Saturday, February 28, 2026

ఒకే ఫోటోఫ్రేం లో ఆంజనేయుడు, విభీషణుడు, శ్రీరాముడు ఉండేలా ఎవరైనా ఒక చిత్రలేఖనం గావిస్తే అదో పెద్ద వింతైనట్టుగా అనుకోనవసరం లేదు

శ్రీరాముడు గొప్ప సుక్షత్రియ వీరుడే.....కాని ఆంజనేయుడు, మరియు విభీషణుడు లేనినాడు శ్రీరాముడు లంకాధిపతిని జయించడం అనే అంశం అంత తేలికైన విషయం ఏమికాదు.....
ఎందుకంటే...
ఆంజనేయుడి దాసభక్తితత్పరత,
విభీషణుడి సందర్భోచితధర్మతత్పరత,
అనే రెండు రథచక్రాలపై పయనించి శ్రీరాముడు రావణుడిపై విజయాన్ని సాధించాడు అనేది కోవిదుల శ్రీమద్రామాయణమహామంత్రార్ణవం యొక్క భాష్యంలోని ఉవాచ...
విభీషణుడికి లంకాధిపత్యం / అమరత్వం, ఆంజనేయుడికి అమరత్వం అనే వరాలను శ్రీరాముడు వారికి అనుగ్రహించడం అనే అంశంలో ఎంతో గహనమైన అధ్యాత్మ తత్త్వం ఉన్నది...

1. కాంచనలంకాసిమ్హాసనంపై కొలువైన రాజు యొక్క ఆజ్ఞ్యను గౌరవించడం / శిరసావహించడం రాక్షసులు కూడా పాటించే ఆనాటి ధర్మం....కాబట్టి...,
నలుడు, నీలుడు మరియు ఇతర శ్రీరామవానరసేనాపరివారం కలిసి నిర్మించిన శ్రీరామసేతు ద్వారా లంకలో ఉండే రాక్షసులు భారతదేశంలోకి ఆక్రమంగా చొరబడి సాధు సజ్జనులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, ఒక కుటుంబసభ్యుడిగా రాక్షసుల కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా సరే... ధర్మాత్ముడైన విభీషణుడికి లంకాధిపత్యం అనుగ్రహించడం....
అనేది ఒక ధర్మసూక్ష్మం....

2. ఎందరో రాక్షసులు అర్జునుడి రథాన్ని సమీపించకుండా
ఉండేందుకు..., అర్జున, శ్రీకృష్ణులుగా నరనారాయణులు ప్రభవించి, శ్రీరాముడు శ్రీకృష్ణుడై రాబోవు ద్వాపరయుగంలో పార్థసారధిగా పేర్గాంచే భవిష్యద్కార్యాచరణలో, దాసాంజనేయుడు కూడా ప్రత్యక్షంగా శ్రీరాముడే అయిన శ్రీకృష్ణుడితో పార్థుడి రథం యొక్క పతాకంలో ప్రచ్ఛన్నరూపుడై కొలువై ఉండడం...
అనేది ఒక ధర్మసూక్ష్మం....
ఎందుకంటే...
ఆనాడు ఉపేంద్రుడై బలిచక్రవర్తిని సుతలలోకానికి పంపించి, దేవేంద్రుడికి మరలా స్వర్గసిమ్హాసనం అనుగ్రహించిన వైనంలోనే...,
దేవేంద్రుడి అంశతో ప్రభవించే అర్జునుడికి, రాక్షసాంశలో / కలిపురుషుడి అంశలో ఏతెంచే కర్ణదుర్యోధనులను నిర్జించి, హస్తినాపుర సిమ్హాసనంపై పాండవులను మరలా కొలువుతీర్చడం అనే దేవకార్యసాధకుడిగా తన అవతారం యొక్క విహిత కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు, 
"చక్రం పట్టను...యుద్ధం చేయను..." అనే ప్రతిన గావించిన చక్రి అయినా సరే.....కురుక్షేత్ర సంగ్రామంలో మొత్తం చక్రం తిప్పింది శ్రీకృష్ణుడే అనేది కోవిదులకు ఎరుకే ..

కాబట్టి ఒకే ఫోటోఫ్రేం లో ఆంజనేయుడు, విభీషణుడు, శ్రీరాముడు ఉండేలా ఎవరైనా ఒక చిత్రలేఖనం గావిస్తే అదో పెద్ద వింతైనట్టుగా అనుకోనవసరం లేదు...

సర్వే సుజనాః సుఖినోభవంతు...💐

No comments:

Post a Comment