంటారు....
శ్రీవారి అనందనిలయంలో స్వామివారి పాదాల క్రింద ఉండే భూగర్భప్రాంతంలో ప్రవహించే విరజానదీ యొక్క ఒక జలఝర ఈ ధృవతీర్థానికి అనుసంధానమై ఉంటుంది అని విజ్ఞ్యుల విశ్వాసం...అందుకే ఎంతో చల్లని, తియ్యని, స్వచ్చమైన ధృవతీర్థ నిత్యప్రవాహనికి అంతటి జ్ఞ్యానదాయక విశేషం....

అప్పటి నా తిరుమల యాత్రా రోజుల్లో అయితే శ్రీవారి అనుగ్రహంగా ఎన్నో సార్లు ఎన్నో బాటిల్లలో ఆ ధృవతీర్థం నింపుకొని ఇంటికి కూడా తెచ్చుకొని తరించేవాణ్ణి....
(వర్షం పడుతున్నప్పుడు మాత్రం ఎంతో జాగ్రత్తగా అడుగులు ఎంతో భద్రంగా వేస్తూ మందగించిన గజగమన శైలిలో ధృవతీర్థనికి చేరుకొనే మార్గంలో నడవవలసి ఉంటుంది సుమా..)

ఇంట్లో భేషజాల కారణంగా తల్లి సునీతి తన కొడుకొని, 'నీక్కావలసిన ఉన్నతమైన ఆసనం / పదవి ఆ శ్రీమన్నారాయణుడే అనుగ్రహిస్తాడు వెళ్ళి తపస్సు చేసుకో', అని క్యాజువల్ గా నిట్టూర్పుతో సెలవిచ్చిన మాటలకు తపస్సును ఆచరించిన బాల ధృవునకు, అంతటి సర్వోన్నతమైన అనుగ్రహన్ని శ్రీమన్నారాయణుడు ప్రసాదించిన వైనాన్ని మీరు గమనించినట్లైతే...,

చ5. హరి గుణ మణి-మయ సరములు గళమున
శోభిల్లు భక్త కోటులిలలో
తెలివితో చెలిమితో కరుణ కల్గి
జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా(రెందరో)
మహానుభావులు అందరికీ వందనములు....

అని శ్రీరాగంలో సద్గురు శ్రీత్యాగరాయస్వామి వారి హృదయాంతరంగవైభవంగా అవిష్కృతమైన శ్రవణ భక్తి / కీర్తన భక్తి భావాన్నే, గోదమ్మ మధుర భక్తి / సఖ్య భక్తి విశేషంగా,
తిరుప్పావై 27వ కూడారై పాశురంలో స్తుతించారు...
అనగా కూడారై పాశురంలో ప్రస్తుతించిన వివిధ ఆభరణాలు నిజానికి భక్తులు సముపార్జించుకొని అలకరించుకొని శోభిల్లే వివిధ హరిభక్తి / శ్రీహరిగౌణముల / విభూతి వైభవాలు....

అధ్యాత్మమార్గంలో...,
అమృతమయమైన దేశవాళి ఆవు పాలు భక్తికి ప్రతీక...
ఔషధీగుణభరిత ధాన్యమైన
చంద్రసంబంధమైన బియ్యం / తండూలరాశి / అన్నం జీవుడికి ప్రతీక....
భక్తి(పాలు) పరిపక్వమై ప్రపత్తిగా(పెరుగు) తత్ జనిత శరణాగతి(వెన్న) గా రూపాంతరం చెందిన పిదప ప్రభవించే మధురభక్తిభావామృతమే నెయ్యి....

ఆచమనం అనగా అరచేతి అమృత మార్గం ద్వారా మినపగుండు మునిగేంత నీటి చుక్కను ముమ్మారు 
"ఓం కేశవాయ స్వాహా..."
"ఓం నారాయణాయ స్వాహా..."
"ఓం మాధవాయ స్వాహా..."
అనే శ్రీహరి నామోఛ్చారణతో స్వీకరించే స్వరపేటిక కందక ప్రక్రియ...
అనే శ్రీచాగంటి సద్గురువుల వివరణ విజ్ఞ్యులకు విదితమే కద...

[ ఆ తదుపరి ఈ క్రింది మిగతా 21 నామాలను కూడా పఠించి సంకల్పిత పూజా / ఆరాధనా కైంకర్యాన్ని ప్రారంభించడం పరిపాటి....
Keshava (కేశవ / Kesavāya)
Narayana (నారాయణ / Nārāyaṇāya)
Madhava (మాధవ / Mādhāvāya)
Govinda (గోవింద / Gōvindāya)
Vishnu (విష్ణు / Viṣṇave)
Madhusudhana (మధుసూదన / Madhusūdanāya)
Trivikrama (త్రివిక్రమ / Trivikramāya)
Vamana (వామన / Vāmanāya)
Sridhara (శ్రీధర / Śrīdharāya)
Hrishikesha (హృషీకేశ / Hṛṣīkeśāya)
Padmanabha (పద్మనాభ / Padmanābhāya)
Damodara (దామోదర / Dāmodarāya)
Sankarshana (సంకర్షణ / Saṅkarṣaṇāya)
Vasudeva (వాసుదేవ / Vāsudevāya)
Pradyumna (ప్రద్యుమ్న / Pradyumnāya)
Aniruddha (అనిరుద్ధ / Aniruddhāya)
Purushottama (పురుషోత్తమ / Puruṣōttamāya)
Adhokshaja (అధోక్షజ / Adhokṣajāya)
Narasimha (నారసింహ / Nārasiṁhāya)
Achyuta (అచ్యుత / Acyutāya)
Janardhana (జనార్దన / Janārdanāya)
Upendra (ఉపేంద్ర / Upendrāya)
Hari (హరి / Haraye)
Sri Krushna (శ్రీ కృష్ణ / Śrī Kṛuṣṇāya)
]

ఈ నామాలు 24 ఏ ఎందుకు ఉండాలి...
ఏ 25 ఉండకూడదా...23 ఉండకూడదా...
అనే అంశానికి....
శ్రీహరి యొక్క శంఖ చక్ర గదా పద్మములు స్వామివారి నాలుగు చేతుల్లో అమరే 24 రీతుల పర్మ్యుటేషన్స్ / కాంబినేషన్స్ ప్రకారంగా ప్రభవించే 24 శ్రీహరి యొక్క వివిధ స్వరూపాల వైభవగౌణములే ఈ 24 నామాలు అనే వివరణ కూడా విజ్ఞ్యులకు విదితమే కద...

"కూడారై ఉత్సవంలో భాగంగా భగవద్ నివేదితమైన ఆ మధురపాల పదార్ధం అరచేతిలో నుండి మోచేతివరకు కారునట్లు మనం సేవించి తరించెదము...."
అని గోదమ్మ మధురభక్తి శైలిలో ఎందుకు సెలవిచ్చారో తెలుసా...

అధ్యాత్మపరంగా ఆంతరమున కుడిచేతి ఆచమన ముద్ర నుండి మోచేతి వరకు ఉండే ప్రదేశం యోగపరిభాషలో అమృతసిద్దికారక ఆకాశగంగాపరీవాహక ప్రాంతంగా యోగులు భావింతురు.....

అందుకే వాయుభక్షణ స్థాయిలో ఆంతర చిదాకాశంలో లీనమై సమాధిస్థితిలో చిత్తాన్ని స్థిరీకరించి ఉండే యోగులకు కూడా వారి కుడిచేతిలో కొలువై ఉండే ఆకాశగంగాపరీవాహక ప్రాంతం నుండి సకల శక్తి అందుతూ ఉంటుంది...

ఒక బంతిని చూసినప్పుడు....

అది బంతి అని అనడం సహజమైన సాధారణ స్థాయి...
అది గాలిని తనలో నింపుకొని దాచుకున్న ఒక గుప్పెడంత ప్లాస్టిక్ బ్యాగ్....
అని అనడం ఒక పైస్థాయి భావన..
ఆ ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉన్న గాలి కారణంగా సంతరింపబడిన గోళాకారం వల్ల అది బంతి అని పిలువబడుతున్నది...
అనేది ఇక్కడి ఆంతర దర్శనం....

కాని ఎవ్వరైనా కూడా...
లౌకిక ప్రపంచంలో...
'హె ఆ బాల్ ఇటు క్యాచ్ వెయ్యవా....'
'హె ఆ బాల్ ఒకసారి ఇయ్యవా...'
'హె ఈ బాల్ అటు విసరవా....'
ఇత్యాదిగా బాల్ ని బాల్ అనే సంబోధిస్తూ ఉంటారే కాని...
'హె ఆ గాలిని ఇటు క్యాచ్ వెయ్యవా....'
'హె ఆ గాలిని ఒకసారి ఇయ్యవా...'
'హె ఈ గాలిని అటు విసరవా....'
అని సంబోధించరు....

ఎందుకంటే మనసుకు ఆలంబన, ఎల్లప్పుడూ సగుణసాకరా తత్త్వమే అయ్యి ఉండును......
నిర్గుణ నిరాకార నిరంజన తత్త్వముననందు, ప్రత్యేకించి ఈ కలియుగంలో, మనిషి యొక్క మనస్సుకు దృఢమైన ఆలంబన / పట్టు అంత త్వరగా సమకూరదు...

అందుకే శ్రీ కాకర్ల త్యాగబ్రహ్మం గారు, సద్గురు శ్రీత్యాగరాయుల వారిగా ఎనలేని నాదవిద్యాభరిత స్వరార్ణవవిద్యా జనిత స్వర రాగ లయ పూర్వక సంకీర్తనా సరములతో పరబ్రహ్మాన్ని వివిధ నామరూపాల్లో ఉపాసించి, ఆ సగుణ సాకార సారస నిత్య సత్య పరమాత్మ తత్త్వాన్ని, కర్ణాటక శాస్త్రీయ సంగీత మాధ్యమంగా విశేషంగా అందుకొని తరించడం అనే ఒక జగద్ప్రసిద్ధినొందిన సత్సంప్రదాయ ఆరాధనా మంజరిని అనుగ్రహించి ఆస్తికలోకాన్ని అనుగ్రహించి తరింపజేసారు...

ప్రఖ్యాత కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు,
మూర్తీభవించిన అపర శారదాంబా స్వరూపులు,
శ్రీమతి శేషులతా విశ్వనాథ్ గురువుగారి ఆధ్వర్యంలో, మోతినగర్ శ్రీశృంగేరి జగద్గురు మహాసంస్థానం వారి శ్రీఆదిశంకర మఠంలో నిర్వహింపబడిన 179 వ సద్గురు శ్రీత్యాగరాయ ఆరాధనోత్సవాల్లో భాగంగా "పంచరత్న గోష్టి గానం" లో, ఇతర ఎందరో విద్యార్ధులతో కలిసి
శ్రీ త్యాగరాయుల అమరసంగీతసాహిత్యాలాపనలను వీనులవిందుగా ఆలకించి, శక్తిమేర ఆలపించి, ఆసాంతం ఆస్వాదించి, ఆనందించిన ఆ మధురమైన భక్తిభావామృతసుధాలహరులను విజ్ఞ్యులతో ఇలా పంచుకొని నెమరువేసుకుంటున్నాను....

చ3. సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము సేయు వా(రెందరో)
మహానుభావులు అందరికీ వందనములు....

ఈ 2026 విశ్వావసు పుష్య మాసం లో ఈశ్వరానుగ్రహంగా 2వసారి మనసుకు అమూల్యమైన స్వాంతన ప్రసాదించే సంగీతరసార్ణవంలో లీనమై ఓలలాడిన భాగ్యానికి సంతసిస్తూ, సద్గురు శ్రీత్యాగరాయులవారి పాదపద్మములకు సభక్తికంగా ప్రణమిల్లుతూ చిరు సవినయ కవనసుమాంజలి.....🙂💐🙏

ఆచార్య తిరువడిగళే శరణం.....🙂💐🙏
ఆండాళ్ తిరువడిగళే శరణం.....🙂💐🙏


No comments:

Post a Comment